Saturday, November 16, 2024

Tiles Cleaning Tips : టైల్స్ మీద మరకలు ఉంటే ఈజీగా తొలగించే టిప్స్.. ట్రై చేయండి

అపరిశుభ్రమైన టైల్స్ మీ ఇంటి రూపాన్ని మార్చేస్తాయి. ఆకర్షణ, అందాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కిచెన్ టైల్స్ సరిగా చూసుకోకుంటే అంతే సంగతులు. అధ్వానంగా తయారవుతాయి.
ఇటువంటి మరకలు మీ ఇంటి మొత్తం రూపాన్ని పాడు చేస్తాయి. తగిన జాగ్రత్తలు, శుభ్రపరిచే నియమాలతో రసాయనాల అవసరం లేకుండా మీ ఇంటి టైల్స్ అందంగా చేసుకోవచ్చు. మెరిసేలా చేయవచ్చు.

సౌందర్య సాధనాలు, గ్రీజు, వంట నూనె వంటి చమురు ఆధారిత పదార్థాల వల్ల ఏర్పడే మరకలు టైల్స్ రంగు మారడానికి కారణమవుతాయి. మరకల మూలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి రసాయన పరిష్కారాలను ఉపయోగించడం అవసరం కావచ్చు. పండ్లు, కాగితం, ఆహారం, టీలు, కాఫీ, మూత్రం, పొగాకు, పక్షి రెట్టలు, ఆకులు వంటి పదార్థాల వల్ల ఏర్పడే మరకలు వివిధ రంగులుగా టైల్స్ మీద అలానే ఉండిపోతాయి.

బూజు, నాచు, ఆల్గే, శిలీంధ్రాలు, లైకెన్లు వంటి జీవసంబంధమైన పదార్థాల వల్ల కూడా మరకలు ఏర్పడతాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా కడిగితే మీ టైల్స్ తలతల మెరిసిపోతాయి.
వేడి నీటితో నిండిన బకెట్‌లో అరకప్పు వెనిగర్, అర టేబుల్ స్పూన్ డిష్ సోప్ కలపడం ద్వారా శుభ్రపరిచే ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఎక్కువ మెుత్తంలో సబ్బును ఉపయోగించవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే సబ్బు మరకలు కూడా అంటుకోవచ్చు.

మెుదట సబ్బు నీటి ద్రావణం, తుడిచే కర్ర ఉపయోగించి టైల్ ను శుభ్రం చేయండి. తర్వాత సాధారణ వేడి నీటితో తుడుచుకోవాలి. నేలను గాలిలో పొడిగా ఉంచుకోవచ్చు. అయితే శుభ్రమైన గుడ్డతో తుడిస్తే ఇంకా మంచిది.

బాత్రూమ్ టైల్స్ ఇలా శుభ్రం చేయండి

మీ బాత్రూమ్ టైల్స్ నుండి నీటి మరకలను శుభ్రం చేయడానికి అవసరమైన సామాగ్రిని ముందుగానే సేకరించాలి. తెలుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా, బ్రష్, శుభ్రమైన గుడ్డ, వెచ్చని నీరు తీసుకోవాలి. వైట్ వెనిగర్‌తో పోలిస్తే, యాపిల్ సైడర్ వెనిగర్ కొంచెం ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది మొండి మరకలను కూడా తొలగించడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో వెచ్చని నీరు, వెనిగర్ సమాన భాగాలను కలపడం ద్వారా శుభ్రపరిచే ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఏదైనా వెనిగర్ ఉపయోగించవచ్చు, కానీ తెలుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఆ వాటర్ ను బాత్రూమ్ టైల్స్ పై చల్లండి. మిశ్రమంలో స్పాంజి లేదా గుడ్డను నానబెట్టి, ప్రభావిత ప్రాంతాలపై 5 నుండి 15 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి.

వృత్తాకార కదలికలో ప్రతి మరకను బ్రష్ లేదా టూత్ బ్రష్‌తో అది మాయమయ్యే వరకు సున్నితంగా రుద్దాలి. అధిక శక్తిని ఉపయోగించడం మానుకోండి. ఇది టైల్స్ ను పాడుచేస్తుంది. మరక అదృశ్యమైన తర్వాత వెచ్చని నీటితో, తడిగా ఉన్న గుడ్డతో ద్రావణాన్ని శుభ్రం చేసుకోండి.

మీరు స్క్రబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత మీ టైల్స్ పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఏదైనా చిన్న మరకలు ఉంటే.., తేమను తొలగించడానికి మీరు తక్కువ వేడి మీద టవల్ లేదా హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించవచ్చు. టైల్స్‌పై మిగిలి ఉన్న కొద్దిపాటి తేమ కూడా భవిష్యత్తులో అదనపు మరక, రంగు పాలిపోవడానికి కారణమవుతుందని గుర్తుంచుకోండి.

నీటి మరకలను తొలగించే చిట్కాలు

టైల్స్ నుండి నీటి మరకలను తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్ప్రే బాటిల్‌లో నీరు, వెనిగర్‌ను సమాన భాగాలుగా కలపండి. నీటి మరకలపై ద్రావణాన్ని స్ప్రే చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడాను కొద్ది మొత్తంలో నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను నీటి మరకలపై అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

తాజా నిమ్మరసాన్ని నీటి మరకలపై పిండండి. కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మృదువైన బ్రష్‌తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

Janasena List: జనసేన అభ్యర్థుల జాబితా రిలీజ్.. ఎవరు ఎక్కడి నుంచంటే

Janasena List: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కూటమిలో భాగంగా ఈ పార్టీ 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు 18 పేర్లను విడుదల చెయ్యడంతో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చెయ్యాల్సి ఉంది.
జనసేన తరపున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ స్పీకర్ గా ప్రముఖ యాంకర్

కఠోర శ్రమ, అంకితభావం, అదృష్టం ఉంటే ప్రతి మనిషికి జీవితంలో ఆశించిన ఫలితాలు వస్తుంటాయి. ఇలాంటి ఘటనలో భారత్‌లు ఎన్నో జరిగాయి. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ టీ అమ్మే బాలుడి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కోని భారత ప్రధానిగా ఎదిగారు.
అలాగే పేపర్ బాయ్ గా పని చేసిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా ఎదిగిన సందర్భం భారత్ లోనే జరిగింది.

ఇలాంటి పరిణామమే మరోకటి చోటు చేసుకుంది. మిజోరాం కు చెందిన ఓ టీవీ యాంకర్ ఎన్నికల్లో గెలుపొంది.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగింది. అంతే కాదు తమ రాష్ట్ర చరిత్రలో మొదటి సారి ఓ మహిళా అభ్యర్థి స్పీకర్ గా అయిన ఘనత కూడా బారిల్ వన్నేహా సాంగ్ కే దక్కింది. మొదట చిన్న చానెల్ యాంకర్ నుంచి టీవీ యాంకర్, ఆ తర్వాత సోసల్ మీడియాలో ఇన్ ఫ్లేయెన్సర్ గా ఎదిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజాల్ సౌత్ 3 నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా.. 33 ఏళ్ల వయస్సులోనే మిజోరం లో యువ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మొట్టమొదటి మహిళా స్పీకర్ గా బారిల్ వన్నేహా సాంగ్ చరిత్రలోకి ఎక్కింది.

Chanakya Niti: డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ దగ్గర డబ్బు నిలవదు.

Chanakya Niti: డబ్బు కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు చాలా మంది. కానీ ఈ డబ్బును సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు. వచ్చిన డబ్బును వచ్చినట్టుగానే హృదా చేసేవారు.
అనవసరాలకు ఖర్చు చేసేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడతారు మరికొందరు. అయితే ఈ డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా నిలవ ఉండదు అంటున్నారు కొందరు. ఇంతకీ డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

డబ్బుల విషయంలో కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి. డబ్బును ఎప్పుడు దాచిపెట్టకూడదు. కానీ దీన్ని సరైన స్థలంలో పెట్టుబడిగా పెట్టాలి. అన్యాయాన్ని అనుసరించే వ్యక్తి వెంట డబ్బు ఉండేదట. అలాంటి వారితో నిత్యం డబ్బు సమస్యలు చుట్టుముడుతాయట. ఇక కొందరు దానకర్ణులు ఉంటారు. అయితే దానం చేయడం మంచి విషయమే. కానీ అతిగా దానం నష్టాలను తెచ్చిపెడుతుందట. పొదుపు చేయడం, ఆదా చేయడం నేర్చుకోవాలి.
ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఖర్చులు అదుపు చేసుకోవాల్సిందే. లేదంటే పొదుపు అసలే ఉండదు. ఖర్చులు, పొదుపై అవగాహన, నియంత్రణ ఉంటే కచ్చితంగా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. డబ్బును చూసి ఎప్పుడు కూడా గర్వ పడకూడదు. అంతేకాదు అహం కూడా ఉండకూడదు.. గౌరవం ఉండాలి. డబ్బుతో మీకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయో తెలుసుకోండి. కావలసిన వాటి కోసం ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ పనులు ఇతరులకు హానీ చేయవద్దు అని గుర్తు పెట్టుకోండి.

డబ్బు విలువ తెలుసుకోవడానికి.. మీతో ఉండే వ్యక్తులు ముఖ్య పాత్ర పోషిస్తారు. మీ విలువ ప్రేరేపించే ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలి అని తెలుసుకోండి. ఈ విధంగా మీరు డబ్బు విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Health Tips: అన్ని వ్యాధులకు ఆన్సర్ ఈ చెట్టు వేర్లు.

