Thursday, November 14, 2024

MOTOROLA G04: రూ. 6వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మోటో ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే ప్రముఖ ఈ కామర్స్‌ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మోటోరోలో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. మోటోరోలో జీ04 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎంత డిస్కౌంట్ లభిస్తోంది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా జీ04 స్మార్ట్‌ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 6,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 5999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 6,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది మీ పాత ఫోన్‌ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఇక మోటోరోలా జీ04 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 5 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. Unisoc T606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

Infinix Note 40 Pro: బడ్జెట్‌ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో, ప్రో+ పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను కంపెనీ బడ్జెట్ రేంజ్‌లోనే లాంచ్‌ చేసింది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 6ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలోనే అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరా అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో దుమ్ము, ధూళి నుంచి ప్రొటెక్షన్‌ కోసం ఐపీ53 రేటింగ్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ పొందొచ్చు

walking : 10 వేల అడుగులు వేయడం కష్టంగా ఉందా.. ఇలా చేయండి..

ఎక్సర్‌సైజ్ చేయలేని వారు కనీసం నడకైనా నడవాల్సి ఉంటుంది. నడవడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల బరువు తగ్గడం, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇందుకోసం రోజుకి కనీసం 10వేల అడుగులైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అలా త్వరగా 10వేల అడుగులు క్రాస్ చేయాలంటే ఏమేం ఫాలో అవ్వాలో తెలుసుకోండి.

రోజుకి కాసేపు సమయం..
హెల్త్ విషయంలో ఎలాంటి షాట్ కట్స్ ఉండవు. కాబట్టి, రోజుకి కాస్తా టైమ్ టార్గెట్ పెట్టుకోండి. ఆ టైమ్‌లో నడవడం అలవాటు చేసుకోండి. వీటితో పాటు బయటికి వెళ్ళినప్పుడు సొంత వాహనం బదులు బస్సు, లోకల్ ట్రైన్స్ వంటి వాటిల్లో వెళ్ళండి దీంతో కాస్తా దూరం నడవాల్సి ఉంటుంది. దీని వల్ల యాక్టివ్‌గా ఉంటారు.

గేమ్స్ ఆడడం..
అదే విధంగా, ఏవైనా గేమ్స్ ఆడండి. పిల్లలతో ఆడితే వారితో పాటు మీకు ఆనందంగా ఉంటుంది. దీని వల్ల బాడీ హెల్దీగా కూడా ఉంటుంది.

లంచ్ తర్వాత..
వీలైతే లంచ్, డిన్నర్ తర్వాత కాసేపు నడవండి. దీని వల్ల వర్కౌట్‌తో పాటు గ్యాస్ సమస్యలు కడా దరిచేరవు. దీంతో పాటు ఫోన్ మాట్లాడుతూ ఒకేదగ్గర కూర్చోకుండా ఫోన్‌లో మాట్లాడుతూ నడవండి.

వెహికల్ బదులు..
వీలైతే మీ వెహికల్ బదులు నడవడం మొదలుపెట్టండి. దీని వల్ల కాస్తా నడిచినట్లుగా ఉంటుంది. అదే విధంగా, జాబ్ చేసేవారు మధ్యలో బ్రేక్ తీసుకుని మీ కొలీగ్స్‌తో నడవండి. దీని వల్ల కేలరీలు ఖర్చవుతాయి.

మెట్లు ఎక్కి దిగడం..
వీలైనంత వరకూ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వాడండి. దీని వల్ల త్వరగా మీరు అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వగలరు. దీని వల్ల వాకింగ్ గోల్స్‌కి రీచ్ కాగలరు. దీంతో శరీరానికి మంచి వర్కౌట్ అందినట్లవుతుంది.

గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Tech Tips స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. మీ కళ్లను కాపాడుకోండి..

Tech Tips ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. మన నిత్య జీవితంలో అదొక భాగంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలా ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఐ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నారని పలు నివేదికల్లో వెల్లడైంది. ఇదిలా ఉండగా.. మనం ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు అనేక విషయాలను చెక్ చేస్తాం.. బ్యాటరీ, పర్మార్ఫెన్స్, కెమెరా, స్టోరేజీ ఇలా అనేక ఫీచర్ల గురించి కంపేర్ చేసి మరీ కొంటుంటాం. అయితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కొత్త ఫోన్ కొనేటప్పుడు లేదా పాత స్మార్ట్‌ఫోన్ రెగ్యులర్‌గా వాడుతుంటే మీ కళ్లకు సంబంధించి కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీ కళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
డిస్‌ప్లే విషయంలో..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు, అది AMOLED లేదా Super AMOLED డిస్ ప్లేతో వస్తుందో లేదీ చెక్ చేయండి. ఈ డిస్ ప్లేలు LCD కంటే అధునాతనమైనవి. ఈ డిస్‌ప్లే మంచి బీమ్ పవర్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఇవి తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటాయి. ప్రస్తుతం దాదాపు అన్నీ కంపెనీలు AMOLED డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నాయి.
స్క్రీన్ ప్రొటెక్టర్..
ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుందన్న విషయం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కళ్లకు మాత్రమే కాదు.. నిద్రకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. అందుకే స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్‌ను ట్రై చేయండి.

ఫాంట్ సైజ్ పెంచండి..
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడే వారి కంటిపై అధిక ఒత్తిడి పడుతుంది. మీరు వాడే స్మార్ట్‌ఫోన్‌లో బ్రైట్‌నెస్‌, టెక్స్ట్ సైజ్ కళ్లపై ప్రభావం చూపుతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగులను మార్చేందుకు అవకాశం ఉంటుంది. చిన్న సైజు టెక్స్ట్ మీ కంటిపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. అందుకే వీలైనంత మేరకు మీ ఫాంట్ సైజ్ పెంచుకోండి. దీని వల్ల మీ కంటిపై కొంతమేరకు ఒత్తిడి తగ్గొచ్చు.

ఇవి వాడండి..
మీ స్మార్ట్‌ఫోన్‌ను రాత్రి వేళ లైట్లు ఆఫ్ చేశాక వాడటం మానేయండి. ఎందుకంటే దీని వల్ల కళ్లపై వేగంగా ప్రభావం పడుతుంది. వాస్తవానికి రాత్రి వేళలో కూడా కళ్లపై ఫోన్ లో నుంచి వచ్చే లైటింగ్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ ఫోన్లో కచ్చితంగా నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ప్రస్తుతం వచ్చే చాలా స్మార్ట్‌ఫోన్లలో ఈ నైట్ మోడ్ ఆప్షన్ వస్తోంది. అలాగే రాత్రి వేళ ఫోన్ చూస్తూ చదవడం, రాయడం వంటివి పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే ఫోన్లో ఉండే బ్లూ లైట్ కంటి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే పైన చెప్పిన విధంగా బ్లూలైట్ ఫిల్టర్‌ను వాడండి.

