Saturday, November 16, 2024

Viral: ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోడికి దొరికినంత.. ఫ్రీగా తెచ్చేసుకుంటున్న జనం.!

subarnarekha river :

ఇప్పుడు మీకు చెప్పబోయే నది మాత్రం చాలా ప్రత్యేకం. ఈ నదిలో నీరు, చేపలు, ఇతర ఖనిజ సంపదతో పాటు.. ఎంతో అమూల్యమైన బంగారం కూడా లభిస్తుంది. పైగా ఈ గోల్డెన్‌ రివర్‌ ఉంది మన దేశంలోనే ఇంతకు ఈ నది ఎక్కడుంది అంటే..

మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. మరి ఇంతకు ఈ నది ఎక్కడ ప్రవహిస్తోంది.. దానిలో బంగారం ఎలా లభిస్తుంది అంటే.. అదే జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌ గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిమీ పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది.

ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది తెలిసిన వార్తే. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం. ఈ నదిలో నీటి ద్వారా కొట్టుకు వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి.. వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడుతుంటారు. దాంతో ఈ నది పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నదిలో బంగారం ఎక్కడ నుంచి వస్తోందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యమే.

అయితే దీని గురించి కొందరు ఈ నది నీళ్లు బంగారంతో కూడిన రాళ్ల మీదుగా ప్రవహిస్తోంది కాబట్టే.. బంగారు రేణువులు నదిలో లభిస్తున్నాయిని చెబుతున్నారు. కానీ ఇంతవరకూ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది రహస్యంగానే మిగిలింది. దీన్ని చేధించేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం రెండు వేర్వేరు సంస్థలకు బాధ్యతలను అప్పగించింది. కానీ అవి ఈ నదిలో బంగారం ఆనవాళ్ల గురించి ఎలాంటి సమాచారం కనుగొనలేకపోయాయి. కాగా, వర్షాకాలం తప్పితే.. మిగిలిన అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతం ప్రజలు నదిలోని ఇసుకను జల్లెడపట్టి బంగారాన్ని వెలికితీస్తారు. వారికి దొరికే బంగారం బియ్యం, ధ్యానం కంటే చిన్నగా ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా.. ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు. ఇక్కడకు భారీగా తరలి వచ్చి.. బంగారం కోసం గాలిస్తుంటారు.

Employee died | ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు..ఉద్యోగి మృతి

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
పార్లమెంట్‌(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.

ఈ విషాదకర సంఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది. నెహ్రూ నగర్‌ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE Exams 2024: Class 10 Exams Results Declared

సీబీఎస్ఈ పరీక్షలు 2024: 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్ల ద్వారా కూడా రిజల్ట్స్ పొందొచ్చు.

ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 93.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30 శాతం, బెంగళూరులో 99.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

 

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

RESULTS LINK 5

AP Elections: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. అసలేం జరిగింది?

AP Election 2024: ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి.. కొట్లాటలకు దిగుతున్నారు. ఓటేసేందుకు క్యూ లైన్‌లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ చేయి చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా శివకుమార్‌ నేరుగా వెళ్తుండటంపై ఓటరు అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్‌ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్‌ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడి చేశారు.

కాగా, ఓటరుపై ఎమ్మెల్యే శివ కుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Ysrcp: తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి తీసుకోండి.. పోలీసులకు ఈసీ ఆదేశం

గుంటూరు: తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది. ఈసీ ఎందుకు చర్యలు తీసుకుందంటే..

పోలింగ్‌ కేంద్రంలో శివకుమార్‌ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్‌.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. వైకాపా అభ్యర్థి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్‌ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది.

Business Idea: బిజినెస్‌లో తిరుగులేని పౌల్ట్రీ పెంపకం..ఈ కోళ్లకు భారీ డిమాండ్‌.. లక్షల్లో లాభాలు

కొన్ని వ్యాపారాలు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో మంచి లాభాలు పొందేలా ఉంటాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో పౌల్ట్రీ పెంపకం ప్రముఖ వ్యాపారంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది. రూ.40,000-50,000 పెట్టుబడి పెట్టి ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇల్లు, ప్రాంగణం లేదా పొలాల ఖాళీ స్థలంలో దీన్ని ప్రారంభించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రుణం, శిక్షణ వంటి పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పూర్వ కాలంలో కోళ్ళ పెంపకం లేదా వ్యవసాయం మంచి ఆదాయాన్ని పొందలేవని ప్రజలు విశ్వసించారు. కానీ ఇప్పుడు అలా కాదు. కోళ్ల పెంపకం ద్వారా ప్రజలు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. కోళ్ల సరైన జాతిని ఎంచుకోవడం ఈ వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన పని.

కోళ్ల పెంపకం వ్యాపారంలో ఈ జాతులకు ప్రాధాన్యత ఇవ్వండి

మీరు కోళ్ల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందాలనుకుంటే, మీరు కడక్‌నాథ్, గ్రామ్రియా, స్వర్నాథ్, కెర్రీ శ్యామ, నిర్భిక్, శ్రీనిధి, వనరాజ, కరి ఉజ్వల్, కరి వంటి కోళ్లను పెంచుకోవచ్చు. కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. ఈ పథకం కింద కోళ్ల పెంపకానికి రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని గురించి మరింత సమాచారం కోసం మీరు నేషనల్ లైవ్ స్టాక్ పోర్టల్‌ని కూడా సందర్శించవచ్చు. అంతే కాకుండా నాబార్డు కింద కూడా కోళ్ల పెంపకానికి రైతులకు మంచి సబ్సిడీ ఇస్తారు. ఇది మాత్రమే కాదు, ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక ఆర్థిక సంస్థల నుండి రుణాలు కూడా తీసుకోవచ్చు.

కోళ్ల పెంపకం వ్యాపారం ద్వారా మీరు ఎంత సంపాదిస్తారు?

10 నుంచి 15 కోళ్లతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. మీరు వాటిని మార్కెట్లో విక్రయించవచ్చు. ఇది మీకు ఖర్చు కంటే రెట్టింపు లాభాన్ని ఇవ్వగలదు. ఒక స్థానిక కోడి సంవత్సరానికి 160 నుండి 180 గుడ్లు పెడుతుంది. మీరు మంచి సంఖ్యలో కోళ్లను పెంచినట్లయితే, అవి మీకు ఏటా లక్షల లాభాలను ఇస్తాయి.

Crime News: తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్‌.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!

తండ్రికి వచ్చే పింఛన్‌ కోసం ఓ మహిళ చేసిన దారుణం విస్తుపోయేలా చేస్తోంది. ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది. ఈ ఘటన తైవాన్‌లో వెలుగు చూసింది. అక్కడి మీడియా కథనం ప్రకారం..

ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు. హోదా, సర్వీసు బట్టి ఆయనకు నెలకు దాదాపు రూ.1.27 లక్షల పెన్షన్‌ వస్తుందని అంచనా. కొన్నేళ్లుగా పింఛను ఉపసంహరణ జరుగుతున్నప్పటికీ.. ఆ వృద్ధుడు మాత్రం కనిపించ లేదు. ఇదే సమయంలో కుమార్తె తీరు.. అధికారుల్లో అనుమానాలకు కారణమయ్యింది. ముఖ్యంగా డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందిని ఆమె లోనికి అనుమతించలేదు. దీంతో ఆమెకు సుమారు రూ.లక్షన్నర జరిమానా విధించారు. ఇలా మరోసారి కూడా ప్రభుత్వ అధికారులను ఇంట్లోకి రానివ్వకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఆమె తండ్రి ఆచూకీ గురించి ఆరా తీయగా.. నర్సింగ్‌ హోమ్‌లో ఉన్నట్లు తొలుత బుకాయించింది. మరిన్ని ప్రశ్నలు వేసేసరికి మరో కట్టుకథ అల్లింది. వేరే నగరంలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నాడని తెలిపింది. పోలీసుల విచారణలో.. ఆమె సోదరుడు చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు తేలింది. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా.. తండ్రి చనిపోయాడని, మరణ ధ్రువీకరణ పత్రం పొందలేదని తెలిపింది. ఇలా అనేక కథలు చెబుతుండటంతో పోలీసులు.. చివరకు ఆమె ఇంట్లో సోదాలు జరిపేసరికి అసలు విషయం బయటపడింది. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో మానవ ఎముకలు గుర్తించడం సంచలనం రేపింది.

దర్యాప్తు చేసిన అధికారులు.. రెండేళ్ల క్రితమే ఆయన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, వృద్ధుడి మరణానికి గల కారణాలు మాత్రమే తెలియలేదు. కుమార్తెనే చంపిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి రావాల్సిన పింఛన్‌ మాత్రం క్రమంగా విత్‌డ్రా అవుతున్నట్లు గుర్తించారు.

ఓటరులారా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రతి ఐదేండ్ల ఒక్కసారి జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి ఓటరూ తనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే సువర్ణ అవకాశం ఇది. అయితే ఓటరు జాగ్రత్త వహించకుండా.. ఓటు వేస్తే ఓటు సరిగ్గా పడకపోక, ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్టు బరిలో నిలిచారు. ఎన్నో హామీలు ఇస్తూ.. తమకు ఓటు వేసేట్టు ఓటర్లను మెస్మరైజ్ చేశారు. అలాగే మరోవైపు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటు వేసే సమయంలో ఓటర్లు పోలింగ్ బూత్ లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అలాగే జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతి ఐదేండ్ల ఒక్కసారి జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి ఓటరూ తనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే సువర్ణ అవకాశం ఇది. అయితే ఓటరు జాగ్రత్త వహించకుండా.. ఓటు వేస్తే ఓటు సరిగ్గా పడకపోక, ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. అందుకే ఓటరు ముందుగా జాబితా తన పేరు ఉందా? లేదా? చూసుకోవాలి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మీ ఎపిక్‌ నెంబర్‌, పేరు, అడ్రస్‌తో చెక్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఓటు వేసే ప్రక్రియ

>> ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే ప్రక్రియ మొదలవుతుంది.
>> పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి అధికారులకు ముందుగా ఓటర్ స్లిప్పును చూపించండి. దాంతో పాటుగా ఓటరు పార్టు నెంబర్, సీరియల్‌ నెంబర్‌ ను కూడా చూపించాలి.

>> స్లిప్పులో ఉన్న వివరాలతో ఓటరు పూర్తి వివరాలను సరిగ్గా ఉన్నాయా? లేదా? అని ధృవీకరిస్తారు.

>> ఆ తరువాతే పోలింగ్‌ అధికారి ఎడమ చూపుడు వేలుకు సిరా ఇంక్ తో ఓటు వేసినట్టు గుర్తు వేస్తారు.

>> ఆ తరువాత ఓటరు జాబితాలో సంతకం, బొటనవేలి ముద్ర వేయించుకుంటారు.

>> ఓటరు ఎవరికైతే ఓటు వేస్తున్నారో ఆ గుర్తుపై ముద్ర వేసేందుకు ఓ కంపార్టును ప్రత్యేకంగా పెడతారు. అందులోకి వెళ్లి మాత్రమే గుర్తు పెట్టాలి.

>> ఇక ఫైనల్ గా ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఈవీఎం(EVM),దాని పక్కనే వీవీప్యాట్ (VVPAT) ఉంటుంది. అభ్యర్థుల పేర్లు ఈవీఎం ఎడమవైపునకు ఉంటాయి.

>> ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క…. వారికి కేటాయించిన గుర్తులు.. మరో వైపు.. వీటి పక్కన్నే నీలి రంగు బటన్‌ ఉంటాయి.

>> మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న బ్లూ కలర్‌ బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు.

>> బటన్‌ నొక్కిన వెంటనే అయిదు సెకన్ల పాటు బీప్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్‌ వెలిగి.. లోపల స్లిప్‌ కనిపిస్తుంది.

>> మీరు ఎవరికి ఓటేశారో వారిపేరు, సీరియల్‌ నెంబర్‌, పార్టీ గుర్తు వంటి సమాచారం దానిపై కనిపిస్తాయి.

>> ఈ కాగితపు స్లిప్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్‌ బాక్స్‌లోకి పడిపోతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ అనుమానం వచ్చిన.. మీరు బటన్ నొక్కినప్పుడు శబ్దం రాకున్న అక్కడున్న అధికారులను అడగవచ్చు.

Cold in Summer: వేసవిలో జలుబు.. కారణం ఇదే..

Cold in Summer: ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగతో వాతావరణంలో మార్పులు రావడం మొదలైంది.

దీంతో కొంత మంది డీహైడ్రేషన్, వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురవుతుంటే, మరికొందరు వేసవిలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అసలు వేసవిలో జలుబు ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకోవాలి. వర్షాకాలం, చలికాలంలో అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని చెబుతున్నారు. కానీ మన జీవనశైలి మారుతున్న కొద్దీ సూక్ష్మజీవులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. అందువల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల శరీరంలోకి దుమ్ము చేరి అలర్జీకి కారణమవుతుంది. వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు ఈ గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఇవి శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.

వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఏసీలో గడిపేవారిలో డ్రైనెస్ పెరుగుతుంది. ముక్కు, చెవి మరియు నోరు కూడా పొడిగా ఉంటాయి. ఇది జరిగినప్పుడు, అంటువ్యాధులు పెరుగుతాయి. ఫలితంగా, మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడవచ్చు. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అది అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంది. చల్లని వైరస్ చాలా సులభంగా వ్యాపిస్తుంది. తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గొంతు దురద, పొడి లేదా కఫంతో కూడిన నొప్పితో కూడిన దగ్గు, వేడిగా అనిపించడం, చెమటలు పట్టే జ్వరం, వేసవిలో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటిని ఈ క్రింది జాగ్రత్తలతో నివారించవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. శరీరంలోకి దుమ్ము, ధూళి చేరకుండా చేస్తుంది. మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడే వారిని కలిసినట్లయితే, వారు తగిన దూరం పాటించాలి. ఈ జాగ్రత్తతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇల్లు మరియు పని ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కొద్దిపాటి విరేచనాలు వచ్చినా రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.

Garlic : శరీరంలోని ఈ సమస్యలన్నింటిని వెల్లుల్లి నయం చేస్తుంది..!

ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందిన వెల్లుల్లి, మన భారతీయ వంటశాలలలో చాలా వరకు కనిపించే ఒక సాధారణ పదార్ధం. పొటాషియం, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్, విటమిన్లు సి, కె, నియాసిన్, థయామిన్ మరియు ఫోలేట్ వంటి అనేక ఖనిజాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

బరువు తగ్గడానికి వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, కాల్షియం మరియు విటమిన్లు సి, బి6, కాల్షియం మరియు సెలీనియం కూడా పుష్కలంగా ఉన్నాయి.