అశ్వగంధ గురించి తెలుగు లోగిళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దీన్ని వేలాది సంవత్సరాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు.
స్త్రీ, పురుషులు ఇద్దరికీ దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అశ్వగంధలో మన మెదడుని కూల్ చేస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది.. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.. ఒత్తిడి, హైబీపీని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం…

అశ్వగంధను పాలలో మరిగించి, ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసి, ఈ పొడిని పాలు, తేనెతో కలిపి సేవిస్తే వెన్నునొప్పి తగ్గుతుంది.
అశ్వగంధ వేరును గ్రైండ్ చేసి పాలు లేదా నెయ్యిలో కలుపుకుని తీసుకుంటే రక్తహీనత సమస్య కూడా నయమవుతుంది.
అశ్వగంధ, శతావరి సమపాళ్లలో తీసుకుని కషాయం చేసి, పాలలో కలుపుకుని తాగితే లైంగిక సమస్యలు దూరమవుతాయి.
అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు సేవిస్తే లైంగిక నపుంసకత్వానికి చక్కటి హోం రెమెడీ.
ఒక చెంచా అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే రుతుక్రమంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అశ్వగంధ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలన్నీ నయమవుతాయి.
అశ్వగంధ వేరు జామకాయ రసం, నెయ్యి, తేనె సమపాళ్లలో కలిపి సేవిస్తే కంటి సమస్యలు నయమవుతాయి.
డిప్రెషన్‌తో బాధపడే వారు అశ్వగంధ పొడి, చిలకడ దుంపలను మిశ్రమం చేసి… గ్లాస్ పాలలో కలుపుకుని రోజు తాగితే రిలీఫ్ ఉంటుంది
నిద్ర సమస్య ఉంటే ఈ అశ్వగంధ పొడిని పాలతో కలిపి తాగితే ఈ వ్యాధి కూడా నయమవుతుంది.
( ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న సమాచారం. ఈ హోం రెమెడీస్‌ను ఫాలో అయ్యే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది.)

ఆమెకూ పోలీస్‌ డ్రెస్‌ వేసి యువతకు వల , రూ.3 కోట్లకు ముంచేశారు

టూ టౌన్‌ ఎస్‌ఐగా అవతారమెత్తిన సస్పెండైన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షల వసూలు
ముగ్గుర్ని పెళ్లాడిన ఘనుడు

ఆమెకూ పోలీస్‌ డ్రెస్‌ వేసి యువతకు వల

డమ్మీ పిస్టల్‌తో బెదిరించి పరారైన నిందితులు

మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో అసలు వ్యవహారం బట్టబయలు.?

పోలీసుల అదుపులో రమేష్‌, ప్రవీణ

విశాఖ సిటీ: ఒక మిస్సింగ్‌ కేసు.. పెద్ద మిస్టరీని బట్టబయలు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రూ.3 కోట్లకు ముంచేసిన ఘరానా నకిలీ పోలీసు వ్యవహారమిది. ఎస్‌ఐగా అవతారమెత్తి.. తన చేతిలో మోసపోయిన యువతినే బుట్టలో వేసుకొని.. ఆమెతో కలిసి అనేక మందిని దోచుకున్న సస్పెన్షన్‌కు గురైన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ హనుమంతు రమేష్‌ (47) వ్యవహారం ఇపుడు నగరంలో సంచలనం రేకెత్తిస్తోంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన దగ్గర నుంచి.. నకిలీ రైల్వే వెబ్‌సైట్‌ తయారీ.. హాల్‌ టికెట్ల జారీ.. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి ప్రవేశ పరీక్ష నిర్వహణ.. హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో ఇంటర్వ్యూల పేరుతో హడావుడి.. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ.. ఇలా అనేక మంది నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసిన ఆ రహస్య దంపతుల తెలివితేటలకు పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే..

విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌
శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టు ప్రాంతానికి చెందిన హనుమంతు రమేష్‌ వీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పనిచేస్తున్నాడు. 2022 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయినప్పటికీ అతడు విధుల్లో చేరలేదు. దీంతో దీర్ఘకాలం సెలవు తీసుకోవడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం రమేష్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అడవివరం ప్రాంతంలో ఆర్‌ఆర్‌ టవర్స్‌లో నివాసముంటున్నాడు.

ఎస్‌ఐగా అవతారమెత్తి..
సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా సస్పెన్షన్‌కు గురైన రమేష్‌ విశాఖ టూటౌన్‌ ఎస్‌ఐగా అవతారమెత్తాడు. తన నివాస ప్రాంతంలోనే కాకుండా పెందుర్తిలో కొన్ని సామాజిక వర్గాల పెద్దలను పరిచయం చేసుకున్నాడు. రైల్వే శాఖలో కొంత మంది ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అందరికీ చెప్పుకొచ్చాడు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అనేక మంది నిరుద్యోగులు రమేష్‌ మాటలు విశ్వసించి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సమర్పించుకున్నారు.

యువతులకు వల..
రమేష్‌ యువతులకు వల వేయడంలో సిద్ధహస్తుడు. ముందు ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె అక్కపై కన్నేసి ఆమెను కూడా పెళ్లాడాడు. ఆ ఇద్దరితోనే ఆగిపోలేదు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని విశాలాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ అనే యువతి నుంచి కూడా రమేష్‌ రూ.15 లక్షల వరకు డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఉద్యోగం రాకపోయే సరికి ప్రవీణ తండ్రి రమేష్‌ను గట్టిగా నిలదీశాడు. దీంతో అతడు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడు. అయితే ప్రవీణను మాత్రం సింహాచలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. రమేష్‌తో కలిసి ప్రవీణ కూడా పోలీస్‌ అని చెప్పుకుంటూ నిరుద్యోగులకు వల వేసింది.

డమ్మీ పిస్టల్‌తో బెదిరించి
రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు రమేష్‌ను నిలదీయడం ప్రారంభించారు. ఒకసారి అత డి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించా రు. దీంతో రమేష్‌ తన వద్ద ఉన్న డమ్మీ మెటల్‌ పిస్టల్‌ను చూపించి వారిని బెదిరించాడు. అనంతరం విశాఖ నుంచి ప్రవీణతో కలిసి పరారయ్యాడు.

మిస్సింగ్‌ ఫిర్యాదుతో వెలుగులోకి?
తన భర్త కనిపించడం లేదని రమేష్‌ భార్య ఈ ఏడాది జనవరి 24వ తేదీన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో అనేక విస్తుపోయే వాస్తవాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వారికి అందిన సమాచారం ప్రకారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రమేష్‌, ప్రవీణలపై నెల రోజుల పాటు నిఘా పెట్టారు. సాంకేతికత సహాయంతో వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులు ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హైదరాబాద్‌కు వెవెళ్లి రమేష్‌, ప్రవీణలను అదుపులోకి తీసుకున్నారు.
రహస్యంగా విచారణ..
నిరుద్యోగులను నిలువునా ముంచిన ఇద్దరినీ పోలీస్‌ ఉన్నతాధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదు. అయితే ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వీరిని అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి.

నకిలీ వెబ్‌సైట్‌.. ఉత్తుత్తి పరీక్ష
నిరుద్యోగులను నుంచి రూ.కోట్లు కాజేసేందుకు రమేష్‌, ప్రవీణ అడుగడుగునా మోసాలకు తెరతీశారు. అభ్యర్థులను నమ్మించేందుకు వీరు ఏకంగా నకిలీ రైల్వే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దాని ద్వారా అభ్యర్థులకు మెయిల్స్‌ ద్వారా ఉద్యోగ సమాచారాన్ని పంపించే వారు. నకిలీ హాల్‌ టికెట్లు జారీ చేశారు. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి పరీక్ష సైతం నిర్వహించారు. అంతటితో ఆగకుండా కొద్ది రోజులకు ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్‌లో డీఆర్‌ఎం కార్యాలయానికి రావాలని మెసేజ్‌లు పంపించారు. అభ్యర్థులు అక్కడికి వెళ్లగా రమేష్‌ వారిని రిసీవ్‌ చేసుకున్నాడు.

ఉన్నతాధికారులతో మాట్లాడి వస్తానని చెప్పి కొంత సేపు కార్యాలయంలో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అధికారులు బిజీగా ఉన్నారని మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పి అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశాడు. వీరికి ఉద్యోగాలు వచ్చేశాయని నకిలీ నియామక పత్రాలు చూపిస్తూ మరికొంత మంది నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు.

పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన జాతీయ ఎన్నికల కమిషనర్లు గా ఉన్న ముగ్గురిలో గోయెల్ ఒకరు. అయితే ఆయన తన రాజీనామకు సంబంధించిన కారణాలు మాత్రం ప్రకటించలేదు. గోయెల్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కాగా ఆయన పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికి అనూహ్యంగా మధ్యలో అది కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ రాజీనామా చేయడంతో అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Daily Running: ప్రతిరోజూ 12 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Daily Running: కొందరికి చిన్నప్పటి నుంచే రన్నింగ్ చేయడం అంటే ఇష్టం..మరి కొందరు మాత్రం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. రన్నింగ్ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని ఇప్పటికే చాలా మంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
అయితే ప్రతి రోజూ ఉదయం వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేయడం వల్ల అలసిపోయి రోజంతా నీరసంగా ఉంటామని భావిస్తారు. అంతేకాకుండా మోకాళ్ల నొప్పుడు వస్తాయనే అపోహ కూడ ఉంది. దీంతో కేవలం రన్నింగ్ చేయకుండా నడక వరకే పరిమితం అవుతారు. కానీ రోజుకు కనీసం 12 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటాయని ఇటీవల చేసిన రీసెర్చ్ లో బయటపడింది. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో నెలకొన్న అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల 12 సంవత్సరాల ఆయుష్సు పెరుగుతుంది. ప్రతిరోజూ 12 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల బరువు పెరగరు. కొవ్వు పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉబకాయం కూడా ఒకటి. దీనిని నియంత్రించాలంటే ప్రతిరోజూ కనీసం 12 నిమిషాల పాటు రన్నింగ్ చేలని అంటున్నారు.
నేటి కాలంలో చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది పెరిగే కొద్ది ఇన్సులిన్ అవసరం ఏర్పడుతుంది. అయితే దీని అవసరం రాకుండా రన్నింగ్ ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయడం వల్ల గ్లూకోస్ జీవక్రియను ప్రోత్సహిస్తుంది. మధుమేహం నంచి శరీరానికి రక్షణగా ఉంటుంది. రన్నింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరుగు వల్ల బ్లడ్ ప్రెషర్ సక్రమంగా పనిచేస్తూ అంటు వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల మెదడులోని కణాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రతిరోజూ పరుగెత్తడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడుతారు. ఫలితంగా జీవిత కాలం పెరుగుతుంది. రన్నింగ్ చేయడం వల్ల కండరాలు గట్టిపడుతాయి. ముఖ్యంగా కాళ్ల ఎముకలు శరీర బరువును మోస్తాయి. రన్నింగ్ చేసే సమయంలో వీటి కదలికతో అవి గట్టి పడుతాయి. భవిష్యత్ లో పగుళ్ల నుంచి ఇవి రక్షణగా ఉంటాయి. అందువల్ల రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

Health Tips: ఫోన్లు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా..? ఇది మీ కోసమే..

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ జీతంలో ఒక భాగం అయ్యాయి.. పొద్దున్న లేచినప్పటి నుంచి చేతిలో ఫోన్ ఉంటుంది… అయితే పడుకొనే టప్పుడు ఫోన్లను పక్కన పెట్టుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
అలా పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా జనాలు వినడం లేదు.. ఈ మొబైల్ ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయని గ్రహించారా? . స్మార్ట్ ఫోన్ లతో ప్రాణాలు పోతాయా అంటే అవుననే చెప్పాలి.. రాత్రి పూట పక్కన ఫోన్లను పెట్టుకుంటే ఏమౌతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫోన్ల నుంచి వచ్చే వెలుతులు లేదా లైటింగ్ మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఇది నిద్రను కష్టతరం చేస్తుంది. మొబైల్ ఫోన్‌ల నుంచి వచ్చే కాంతి మెదడులోని హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనే ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.. అంతేకాదు రేడియేషన్ ను కూడా విడుదల చేస్తుందని చెబుతున్నారు.. ఇవి చాలా ప్రమాదకరమైనవి.. క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు..
ఇకపోతే మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే, మీరు దానిని మీ తల నుండి కనీసం 5అడుగుల దూరంలో ఉంచాలి.. ఫోనును స్విచ్ ఆఫ్ చెయ్యడం లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టి పడుకోవడం మంచిది.. ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు. కొద్దిగా దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టండి. అదికూడా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తే ఇక ఫోన్ లైఫ్ టైం తగ్గిపోతుంది.. దాంతో ఫోన్ పాడై పోతుంది.. ఫుల్ చార్జింగ్ కూడా అసలు పెట్టకండి.. మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

ముసలితనం మీద పడుతున్నదా..స్వర్ణభస్మం పరమౌషధం

బంగారు చూరు లేదా స్వర్ణభస్మం మనిషికి ముసలితనం లేకుండా చేయడంలో ఉపకరిస్తుంది. సాధారణంగా భారతీయ ప్రాచీన ఔషధాలలో , మూలికలలో తరాల నుంచి కూడా ఈ స్వర్ణభస్మాన్ని వాడుతారు.
చాలాకాలంగా చర్మం రక్షణకు, మచ్చలు లేకుండా చేసేందుకు దీనిని వాడుతారు. కొన్ని కుటుంబాలలో దీనిని ఓ మోతాదులో భోజనానంతర తాంబూలంలో వాడటం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్వర్ణభస్మం వయస్సు మీదపడకుండా చేస్తుందనే విషయాన్ని నిపుణులు నిర్థారించారు. సమీకృత వైద్య సంఘం (ఆయూష్) జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్‌పి పరాషెర్ ఈ విషయాన్ని శుక్రవారం నిర్థారించారు. కాగా బంగారం చూరు చేసి తీసే పదార్థం తీసుకోవడం వల్ల చర్మంలో అది తేలిగ్గా లీనం అయిపోతుంది. ఇక ఈ బంగారపు రేణువులకు ఉండే సహజసిద్ధమైన మూలక ధర్మం వల్ల చర్మం నిగనిగలాడటమే కాకుండా ఓ పట్టానా ముసలితనం రాకుండా చేస్తుందని నిర్థారణ అయింది.

సోనా భాష్మా అనబడే ఈ పదార్థం పలు ఆయుర్వేద మందులలో మూలకంగా ఉంది. మానవ శరీరంలోని పలు కీలక ప్రక్రియలు, వ్యవస్థలను పునరుత్తేజితం చేసేందుకు దీనితోని లక్షణాలు ఉపకరిస్తాయని ఆర్‌పి తెలిపారు.బంగారం కేవలం మనిషి శరీరం పైపై తళుక్కులకు ఉపయోగపడే నగలలో వాడేందుకే కాకుండా , ఇది అంతర్గత ఆరోగ్యశక్తిని కాపాడుతుందని కూడా నిపుణులు విశ్లేషించారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో బంగారం ప్రయోజనాలను వేలాది సంవత్సరాల క్రితమే గుర్తించారు. కాగా తొందరగా ముసలివాళ్లం అవుతున్నామనే భయాందోళను రగులుకుంటున్న మనిషికి ఈ బంగారం ఆరోగ్య రహస్యం మరింతగా ఉపయోగపడుతుంది. అయితే బాగా డబ్బులు పెట్టగలిగితే కానీ బంగారం చూరును ఔషధంగా తీసుకోవడం వీలుకాదనేది కీలక విషయం. కణజాలం కుంచించుకుని పోకుండా చేయడానికి అవసరం అయిన మౌలిక మూల కణాల ధర్మపు లక్షణాలు బంగారంలో ఉంటాయి. కణజాల పునరుత్పత్తికి ఇది దోహదం చేస్తుంది. కాగా జీర్ణశక్తి, శారీరక అంతర్గత ప్రక్రియ ప్రత్యేకించి యవ్వనశక్తిని పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. కండరాల నొప్పుల నివారణకు , ఎముకలు, నాడుల బలానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇప్పటి యువతరం బాగా సంపాదించే స్థాయిని చేరుకుంటున్న దశలో యంగ్‌గా ఉండే తాపత్రయంతో ఇతరత్రా మార్గాలకు వెళ్లకుండా ఇప్పుడు ఎక్కువగా బంగారం చూరును తీసుకోవడం జరుగుతోందని అయిమిల్ ఆయోయుత్వేద డైరెక్టర్ డాక్టర్ సంచిత్ శర్మ కూడా తెలిపారు. భారతీయ పరిశోధకుల సాయంతో ఈ సంస్థ తళతళమెరిసే గోల్డ్ ఫేస్ క్రీం కూడా రూపొందించింది. 24 క్యారట్ గోల్డ్ కణాలను, కశ్మీరీ కుంకుమతో రంగరించి రూపొందించిన మిశ్రమంతో ఈ క్రీం రూపొందింది. ఇందులో పలు రకాల ఆరోగ్యకర సుగంధ ద్రవ్యాల మిళితం కూడా ఉంటోంది. బంగారం ఔషధంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అవకాశం లేదని, పైగా ఇది నేరుగా కణజాలంలోకి చేరుకుని తన ప్రయోజనకర ఫలితాలను అందచేస్తుందని నిపుణులు తేల్చారు.

Maha Shivaratri: శివాలయంలో నాగుపాము దర్శనం .. ప్రతి ఏటా శివరాత్రి జాగరణ సమయంలో ప్రత్యక్షం అవుతున్న నాగేంద్రుడు..

శివరాత్రి పండగను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివ నామస్మరణ తో మారుమ్రోగాయి.

శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.

Video చూడండి….

నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది. మహాశివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడంతో మహా భాగ్యమని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి రోజున నాగుపాము దర్శనం ఇస్తోంది. ప్రతి ఏడాది శివరాత్రి అర్థరాత్రి వేళ జాగరణ సమయంలో ఆలయం గర్బగుడిలో నాగుపాము దర్శనం ఇస్తోంది. ఆలయంలో శివుడిని దర్శించుకుని అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Fenugreek for Weight Loss: నాజూకైన శరీరాకృతి కావాలా? ఐతే ఈ గింజలను ఇలా వాడి చూడండి..

ప్రతి వంటగదిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. అటువంటి మసాలా దినుసులలో మెంతి గింజలు ముఖ్యమైనది. మెంతులు బరువు తగ్గడానికి మాత్రమేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ సహాయపడతాయి.
మెంతులు పోషకాల భాండాగారం. వీటిల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వరకు మెంతులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బరువు పెరుగడానికి కారణం అవుతాయి. బరువును అదుపులో ఉంచడంలో మెంతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఊబకాయం వచ్చే అవకాశాలను తగ్గించడంలోనూ మెంతులు ఉపయోగపడుతుంది. కానీ చాలా మందికి మెంతి గింజలు తినే సరైన పద్ధతి తెలియదు.