AP: అదృష్టం అంటే ఇది.. 2 చేపలకు రూ.4 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకం

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కొన్ని గంటల్లో జీవితాలు రోడ్డున పడతాయి అనుకున్న తరుణంలో లాటరీ రూపంలో అదృష్టం వరించి.. లక్షాధికారులు అయిన వారు ఎందరో ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సామాన్యులు, పేదలకు లక్షలు, కోట్ల రూపాయల లాటరీలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ మత్స్యకారున్ని కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. అతడి వలకు చిక్కిన రెండు చేపలు.. ఆ జాలరిని లక్షాధికారిని చేశాయి. కేవలం రెండు చేపలు 4 లక్షల రూపాయల ఖరీదు పలికాయి. ఎందుకు.. ఆ చేపల ప్రత్యేకత ఏంటంటే..

మత్యకారుల వలలో అప్పడప్పుడు అరుదైన చేపలు పడుతూ ఉంటాయి. చూడ్డానికి ఎంతో చిన్నగా ఉండే వీటి ఖరీదు.. లక్షల్లో ఉంటుంది. అలాంటి అరుదైన జాతులకు చెందిన చేపలు వలకు చిక్కితే మత్స్యకారుల పంట పడినట్లే. రాత్రికే రాత్రే లక్షాధికారులు అవుతారు. తాజాగా.. కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు కూడా రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అతడి వలకు చిక్కిన 2 చేపలు ఏకంగా 4 లక్షల రూపాయలు పలికాయి. మరి ఆ చేపల ప్రత్యేకత ఏంటంటే..

సదరు మత్స్యకారుడి వలకు అరుదైన కచ్చిడి చేపలు చిక్కాయి. వీటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడగా.. వారిలో ఓ వ్యక్తి అత్యధికంగా ఒక్కో చేపకు రూ. 2 లక్షల చొప్పున మెుత్తం రూ. 4 లక్షలు చెల్లించి ఈ రెండు చేపలను కొనుగోలు చేశాడు.

ఏంటి వీటి ప్రత్యేకత..
కచ్చిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేప పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా వలకు చిక్కుతాయి. ఇవి కనుక వలలో పడ్డాయా.. ఇక ఆ మత్స్యకారుల పంట పండినట్లే. కచ్చడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌ అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆ చేపలు బంగారం కన్నా అధిక విలువ కలిగి ఉంటాయి. కచ్చిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండవని.. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయన్నారు.

సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాలను ఈ చేపల నుంచే తయారు చేస్తారన్నారు. కచ్చడి చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని చెప్పారు. అలానే పిత్తాశయం, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసే మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతేకాదు కాస్ట్లీ వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచ్చిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగానూ కచ్చడి చేపకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి మరీ వీటిని కొనుగోలు చేస్తారని తెలిపారు.

High Interest FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న 3 బ్యాంకులివే..!!

Fixed Deposits: ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు తమ పెట్టుబడిదారులకు మంచి వడ్డీ రేట్లకు టర్మ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేట్లను గతంలో పలు దఫాలుగా పెంచిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ భారతీయ కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా దేశంలోని ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కస్టమర్‌లు నిర్ణీత వ్యవధి తర్వాత హామీ ఆదాయాన్ని పొందుతారు. బ్యాంకులే కాకుండా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కూడా తమ కస్టమర్లకు FDపై బంపర్ వడ్డీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో 9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
Suryoday Small Finance Bank: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 5 సంవత్సరాల FDపై 9.10% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.60% వరకు వడ్డీని అందిస్తోంది. Unity Small Finance Bank: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1001 రోజుల FDపై 9% వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి 9.50 శాతం వడ్డీని అందిస్తోంది. Fincare Small Finance Bank: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్‌లకు 1000 రోజుల FDపై 8.51% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.11 శాతం వడ్డీని అందిస్తోంది.

AP Students Online Promotion Lists, Holistic Progress Card 2024 Generation

Oplus_131072

AP Students Online Promotion Lists, Holistic Progress Card 2024 Generation AP Students Promotion Lists 2024 Generation Student Holistic Progress Card Generation apscert automatic promotion lists 2024 Promotion Lists Download from CSE Website Automatically

AP Students Promotion Lists, Holistic Progress Card 2024 Generation స్టూడెంట్ ఇన్పో పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు:

1. https://studentinfo.ap.gov.in/ లో CCE మార్క్స్ విభాగంలో అన్ని Assessments మార్కులు నమోదు చేయవలెను.

2. ఇప్పటివరకు కో కరికులర్ సబ్జక్ట్ ల మార్కులు పాటశాల ల రికార్డులలో నమోదు చేయుచున్నారు. వాటిని SA 1 , SA 2 మార్కుల ఎంట్రీ స్క్రీన్ లో ఆన్లైన్ లో కూడా నమోదు చేయవలెను.

3. SA 2/ CBA 3 మార్కుల ఎంట్రీ స్క్రీన్ ఎనేబుల్ చేయబడినది. అందులో ప్రతి విద్యార్ధి మార్కులు సబ్జక్ట్ మరియు కో-కరిక్యులర్ మార్కులు. నమోదు చేయవలెను. అందుకు సంబంధించిన రుబ్రిక్స్ ఇవ్వబడినది.

4. అనంతరం https://studentinfo.ap.gov.in/ లోనే SERVICES విభాగం లో Holistic Progress Remarks ను క్లిక్ చేసి Studying Class, Select Student, Exam Type సెలెక్ట్ చేసుకుని HOLISTIC PROGRESS REMARKS ని ఇచ్చిన రుబ్రిక్స్ ప్రకారం నమోదు చేయవలెను. డ్రాప్ డౌన్ బాక్స్ లో మూడు ఆప్షన్ లు STREAM l, MOUNTAIN, SKY లు విద్యార్ధి స్థాయిలు ఆయా అంశాల (21) ఆధారం గా ఎంపిక చేసుకోవాలి. సబ్మిట్ చేయాలి ఈ విధం గా SA 1, SA 2 లకు అందరు విద్యార్ధులకు సబ్మిట్ చేయాలి.

5. అన్ని పరీక్షల మార్కులు, HOLISTIC PROGRESS REMARKS నమోదు చేసుకున్నామని నిర్ధారణ చేసుకోవలెను.

6. అనంతరం https://cse.ap.gov.in/ వెబ్సైటు లో LOGIN పై క్లిక్ చేసి HM యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వవలెను.

7. అనంతరం https://cse.ap.gov.in/ లోనే MIS Reports పై క్లిక్ చేస్తే 15 వ సేరియల్ నంబర్ లో Students Promotion List Report పై క్లిక్ చేస్తే, ఓపెన్ అయిన పేజి లో క్లాస్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List Generate అవుతుంది. పక్కన ఉన్న ఎక్సెల్ బొమ్మ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List డౌన్ లోడ్ అవుతుంది. అందులో మార్కులు గ్రేడ్స్, ఇతర వివరాలు సరిచూసుకుని అవసరం అయితే తగు మార్పులు చేసుకుని ప్రింట్ తీసుకుని HM, CLASS TEACHER సంతకాలు చేసి సంబంధిత ఇన్స్పెక్టింగ్ అధికారికి సమర్పించుకోనవచ్చును.