వెల్లుల్లిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరియు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. అలాగే, ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉబ్బసం రోగులకు వెల్లుల్లి వరం. వెల్లుల్లి తినడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలలో మూడు వెల్లుల్లి రెబ్బలు కలిపి తీసుకుంటే ఆస్తమా నుంచి బయటపడవచ్చు.
వెల్లుల్లి తినడం వల్ల జీర్ణశక్తి బలపడి అపానవాయువు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ గుణాలు జీర్ణకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
వెల్లుల్లిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి మనల్ని రక్షిస్తుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని పురుగులు మూత్రం మరియు మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. వెల్లుల్లిలోని గుణాలు చెడు బ్యాక్టీరియాను నశింపజేసి, పేగులోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తాయి.
వెల్లుల్లిలోని విటమిన్ సి, క్వెర్సెటిన్, మాంగనీస్ మరియు సెలీనియం వాపును తొలగించి, కళ్లకు పునరుజ్జీవనాన్ని చేకూరుస్తాయి. వెల్లుల్లి మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లిని తినవచ్చు. ఇది LDL స్థాయిని తగ్గిస్తుంది అంటే చెడు కొలెస్ట్రాల్. దీని గుణాలు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెను రక్షిస్తాయి.

Election Ink: టాటూలా శాశ్వతంగా పడిపోయిన సిరా గుర్తు.. 9 ఏళ్లయినా ఆ మహిళకు చెదరిపోని ఇంక్ మార్క్!

మన దేశంలో ఎన్నికల వేళ ఓటేసిన వారి వేలిపై సిరా గుర్తు వేయడం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఎన్నికలు ఏవైనా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరి ఎడమ చేతి చూపుడు వేలికి ఈ ఇంకు చుక్కను అధికారులు పెడతారు. పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు గుర్తు ఇదే. అలాగే ఒకసారి ఓటు వేసిన ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు ఈ గుర్తు ఓ సంకేతం. వేలి గోరుతోపాటు చర్మానికి కూడా కాస్త అంటుకుంటుంది. అయితే ఈ సిరా చుక్క అంత త్వరగా చెరగదు. సిరాగుర్తు వేసిన 15 నుంచి 30 సెకండ్లలో ఆరిపోతుంది. సాధారణంగా పది రోజులు లేదంటే నెల రోజులకు ఈ గుర్తు పూర్తిగా చెరిగిపోతుంది. అయితే ఓ మహిళకు మాత్రం ఈ గుర్తు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె గత మూడు సార్లు జరిగిన ఎలక్షన్లకు తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయింది.

కేరళకు చెందిన ఉష అనే మహిళ వయసు 62 ఏళ్లు. ఆమె 2016లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కులపుల్లి ఏయూపీ పాఠశాలలో ఓటేసింది. అప్పుడు ఎన్నికల అధికారి ఆమె వేలిపై వేసిన సిరా గుర్తు ఎన్ని రోజులైనా అలాగే చెరిగిపోకుండా ఉండిపోయింది. ఎన్ని రకాల సబ్బులు, ద్రావణాలు ఉపయోగించినా లాభం లేకపోయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తే.. ఆమె వేలిపై గుర్తు చూసి ఓటేసేందుకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేసేందుకు అనుమతి లభించింది.

తన వేలిపై ఉన్న సిరా గుర్తు కారణంగా పోలింగ్‌ కేంద్రాల్లో తలెత్తుతున్న వివాదాల దృష్య్టా.. ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటేసేందుకే వెళ్లలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీసీసీ ప్రధాన కార్యదర్శి టీవై షిహాబుద్దీన్‌కు ఉష తన గోడు వెళ్లడించింది. దాదాపు తొమ్మిదేళ్లయినా తన ఎడమచేతి చూపుడు వేలికి వేసిన సిరా గుర్తు చెరిగిపోలేదని వాపోయింది. అతను ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా.. వారు సమస్యను పరిష్కరించి ఆమె ఓటేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సిరా ఇంత సుదీర్ఘ కాలం పాటు మాసిపోకుండా ఉండిపోవండం ఇంత వరకూ ఎక్కడా జరగలేదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ్ల మహిళ గోళ్ల కింద నల్లమచ్చలు లాంటివి ఏవైనా ఏర్పడి ఉండవచ్చని చర్మవ్యాధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉష వేలిపై శాశ్వతంగా పడిపోయిన సిరా గుర్తు మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది.

టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లెజెండ‌రీ ప్లేయ‌ర్

James Anderson : గత కొన్ని రోజులుగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాల మధ్య, ప్రపంచంలోని గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

James Anderson : అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను చెడుగుడు ఆడుకున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది లార్డ్స్‌లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రపంచంలోని గొప్ప టెస్ట్ బౌలర్లలో అండర్సన్ ఒకరు. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ కు ఒంటిచెత్తో అనేక విజయాలు అందించాడు. 41 ఏళ్ల అండర్సన్ ఇప్పుడు తన 20 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

లార్డ్స్‌లో చివరి మ్యాచ్

అండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి పంచుకున్నాడు. లార్డ్స్‌లోని చారిత్రాత్మక మైదానంలో అతను చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ల మధ్య లార్డ్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటానని అండర్సన్ పేర్కొన్నాడు. అండర్సన్ లార్డ్స్ మైదానంలోనే టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయడం విశేషం. టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ బౌలర్లలో అండర్సన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 700+ వికెట్లు తీసుకున్నాడు.

అందరికీ ధన్యవాదాలు..

తన 20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు అండ‌ర్స‌న్ పేర్కొన్నాడు. కుటుంబం నుంచి అభిమానుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. “డానియేలా, లోలా, రూబీ, నా తల్లిదండ్రుల ప్రేమ, మద్దతు లేకుండా నేను ఈ ప్రయాణం చేసేవాడిని కాదు. వారికి చాలా ధన్యవాదాలు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌల‌ర్ల‌లో ఒక‌రిగా ఎద‌గ‌డంలో త‌న‌తో వ‌చ్చిన‌ ఆటగాళ్లు, కోచ్‌లకు కూడా ధన్యవాదాలు. నేను ముందున్న కొత్త సవాళ్ల కోసం, అలాగే నా చివ‌రి మ్యాచ్ ల‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం కోసం ఉత్సాహంగా ఉన్నాను. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లార్డ్స్‌లో కలుద్దాం” అంటూ త‌న పోస్టులో పేర్కొన్నాడు.

ప్ర‌పంచంలోని గొప్ప ఫాస్ట్ బౌల‌ర్..

టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన ప్రపంచంలోని ఏకైక పేసర్ జేమ్స్ అండర్సన్. 187 మ్యాచ్‌లు ఆడిన అండ‌ర్స‌న్ రెడ్ బాల్ క్రికెట్‌లో 700 వికెట్లు తీశాడు. ఇక వ‌న్డే క్రికెట్ లో 194 మ్యాచ్‌లు ఆడి, 269 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అండర్సన్ టీ20 క్రికెట్‌లో 19 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. అండర్సన్ ప్రపంచంలోనే అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక-800 వికెట్లు), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా-708 వికెట్లు) మాత్రమే జేమ్స్ అండ‌ర్స‌న్ కంటే ముందున్నారు.