మెంతికూర తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ ఆకలి ఉండటంతో మాటిమాటికి ఆహారాన్ని తినకుండా నివారిస్తుంది. ఇవి జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి. అయితే మంచి ఫలితాలను పొందడానికి కొన్ని మెంతి గింజలను వేడి నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అలాగే.. 1/2 టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గేందుకు సహాయపడుతుంది.

మెంతి గింజలను గాజు పాత్రలో నానబెట్టి, శుభ్రమైన గుడ్డలో కట్టి పెడితే సులువుగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో కలిపి తినవచ్చు. మెంతి గింజల్లోని పోషకాలన్నీ శరీరంలో కలుస్తాయి. మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు, పసుపు కలిపి తింటే కూడా బరువు తగ్గుతారు. ఈ రెండు పదార్థాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శారీరక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువును తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

health tips: మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నారా? అయితే లోపం ఇదే!!

ప్రస్తుత కాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి.. స్ట్రెస్.. ఇది ఇప్పుడు చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తీవ్రసమస్యగా పరిణమిస్తోంది.
అయితే ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయి. మన శక్తి కంటే ఎక్కువగా పనిచేయడం, సరైన నిద్ర లేకపోవడం, సమస్యలను పరిష్కరించడంలో మెదడుపై పడుతున్న భారం వంటి అనేక కారణాలు ఒత్తిడికి కారణంగా తెలుస్తున్నప్పటికి ఒత్తిడికి చాలా ముఖ్యమైన కారణం మరొకటి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడికి శరీరంలో విటమిన్ లోపం కూడా ఒక కారణమని, శరీరంలో విటమిన్ లోపం ఉంటే అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ల లోపం ఒత్తిడి మరియు ఆందోళన సమస్యను మరింత ఎక్కువ చేస్తుందని, విటమిన్లు సమృద్ధిగా ఉంటే ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

 

మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలని చెబుతున్నారు. అయితే మన శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల ఒత్తిడి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ డి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకల్లో కూడా బలహీనత ఏర్పడుతుంది. దీనివల్లనే ఒత్తిడి మరియు మానసిక ఆందోళన సమస్య కలుగుతుంది.

కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నవాళ్లు ఒత్తిడి మరియు ఆందోళన నుంచి బయటపడడానికి ప్రతిరోజు కొంత సమయం సూర్యకాంతిలో గడపాలి. ముఖ్యంగా సూర్యోదయంలో వచ్చే సూర్యకిరణాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అది మన శరీరాన్ని కాపాడుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

విటమిన్ డి తృణధాన్యాలలో సమృద్ధిగా ఉంటుంది. పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులలోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో చేపలను భాగం చేసుకుంటే కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది.ఇక ఆకుపచ్చని ఆకుకూరలలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని Mannam Web ధ్రువీకరించలేదు.

112 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ రేర్ రికార్డు! ఎవ్వరి తరం కాలేదు!

ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ప్రత్యర్థి టీమ్ ను చిత్తుచేసింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ రికార్డును నెలకొల్పాడు. 112 ఏళ్ల టెస్ట్ క్రికెటర్ లో ఇది అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. మరి ఇంతకీ ఆ రేర్ రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ తో తాజాగా జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇండియాను ఓడించి, బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ విర్రవీగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాతే అసలైన ఆటను, బజ్ బాల్ ను ఇంగ్లండ్ కు రుచిచూపించింది భారత జట్టు. తొలి మ్యాచ్ లో ఓడిపోయి.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయకేతనం ఎగురవేసింది. చివరి మ్యాచ్ లో గెలవడం ద్వారా 112 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరి వల్ల కానీ రికార్డును సాధించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంతకీ ఆ రేర్ ఫీట్ ఏంటంటే? టెస్ట్ క్రికెట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ను కైవసం చేసుకున్న ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి అరుదైన చరిత్రను సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి.. తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడం 112 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ గా రోహిత్ శర్మ రేర్ రికార్డు సాధించాడు. గతంలో 1897-98 లో ఇలా మెుదటిసారి జరిగింది. ఆ తర్వాత 1911లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి.. 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత అరుదైన ఘట్టం పునరావృతం అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరి తరం కాని రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు హిట్ మ్యాన్. మరి ఈ అద్భుతమైన రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Low BP Foods: లోబీపీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చెక్ పెట్టండి!

ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో బీపీ కూడా ఒకటి.
బీపీల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైబీపీ అయితే.. మరొకటి లోబీపీ. హైబీపీ కంటే లోబీపీ మరీ డేంజర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైబీపీని తగ్గించే విషయంలో గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు లోబీపీ గురించి తెలుసుకుందాం. బీపీ అనేది చాప కింద నీరులా శరీరంలో పెరుగుతుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే.. అదుపు చేసుకోవడం చాలా కష్టం. ఇందుకు సంబంధించి డైట్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

మనిషి ఆరోగ్యం అనేది రక్త పోటు బట్టి ఉంటుంది. శరీరంలో రక్త పోటు సాధారణంగా ఉన్నంతవరకూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి అదుపు తప్పితే.. ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణంగా బీపీ అనేది 120-80 ఉంటుంది. అదే 90-60 ఉంటే దాన్ని లోబీపీగా లెక్కిస్తారు. లోబీపీ కారణంగా.. మెదడు, గుండె, కిడ్నీ, ఊపిరి తిత్తులపై ప్రభావం పడుతుంది. అంతే కాకుండా లోబీపీ ఉన్నవారు ఖచ్చితంగా సమయానికి ఆహారం తీసుకోవాలి. అప్పుడు రక్త పోటు స్థాయిలు అనేవి సమానంగా ఉంటాయి. మరి లోబీపీ ఉన్నవారు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కాఫీ:

లోబీపీతో బాధ పడేవారు.. ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. రక్త పోటును పెంచడంలో కాఫీ బాగా సహాయ పడుతుంది. మీ శరీరంలో బీపీ స్థాయిలు తగ్గినప్పుడు తక్షణమే కాఫీ తాగాలి. కెఫీన్ తీసుకోవడం వల్ల రక్త పోటు స్థాయిలు అనేవి పెరిగి.. రక్త పోటు అనేది సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

నీటిని తాగుతూ ఉండాలి:

లోబీపీతో బాధ పడేవారు ఖచ్చితంగా నీటిని తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే.. బ్లడ్ ప్రెషర్‌ కూడా తగ్గి పోతుంది. దీంతో కళ్లు తిరగడం, వాంతులు అవడం, నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి తగినన్ని నీళ్లు తాగుతూ ఉండండి. నీరు తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు లేదా నిమ్మ రసం తాగుతూ ఉండండి.

ఉప్పు:

లోబీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీంతో తక్షణమే బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. బీపీ తక్కువగా ఉన్నప్పుడు నిమ్మ రసంలో ఉప్పు కలుపుకుని తాగడం లేదా మజ్జిగ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే లోబీపీ ఉండేవారు బాదం పప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Mannam Web బాధ్యత వహించదు.)

బ్యాంక్ ఉద్యోగులకు ఒకేసారి రెండు శుభవార్తలు.. అవి ఏంటంటే?

బ్యాంకు ఉద్యోగుల (Bank Employees)కు వార్షిక వేతనం 17 శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది.
నవంబర్‌ 2022 నుంచి పరిగణనలోకి తీసుకున్న ఈ పెంపుతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులపై అదనంగా ఏటా రూ.8,284 కోట్లు భారం పడనున్నట్లు అంచనా.
మరోవైపు.. అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించేందుకు ఉమ్మడిగా అంగీకారానికి వచ్చినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. అయితే, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే బ్యాంకులకు వారానికి ఐదు పనిరోజులే ఉండనున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత కొత్త పని వేళలు అమల్లోకి వస్తాయి.

Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం

Nursing Officer Posts: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ ఓ శుభవార్త వినిపించింది. నర్సింగ్ చేసిన అభ్యర్ధుల కోసం ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
1,930 నర్సింగ్ అధికారి ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు..

మొత్తం నర్సింగ్ అధికారి పోస్టులు: 1,930

అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 892
ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 193
ఓబీసీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 446
ఎస్సీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 235
ఎస్టీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 164
దివ్యాంగుల కేటగిరీలో పోస్టుల వివరాలు: 168
అర్హతలు
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీలో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం కూడా ఉండాలి.