8. అనంతరం https://cse.ap.gov.in/ లోనే SERVICES పై క్లిక్ చేస్తే 5 వ వరస లో Student Wise Holistic Progress Card పై క్లిక్ చేస్తే Select Class, Select Student ఆప్షన్స్ ను ఎంపిక చేసుకుంటే ఎంపిక చెసుకున స్టూడెంట్ Student Holistic Progress Card డౌన్ లోడ్ చేయమంటారా అని బాక్స్ వస్తుంది. OKక్లిక్ చేస్తే Student Holistic Progress Card డౌన్లోడ్ అవుతుంది. CCE మార్క్స్ ఎంట్రీ లో మీరు ఎంటర్ చేసిన మార్కులు, స్టూడెంట్ attendance app లో హాజరు, Holistic Progress remarks లో మీరు ఎంటరు చేసిన లెవెల్స్ అన్ని వివరాలతో Student Holistic Progress Card generate అవుతుంది. ప్రింట్ తీసుకుని HM, Teacher సంతకం చేసి విద్యార్ధులకు అందించవలెను.

9. ఈ ప్రాసెస్ అందరు ఉపాధ్యాయులకు తెలియచేసి నూరు శాతం మార్కుల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు ల తయారీ చేయుట కు కృషి చేయవలెను.

CCE Marks Entry click here

Promotion Lists, Holistic Progress Card Generation click here

మహిళలకు భారీ శుభవార్త అందించిన ప్రధాని మోడీ

బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ సబ్సిడీ గ్యాస్ అందిస్తామన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ పేదల కోసం మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Papaya: బొప్పాయితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ దీన్ని ఇలా తింటేనే మంచిది!

బొప్పాయి.. అందరికీ అందుబాటులో ఉండే చవకైన రుచికరమైన, జ్యూసీ పండు. ఇది వేసవి కాలంలో తినడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా తీపి మరియు జ్యుసిగా ఉంటుంది, ఇది తిన్న తర్వాత చాలా తాజాగా అనిపిస్తుంది. బొప్పాయి చాలా రుచికరమైన పండు, ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. అంతే కాదు బొప్పాయి తినడం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు.. బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

బొప్పాయి ప్రయోజనాలు:

షుగర్‌ని నియంత్రించడం నుండి బరువు తగ్గడం వరకు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి చాలా రుచికరమైన పండు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల, బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి సహజమైన భేదిమందు కూడా. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల ప్రేగుల కదలిక మెరుగుపడుతుంది. ఉబ్బరం సమస్యను నివారిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి:

బొప్పాయిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కెరోటినాయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

గుండెకు ప్రయోజనకరం:

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, బొప్పాయి తినడం ఆరోగ్యకరమైన గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

బొప్పాయిలో లైకోపీన్, విటమిన్ సి ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. డార్క్ స్పాట్స్‌తో పాటు ముడతలు, ఫైన్ లైన్‌లను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఫలితంగా మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:

బొప్పాయిలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది . ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

కడుపు నిండుగా ఉంటుంది:

బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని కారణంగా, అతిగా తినాలనే కోరిక ఉండదు. బరువు పెరగడం లేదా ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Fruit For Weight Loss: ప్రతిరోజూ ఈ పండు తినండి.. నెలరోజుల్లోనే మీరు స్లిమ్‌గా అవుతారు..డోన్ట్‌ మిస్..!

సపోటా పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ని సులభంగా తగ్గించుకోవచ్చు. సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ ఉన్నాయి. ఇవి మీ నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాను ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సపోటా పండు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇది మన శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగిస్తుంది. అంతేకాకుండా, సపోటా పండులో సహజ చక్కెర ఉంటుంది. బరువు పెరుగుతారనే భయం లేదు. సపోటా పండు హాయిగా తినవచ్చు. సపోటా పండు తింటే షుగర్ పెరుగుతుందన్న భయం అక్కర్లేదు. ఇందులోని విటమిన్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో సపోటా సహకరిస్తుంది. సపోటాలు తింటే.. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ తక్షణమే లభిస్తుంది సపోటా పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సపోటా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు పెరగడానికి కారణం కాదు. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. మన ఆహారంలో సపోటా పండును చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ.. కంటి సమస్యలు దూరం చేస్తుంది. అంతేకాదు.. నిద్రలేమి, ఒత్తిడితో బాధపడే వారు తరచూగా సపోటా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సపోటా పండు రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నివారిస్తుంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సపోటాలో ఉండే బీ-సీ విటమిన్స్ వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌.. ఎముకల్ని బలపరుస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వాన్ని సపోటా నివారించడంలో తోడ్పడుతుంది. సపోటా పండు మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. ఇవి చాలా తక్కువ ధరలకే లభిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చు. అలాగే, స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను తగ్గించడంలోనూ సపోటా పనిచేస్తుంది. ఈ పండ్లు మన జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడతాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సపోటా పండును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇతర పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనితో మీరు రుచిని ఆస్వాదిస్తూ సులభంగా బరువు తగ్గవచ్చు.

ఏపీ సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి చేశారు.
ఈ దాడిలో సీఎ జగన్ కనుబొమ్మ పై గాయం అయింది. కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్‌ స్పందించి.. ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు.

ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని.. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని, ఆ ప్రాంతంలో స్కూల్, వ్యాపార సముదాయాలు ఉండటంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిక్షించారు. అలాగే సీఎం జగన్ కు తగిలిన రాయిని పరిశీలించి వేలిముద్రలు సేకరించిన పోలీసులు, పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం. వారికి నో రేషన్ కార్డు.!

Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న 6 గ్యారంటీలను పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో నేటికీ చాలామందికి రేషన్ కార్డు లేదు.

దీంతో చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్ల రేషన్ కార్డు లేని అర్హులను గుర్తించి తెల్ల రేషన్ కార్డ్ జారీ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోని అధికారుల ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే 15 తర్వాత నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Ration Cards : వీరికి నో రేషన్ కార్డు….

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ,ప్రభుత్వ ఉద్యోగులకు , కారు ఉన్న వారికి గృహ యజమానులు మరియు నిర్దిష్ట క్యాటగిరీలకు చెందిన వ్యక్తులకు కొత్త రేషన్ కార్డ్ ఇవ్వబడదని ప్రభుత్వం విశ్వసనీయంగా సూచించింది.

Ration Cards : కొత్త రేషన్ కార్డు ప్రక్రియ..

రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకి చాలా కీలకమైనటువంటి కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు జారీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న పక్కా ప్రణాళికలను తెలియజేస్తూ కీలక నిర్ణయాలను వెల్లడించింది.

అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా దరఖాస్తులు స్వీకరించారు. దీనిలో భాగంగా సుమారు 10 లక్షల మంది వ్యక్తులు వివిధ పథకాల కోసం దరఖాస్తు తో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు.

Ration Cards : సంక్షేమ లక్ష్యంపై దృష్టి…

రేషన్ కార్డులను నిర్దిష్ట సామాజిక మరియు ఆర్థిక విభాగాలకు చెందిన వారికి అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. రైతులు మరియు కార్మికుల వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి ఈ తెల్ల రేషన్ కార్డులో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా ఖచ్చితమైన పరిశీలన మరియు ధృవీకరణ విధానాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి మే 15 తర్వాతకొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం… వారికి నో రేషన్ కార్డు…!