Crime: ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో గొడవ.. కత్తితో దాడి ఒకరి మృతి

సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.

అయితే.. కొన్నిసార్లు గ్రూప్‌లోని ఇతర సభ్యులకు నచ్చని వ్యాఖ్యలు దర్శనమిస్తుంటాయి. గొడవలు చెలరేగుతుంటాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇలాగే జరిగింది. కాని గొడవ కాస్త ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..

జైసింగ్‌పురా ఖోర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ శర్మ వివరణ ప్రకారం.. సల్మాన్ అన్సారీ కుటుంబ సభ్యులు ‘ఖాన్ ఫ్యామిలీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా సల్మాన్ బంధువులు అస్లాం, జమీర్, సాహిల్ సల్మాన్‌కు వ్యతిరేకంగా మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ విషయంపై దాయాదుల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం అర్థరాత్రి, సల్మాన్ తన బంధువులను శాంతింపజేయడానికి తన షారుఖ్‌తో సహా అతని స్నేహితులతో వెళ్ళాడు. అయితే అక్కడ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశంపై వాగ్వాదం చాలా ఎక్కువైంది. దీంతో కజిన్ అస్లాం కత్తి తీసి సల్మాన్ ఛాతీపై నేరుగా పొడిచాడు. సల్మాన్ కాపాడేందుకు ప్రయత్నించిన అతడి స్నేహితుడు షారుక్ ని కూడా కడుపులో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు అస్లాం. ఈ ఘటన జైపూర్‌లోని ఓ బార్బర్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో సల్మాన్ మరణించగా.. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడు షారుక్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలింగ్ బూత్ లోకి ఫోన్ల అనుమతి లేదు: సీఈవో ముకేశ్

మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు ఈరోజుతో ప్రచారం ముగిసింది.పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో పార్టీలు ఎలాంటి సింబల్స్ లేకుండా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసుకోవచ్చని CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘పోలింగ్ కేంద్రంలో ఒక పార్టీకి ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలి. ప్రిసైడింగ్ అధికారి తప్ప మిగతా ఎవరూ బూత్లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదు. నేతలు ఓటర్లను వాహనాల్లో తరలించకూడదు అని తెలిపారు. ఓటింగ్ శైలిని పర్య వేక్షించుకునేందుకు అభ్యర్థి 3 వాహనాలు ఉపయోగించుకోవచ్చు’ అని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకెవెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు.ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు.అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించామని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని సీఈఓ మీనా అన్నారు.

New Banking Rule: గుడ్‌న్యూస్‌.. బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు..ఆర్బీఐ కొత్త నిబంధనలు

జీరో బ్యాలెన్స్ ఖాతాలు బ్యాంకు ఖాతాలకు అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్యాంకు ఖాతా తెరవడానికి మీకు డబ్బు అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ ఖాతాలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ తరచుగా జీరో బ్యాలెన్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండదు. అది మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఎంత పెరిగితే అంత జరిమానా ఉంటుంది. తరచుగా వ్యక్తులు ఖాతాను మూసివేయడానికి వచ్చినప్పుడు మాత్రమే జరిమానా గురించి తెలుసుకుంటారు. అప్పటికి ఇది భారీ మొత్తం అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ విధానం ఏమిటంటే మీరు బ్యాంకులు వసూలు చేసే మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మీ వద్ద బ్యాలెన్స్ నెగిటివ్ ఉన్నా, మీ ఖాతాలో చూపిన మైనస్ మొత్తానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

మీకు అవసరం లేకుంటే మీరు మీ బ్యాంక్ ఖాతాను పూర్తిగా ఉచితంగా మూసివేయవచ్చు. బ్యాంకులు దాని కోసం మీకు ఛార్జీ విధించవు. చాలా బ్యాంకులు ఖాతా మూసివేత సమయంలో అప్పటి వరకు వసూలు చేసిన పెనాల్టీ మొత్తాన్ని (బ్యాలెన్స్ మైనస్) వసూలు చేసే అవకాశం ఉంది.

మీరు ఫిర్యాదు చేయవచ్చు

మీ ఖాతాను మూసివేసేందుకు ఏదైనా బ్యాంకు జరిమానా విధించినట్లయితే, మీరు RBIకి ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మీరు bankingombudsman.rbi.org.in కు వెళ్లి ముందుగా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవాలి. ఇది కాకుండా ఆర్బీఐ హెల్ప్‌లైన్ నంబర్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత బ్యాంకుపై కూడా చర్యలు తీసుకోవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకున్నా ఎలాంటి జరిమానా విధించవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పినా కొన్ని బ్యాంకులు మాత్రమే అమలు చేస్తూ మరికొన్ని బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!

Tea : చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. ఉదయం లేవగానే చాయ్ తాగేస్తుంటారు. అంతే కాకుండా కాఫీలు, ఇతర కొన్ని టీలు కూడా తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

కానీ టీలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ తాగితే మాత్రం కచ్చితంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవాలి. అదే కొంబుచా టీ. దీన్ని తాగితే మాత్రం మీకు దివ్య ఔషధం దొరికినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని చక్కెర, టీ డికాషన్, ఈస్ట్, బ్యాక్టీరియా ఎంజైమ్స్‌తో తయారు చేసి పులియబెడుతారు.

Tea : కేలరీలు తక్కువ..

కాబట్టి ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాల అధికంగా ఉంటాయి. అంతే కాకుండా పులియబెట్టినప్పుడు ఇది సహజ ఆమ్లాలు, ఎంజైమ్స్‌ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఇది బరువు తగ్గించేందుకు కూడా సాయం చేస్తుంది.ఎందుకంటే ఇందులో 40 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉండే ప్రో బయోటిక్ లక్షణాలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.

Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!

ప్రేగుల్లో సూక్ష్మజీవుల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో ఈ టీ బాగా పని చేస్తుంది. దీన్ని బ్లాక్ టీతో తయారు చేస్తారు. కాబట్టి దీని వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా కాబట్టి ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీకి హాని చేసే చెడు బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని బలంగా చేసే యాంటీ మైక్రోబయల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది ఈ టీ. ఇక మరో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే దీన్ని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. సోడాలు, జ్యూస్ లలో కంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

కాబట్టి ఈజీగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కొంబుచా టీ హెల్ప్ చేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి దీన్ని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో ‘సీఎం రేవంత్ ఫుట్బాల్`..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు.

ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్సీయూ విద్యార్థులు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీశాట్ ఈఈవో వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?

Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్ అవుతున్నారా? మాజీ న్యూజిల్యాండ్ ఆటగాడు మెక్‌క్లెనాగన్ కోహ్లీ రిటైర్‌మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు చివరి సారిగా ఈ ఐపీఎల్ సీజన్‌లో తలపడనున్నారు అని మెక్ క్లెనాగన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
దాంతో పక్కనే ఉన్న మాజీ వికెట్ కీపర్ దీప్‌ దాస్ గుప్తా షాకయ్యాడు. అదేంటి చివరి మ్యాచ్ అనేసావ్ అని మెక్ క్లెనాగన్‌ని ప్రశ్నించాడు. దీనిపై మెక్ క్లెనాగన్ స్పందిస్తూ.. గత నాలుగేళ్లుగా ధోనీ రిటైర్ అవుతారు అంటున్నారు. కానీ నాకు తెలిసి ధోనీ రిటైర్ అవ్వడు. ఆడుతూనే ఉంటాడు. రిటైర్ అయితే కోహ్లీ అవుతాడేమో అని అనేసాడు.