అభ్యర్థుల వయో పరిమితి
అభ్యర్ధుల వయసు మార్చి 27, 2024 నాటికి జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీ 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ 35 ఏళ్లు, దివ్యాంగులకు 40 సంవత్సరాల వయసు మించకూడదు.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుము కింద రూ.25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

ఉద్యోగ ప్రక్రియ ఎంపిక
మొదట రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 7 మార్చి 2024
దరఖాస్తుకు ఆఖరి గడువు: 27 మార్చి 2024
దరఖాస్తు సవరణ తేదీలు: 28 మార్చి నుంచి ఏప్రిల్‌ 3 వరకు
రాత పరీక్ష తేదీ: 7 జులై 2024

పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా మంది ఎండ వేడిమి తట్టుకోవడానికి చల్లని పదార్థలు తీసుకుంటారు. కొబ్బరి బోండం, నిమ్మకాయ, బత్తాయ, తర్బూజా ఇలా చల్లబరిచే జ్యూస్ లు తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఎండాకాలంలో ఒంటిని వెంటనే చల్లబరిచి డీ హైడ్రేట్ కాకుండా చూసే పండ్లలో ఒకటి పుచ్చకాయ. పుచ్చపండులో 95 శాతం నీరు ఉంటుంది. అందుకే పుచ్చకాయలు తింటే మంచి ఆరోగ్యం అని నిపుణులు అంటారు. ఎర్రగా, తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయ తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. సమ్మర్ సీజన్ లో రోడ్లపై విరివిగా పుచ్చకాయలు అమ్ముతుంటారు. పుచ్చకాయల ఫ్రిజ్ లో ఉంచవొచ్చా.. ఉంచితే ఏదైనా ఇబ్బందులు ఉంటాయా అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఎండకాలంలో చాలా మంది బయటికి వస్తే డీ హైడ్రేషన్ కి గురవుతారు. అందుకే వేసవి కాలంలో చల్లటి పానియాల కోసం వెంపర్లాడుతుంటారు. చల్లని జ్యూస్, ఐస్ క్రీమ్స్ కోసం ఎగబడుతుంటారు. అయితే సమ్మర్ సీజన్ లో పుచ్చకాయలు మంచి చలదనాన్ని ఇస్తాయి. అంతేకాదు వేసవిలో పుచ్చకాయలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. పుచ్చకాయలు తింటే నీటి లోపాన్ని అధిగమించవొచ్చు. ఇవి తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి.. ఇది శరీరంలోని వేడిని తొలగిస్తుంది. అయితే పుచ్చకాయ ఫ్రిజ్ లో పెట్టవొచ్చా అన్న అనుమానాలు కొంతమందికి ఉంటాయి. వాటిపై పరిశోధకులు క్లారిటీ ఇచ్చారు.. పుచ్చపండు ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్ లో పెట్టవొద్దని చెబుతున్నారు.

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు కోల్పోతాయి. పుచ్చకాయను కోసి ఫ్రిజ్ లో ఉంచితే.. ఫుట్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లాబోరేటరీ నిపుణులు చెబుతున్నారు. కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. పరిశోధకులు పుచ్చకాయలను తీసుకొని -44, -55, -70 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఫ్రిజ్ లో భద్రపరిచారు. -70 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేసిన వాటిలో ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఫ్రిజ్ లో ఒక వారం ఈ పండ్లను ఉంచితే కుళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం 14 రోజుల పాట్ పుచ్చకాయలను పరీక్షించారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని పుచ్చపండు విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

Heart attack: వీటివల్లే యువకుల్లో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.. అవేంటంటే..

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యువత గుండె పోటు బారిన పడుతుండడంతో అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
చిన్న వయసు వారే గుండెపోటుతో మరణిస్తుండడం వైద్యులను సైతం కలవరపెడుతోంది. భారత్‌లో ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మారుతోన్న జీవన ప్రమాణాలు, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక యువకుల్లో గుండె సమస్యలకు రావడానికి గల కొన్ని కారణాలను వివరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో గుండె పోటు బారిన పడుతున్న వారిలో అత్యధికులు 50 ఏళ్ల లోపు వారే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో కొందరు సైలెంట్ అటాక్ కారణంగా చనిపోతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే మంచి జీవనశైలితో గుండెను సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మంచి జీవన శైలితో గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు ప్రమాదాన్ని 80 శాతానికి పైగా తగ్గించవచ్చని చెబుతున్నారు.
జీరో షుగర్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గోధుమల వినియోగాన్ని తగ్గించి మినుము, జొన్న, మొక్కజొన్న, శనగ, రాగులు, సోయాబీన్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవలని చెబుతున్నారు. ప్రోటీన్‌ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ.. నూనె, నెయ్యిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా ప్రతీ రోజూ 10 వేల అడుగులు నడవాలనే నియమాన్ని పాటించాలని చెబుతున్నారు. ఇక అదే పనిగా కూర్చునే సమయాన్ని 50 శాతం తగ్గిస్తే రోగాలను 50 శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రతీ రెండు గంటలకు ఒకసారైనా లేచి అటు, ఇటు నడవాలని సూచిస్తున్నారు. ఇక కండరాలను బలోపేతంగా ఉంచుకోవడానికి పుష్ అప్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర కొన్ని వ్యాయామాలు అవసరమని చెబుతున్నారు.
సూర్య నమస్కార్ మొత్తం ఫిట్‌నెస్ కోసం ఉత్తమ వ్యాయామమని చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటి గ్యాడ్జెట్లకు సమయాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

ఏపీలో మరో సంచలన సర్వే: వైసీపీ, టీడీపీ,జనసేనకి ఎన్ని సీట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాయి. అయితే ప్రతిపక్షమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది… ఏ పార్టీ ఎన్నిసీట్లు సాధించబోతుంది అనే దానిపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..?ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కారును టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కుప్పకూల్చుతుందా? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వైసీపీని ఆదరిస్తారా? లేక టీడీపీ-జనసేన కూటమిని ఆదరిస్తారా?అనే ప్రశ్నలు ప్రతీ ఒక్కరిని తొలచివేస్తున్నాయి. ఈ అంచనాలను పటా పంచలు చేస్తూ ఓ సర్వే విడుదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా ఓ సర్వే ఫలితాలను వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా తెలిపింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై’పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘టేటెస్ట్ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా స్పష్టం చేసింది.

టీడీపీ-జనసేనకే మెుగ్గు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉండటం మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆ కూటమి సైతం బలంగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న తరుణంలో ఈ సీట్లపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అనేక సర్వేలు సైతం తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తూ రాజకీయాన్ని కాస్తా మరింత హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాల్లో గెలుపొందడం ఖాయం అని సర్వేలో స్పష్టం చేసింది. ఇకపోతే అధికార వైసీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కాబోతుందని తెలిపింది. మిగిలిన 22 నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని స్పష్టం చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూటమిదే హవా
ఇదిలా ఉంటే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘ సర్వే వెల్లడించింది. ఇకపోతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితం కాబోతుందని తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. అయితే 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య కేవలం 7 స్థానాలకే పరిమితం కాబోతుందని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘స్పష్టం చేసింది.ఓట్ షేరింగ్‌లో భారీ మార్పు
తెలుగుదేశం-జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో భారీ ఓట్ షేరింగ్ పెరగడం ఖాయమని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘సంస్థ తన సర్వేలో తెలిపింది. ఈ కూటమికి 51.4 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.6 శాతం ఓట్లు మాత్రమే పడతాయని తేల్చింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ ఓటింగ్ షేర్ 3 శాతంకు పెరుగుతుందని తెలిపింది. మరోవైపు బీజేపీకి 1.3 శాతం, ఇతర పార్టీలు( సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీసీవై, జై భారత్ నేషనల్) 1.4 శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేసింది.

గత నెలలోనే శాంపిల్స్ సేకరణ
ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు ఈ సర్వే చేపట్టినట్లు’పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టినట్లు తెలిపింది. మెుత్తం 53,000 మంది షాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది. ఇకపోతే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నట్లు ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘వెల్లడించింది.

TDP-Janasena-BJP: షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ల భేటీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే..

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. త్వరలోనే పొత్తుతో పాటు సీట్లపై మూడు పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నాయి

MXmoto M16: 8 సంవత్సరాల వారంటీ.. 220 కిమీల మైలేజీ.. వామ్మో ఈ బైక్ చూస్తే కొనాయాలనే ముచ్చటేస్తుందంతే..!

MXmoto M16: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ MXmoto భారతదేశంలో తన లాంగ్ రేంజ్ క్రూయిజర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ M16ని విడుదల చేసింది. ఇది కంపెనీ కఠినమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.
దీనిపై కంపెనీ 8 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఈ బైక్ సరికొత్త హైక్వాలిటీ ఎలక్ట్రిక్ బైక్ అని, ఇది ఇండియన్ రోడ్లపై అద్భుతమైన పనితీరును ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

M16 ఇ-బైక్ బ్యాటరీపై MXmoto 8 సంవత్సరాల వారంటీని ఇచ్చింది. ఇది కాకుండా, మోటారుపై 80,000 కిమీ వారంటీ, కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతుంది. అలాగే, M16 అత్యంత నిరోధక మెటల్ బాడీ భారతీయ రోడ్లకు బలమైన EVగా చేస్తుంది. ఆకర్షణీయమైన లుక్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ ఇ-బైక్ ప్రారంభ ధర రూ.1,98,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

లాంగ్ రేంజ్ 220 కి.మీ..

ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 160-220 కి.మీల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. వినియోగదారు ప్రతి ఛార్జ్‌పై 1.6 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తారు. 3 గంటలలోపు 0 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 4,000 వాట్ల BLDC హబ్ మోటార్ ఉంది. ఇది 140Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్‌తో పవర్ అవుట్‌పుట్‌ను 16% పెంచే 80 AMP అధిక సామర్థ్య నియంత్రికను కూడా కలిగి ఉంది.

క్రూయిజర్ డిజైన్, ఫీచర్లు అద్భుతం..

MXmoto M16 క్రూయిజర్‌లో పెద్ద 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి అన్ని రకాల రోడ్లపై మెరుగైన పనితీరును అందిస్తాయి. ఇది కాకుండా, కంపెనీ సర్దుబాటు చేయగల రేసింగ్ మోటార్‌సైకిల్ రకం సెంట్రల్ షాక్ అబ్జర్వర్‌ను కూడా ఇందులో అందించింది. ఈ బైక్ ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌తో పాటు ఎల్‌ఈడీ డైరెక్షన్ ఇండికేటర్‌లతో వస్తుంది. ఇది అల్ట్రా సోనిక్ కంటిన్యూస్ వెల్డింగ్ టెక్నాలజీతో వస్తుంది. బైక్ కొన్ని ప్రత్యేక లక్షణాలలో క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, యాంటీ-స్కిడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, ఆన్-బోర్డ్ నావిగేషన్, ఆన్-రైడ్ కాలింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అనంత్ అంబానీ వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతారా’ పేరుతో రిలయన్స్ గ్రూప్ ఒక అడవిని ఏర్పాటు చేసింది.
ఈ ఆలోచన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మదిలో పుట్టింది.
దీన్ని రిలయన్స్ సంస్థ ‘ప్రైవేటు జూ’ అని పిలుస్తున్నారు.