Ration Cards : సంక్షేమ పథకాలకు ప్రాముఖ్యత…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్లు మాత్రమే పొందగలుగుతారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు ,సబ్సిడీ కింద 500 కే గ్యాస్ సిలిండర్లు ఇలా అవసరమైన సేవలు అన్నింటికీ ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

IranAttack: డేంజర్‌ బెల్స్‌.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాంబుల వర్షం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.

ఇక, ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌ గగనతలంలోకి రాగానే సైరన్‌ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్‌లో డ్రోన్‌ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇరాన్‌ నుంచి వచ్చే డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది

AC Tips: ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి

ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండటం చాలా కష్టమే. దగ్గరలో చెట్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓ గార్డెన్ ఉన్నా, లేదా నీడ ఎక్కువగా ఉండే చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కుర్చీ వేసుకొని కూర్చోవాలి అనిపిస్తుంటుంది.
ఊరిలో ఉండేవారు ఇప్పటికీ ఇలాగే చేస్తుంటారు. కానీ పట్నం ప్రజలకే ఈ అదృష్టం ఉండదు. అయితే ఎండలు, వేడి భరించలేక ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. మరి మీరు కూడా ఏసీ తీసుకున్నారా? ఈ ఏసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అంతే సంగతలు..

ఏసీ వేసుకున్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ ను కూడా వేస్తున్నారా? ఇంతకీ ఏసీ వేసిన తర్వాత ఫ్యాన్ ను ఆన్ చేయాలా? చేయవద్దా? చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయకూడదు అంటే నిపుణులు మాత్రం ఫ్యాన్ ను ఆన్ చేయాలి అంటున్నారు. కానీ ఈ ఫ్యాన్ ను స్పీడ్ లో మాత్రం పెట్టవద్దట. కేవలం రెండు లేదా మూడు నెంబర్ లో పెట్టి మాత్రమే ఫ్యాన్ ను ఉపయోగించాలట.

ఏసీ వేసుకొని ఫ్యాన్ ను కూడా ఆన్ చేసుకునే వారు కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట. దీని వల్ల నష్టం లేకపోగా లాభమే ఉంది అంటున్నారు నిపుణులు. ఏసీ వేసుకొని ఫ్యాన్ వేయడం వల్ల ఏసీ గాలి రూమ్ మొత్తం త్వరగా వ్యాపిస్తుంది. మీ గది కూడా త్వరగా చల్లగా మారుతుంది. ఏసీ తక్కువ స్పీడ్ లో ఉన్నా కూడా చల్లగా ఉన్న ఫీల్ వస్తుంటుంది. కానీ ఏసీ గాలి బయటకు రాకుండా తలుపులు, కిటికీలు మాత్రం మొత్తం క్లోజ్ చేసుకొని పెట్టుకోండి.

ఇలా అన్ని డోర్లను క్లోజ్ చేయడం వల్ల రూమ్ మరింత త్వరగా చల్లబడుతుంది. దీంతో కరెంబ్ బిల్ కూడా ఆదా చేసిన వారు అవుతారు. కానీ ప్యాన్, కూలర్లను రెండింటిని ఒకేసారి ఆన్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అవి వ్యతిరేక దిశల్లో పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండు పరికరాలను ఒకేసారి ఉపయోగించవద్దు.

జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించే వంటింటి చిట్కాలివే..?

Young woman with hair loss problem indoors

ఈ మధ్య కాలంలో చాలామంది హెయిర్ లాస్ సమస్యతో బాధ పడుతున్నారు. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు హెయిర్ లాస్ సమస్యకు కారణమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిలో ఈ సమస్య కనిపిస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వంటింటి చిట్కాలు పాటించి జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

హెయిర్ లాస్ సమస్యతో బాధ పడేవాళ్లకు ఉసిరి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని పొడిగా చేసి తలకు తరచూ పెట్టుకుంటే జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉసిరి పొడి, చుండ్రు, నెత్తి మంట లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. వేపాకులను కొబ్బరి నూనెలో మరిగించి ఆ ఆయిల్ ను తలకు రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

బీట్ రూట్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ఎవరైతే బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటారో వారిలో కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది. రాత్రంతా మెంతులను నానబెట్టి ఆ మెంతులను పేస్ట్ లా చేసి తలకు పట్టించినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉల్లిగడ్డలను జ్యూస్ లా చేసుకుని తలకు పట్టించినా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

గుడ్లను పగలగొట్టి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు రాసుకున్నా గుడ్లలో ఉండే ప్రోటీన్లు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగినా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. జుట్టు రాలే సమస్యను నివారించడంలో మందారం సైతం అద్భుతంగా సహాయపడుతుంది. మందారం రెక్కలను క్రష్ చేసి నూనెలో కలుపుకుని తలకు పట్టిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉండాలంటే ఈ పండు తింటే చాలు..

కిడ్నీలో రాళ్లు ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఉరుకులు పరుగుల జీవితంలో సరిగ్గా భోంచేయక, నీళ్లు తాగకపోవడంతో నాలుగు రాళ్లు వెనుకాల పడుతున్నాయి. కిడ్నీలో చేరి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత బిజీగా ఉన్నఈ ఒక్క పండుతింటే కిడ్నీ రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని తాజాగా పరిశోదనలో తేలింది.

ఎండు ద్రాక్ష కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వాటి నుంచి బయటపడొచ్చు. ఎసిడీటీతో బాధపడేవారికి మంచి మందులా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎసిడిటీతోపాటు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యకరమైన కంటిచూపుకి కూడా సహాయపడతాయి. అలాగే ఎండుద్రాక్షల్లో లభించే ఓలినోలిక్ యాసిడ్ తో పళ్లు బలంగా… ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎండు ద్రాక్షల్లో ఐరన్, బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. అందువల్ల ప్రతిరోజు వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు. ఇవి శరీరంలో అనవసరపు కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా అవుతాయి..

Mudragada Padmanabham: ముద్రగడ విచిత్ర పరిస్థితి

xr:d:DAF7VKhaV6Q:1515,j:6237910196473995995,t:24041306

Mudragada Padmanabham: రాజకీయ నాయకుడి కంటే కాపు ఉద్యమ నేతగానే ముద్రగడ పద్మనాభంకు గుర్తింపు ఉంది. తనకు ఈ రాజకీయాలు అవసరం లేదంటూ అస్త్ర సన్యాసం చేసిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఉద్యమ ఫలాలు దక్కకుండానే పోరాటాన్ని ఆపేశారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన వైపు చూశారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో వైసీపీలోకి వెళ్లారు. కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి స్టార్ క్యాంపైనర్ అవుతారని భావించారు. కానీ ఆయన పవన్ కోసమే వైసీపీకి వెళ్లినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాలం గడిపేస్తున్నారు.