Shawarma Food Poison: షావర్మా తిని ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకు?

Shawarma Food Poison: ఇటీవల ముంబై కి చెందిన ఒక యువకుడు రోడ్డు పక్కన ఉన్న షావర్మా తిన్నాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై మరణించాడు. గతంలో కేరళలో కూడా ఇలాగే జరిగింది. షావర్మా తినడం వల్ల ఎక్కువమంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యులు వివరిస్తున్నారు.

షావర్మా ఎందుకు ప్రమాదకరం?
షావర్మా తినడం వల్ల కొంతమంది ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. ఆ కలుషితమైన ఆహారం తినడం వల్ల వ్యక్తులు అనారోగ్యాలకి గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొట్టనొప్పి వంటి వాటి బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్న జీవులు ఆహారంపై నిల్వ ఉండడం వల్ల… వాటిని తిన్నవారు ఇలా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.

షావర్మాలో చెడు బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుంది. మాంసం అపరిశుభ్రంగా ఉన్నా కూడా బ్యాక్టీరియా అక్కడ సులువుగా నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సరిగా ఉడకని మాంసంలో కూడా బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. అలాగే రోడ్డుమీద నుంచి వచ్చే కాలుష్యం కూడా ఆ మాంసంపై చేరి వ్యాధికారకాలను పెంచుతాయి. వండేటప్పుడు పచ్చి మాంసాన్ని ముక్కలుగా కోసి మంటపై ఇనుప తీగకు గుచ్చి వండుతారు. సరైన పరిశుభ్రత పాటించకుండా వండితే బ్యాక్టీరియాలు అందులో చేరిపోతాయి.

మాంసంలో బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వండాలి. కానీ షావర్మా వండినప్పుడు మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించరు. దీని వల్ల కూడా సాల్మొనెల్లా, ఈ. కోలి, క్యాంపిలో బాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది.

వండేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఇతర బ్యాక్టీరియాలు షావర్మాపై చేరుతాయి ఈ షావర్మాలు ఏ రోజు వండినవి ఆరోజు అమ్ముడు పోకపోతే మరుసటి రోజు కూడా వాటినే మంటపై పెట్టి కాల్చి తిరిగి అమ్ముతూ ఉంటారు. ఇలా కూడా ఆహారం విషంగా మారిపోతుంది. ఏ మాంసాన్నైనా అందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపాలంటే అధిక ఉష్ణోగ్రత వద్ద వండాలి. అప్పుడే అది తినడానికి వీలైనది. కాబట్టి ఇలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వండే షావర్మాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

Energy Saving Tips: ఏసీ ఆన్ చేసిన వెంటనే ఇలా చేయండి.. కరెంట్ బిల్లుతో టెన్షన్ ఉండదు..!

Energy Saving AC Tips: వేసవి వచ్చినప్పుడల్లా కచ్చితంగా ఏసీ గురించి చర్చ జరుగుతుంది. వేడిని ఎదుర్కోవడానికి AC అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఏసీలో బతకడం, రాత్రిళ్లు ఏసీలో పడుకోవడం అనేది వేరే విషయం. AC మనకు వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, ఏసీ ఎక్కువసేపు నడుస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని మనస్సులో టెన్షన్ కూడా ఉంది. బిల్లులు పెరుగుతున్నాయనే టెన్షన్‌తో చాలా మంది రాత్రిపూట మాత్రమే ఏసీ వినియోగిస్తున్నారు. ఏసీని రన్ చేయడం వల్ల ఎంత బిల్లు వస్తుంది అనేది మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది ఏసీని వాడతారు. కానీ, దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

AC నడుస్తున్నప్పుడు వచ్చే బిల్లు, AC పనితీరు రెండూ మన వినియోగాన్ని బట్టి ఉంటాయి. మనం ఏసీని సక్రమంగా నడిస్తే బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏసీ ఏళ్ల తరబడి బాగా నడుస్తుంది. అదే టెంపరేచర్‌లో ఏసీని నడిస్తే, పెరుగుతున్న కరెంటు బిల్లుల టెన్షన్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

తరచుగా ఉష్ణోగ్రతలో మార్పులు..
ఉష్ణోగ్రతను పదేపదే పెంచడం లేదా తగ్గించడం AC పనితీరును ప్రభావితం చేస్తుంది. AC కష్టతరం చేస్తుంది. మీరు అదే ఉష్ణోగ్రత వద్ద AC సెట్ చేస్తే, అప్పుడు AC తక్కువ కష్టపడాలి. విద్యుత్ లోడ్ పెరగదు.

ఏ ఉష్ణోగ్రతలో ఏసీ పనిచేస్తుంది..
మీరు ఎయిర్ కండీషనర్‌పై ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ తగ్గిస్తే, అది విద్యుత్ బిల్లును 6 శాతం పెంచుతుందని నమ్ముతారు. ఇటువంటి పరిస్థితిలో, మీరు గదిని త్వరగా చల్లబరచడానికి 18-19 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ కండీషనర్ను సెట్ చేస్తే, అప్పుడు బిల్లు మరింత పెరుగుతుంది. కాబట్టి, మీరు ఏసీని 23-25 ​​డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే ఉంచాలి. ఇది మీ AC పై ఎక్కువ లోడ్ పెరగకుండా చూస్తుంది.

గదిని చల్లబరచడానికి ఇలా చేయండి..
AC నడుస్తున్న కారణంగా బిల్లులను తగ్గించుకోవడానికి, మీ గదిని త్వరగా చల్లబరచడానికి మీరు కొన్ని పద్ధతులను ప్రయత్నించవచ్చు. AC నడిచినప్పుడు, మీరు గదిలోని ఫ్యాన్‌ను ఆన్ చేయవచ్చు. తద్వారా AC చల్లని గాలి గది చుట్టూ వ్యాపిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఏసీ నడపాల్సిన అవసరం ఉండదు.

గదిలో అధిక వేడిని ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఉంచవద్దు..
మీరు ఏసీని నడుపుతున్నప్పుడు, ఫ్రిజ్, ల్యాప్‌టాప్ వంటి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఆ గదిలో ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఇవి గదిలో వేడిని పెంచుతాయి. గదిని చల్లబరచడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఉత్పత్తుల కారణంగా, AC తక్కువ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయబడాలి. దీని కారణంగా బిల్లు వేగంగా పెరుగుతుంది.

ఓటరు గుర్తింపు కార్డు లేదా ? 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటెయ్యొచ్చు..!

అమరావతి : ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటేస్తాం… ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి ఓటు వేయొచ్చు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం … ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డును అందజేస్తుంది. ఆ గుర్తింపు కార్డుతో ఓటు వేయాలి. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులు చూపి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

1. పాస్‌పోర్టు 2. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు, 4. బ్యాంకులు జారీ చేసిన పాస్‌ పుస్తకం, తపాలా కార్యాలయాలు జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాలు, 5. పాన్‌కార్డు, 6. ఎన్‌పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, 7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, 8. కార్మిక మంత్రిత్వశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, 11. ఆధార్‌కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

భగవద్గీత 1 నుండి 5 అధ్యాయాలు చదివితే జీవితమంటే ఏంటో తెలిసిపోతుందట..!