వంతారాలో అనేక రకాల వన్య ప్రాణులతో పాటు ఏనుగులు కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు మీద దేశంలోని కోర్టుల్లో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఇటీవల అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులకు ఈ జూలోని జంతువులను చూపించడంపైనా కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతువులను జామ్‌నగర్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ దాఖలైంది.

వంతారా లో ఏమి జరుగుతుంది 

ఈ ప్రాజెక్టు కింద వన్య ప్రాణుల సంరక్షణ కోసం జామ్‌నగర్‌లో మూడు వేల ఎకరాలు సిద్ధం చేశారు. ఇందులో ఎక్కువ భాగం ఏనుగుల కోసం కేటాయించారు.

వంతారాలో ఏనుగుల కోసం నిర్మించిన సెంటర్‌లో 200కి పైగా ఏనుగులు ఉన్నాయి.

ఈ ఏనుగుల బాగోగులు చూసేందుకు 500 మంది సుశిక్షితులైన పనివాళ్లు ఉన్నారు. ఇందులో జంతు వైద్యులు, బయాలజిస్టులు, పాథాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు.

మూడు వేల ఎకరాల్లో 650 ఎకరాలను కొన్ని జంతువుల్ని సంరక్షించి, వాటికి పునరావాసం కల్పించేందుకు కేటాయించారు.

భారత దేశంతో పాటు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రమాదంలో ఉన్న జంతువులను తీసుకొచ్చి వాటికి చికిత్స అందించడంతో పాటు అవి అక్కడే జీవించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్‌లో 2,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

వంతారాలో 300 చిరుతలు ఉన్నాయి. వీటితోపాటు పులులు, సింహాలు, జాగ్వార్‌లు ఉన్నాయి. అలాగే మొసళ్లు, పాములు, తాబేళ్లు సహా 1200 క్షీరదాలు ఉన్నాయి.

వంతారాలో 300 జింకలు కూడా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే 43 రకాాలకు చెందిన రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి.

భారతదేశంలో మొదటి ప్రైవేట్ జూ ఇదేనా?

వంతారాలో ఏనుగులను రక్షించి వాటి మంచి చెడ్డలు చూసుకోవడానికి ‘రాధాకృష్ణ యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్’ ఉంది.

మిగతా జంతువుల కోసం ‘గ్రీన్స్ జూలాజికల్’ సంరక్షణ పునరావాస కేంద్రం పని చేస్తోంది.

వంతారాను “మినీ జూ” గా సెంట్రల్ జూ అథారిటీ గుర్తించింది. ఈ జూను 2021 మార్చ్ 10న ఏర్పడిన జీజెడ్ఆర్ఆర్‌సీ నిర్వహిస్తోంది.

రిలయన్స్ గ్రూప్ నిర్వహణలోని వంతారాపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీన్ని భారత దేశపు తొలి ప్రవేట్ జూ అని పిలవడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

భారత దేశంలో ప్రైవేట్ జూ అనేది కొత్త ఆలోచన ఏమీ కాదని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌వోఎస్) మాజీ అధికారి బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

“భారతదేశంలో ప్రైవేట్ జూలు ఇప్పటికే ఉన్నాయి. జంషెడ్‌పూర్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న జంతు ప్రదర్శన శాల దీనికొక ఉదాహరణ. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జింకల పార్కులు ప్రైవేటు నిర్వహణలో నడుస్తున్నాయి” అని ఆయన చెప్పారు.

అయితే భారత దేశంలో ఇలాంటి జూలు ఎలా ప్రారంభించవచ్చు అనే సందేహాలు ఉన్నాయి.

దేశంలోని ప్రైవేట్ జూలకు అనుమతి ఇచ్చే ‘సెంట్రల్ జూ అథారిటీ’లో మెంబర్ సెక్రటరీగా ఉన్న బ్రజ్‌రాజ్ శర్మ వీటికి సమాధానం ఇచ్చారు.

“భారత దేశంలో ఏదైనా జూ ప్రారంభించాలన్నా, నడిపించాలన్నా ముందుగా సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత 2009లో సవరించిన జూ రికగ్నిషన్ రూల్స్ ప్రకారం వాటిని నడపాలి” అని ఆయన చెప్పారు.

జంతువుల భద్రతను పర్యవేక్షించేది ఎవరు?

ప్రైవేటు జూలలో జంతువుల బాగోగులు, రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కీలకమైన ప్రశ్న.

“సెంట్రల్ జూ అథారిటీ ఈ జూలను తరచుగా సందర్శించి జంతువులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తుంది” అని బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

“జంతువుల సంరక్షణ, భద్రత విషయంలో ప్రైవేటు జూ నిర్వాహకులు మేం చెప్పిన ప్రమాణాలను పాటించకపోతే, మేం గుర్తించిన అంశాలను తక్షణమే వారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రైవేటు జూలకు ఇచ్చిన గుర్తింపు శాశ్వతం కాదు. దాన్ని ఏ క్షణమైనా రద్దు చెయ్యవచ్చు” అని ఆయన అన్నారు.

21 ఏళ్ల ఏషియన్ ఎలిఫెంట్
ఏనుగు లేదా పులి చనిపోతే పరిస్థితి ఏమిటి?

రిలయన్స్ గ్రూప్ వంతారాపై విడుదల చేసిన వీడియోలో ఓ ఏనుగుకు దంతాలు ఉండటాన్ని గమనించవచ్చు.

భారత వన్యప్రాణి చట్టం-1972లో షెడ్యూల్ వన్ ప్రకారం పులుల సంరక్షణలో పాటించాల్సిన ప్రమాణాలను ఏనుగుల సంరక్షణ కోసం పాటించాలి.

ఏనుగు దంతాలు, పులి గోళ్లు వంటి వాటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడం భారతీయ అటవీశాఖ ప్రాధాన్యాల్లో ఒకటి.

“షెడ్యూల్ వన్‌లో ఉన్న జంతువులు చనిపోతే ఏం చేయాలనే దానిపై కచ్చితమైన నియమావళి ఉంది. చనిపోయిన జంతువుకు సంబంధించిన ప్రైవేటు జూ అధికారులు లేదా నిర్వహణ యాజమాన్యం ఆ రాష్ట్రానికి చెందిన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌, సెంట్రల్ జూ అథారిటీకి సమాచారం అందించాలి. జంతువు చనిపోయిన తర్వాత దానికి పోస్ట్‌మార్టం నిర్వహించి నివేదికను అందజేయాలి.

ఏనుగు చనిపోతే దాని శరీరం నుంచి దంతాలను వేరు చేయకూడదు. మొత్తం శరీరాన్ని తగలబెట్టాలి. ఆ జంతువుకు ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకి చనిపోయి ఉంటే అప్పుడు దాని శరీరాన్ని పూడ్చివేయాలి” అని బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

ప్రైవేటు జూలలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రశ్నకు కూడా ఆయన వివరణ ఇచ్చారు.

“అలాంటిది ఏదైనా జరిగినట్లు అటవీశాఖ అధికారుల దృష్టికి వస్తే దానిపై దర్యాప్తు నిర్వహించడంతో పాటు ప్రైవేటు జూ నిర్వహణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవచ్చు” అని తెలిపారు.
ప్రైవేటు జంతు ప్రదర్శన శాలలు అవసరమా?

జంతు ప్రదర్శనశాలలను ప్రారంభించి వన్య ప్రాణాలను సంరక్షించేందుకు ముందుకు రావడం మంచి ఆలోచనే.

ఆఫ్రికాతో పాటు పశ్చిమ దేశాలలో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో పెద్ద పెద్ద వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.

“అటవీ శాఖ వద్ద వనరులు, నిధులు పరిమితంగా ఉన్నాయనేది సుస్పష్టం. అందుకే జంతువుల్ని సంరక్షించడం, పునరావాసం కల్పించడం లాంటివి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేపడితే మంచిదే” అని పేరు చెప్పడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

“ఈ ప్రక్రియలో ప్రైవేటు జూలకు క్రూరమృగాలను తీసుకురాకుండా చూడాలి. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న క్రూరమృగాలను తీసుకొచ్చినా, కోలుకున్న వెంటనే అడవిలో వదిలి పెట్టాలి” అని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబులను దాటుకొని వచ్చిన సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ!

కొన్ని సినిమాలను చూస్తే అందులోని ప్రధానమైన క్యారెక్టర్‌ ఆ హీరో కోసమే పుట్టిందా? అనిపిస్తుంది అతన్ని తప్ప ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా ముద్రపడిపోతుంది. అలాంటి సినిమాలు చేసే అవకాశం రావడం చాలా అరుదు. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయా హీరోలు సద్వినియోగం చేసుకున్నప్పుడే చరిత్ర సృష్టించే సినిమాలు తయారవుతాయి. అలాంటి అరుదైన, అపురూపమైన అవకాశం అల్లూరి సీతారామరాజు రూపంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన చూపించిన తెగువ సాధారణమైంది కాదు. 1 మే, 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలైంది. ఇది సూపర్‌స్టార్‌ కృష్ణ 100వ సినిమా. 1962లోనే నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ మూడు సినిమాల్లో చాలా చిన్న క్యారెక్టర్స్‌ చేశారు. 1965లో ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కేవలం 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు కృష్ణ.

అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎక్కడ బీజం పడిరదంటే.. 1968లో అసాధ్యుడు చిత్రంలోని ఒక నాటకంలో అల్లూరి సీతారామరాజు గెటప్‌ వేశారు కృష్ణ. అప్పుడే డిసైడ్‌ అయ్యారు ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు సినిమా చెయ్యాలని. అంతకుముందు 1958లో వచ్చిన ఆలుమగలు చిత్రంలో జగ్గయ్య కూడా అల్లూరిగా నటించారు. దాన్ని కూడా స్ఫూర్తిగానే తీసుకున్నారు కృష్ణ. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు.. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను అక్కినేని నాగేశ్వరరావుతో తియ్యాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు.

ఎన్‌.టి.రామారావుకి కూడా ఈ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు తయారు చేయించారు. ఇది కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత శోభన్‌బాబు వంతు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. అల్లూరి సినిమాను తియ్యాలనుకున్నారు. దాని కోసం కొంత ప్రయత్నం కూడా చేశారు. కానీ, అది జరగలేదు. కొన్ని క్యారెక్టర్స్‌ కొంతమంది కోసమే రాసి ఉంటాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. చివరికి కృష్ణ వంతు వచ్చింది.

హీరోగా నిలదొక్కుకొని దాదాపు 100 సినిమాల వరకు చేసిన తర్వాత అప్పటివరకు కృష్ణ మనసులో ఉన్న అల్లూరి సీతారామరాజు పాత్ర మరోసారి తెరరూపం దాల్చుకునే న్రయత్నం చేసింది. త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించడానికి సిద్ధమయ్యారు కృష్ణ. అప్పటికి మహారథి బాగా బిజీ రచయిత. ఒక అద్భుతమైన సినిమాకు స్క్రిప్టు తయారుచేసే బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయన అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్‌ చేసుకున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేశారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో ‘అల్లూరి సీతారామరాజు’ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా హార్సిలీ హిల్స్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. సినిమా కొంతభాగం షూటింగ్‌ అయిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో షూటింగ్‌ కొన్నిరోజులు ఆగింది. మిగిలిన సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించమని సన్నిహితులు సలహా ఇవ్వడంతో మళ్ళీ షూటింగ్‌ ప్రారంభించారు కృష్ణ. కొన్ని పోరాట దృశ్యాలను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ చిత్రీకరించారు. 1 మే, 1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ పాత్ర చేసిన కృష్ణను ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా అభినందించారు.

మహిళలకు Ola బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై స్పెషల్ డిస్కౌంట్.. రెండ్రోజులే ఛాన్స్!

Ola Electric: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అదిరే ఆఫర్ ప్రకటించింది ఓలా కంపెనీ. ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. మార్చి 10 లోపు కొనుగోలు చేసిన వారికి ఈ స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.
Ola Electric: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్. మహిళలకు ఈ స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఆఫర్ సమయంలో కొనుగోలు చేసే మహిళా కస్టమర్లకు ప్రస్తుతం ఓలా ఎస్1 మోడళ్లపై ఉన్న తగ్గింపు పై అదనంగా మరో రూ.2000 డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. సాధారణ డిస్కౌంట్ పై అదనంగా రూ.2 వేల తగ్గింపు పొందవచ్చని తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.
‘మహిళలు ఫ్రంట్ సీట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మా ప్రత్యేక ఆఫర్లు అందుకు దోహదపడతాయి. ఈ ఆఫర్లు మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ లో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి మీ డ్రీమ్స్‌ని చేరుకోండి.’ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. ఈ ఆఫర్ అనేది ఇప్పటికే మార్చి 31 వరకు ఇస్తున్న రూ.25 వేల వరకు తగ్గింపుపై అదనమని గుర్తుంచుకోవాలి.
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీగా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఎస్1 స్కూటర్ల పోర్ట్ ఫోలియోలో భారీగా ధరలు తగ్గించింది. ఎంట్రీ లెవెల్ ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ పై గరిష్ఠంగా రూ.25 వేల వరకు తగ్గించింది. ఓలా 3కేడబ్ల్యూహెచ్ ఎస్1 ఎక్స్ ప్లస్ ప్రస్తుతం రూ.85 వేలకే లభిస్తోంది. అలాగే ఓలా ఫ్లాగ్ షిప్ మోడల్ ఎస్1 ప్రో ప్రస్తుతం రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) వద్ద ఉంది. గతంలో ఈ రేటు రూ.1,47, 500 గా ఉండేది. అంటే ఏకంగా రూ.17,500 మేర తగ్గింది. ఇప్పుడు వుమెన్స్ డే ఆఫర్ లో మహిళలకు అదనంగా మరో రూ.2 వేల తగ్గింపు లభిస్తోంది.
మరోవైపు.. ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.15 వేలు తగ్గించింది కంపెనీ. గతంలో రూ. 1.20 లక్షలుగా ఉన్న ఎస్1 ఎయిర్ ధర రూ.1.05 లక్షలు (ఎక్స్ షోరూమ్) కి దిగివచ్చింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ పై గరిష్ఠ తగ్గింపు రూ.25 వేలుగా ఉంది. దీని ధర గతంలో రూ.1.10 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.85 వేలకే లభిస్తుండడం గమనార్హం. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఓలా సేల్స్ భారీగా పెరిగినట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 30 వేలకుపైగా స్కూటర్లను విక్రయించింది. ఇప్పుడు మహిళా దినోత్సవ ఆఫర్ ప్రకటించడంతో మరింత పెరిగే అవకాశం ఉంది.

APలోని ఆ శాఖల్లో ఉద్యోగాలు.. లక్షన్నర వరకు జీతం.. ఈ అర్హతలుంటే చాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్లు రిలీజ్ కాగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలో పలు శాఖల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ తాజాగా మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు, స్టాటస్టికల్ ఆఫీసర్లు, ఫిషరిస్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతి ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం 49 పోస్టులు కాగా.. వాటిలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పోస్టులు, 5 స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 4 ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులు, 3 ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పోస్టుల పూర్తి సమాచారం కోసం https://psc.ap.gov.in/ క్లిక్ చేయండి. స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల వివరాల కోసం https://psc.ap.gov.in/, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టుల సమాచారం కోసం https://psc.ap.gov.in/,అసిస్టెంట్ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల వివరాల కోసం https://psc.ap.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం :

ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులు:

  • 37

అర్హత:

  • అభ్యర్థులు అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వికలాంగుల్ని ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటించారు.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి 18 నుంచి 30 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతం:

  • నెలకు రూ. 48,440 నుంచి 1,37,220 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • అప్లికేషన్‌ ప్రొసెసింగ్ ఫీజుగా రూ.250.. ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌, తెల్ల రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులు రూ.120 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 15-04-2024

దరఖాస్తు చివరి తేదీ:

  • 05-05-2024

ఫిషరీష్ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులు:

  • 4

అర్హత:

  • గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి 18 నుంచి 42 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,830 నుంచి 1,30,580 వరకు అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులు:

  • 3

అర్హత:

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి 18 నుంచి 42 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతం:

  • నెలకు రూ. 57,100 నుంచి 1,47,760 వరకు అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు:

  • 5

అర్హత:

  • స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి 18 నుంచి 42 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతం:

  • నెలకు రూ. 37,640 నుంచి 1,15,500 వరకు అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ప్రపంచంలో 7 వింతలు.. కడపలో బయటపడ్డ 8వ వింత!

ప్రపంచంలో ఇంతవరకు 7 వింతలు ఉంటాయని కడపలో 8వ వింత చూపిస్తానని కడప నియోజకవర్గం టీడీపీ- జనసేన అభ్యర్ధి రెడ్డప్పగారి మాధవి అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కడపలో హైటెన్షన్ వైర్లు ఉంటే టవర్ కింద రోడ్డు వేశారని, ప్రపంచంలో ఏడు వింతలు ఉంటే, కడపలో ఎనిమిదవ వింత ఉందని అని ఎద్దేవా చేశారు. రోడ్డు మీద టవర్లు ఉండగా వాహానాలు ఎలా ప్రయాణిస్తాయని, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఇలా చేశారని విమర్శించారు.

అలాగే పక్కనే ఉన్న కొండను కూడా కొరిగేస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో ఎవరి నియోజవర్గంలోకి కొండలు ఉన్నా ఆ ఎమ్మెల్యేలు కొరిగేసుకునే అధికారం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకోవడమే జగన్ చెప్పే సామాజిక సాధికారత అని, వాటి ప్రకారమే సీట్లు పంపకం జరుగుతుందని విమర్శించారు. మళ్లీ రేపు అధికారంలోకి వస్తే మనుషుల అవయవాలు దోచుకునే విధంగా జగన్ సామాజిక సాధికరత ఉంటుందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై జగన్ పాలన దేశానికి ఆదర్శం అంటే ఇదేనేమో..!, రేపు అధికారంలోకి వస్తే ఇండ్లల్లోకి రోడ్లు వేసి బిల్లులు తీసుకుంటారేమో అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

AP News: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?

Andhra Pradesh News: ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లో ఉంటుందని అని అప్పట్లో ఓ సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయానికి సరిపోతుంది. ఇంకా ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తుకు అతికినట్టు ఉంటుంది.
అవును నిజమే. వీరి స్నేహంపై గంటకో బ్రేకింగ్ న్యూస్ పూటకో షాకింగ్ న్యూస్. ఇదిగో పొత్తు ఖాయమైపోయిందని ఒకసారి. లేదు లేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి మరోసారి. అన్నీ ఓకే కానీ సీట్ల పంచాయితే తెగలేదని ఇంకొకసారి. ఇలా తెలుగు సీరియల్లా ఎపిసోడ్ ఎపిసోడ్లు సాగిపోతూనే ఉంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకీ ఆలస్యం.?