ప్రస్తుతం కిర్లంపూడి లోని తన ఇంటి గేటును కూడా ముద్రగడ దాటడం లేదు. తనను కలిసేందుకు వైసిపి నేతలు, కాపు నాయకులు వచ్చినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమాల్లో నువ్వు గొప్ప, రాజకీయాల్లో నేను గొప్ప అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎంతటి ముద్రగడ.. ఇలా అయ్యారేంటి అని సన్నిహితులు కూడా వ్యాఖ్యానించే స్థితికి చేరుకున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ఆయనకు ఏ పని అప్పగించ లేదని తెలుస్తోంది. కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికే ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నట్లు టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఒకరిద్దరు కాపు నేతలను ముద్రగడ ఆకర్షించగలిగారు. కానీ ఎందుకో తర్వాత పిఠాపురం వదిలేశారు. ఇంటికే పరిమితం అయ్యారు.

తనకు తాను ముద్రగడ స్టార్ క్యాంపైనర్ గా భావిస్తున్నారు. అయితే కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తేనే ముద్రగడకు ఎంతోకొంత గుర్తింపు లభించే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఆయన ఫేడ్ అవుట్ అయినట్టే. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలి. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. కేవలం పవన్ కోసమే జగన్ తనను నియమించినట్లు వ్యవహరిస్తున్నారు. తనకున్న పెద్దమనిషి హోదాను కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ముద్రగడ తీరును చూసి కాపు సామాజిక వర్గంలో కూడా ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం పెద్ద రచ్చ నడుస్తోంది. ఇటువంటి వ్యక్తా కాపు ఉద్యమ నేత అంటూ.. కాపు యువత విమర్శల జడివాన కురిపిస్తోంది.

Jio Vs Airtel తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే.. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ కూడా…

Jio Vs Airtel ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడే వారందరికీ అన్‌లిమిటెడ్ డేటా కోసం, ఫ్రీ వాయిస్ కాల్స్‌తో ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నాయి ఎయిర్ టెల్, జియో కంపెనీలు. ఈ రెండు దిగ్గజ కంపెనీలు రూ.250లోపు అపరిమిత వాయిస్ కాల్స్, రోజకు 100 మెసెజెస్, అన్ లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. అంతేకాదు యూట్యూబ్, ఫేస్‌బుక్ బేస్ కోసం ప్రత్యేక డేటాను అందిస్తున్నాయి. వీటన్నింటికి 28 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్, జియో ఈ రెండింటినీ కంపేర్ చేస్తే, దేంట్లో ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.179
జియో కంపెనీ రూ.179 ప్రారంభ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా 24 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటాను అందిస్తోంది. అంతేకాదు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 మెసెజెస్ కూడా అందిస్తున్నాయి. జియో రెండో ప్రీపెయిడ్ ధర రూ.239. ఇటీవలే ప్రారంభించిన ఈ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు.

మరో రెండు ప్లాన్లు..
రూ.250లోపు కంటే తక్కువగా మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే దీనికి 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అందులో ఒకటి రూ.199 రీఛార్జ్ ప్లాన్. ఇందులో భాగంగా ప్రతిరోజూ 1.5GB డేటా పొందుతారు. మరొకటి రూ.249 ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో భాగంగా రూ.2GB డేటాను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్లు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఫస్ట్ ప్లాన్..
జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా తన ప్రారంభ రీఛార్జ్ ప్లాన్ రూ.179లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 2GB డేటా లభించనుంది. అంతేకాదు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వైఫైని ఉపయోగించే వారికి ఇదొక గొప్ప ప్రయోజనంగా చేకూరుతుంది. మరో రీఛార్జ్ రూ.239లో భాగంగా రోజు 1GB డేటా, రోజుకు 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగుతో 24 రోజుల పాటు వ్యాలిడిటీని పొందొచ్చు.

ఈ రెండింట్లో ఏది బెటరంటే..
డేటా పరంగా జియో కంపెనీ మంచి ఆఫర్లను ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. జియో కంపెనీ రూ.179 ప్లాన్లో భాగంగా మొత్తం 24GB డేటాను అందించనుంది. అయితే ఎయిర్‌టెల్ మాత్రం మొత్తం 2GB వరకు డేటాను అందించనుంది. మళ్లీ రూ.239 ప్లాన్లో భాగంగా ఎయిర్‌టెల్‌లో 24GB డేటా, జియోలో 42GB డేటా లభించనుంది. చూశారు కదా.. రెండింట్లో ఏయే అదనపు ప్రయోజనాలు ఉన్నాయో.. వీటిలో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్లను చెక్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి.

PPF: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇది కచ్చితంగా ఇవ్వాల్సిందే.. లేకుంటే అకౌంట్ ఫ్రీజ్!

Post Office Schemes: పెట్టుబడులకు ఎన్నో పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల్ని కూడా తీసుకొచ్చింది. ఇవి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న మొత్తాల్లో కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిర వడ్డీ ప్రకారం రాబడి ఉంటుంది. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. నిర్దిష్ట కాలానికి వడ్డీ ప్రకారం రాబడి అందుకోవచ్చు. ఈ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది.

అయితే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కచ్చితంగా ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సిందేనా? కచ్చితంగా ఇవ్వాల్సిందే. కొత్తగా ఈ అకౌంట్లు తెరిచే వారు కచ్చితంగా ఆధార్ కార్డు డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేటెస్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి 2023, ఏప్రిల్ 3న నోటిఫికేషన్ వచ్చింది. 2023, ఏప్రిల్‌కు ముందు చాలా మంది ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండానే ఇలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. వీరికి సదరు కార్డులు సమర్పించాలని గతంలోనే అలర్ట్ చేసింది కేంద్రం. ఇక మీదట ఇన్వెస్ట్ చేసే సమయంలోనే సమర్పించాలని పేర్కొంది.

ఆధార్ కార్డు నంబర్ లేకుంటే.. ఆధార్ స్కీమ్‌ కింద ఎన్‌రోల్‌ చేసుకొని ఆ నమోదు సంఖ్యను సమర్పించాలని అదే నోటిఫికేషన్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఇలా ఎన్‌రోల్‌మెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేసి స్కీమ్‌లో అకౌంట్ తెరవొచ్చని పేర్కొంది. ఇంకా అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల్లోగా మళ్లీ ఆధార్ కార్డు నంబర్‌ సమర్పించాలని వెల్లడించింది. అయితే నిర్దిష్ట సమయంలోగా అకౌంట్ హోల్డర్.. ఆధార్ కార్డు సమర్పించకపోతే అకౌంట్ నిలిచిపోతుందని.. మళ్లీ ఆధార్ నంబర్ సమర్పించినప్పుడు తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపింది.

ఇలా అకౌంట్ ఫ్రీజ్ అయిన సమయంలో వడ్డీ ప్రయోజనాలు కోల్పోతారు. సదరు స్కీమ్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయలేరు. విత్‌డ్రా చేయలేరు. ఇతర బెనిఫిట్స్ అందుకోలేరు. అందుకే సమయానికి సమర్పించడం మంచిది. ఇక పాన్ కార్డు కూడా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సమర్పించలేని వారు.. రెండు నెలల్లోగా అందించాల్సి ఉంటుంది. చిన్న పొదుపు పథకాలకు కేవైసీగా పాన్ కార్డు ఉపయోగిస్తామని గతంలో కేంద్రం తెలిపింది. లిమిట్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేందుకు పాన్ కార్డు కచ్చితంగా అందించాల్సిందేనని వివరించింది.