భగవద్గీత మనిషి జీవితాన్ని ఎలా జీవించాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు యుద్ధభూమిలో భగవద్గీత భోదిస్తాడు. అందులో మొదటి ఐదు అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి.. మనిషి జీవితంలో తప్పక తెలుసుకోవాల్సి అక్షర సత్యాలు అవి.. అవేంటంటే..

భగవద్గీత 1వ అధ్యాయం సందేశం :
జీవితంలోని సమస్యలన్నీ మన ఆలోచనల వల్లనే కలుగుతాయి.
భగవద్గీత 2వ అధ్యాయం యొక్క సందేశం :
సరైన జ్ఞానం జీవితంలోని అన్ని సమస్యలకు ఉత్తమ పరిష్కారం.
భగవద్గీత అధ్యాయం 3 సందేశం :
నిస్వార్థంగా చేసేది ఏదీ మిమ్మల్ని బాధించదు.
భగవద్గీత 4వ అధ్యాయం సందేశం :
మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీ కర్మ ఫలితమే.
భగవద్గీత 5వ అధ్యాయంలోని సందేశం :
నేను ఒక్కడినే అనే అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే లోకం ఇచ్చే ఆనందం మీకు లభిస్తుంది.
భగవద్గీత నేపథ్యం..
రణరంగంలో ఎదురుగా ఉన్న సైనికులను చూసి అర్జునుడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నేను చంపబోయేది నా తోడబుట్టినవాళ్లను, నా గురువులను, నా ప్రజలనే కదా ఎందుకు కృష్ణా ఇదంతా అని అర్జునుడు బరువెక్కిన గుండెతో కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు తనకున్న శక్తులతో కాలాన్ని ఆపేసి మొదలుపెడతాడు.. శుత్రసైన్యంలో ఒక్కొక్కరిని చూపిస్తూ.. వాళ్లు చేసిన పాపాలు గుర్తుచేస్తాడు. వీళ్ల పాపాలకు కర్మ ఫలితాన్నే వీరు అనుభవించబోతున్నారు అర్జునా.. అని.. జీవితం గురించి, ప్రేమ గురించి, చావు గురించి ఎంతో చక్కగా వివరిస్తాడు. ఇదే భగవద్గీత అయింది.. భగవద్గీత అనేది మనిషి జీవితానికి మాన్యువల్‌ లాంటిది..ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏదీ శాశ్వతం కాదు, చావు శరీరానికే కానీ ఆత్మకు కాదు అనే అక్షరసత్యం భగవద్గీత చదివితేనే అర్థమవుతుంది. అయితే కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు ఒక్కడే వినలేదు..దృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో ఏం జరుగుతుందో పూసగుచ్చినట్లు వివరించే సంజయుడు కూడా విన్నాడు..!

ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఆడవారు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా, సంప్రదాయంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల కూడా ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి.
భార్యభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట. అయితే సమయం, సందర్భం ఏదైనా సరే ఆడవారు ఎక్కువగా ఆకుపచ్చ గాజులను ధరించడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి అందంగా కనిపిస్తాయని అనుకుంటారు.

కానీ ఆకు పచ్చ గాజులు వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. ఆకు పచ్చ గాజులు వేసుకోవడం వల్ల వారికి ఉన్న అన్ని రకాల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఆడవారిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.

ఆకు పచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించింది. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఈ గ్రహం బలం కూడా తోడవుతుంది. జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చి పెడుతుంది. ప్రతీ పనిలో లవిజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అంతే కాకుండా శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుందట. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే.. రెండు చేతులకు ఆకు పచ్చ గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ గాజులు వేసుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతారు.

Triphala Health Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష త్రిఫల చూర్ణం.. పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు..

త్రిఫల పొడిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో హెర్బ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకానికి దివ్యౌషధం. శరీరంలో దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నయం చేయడంలో ఇది అద్భుతం చేస్తుంది. రోజూ త్రిఫల చూర్ణం తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతే కాకుండా త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. త్రిఫల చూర్ణం ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: త్రిఫల పొడి కడుపులో కందెనగా పనిచేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇది కడుపు లోపలి పొరను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కడుపులో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే సహజ భేదిమందులు ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ఏజెంట్లు, మలబద్ధకంతో పోరాడడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: కడుపు, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి త్రిఫల పొడి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం త్రిఫల చూర్ణం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కణాలను క్యాన్సర్ కణాలను పెరగకుండా నివారిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కి ఇది మంచి రెమిడీ.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: త్రిఫల ఒక మూలికా ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఏదైనా ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, పోరాడడంలో సహాయపడుతుంది. త్రిఫల శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం: త్రిఫల పొడి చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

త్రిఫల చూర్ణం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. త్రిఫల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంట్ డయాబెటిక్ గా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఇన్ల్ఫమేషన్ రాకుండా కాపాడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.

‘మదర్స్ డే’ను ఆదివారమే ఎందుకు చేసుకుంటారు? దీని వెనుక ఇంత కథ ఉందా?

World Mothers Day 2024 : అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే అని ఓ సినీ కవి అన్నట్లు అమ్మ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి. లోకాన్ని నడిపించే అద్వితీయ శక్తి అమ్మ. కానీ అమ్మ ఏ రోజూ ఇది నేనే చేశాను నా గొప్పే అని ఎప్పుడూ చెప్పుకోదు. అందుకే అమ్మ అంటే త్యాగం అని కూడా అంటారు. గోరంతలు చేసి కొండంతలు చెప్పుకునే మనుషులున్న ఈ లోకంలో తన ప్రాణాలనే పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి.

తల్లికి బిడ్డే లోకం
దాదాపు చావు అంచుల వరకు వెళ్లి బిడ్డను కన్న తల్లి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి అన్నీ మర్చిపోతుంది. తన బిడ్డ నవ్వితే ఆనందం ఏడిస్తే విచారం. బిడ్డకు ఒక వయసు వచ్చే వరకూ తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్ కాదు తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డ కోసం త్యాగం చేసే గొప్ప గుణం తల్లికి తప్ప ఈ సృష్టిలో మరో ప్రాణికి ఉండదు.

అమ్మకు థాంక్స్ చెప్పొద్దు
మనకు సహాయం చేసిన వారికి మనం ఒక థాంక్స్ చెప్పేసి చేతులు దులుపుకుంటాం. మహా అయితే వారికి అవసరంలో అన్ని రకాలుగా ఆదుకుంటాం. కానీ అమ్మకు థాంక్స్ చెప్పారా ఎప్పుడైనా? అమ్మకు ఎప్పుడు థాంక్స్ చెప్పకూడదు. ఒక థాంక్స్​తో అమ్మ ఋణం తీరిపోదు. అమ్మకు థాంక్స్ చెబితే అమ్మ విలువను మనం తగ్గించినట్లే. అమ్మ మనది. మనలో భాగమే. మనకు మనం ఎప్పుడూ థాంక్స్ చెప్పుకోము కదా. అమ్మ కూడా అంతే.