బీజేపీ, టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వాస్తవం. ఇంకా సీట్ల పంచాయితీ విషయంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. కేవలం పొత్తును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యమైంది అంటే బీజేపీ నేతల షెడ్యూల్ కారణంగానే అంటున్నారు.
పొత్తులు సీట్ల ప్రకటన విషయంలో అమిత్షా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ పార్టీ నాయకులను పిలిపించి ఎవరితో పొత్తు ఉండాలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో బలాబలాల ఆధారంగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయిస్తున్నారు. శుక్రవారం కూడా అదే జరిగింది. మహారాష్ట్ర ఒడిశా రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

ముందు ఒడిశా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. అక్కడ నవీన్ పట్నాయక్ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే బీజేడీతో పొత్తులో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లు, మిగతా సర్దుబాట్లపై వారితో చర్చించారు. అక్కడ బలాలను అంచనా వేసుకొని ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రకటించబోయే రెండో జాబితాలో ఒడిశాలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయి.
ఆ తర్వాత మహారాష్ట్ర నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రేను కాదని వచ్చిన నేతల భవిష్యత్పై ఏక్నాథ్షిండే, మహారాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ ఇతర రెబల్ అభ్యర్థులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేతి చర్చించారు. అయితే రెండు మూడు సీట్ల వ్యవహారంలో ఇరు వర్గాలు పట్టుబట్టారు. దీంతో చర్చలు అర్థరాత్రి వరకు సాగాయి.

మహారాష్ట్ర సీట్ల వ్యవహారం త్వరగా తేల్చుకుని టీడీపీ, జనసేనతో చర్చించాల్సి ఉందని అంటున్నారు. అయితే మహారాష్ట్ర పంచాయితీ సుదీర్ఘంగా కొనసాగడంతో ఏపీ వ్యవహారం వాయిదా వేశారని సమాచారం. ఇవాళ కచ్చితంగా దీనిపై ప్రకటన ఉంటుందని అంటున్నారు.

ఏపీలో సీట్ల పంచాయితీ లేదని సమాచారం. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుందని… ఆ రెండు పార్టీలకుు 8 వరకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు ప్రకటించిన 24 స్థానాలు మినహాయిస్తే బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే జనసేనకు 3 స్థానాలను టీడీపీ ఇచ్చింది. అంటే మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడే ఛాన్స్ ఉంది.
అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీజనసేనకు కేటాయించారు. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు.

వంటగదిలో చీపురును పెడుతున్నారా.. అయితే, వీటిని తప్పక తెలుసుకోవాలి!

హిందూ మతంలో, చీపురు లక్ష్మీ దేవతగా పరిగణించబడుతుంది. వాస్తులో చీపురుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో చీపురు పెట్టే దిశకు ప్రత్యేక స్థానం ఉంది.
అయితే చీపురును తప్పుగా వాడితే పేదరికం వస్తుందని, సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత చీపురుతో ఇంటిని ఊడ్చకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని మన పెద్దలు కూడా అంటుంటారు. పొరపాటున కూడా చీపురును కాలితో తొక్కకూడదు.

సాధారణంగా ప్రతి ఇంట్లో చీపురు ఉంటుంది. ముఖ్యంగా, చీపురు లేకుండా ఇంటిని శుభ్రం చేయలేరు. మీరు చీపురుతో ఇంటి చుట్టూ ఉన్న చెత్తను తుడుచుకుంటారు. అయితే, చాలా మంది చీపురు ఉపయోగించడం పూర్తయ్యాక దానిని దూరంగా ఉంచుతారు. మీరు మీ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాకుండా మీ ఇంట్లో వస్తువులను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు, వంటగది యొక్క పరిశుభ్రత ఇంటి శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన భాగం. మేము వంటగదిలో ఆహారాన్ని సిద్ధం చేస్తాము. అక్కడ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతాం. అయితే, మీరు వంటగదిలో చీపురు ఉంచకూడదు. వాస్తు ప్రకారం, సరైన స్థలంలో ఉంచాలి. సాధారణంగా కొంతమందికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉండదు. అయితే, సైన్స్ ప్రకారం చీపురు అనేది ఇంటిని శుభ్రం చేసే పరికరం. చీపురు నుండి బ్యాక్టీరియా మీ ఆహారంలోకి ప్రవేశించి దానిని కలుషితం చేస్తుంది. అలాగే వాస్తు ప్రకారం, చీపురు సరైన దిశలో పెడితే లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాకాకుండా అన్నీ పక్కదారి పట్టిస్తే పేదరికం ఏర్పడుతుంది.

Nalgonda: నాకు అన్నంపెట్టేవారు లేరు.. వేసవి సెలవులు ఇవ్వకండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలుడి లేఖ

Nalgonda: విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి 15 నుంచి హాఫ్‌ డే స్కూల్స్‌ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాని పేర్కొంది. 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని తెలిపింది.

సెలవులు వద్దు ప్లీజ్‌..
పిల్లలంతా హాఫ్‌డే స్కూల్స్‌తోపాటు వేసవి సెలవులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ విద్యార్థి మాత్రం సెలవులు వద్దని తన నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. అందరూ సెలవులు వస్తున్నాయని సంతోషపడుతుంటే అతను మాత్రం బాధపడుతున్నాడు. తన బాధను మొత్తం నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. ఆ లేఖ ఉపాధ్యాయుడి కంట పడింది. అది చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు ఆ లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆలేఖ చదివిన వారందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.
లేఖలో ఏముందంటే..
‘సార్‌.. వేసవి సెలవులు ఇవ్వకండి.. నేను ఇంటికి వెళితే నాకు అన్నం పెట్టేవారు లేదు. అమ్మమ్మ పింఛన్‌ పైసలతోనే బతుకుతుంది. నానమ్మకు కాళ్లు విరిగాయి. నాన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నడు. అమ్మ హైదరాబాద్‌లో ఉంటుంది. నాకు ఇంటికి వెళ్లాలని లేదు. బడిలోనే ఉంటాను అన్నం పెట్టండి. పాఠాలు చెప్పండి. బాగా చదువుకుని ఐఏఎస్‌ అవుతా’ అంటూ అందులో తన కష్టాలను వివరిస్తూ రెండు పేజీల వరకు రాసుకున్నాడు. ఈ లేఖ పాఠశాల ఉపాధ్యాయుడి కంటపడింది. దానిని చదివిన ఉపాధ్యాయుడు చలించిపోయాడు. ఆ లేఖను ఇతర ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు బాలుడిని పిలిచి మాట్లాడారు. అతని పరిస్థితి తెలుసుకు బాధపడ్డారు. దాతల సాయం కోరుతూ లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌ అవుతోంది.

ఎవరీ బాలుడు..
నల్లగొండ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 8వ తరగతి చదువుతున్నాడు సాత్విక్‌. ఐదో తరగతి వరకు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో చదువుకున్నాడు. తర్వాత కరోనా కారణంగా సెలవులు రావడంతో పాఠశాలకు వెళ్లలేదు. కరోనా తర్వాత తన తండ్రి వద్దకు వెళ్లాడు. నానమ్మ దగ్గర ఉంటూ నేరుగా 7వ తరగతిలో చేరాడు. అక్కడ మిత్రులు జ్యోతిబాపూలే గురుకుల పరీక్ష రాయాలని చర్చించుకోవడం విని పరీక్ష రాశాడు. సీటు సాధించాడు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు.

ఇదీ కుటుంబ నేపథ్యంలో
సాత్విక్‌ రెండేళ్ల వయసులోనే అతని తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి తాగుడు కారణంగా సాత్విక్‌ అనాథ అయ్యాడు. తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. సాత్విక్‌ అమ్మమ్మ దగ్గర ఉంటూ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తండ్రి వద్దకు వెళ్లాడు. అక్కడ 7వ తరగతి చదివాడు. అక్కడ అమ్మమ్మ, ఇక్కడ నానమ్మ వృద్దులే. వారినే మరొకరు చూసుకోవాలి. ఈ పరిస్థితిలో ఒంటరితనానికి అలవాటుపడిన సాత్విక్‌ చదువుపైనే దృష్టిపెట్డాడు. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే సమయంలో ఆట పాటల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఏక సంతాగ్రహి..
సాత్విక్‌కు మంచి టాలెంట్‌ ఉందని పాఠశాల ఉపాధ్యాయులు స్వయంగా చెబుతున్నారు. ఏం చెప్పినా ఒక్కసారికే గ్రహిస్తాడని, తన అనుమానాలు నివృత్తి చేసుకుంటాడని చెబుతున్నారు. ఇంతటి టాలెంట్‌ ఉన్న విద్యార్థి సెలవులు వద్దని తన పుస్తకంలో రాసుకోవడం అందరినీ కదిలిస్తోంది. ఎవరైనా దాతలు ఉండి అతడికి సాయం చేస్తే భవిష్యత్‌లో మంచి స్థాయికి ఎదుగుతాడని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

స్పందిస్తున్న నెటిజన్లు..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సాత్విక్‌ లేఖను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. అతడికి సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కొందరు సాత్విక్‌కు మంచి భవిష్యత్‌ ఉందని, గొప్పవాడు అవుతాడని, కావాలని ఆకాంక్షిస్తున్నారు.

Health

సినిమా