అరటి పండ్లు త్వరగా కుళ్లిపోతున్నాయా.? ఇలా చేయండి..

అరటి పండును పేదవాడి ఆపిల్‌గా పిలుస్తారు. తక్కువ ధరకు లభించే అరటితో కలిగే లాభాలు అలాంటివి మరి. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అరటి పండ్లలో అనేక రకాల విటమిన్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని ఐరన్‌, ఫైబర్‌, ఆక్సిడెంట్స్‌ కిడ్నీలు, జీర్ణవ్యవస్థ, గుండె వంటి అవయవాలను కాపాడుతాయి.

మరి ఇన్ని లాభాలు ఉండే అరటి పండ్లతో వచ్చే సమస్యల్లో అవి త్వరగా కుళ్లి పోవడం ఒక సమస్యగా చెప్పొచ్చు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా అరటి పండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇంతకీ అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

* అరటి పండ్లను వేలాడదీస్తే త్వరగా పాడవవు. ఇందుకోసం ఒక తాడుతో కట్టి గాలి సోకే ప్రాంతంలో వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

* ఇక అరటి పండ్లను ప్లాస్టిక్‌ ర్యాపింగ్‌లో చుట్టడం వల్ల కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. గాలి తాకకుండా ఉండేలా కవర్‌తో అరటిపండ్లను కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు తాజాగా ఉంటాయి.

* అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే. మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే అరటి పండ్లకు వెనిగర్‌ను అప్లై చేయాలి. అనంతరం గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

* అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టినా తాజాగా ఉంటాయి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు అరటి పండ్లకు గాలి చొరబడకుండా కవర్‌లో ప్యాక్‌ చేయాలి.

* ఇదిలా ఉంటే మీరు కొనుగోలు చేసిన అరటి పండ్లలో ఒక్క పండు కుళ్లిపోయినా దానిని తొలగించాలి. ఇందుకంటే బాగా మక్కిన అరటిపండు నుంచి ఇథిలిన్‌ వాయువు వస్తుంది. ఇది పక్కనున్న అరటిపండ్లను కూడా కుళ్లిపోయేలా చేస్తుంది.

Lifestyle: భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్తారు. అయితే పండ్లను తీసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.? మనలో చాలా భోజనం చేయగానే పండ్లను తీసుకుంటారు. మరి ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా.? అసలు పండ్లను ఎప్పుడు తినాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లను భోజనానికి అరగంట ముందు తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే భోజనం తర్వాత పండ్లను తింటే, పండ్లలోని అదనపు కేలరీలు ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తాయని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే పండ్లను తీసుకోకూడదని చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం పండ్లను తీసుకోవడానికి బెస్ట్‌ సమయంగా చెబుతున్నారు.

భోజనం చేయగానే ఎట్టి పరిస్థితుల్లో పండ్లను తీసుకోకూడదు. దీనికి కారణం భోజనం చేయగానే శరీరంలో కేలరీలు ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే కంటే ముందే మళ్లీ పండ్లను తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై రెట్టింపు భారం పడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల టాక్సిన్స్ పేరుకుపోతాయని చెబుతున్నారు. దీని ప్రభావం పొట్టపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తుంది.

భోజనం చేసే కంటే కనీసం రెండు గంటల ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవడం బెస్ట్‌ అని చెబుతున్నారు. ఇక ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

సీఎం జగన్‌పై దాడి.. చంద్రబాబు, లోకేష్‌ రియాక్షన్‌.. వైసీపీ కీలక ప్రకటన

రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు కూడా వేశారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ కీలక ప్రకటక చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని ఎక్స్‌ వేదికగా కోరింది. మరోవైపు సీఎం జగన్‌పై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ ఎక్స్‌ ఖాతా నుండి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ ఫైర్‌ అయ్యింది.

సీఎం జగన్‌పై దాడిని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఇక ‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్‌? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే వచ్చా!’ అని నారా లోకేస్‌ ట్వీట్‌ ఏచశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయి అని వాటి ఫొటోలు పోస్ట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 13, శనివారం విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల బస్సు యాత్రలో రాళ్లతో దాడి చేశారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తెలిపింది. ‘ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌పై బస్సులో దాడి జరిగింది. రాయి తగలడంతో ఎడమ కనుబొమ్మపై గాయమైంది. అతడిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి గాయమైంది’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం జగన్ ప్రచారం చేస్తున్నారు.

మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

దొంగలని.. వెధవలని చేసిన అవ్వ! ఈమె ఐడియాకి దొంగలు పరార్!

నేటికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చోరీలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అయినా కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈ దొంగతనాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్లు, బ్యాంకు, బంగారు షాపులు, ఇతర దుకాణాల్లో చోరీలు చేసి..విలువైన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఇక దొంగల దెబ్బకు సామాన్య జనమే కలవర పడుతుంటే.. ఓ వృద్ధురాలు చేసిన పనికి ఆ దొంగలే అవాక్కయ్యారు. ఇక ఆ వృద్ధురాలు చేసిన పనికి స్థానిక ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఆలస్యం ఏందుకు ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. అలానే ఎవరైన ఒంటరిగా ఉన్న సమయంలో కూడా ఇళ్లల్లో చోరీలకు తెగపడుతుంటారు. ఎవరైన ఎదురు తిరిగితే చంపడానికి సైతం వెనుకాడరు. అలా దొంగళను ఎందిరించి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అయితే ధైర్యం చేసి పోరాడుతారు. ఇక వృద్ధులు అయితే దొంగలను ఎదిరించే సాహసం చేయలేరు. అలానే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేరు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్దురాలు చేసిన పనికి దొంగలకే చెమటలు పట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలు అందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అలానే గుండాల మండలం సీతారామపురంలో అనే గ్రామంలో కూడా తరచూ చోరీల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ జరుగుతున్న దొంగతనాలతో స్థానికులు కలవరపడుతున్నారు.

ఇదే సమయంలో అదే గ్రామంలో నివాసం ఉండే కప్పరి పిచ్చమ్మ అనే వృద్ధురాలు ఓ అద్భుతమైన ఐడియా వేసింది. తన ఇంట్లో చోరీ జరిగిన విలువైన వస్తువులు పోకుండా మంచి పథకం వేసింది. గతంలో ఆ వృద్ధురాలి ఇంట్లో రెండు సార్లు చోరీ జరిగింది. ఆ సమయంలో నగదుతో పాటు విలువైన వస్తువులు పోయాయి. దీంతో మరోసారి అలాంటి చేదు అనుభవం ఎదుర్కొకూడదని ఆమె భావించింది. ఇంట్లో విలువైన వస్తువులను, డబ్బులను తన వద్దే పెట్టుకుని ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లి పడుకుంది.