మదర్స్​డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు.
17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు.
1872లో జూలియవర్డ్‌ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది.
మేరీ జర్విస్‌ మే 9వ తేదీ రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె మరణానంతరం ఆమె కుమార్తె తన తల్లి జ్ఞాపకార్ధం మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది.
1911 నుంచి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరపడం మొదలైంది.
1914 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ప్రతిఏటా మే రెండో ఆదివారం రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు.
కాలక్రమేణా ఇది ప్రపంచమంతా వ్యాపించింది.
మరి అమ్మకు ఒక్క రోజు సరిపోతుందా!
కచ్చితంగా లేదు. ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు మాతృ దినోత్సవం పేరిట అమ్మకు గ్రీటింగ్ కార్డులు, కేకులు, పూలు కానుకలు ఇచ్చేస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతి క్షణం అమ్మకు అంకితం చేసినా కూడా సరిపోదు.

అమ్మకు వందనం ఇలా చేద్దాం
ఒక తల్లిగా, గురువుగా, మార్గదర్శిగా, చివరకు ఒక పెద్ద దిక్కుగా మన జీవితంలో అన్ని దశల్లో మనకు అండగా ఉండే అమ్మను దేవతలా పూజించవద్దు. ఎందుకంటే దేవత ప్రత్యక్షం కాదు కానీ అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మను మన మనసులో నిలుపుకుందాం. మన జీవితంలో, మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అమ్మ మనింట్లో ఉంటే మా అమ్మను నేను చూసుకుంటున్నాను అని పొరపాటున కూడా అనవద్దు. నా అదృష్టం మా అమ్మ దగ్గర నేను ఉన్నాను అని చెప్పడమే అమ్మ పట్ల మనం చూపించే నిజమైన కృతజ్ఞత.

అమ్మ బాధ్యత, కాదు బంధం
వృద్ధాప్యంలో ఉన్న అమ్మను బాధ్యత అనుకోవద్దు. ఒక పసిబిడ్డలా చూసుకొని ఆమె చరమాంకంలో హాయిగా గడిపేలా చేయాలి. అదే తల్లీబిడ్డల బంధానికి ఉన్న విలువ. మనం ఎన్ని సేవలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చిన తీరని ఋణం అమ్మది. లోకంలో తల్లి ప్రేమ లేక అలమటిస్తున్న ఆనాధలు ఎందరో ఉన్నారు. స్తోమత, సౌకర్యం ఉన్నవారు, పిల్లలు లేని వారు అలాంటి అనాధలకు తల్లి ప్రేమను అందించగలిగితే కన్నతల్లి ఋణం కొంతయినా తీరుతుంది. తల్లి ప్రేమ దైవత్వం. ఆ దైవత్వమును అందరికి పంచగలిగితే అది అమరత్వం అవుతుంది. అదే మన తల్లికి చేసే నిజమైన వందనం.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? – రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు!

How Many Liters Water Should You Drink Per Day : శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మందికి రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలియదు. ఇంకొందరు తాగినా.. ఎక్కువ తాగడమో, తక్కువ తాగడమో చేస్తుంటారు. అయితే, అలా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీరు(Water) తాగాలి? తక్కువ తాగితే ఏమవుతుంది? ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది? వీటన్నింటికి సమాధానం నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం.

సాధారణ వ్యక్తి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగాలని అమెరికా పరిశోధకులు అధ్యయన పూర్వకంగా కనుగొన్నారు. అయితే, ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చంటున్నారు. అంతేకానీ.. డైలీ తీసుకునే వాటర్ మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదని వెల్లడించారు. ఎందుకంటే ఆ విధంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

అమెరికాలోని “నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌”కు చెందిన పరిశోధకులు.. రోజూ తగినంత వాటర్ తాగడం వల్ల దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చనే దానిపై ఈ రీసెర్చ్ చేపట్టారు. దాదాపు 30 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొన్నారు. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి ఆరోగ్య వివరాలు తీసుకొన్నారు. ఆపై.. వారికి ’70-90 ఏళ్ల’ వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించి.. ఆ వివరాలన్నింటినీ “ఇ బయోమెడిసిన్‌” వైద్య పత్రికలో ప్రచురితం చేశారు. ఆ నివేదికలో వెలుగులోకి వచ్చిన వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి ఆవశ్యకతకు సంబంధించిన పలు అంశాలను ‘కిమ్స్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అకడమిక్స్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ మణిమాలరావు ఈ విధంగా వివరించారు. అవేంటంటే..

‘వాటర్​ వెయిట్’ సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా?

దాహమేసిన వెంటనే తాగాలి : నీరు ఎక్కువ తాగినా అవేమీ శరీరంలో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోతాయి. పైగా ఆ వాటర్​ను వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి.. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్ మణిమాలరావు. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగేలా చూసుకోవాలంటున్నారు.

అలాగే.. రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే.. ఒకేసారి తాగితే బాడీ ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుందని చెబుతున్నారు. అలాగని మరీ కొంచెం తాగితే.. ఆ నీళ్లను దాచిపెడుతుందట. కాబట్టి ఇవి రెండూ మంచిది కాదని సూచిస్తున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మంచినీటిని ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఉదాహరణకు 65-70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే.. వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు మణిమాలరావు.
తక్కువ తాగితే ఏమవుతుందంటే? మీరు నీరు తక్కువగా తాగితే ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్ మణిమాలరావు. అలాగే.. కిడ్నీల పనితీరు మందగిస్తుందని, రక్తపోటు పడిపోతుందని, కండరాలు పట్టేస్తాయని ఆమె సూచిస్తున్నారు. అదే విధంగా.. తలనొప్పి, మలబద్ధకం, చర్మం-నోరు ఎండిపోవడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ముఖ్యంగా యూరిన్ పసుపు పచ్చ రంగులోకి వచ్చిందంటే.. ఒంట్లో నీటి శాతం తగ్గిందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి టైమ్​లో వెంటనే తగినంత వాటర్ తాగాలని సూచిస్తున్నారు.

మరీ ఎక్కువ తాగితే ఏమవుతుందంటే? వాటర్ మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా.. శరీరంలో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుందంటున్నారు. ఫలితంగా కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుందని సూచిస్తున్నారు. దాంతో తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరగడం, గుండె లయ తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అంతేకాదు.. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

Case Filed on Allu Arjun for Nandyala Visit: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాక్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్ పైనా, వైసీపీ ఎమ్మెల్యే శిల్వా రవిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ అనుమతి లేకుండా జనసమీకణ చేశారంటూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహీ రెడ్డితో కలిసి ఈరోజు తన స్నేహితుడైన నంద్యాల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్ దంపతులు రవి నివాసానికి వచ్చిన సమయంలో భారీ సమీకరణ ఏర్పడింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రిటర్నింగ్ అధికారి అల్లు అర్జున్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Ravivar Upay: ఆదివారం రోజు ఈ చిన్న పని చేయండి.. మీ కోరికలు నెరవేరుతాయి..!

Sunday Remedies: సూర్య భగవానుని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, శక్తి, జీవితంలో విజయం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, ఎవరైతే ఆచారాల ప్రకారం సూర్య భగవానుని పూజిస్తారో, అతని జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.