ఆ వృద్ధురాలి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇదే మంచి ఛాన్స్ అని దొంగలు భావించారు. వెంటనే ఇనుప వస్తువులను కోసే బ్లేడ్ తో ఆ ఇంటి తాళం కోశారు. ఇంట్లోకి వెళ్లి మొత్తం వెతికిన ఓ పది రూపాయల నోటు కూడా దొరలేదు. చివరకు వెనుతిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి..అక్కడి పరిస్థితి చూసి దొంగలు వచ్చినట్లు పిచ్చమ్మ గ్రహించింది. అలానే స్థానికులు ఆమె ఇంట్లో ఏ విలువైనవి చోరీకి గురయ్యాయో అని తెగ బాధపడ్డారు. నగదు తనవద్దే ఉన్నాయని ఆ వృద్దురాలు చెప్పడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా కండబలంతో కాకుండా బుద్ధిబలంతో దొంగలకు ఆ వృద్ధురాలు బుద్ది చెప్పింది.

Health Tips : రాత్రి పడుకోనే ముందు ఒక గ్లాసు తాగితే చాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..

ఉదయం తీసుకొనే ఫుడ్ లేదా పానీయాలు శరీరానికి బాగా పడతాయని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. రాత్రి పడుకొనే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది.. పాలను మాత్రమే కాదు.. కొన్ని కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటివి కలుపుకొని తాగాలి.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని వ్యాధులకు మందు కూడా లేదని చెప్పాలి.. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి.. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, ఆస్తమా,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ డ్రింక్ ను తప్పనిసరిగా తాగాలి..

రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. ఆ తర్వాత 300 గ్రాముల పసుపు., 50 గ్రాముల శొంఠి పొడి, 25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 15 గ్రాముల దాల్చిన చెక్క పొడి వేసి రంగు పూర్తిగా మారేవరకు వేడి చెయ్యాలి.. పొడి చల్లారాక టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి.. ఇలా కొద్ది రోజులు తాగితే ప్రయోజనాలు తెలుస్తాయి.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

మీ పళ్లను ఇలా బ్రష్ చేస్తున్నారా? దంత సమస్యలతో డయాబెటిస్, గుండెజబ్బుల ప్రమాదం..!

Brushing Your Teeth : ప్రతిరోజూ మీ పళ్లను ఎలా తోముతున్నారు? సరిగా బ్రష్ చేయనివారిలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా పేలవమైన దంత పరిశుభ్రత అనేక వ్యాధులతో దారితీస్తుంది. చాలా మంది ప్రధానంగా నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్నే హాలిటోసిస్ అని పిలుస్తారు. వెంటనే శ్రద్ధ చేసుకోవాలి.

లేదంటే.. నోటి అపరిశుభ్రత కారణంగా మధుమేహం, గుండె జబ్బులతో సంబంధం ఉందని అధ్యయనాల్లో తేలింది. నోటి బ్యాక్టీరియాతో వాపు ఏర్పడటమే కాకుండా మధుమేహం, పీరియాంటల్ (గమ్) వ్యాధి మధ్య అనేక రుగ్మతలకు దారితీస్తుందని పరిశోధనలో గుర్తించారు. మధుమేహం ఉన్న వ్యక్తులు చిగుళ్ల వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
చిగుళ్ల వ్యాధితో మధుమేహం ముప్పు :
చిగుళ్ల వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సాధ్యం కాదు. ఫలితంగా పీరియాడోంటల్ వ్యాధి వాపుకు కారణమవుతుంది. ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. డయాబెటిక్ రోగులలో గ్లైసెమిక్ నియంత్రణకు దారితీస్తుంది. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి కండరాలు, కొవ్వు, కాలేయంలోని కణాలు ఇన్సులిన్ (హార్మోన్)కి స్పందించవు.

రక్తంలోని గ్లూకోజ్‌ను సులభంగా తీసుకోలేదు. ఫలితంగా, మీ ప్యాంక్రియాస్ గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించేందుకు ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది.

దంత సమస్యలతో గుండెజబ్బులు :
జర్నల్ ఆఫ్ పీరియాడోంటాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మధుమేహం లేని వ్యక్తులతో పోలిస్తే.. మధుమేహం ఉన్నవారు తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. నోటి ఆరోగ్యంలో ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి, దీర్ఘకాలిక మంటకు దారితీస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. గమ్ వ్యాధి నుంచి నోటి బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ధమనుల ఫలకాలు ఏర్పడతాయి. దాంతో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇతర వ్యాధుల కన్నా పీరియాంటల్ వ్యాధి గుండెజబ్బులతో ముడిపడి ఉందని పరిశోధన కనుగొంది. చికిత్స చేయని చిగుళ్ల వ్యాధి రక్తప్రవాహంలో వ్యాపించే వాపుకు కారణమవుతుంది. ఓరల్ బ్యాక్టీరియా ధమనులలో ఫలకం ఏర్పడటానికి కూడా కారణమవుతుంది. ఇటీవలి పరిశోధనలో గుండె సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని డాక్టర్ సూరి పేర్కొన్నారు. నోటి పరిశుభ్రతకు అనేక మార్గాలను ఆయన సూచించారు.

రెగ్యులర్ బ్రషింగ్ ఫ్లాసింగ్ : ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయాలి. రోజువారీ ఫ్లాసింగ్ పేరుకుపోవడాన్ని పాసిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియా వ్యాప్తిని అడ్డుకుంటుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రొటీన్ డెంటల్ చెక్-అప్‌లు : దంత నిపుణులతో నోటి సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
సమతుల్య ఆహారం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం, చక్కెర, ఆమ్ల ఆహారాలను పరిమితం చేయడం, నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

నేటి తెలుగు పంచాంగం ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. ! నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా…(14/04/24)

today telugu panchangam today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 14వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం…

మిధునంలో చంద్రుడి సంచారం..
రాష్ట్రీయ మితి ఛైత్ర 25, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 04, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 14 ఏప్రిల్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం సాయంత్రం 4:55 గంటల నుంచి సాయంత్రం 6: 28 గంటల వరకు. ఈరోజు షష్టి తిథి ఉదయం 11:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:34 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:27 గంటల నుంచి ఉదయం 5:15 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:41 గంటల వరకు
అమృత కాలం : మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 4:54 గంటల వరకు
సూర్యోదయం సమయం 14 ఏప్రిల్ 2024 : ఉదయం 6:04 గంటలకు
సూర్యాస్తమయం సమయం 14 ఏప్రిల్ 2024: సాయంత్రం 6:28 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : సాయంత్రం 4:55 గంటల నుంచి సాయంత్రం 6: 28 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:22 గంటల నుంచి సాయంత్రం 4:55 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 12:16 గంటల నుంచి మధ్యాహ్నం 1:49 గంటల వరకు
దుర్ముహుర్తం : సాయంత్రం 4:49 గంటల నుంచి సాయంత్రం 5:38 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా…(14/04/24)

మేషం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

వృషభం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.

మిథునం
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మనసుకు ఒత్తిడిని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి.

సింహం
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

కన్య
మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

తుల
శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు బాధతో పాటు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజసౌఖ్యం కలదు. చేయని తప్పునకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలు ఉన్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.

మకరం
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి ఆటంకం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

కుంభం
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీసుబ్రహ్మణ్య ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

మీనం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.

MF: రూ.లక్షను రూ.1.53 కోట్లుగా మార్చిన మ్యూచువల్ ఫండ్..

ఈక్విటీలో కపౌండ్ మ్యాజిక్ తెలిస్తే.. పెట్టుబడి పెట్టకుండా ఉండలేరు. మ్యూచువల్ ఫండ్ లో 25 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలు రూ.1.53 కోట్లకు చేరుకుంది. ఆగస్ట్ 1998లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ప్రారంభించిన సమయంలో దానిలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే అది 25 ఏళ్లలో ₹1.53 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ డివిడెండ్‌లు లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్ పథకాలు, డిఫాల్ట్‌గా, ప్రారంభ సంవత్సరాల్లో సంపాదించిన ఆదాయాలను మళ్లీ పెట్టుబడి పెట్టడం వలన, ప్రారంభ సంవత్సరాల్లో సంపాదించిన వాటి కంటే తరువాతి సంవత్సరాల్లో రాబడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. వారెన్ బఫెట్ వంటి పెట్టుబడిదారుల ద్వారా భారీ సంపద ఉత్పత్తికి కపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ముఖ్య కారణం. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 25 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.53 కోట్లుగా ఉండేది.
రూ.1 లక్ష పెట్టుబడి ఒక సంవత్సరంలో రూ.1.40 లక్షలకు పెరిగి ఉండేది. అదే డబ్బును మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే అది రూ.1.61 లక్షలకు పెరిగింది. అలాగే ఒక ఇన్వెస్టర్ ఐదు సంవత్సరాల కాలానికి రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే పెట్టుబడి మొత్తం రూ.2.11 లక్షల వరకు పెరిగి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు ఒక దశాబ్దం క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు పెట్టుబడి మొత్తం రూ.4.71 లక్షలకు పెరిగి ఉండేది. ఈ మ్యూచువల్ ఫండ్ పథకం గత 25 సంవత్సరాల ఏడు నెలల్లో అనూహ్యంగా 21.73 శాతం రాబడి అందించినందున రూ. 1 లక్ష పెట్టుబడి రూ.1.53 కోట్లకు పెరిగి ఉండేది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆగస్ట్ 27, 1998న ప్రారంభించారు. దీనిని ధవల్ జోషి, హరీష్ కృష్ణన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్ టీ, అపోలో హాస్పిటల్స్ లో ప్రముఖంగా పెట్టుబడి పెట్టింది.
కీలకమైన విభాగాలు ఫైనాన్షియల్స్ (27 శాతం), టెక్నాలజీ (11.74 శాతం), హెల్త్‌కేర్ (11.3 శాతం), కన్స్యూమర్ స్టేపుల్స్ (8.7 శాతం) మరియు ఆటోమొబైల్ (5.19 శాతం) వెయిటేజీ ఇచ్చింది. దీని మొత్తం వ్యయ నిష్పత్తి(ఎక్స్ పెన్సివ్ రేషియో) 1.68 శాతంగా ఉంది.ఒక పథకం గతంలో అధిక రాబడిని ఇచ్చినందున అది భవిష్యత్తులో అదే వేగంతో పెరుగుతుందని అర్థం కాదని గుర్తుంచుకోవాలి.

AP Politics: మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేనత్తకు వయసు మీద పడింది. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. విమలమ్మ కొడుకుకు సీఎం జగన్ పనులు ఇచ్చారు. ఆ పనులు చేయడంతో విమలమ్మ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. ఇప్పుడు మేనత్త స్థాయి వేరే. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయం మరచిపోయారు అని’ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.

‘తన మేనత్త విమలమ్మకు వివేకానంద ఎంత చేశారో మరిచి పోయినట్టున్నారు. అవి గుర్తుకొస్తే ఇలా మాట్లాడారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తాము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దర్యాప్తు సంస్థ సీబీఐ చూపించిన ఆధారాలతో నమ్మాం. అంతే తప్ప హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేయడం లేదు. ఆధారాలు లభించిన తర్వాత వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని విశ్వసించాం. ఇకనైనా హత్య రాజకీయాలు ఆపాలని కోరుతున్నాం. హత్య చేసిన నర హంతకులు చట్టసభల్లోకి వెళ్లకుండా పోరాడుతున్నాం అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

మైలేజ్‌లో సూపర్‌.. సేఫ్టీలో బంపర్‌.. రూ.6 లక్షల్లో అద్భుతమైన కారు!

Tata Tiago: కరోనా తర్వాత సొంత వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన కారు.. ఇప్పుడు మధ్య తరగతి ప్రజల ఇళ్ల ముందు కూడా దర్శనమిస్తోంది.
లోప్‌ లేదా అప్పు చేసి కారు కొనుగోలు చేస్తున్నారు. ఇక మధ్య తరగతి కుటుంబాలు కారు కొనేటప్పుడు మైలేజీ, పనితీరుతోపాటు భద్రత కూడా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా తెచ్చిన టాటా టియాగో కారు సేఫ్టీ విషయంలో 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తోపాటు మంచి మైలేజీతో కేవలం రూ.6 లక్షల్లోనే కారును తీసుకొచ్చింది. కారు గురించి తెలుసుకుందాం.

ప్రత్యేకతలు ఇవీ..
టాటా టియాగో కారు మార్కెట్‌లో రూ.5.65 లక్షల(ఎక్స్‌ షోరూం) నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ కారు మారుతి ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ ఆర్‌ వంటి కార్లతో పోటీపడుతుంది. టాటా టియాగోలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది భద్రత పరంగా చాలా బాగుంది. అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌ కారు. ఇది GNCAP క్రాష్‌ టెస్ట్‌లో 4-స్టార్‌లను పొందింది.
ఇంజిన్, మైలేజ్‌..
టాటా టియాగో కారు ఇంజిన్‌ 1.2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 86 Bhp శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ కారు CNG ఎంపికలో కూడా వస్తుంది. ఈ ఇంజిన్ తో 5-స్పీడ్‌ మాన్యువల్, 5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఎంపిక అందుబాటులో ఉంది. ఈ కారు భద్రతతో పాటు మంచి మైలేజీని అందిస్తుంది. కంపెనీ ప్రకారం, పెట్రోల్‌లో దాని మైలేజ్‌ 19.01kmpl. అదే సమయంలో, ఒక కిలో సీఎన్ జీతో 26.49 కి.మీల వరకు నడపవచ్చు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జులై నెల షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకులు సందర్శించేందుకు ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అయితే, శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తీసుకొచ్చింది. జులై నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడి అధికారులు తెలిపారు. ఈనెల18వ తేది ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చని అన్నారు.

ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివరించారు.
ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..

ఇక, ఈ నెల 23న ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు కూడా భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ పేర్కొంది. అదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. వీటితో పాటు ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయలతో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు గురువారం (ఏప్రిల్ 11) రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక, ఈ వాహనసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్‌ సోమశేఖర్‌, కంకణభట్టర్ సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవ కోటా విడుదల..

ఇక, ఈనెల 27వ తేది ఉదయం పదకొండు గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27 వ తేది మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, తిరుమల శ్రీవారి భక్తులు శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆలయ వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సందర్శించొచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

Health

సినిమా