హిందూ మతంలో, వారంలో 7 రోజులు ఏదో ఒక దేవత లేదా మరొక దేవుడికి అంకితం చేస్తారు. అదేవిధంగా, ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సూర్య భగవానుని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, శక్తి, జీవితంలో విజయం చేకూరుతుంది. మత విశ్వాసాల ప్రకారం, ఎవరైతే ఆచారాల ప్రకారం సూర్య భగవానుని ఆరాధిస్తారో, అతని జీవితంలో కష్టాలు తొలగిపోతాయి, అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

శ్రీ సూర్యాష్టకం పఠించండి..
ఆదివారం సూర్య భగవానుని పూజించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున మీరు శ్రీ సూర్యాష్టకం పఠించడం ద్వారా సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో, ఆనందంతో, శాంతితో, శ్రేయస్సుతో పఠిస్తారో వారి జీవితంలో నివసిస్తుందని నమ్ముతారు. ఇది కాకుండా, సూర్యదేవుడు కోరికలను నెరవేర్చడమే కాకుండా గ్రహ దోషాల నుంచి ఉపశమనం కూడా అందిస్తాడు. ఈ స్తోత్రాన్ని పఠించడం కూడా ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి, మీరు ఈ పాఠాన్ని 7 ఆదివారాలు నిరంతరం చేయాలి.

Night Shift Work: నైట్ షిఫ్ట్‌లలో పని చేస్తున్నారా..? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే గుండె గుభేలే..

పేలవమైన జీవనశైలి మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ముఖ్యమైనది. ఎందుకంటే.. రాత్రిపూట షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ, పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట పని చేయడం వల్ల శరీరంలోని ప్రోటీన్ స్థాయిలకు భంగం కలుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర శక్తి వినియోగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

అధ్యయనం సమయంలో, పరిశోధకులు వాలంటీర్లను నియంత్రిత వాతావరణంలో ఉంచారు. కొన్ని రోజులు రాత్రి షిఫ్ట్‌లలో, కొన్ని రోజులు పగటి షిఫ్టులలో పని చేయమని కోరారు. దీని తర్వాత అతని రక్తపరీక్షలను విశ్లేషించారు. రక్తంలో చక్కెర స్థాయిలు, శక్తి జీవక్రియను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శరీరంలోని కొన్ని ప్రోటీన్ల స్థాయిలను రాత్రి షిఫ్టులలో పనిచేయడం ప్రభావితం చేస్తుందని విశ్లేషణ కనుగొంది.

జీవ గడియారంతో సమస్య..

మన మెదడులో ఉండే ప్రధాన జీవ గడియారం (మాస్టర్ క్లాక్) పగలు-రాత్రి చక్రాన్ని నియంత్రిస్తుంది అని అధ్యయనం సీనియర్ రచయిత ప్రొఫెసర్ హన్స్ వాన్ డాంగెన్ చెప్పారు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా వాటి స్వంత అంతర్గత గడియారాలు ఉంటాయి. రాత్రిపూట పని చేయడం వల్ల ఈ అంతర్గత గడియారాలు చెదిరిపోయినప్పుడు, శరీరంలో స్థిరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది.

పరిశోధనలు అవసరం..

అయితే.. రాత్రి షిఫ్ట్‌ల తర్వాత ఈ ప్రమాదాలు ఎంతకాలం పెరుగుతాయి.? ఈ ప్రమాదాలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. ఈ అధ్యయనం నైట్ షిఫ్టులలో పనిచేసే వారికి కచ్చితంగా హెచ్చరిక సంకేతం. మీరు కూడా నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తుంటే, మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ నిద్ర సమయాన్ని వీలైనంత క్రమబద్ధంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఆహారంపై కూడా శ్రద్ధ వహించండి. అలాగే డాక్టర్‌ తో రెగ్యులర్ చెకప్‌లు చేయించుకుంటూ ఉండండి.. అంటూ పరిశోధకులు తెలిపారు.

iphone Battery Life Tips: మీ ఐఫోన్‌ ఛార్జింగ్‌ ఇట్టే అయిపోతోందా?.. అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్‌లో కూడా ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్‌ కంపెనీ కొన్ని టిప్స్‌ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఐఫోన్‌లో ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు మొదటగా చేయాల్సింది ‘ఐఓఎస్‌ అప్‌డేట్‌’ అని యాపిల్ తెలిపింది. కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం పేర్కొంది. ఈ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లను అందించడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్‌ సామర్థ్యాన్ని పెంచుతుందట. ఎప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వచ్చినా.. వెంటనే చేయాలని యాపిల్ చెబుతోంది.

ఐఫోన్‌లు 16- 22 ఉష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది. ఒకవేళ ఐఫోన్‌కు 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి తగిలితే.. బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుందట. చల్లని వాతావరణంలో ఐఫోన్‌ను ఉంచినా.. బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుందట. ఐఫోన్‌ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంటే.. బ్యాటరీ లైఫ్‌ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.

ఐఫోన్‌ రక్షణ కోసం దాదాపుగా అందరూ కేస్‌ లేదా పౌచ్‌లు వాడుతుంటారు. వాటితో పాటు ఛార్జింగ్‌ చేయడం మంచిది కాదని యాపిల్ అంటోంది. ఛార్జ్‌ చేసే సమయంలో ఐఫోన్‌ వేడెక్కుతుంది. కేసులు వేడిని బయటకు పోనీయకుండా చేయడంతో బ్యాటరీ దెబ్బతింటుంది. అందులకే ఫోన్‌ ఛార్జ్‌ సమయంలో పౌచ్‌ లేదా కేస్‌ల ఐఫోన్‌కు ఉంచరాదని కంపెనీ పేర్కొంది.

ఐఫోన్‌ను కొన్ని రోజులు వాడొద్దని అనుకున్న సమయంలో ఫుల్‌ ఛార్జి లేదా పూర్తిగా ఛార్జింగ్‌ లేకుండా పక్కన పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఫోన్‌ పనితీరు మాత్రమే కాదు బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతాయట. ఫోన్‌ను కొన్ని రోజులు ఉపయోగించకుండా ఉంచాలనుకుంటే.. 50 శాతం ఛార్జింగ్‌ ఉంచడం మంచిదని యాపిల్‌ తెలిపింది. ఒక వేళ మీరు ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు అనుకుంటే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఛార్జింగ్‌ చేయాలని చెప్పింది. లోపవర్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే బ్యాటరీ లైఫ్‌ బాగుంటుందట.

రాష్ట్రంలో పోలింగ్ టైమింగ్స్ విడుదల.. ఆ ప్రాంతాల్లో అనూహ్య మార్పులు

AP Polling : ఏపీలో సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

AP Polling : ఏపీలో కొన్ని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం ముగియగా, మరో 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయాలపై ఈసీ ప్రకటన చేశింది. ఏపీలోని 6 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది.

సాయంత్రం 6 తర్వాత మైకులు బంద్
ఇవాళ సాయంత్రం 6 గంటలకు తర్వాత అన్ని రకాల ప్రచారాలు నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తోందన్నారు. బయటి ప్రాంతాల వాళ్లు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం బయటి వారికి అనుమతిస్తామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ లకు చేరుకుంటామని ఎంకే మీనా తెలిపారు. సోమవారం ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసిందని సీఈవో మీనా తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం చేయకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

46 వేల పోలింగ్ కేంద్రాలు
“పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నాం. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. ఒపీనియన్ పోల్, ఎగ్జీట్ పోల్స్ పైనా నిషేధం ఉంది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశాం. అలాగే ప్రైవేటు , ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నాం. ఎన్నికల రోజు హింస జరక్కుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదు. తిరుపతి తరహా ఘటనలు జరక్కుండా నియంత్రిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్దులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం”- సీఈవో ముకేష్ కుమార్ మీనా

Health

సినిమా