Sunday, November 17, 2024

లీప్ డే : ఫిబ్రవరి 29 యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు, చరిత్ర మరియు ప్రాముఖ్యత.

లీప్ డే 2024: ఫిబ్రవరి 29 యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు, చరిత్ర మరియు ప్రాముఖ్యత.
క్యాలెండర్‌లో అదనపు రోజును ఎందుకు జోడించాల్సిన అవసరం వచ్చిందనే దాని గురించి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.242190 రోజులు పట్టింది, ఒక క్యాలెండర్ సంవత్సరంలో 365 రోజులు. మిగిలిన 0.242190 రోజులు లేదా 5 గంటల 48 నిమిషాల 56 సెకన్లు సీజన్‌లు డ్రిఫ్ట్ కాకుండా మరియు వార్షిక ఈవెంట్‌లు వాటి షెడ్యూల్‌ను అనుసరిస్తాయని నిర్ధారించుకోవడానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
అయితే లీప్ ఇయర్ ప్రతి నాలుగు సంవత్సరాలకు రాదు మరియు 100తో భాగించబడే సంవత్సరాలను లీప్ ఇయర్స్ అని అనరు. ఇదిగో కారణం. క్యాలెండర్ సంవత్సరాలు మరియు సైడ్రియల్ సంవత్సరం మధ్య వ్యత్యాసం 24 గంటలకు బదులుగా 23.262222 గంటలు. లీప్ డేని జోడించడం వల్ల క్యాలెండర్‌ను 44 నిమిషాల కంటే ఎక్కువ పొడవుగా మార్చవచ్చు మరియు ఇది సీజన్‌లు డ్రిఫ్ట్‌కు కారణం కావచ్చు. కాబట్టి, మా క్యాలెండర్ మరియు భూమి యొక్క కక్ష్య మధ్య స్వల్ప వ్యత్యాసం కారణంగా లీపు సంవత్సరాలు ప్రతి నాలుగు సంవత్సరాలకు జరగవు, ఇది 44 నిమిషాలకు పైగా జోడిస్తుంది. 100తో భాగించబడే సంవత్సరాలు లీపు సంవత్సరాల నుండి మినహాయించబడతాయి, అవి కూడా 400తో భాగించబడకపోతే. ఇది మా క్యాలెండర్ సీజన్‌లతో సమకాలీకరించబడుతుందని నిర్ధారిస్తుంది, కాలక్రమేణా గణనీయమైన చలనాన్ని నివారిస్తుంది.
లీప్ డే మరియు లీప్ ఇయర్ చరిత్ర
పురాతన కాలంలో పంట మరియు నాటడం సమయాన్ని నిర్ణయించడానికి సూర్యుని స్థానం విశ్వసించబడినప్పటికీ, కాలక్రమేణా, కేంద్రీకృత క్యాలెండర్‌ను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. 45 BCలో జూలియస్ సీజర్ ప్రవేశపెట్టిన జూలియన్ క్యాలెండర్ ఈజిప్షియన్ భావన ఆధారంగా వార్షిక అదనపు రోజును కలిగి ఉంది. ఏదేమైనప్పటికీ, సీజర్ యొక్క గణన లోపం సౌర సంవత్సరానికి 11 నిమిషాల గణన లోపంతో సహస్రాబ్దికి దాదాపు ఎనిమిది రోజులు అధిక దిద్దుబాటుకు దారితీసింది, ఇది కాలానుగుణ ప్రవాహానికి కారణమైంది. 16వ శతాబ్దంలో, పోప్ గ్రెగొరీ XIII దీనిని గ్రెగోరియన్ క్యాలెండర్‌తో సంబోధించాడు, 100తో భాగించబడే వాటిని మినహాయించి నాలుగుతో భాగించగల సంవత్సరాల్లో లీపు రోజులను జోడించాడు. అయినప్పటికీ, 400తో భాగించబడే సంవత్సరాలకు ఇప్పటికీ లీప్ డే వస్తుంది, ఇది క్యాలెండర్‌ను పునర్నిర్మించడానికి ఉద్దేశించబడింది. రుతువులతో.

YSRCP: వైకాపాలో ఇన్‌ఛార్జుల మార్పు.. మరో జాబితా విడుదల

అమరావతి: వైకాపాలో ఇన్‌ఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్‌ యాదవ్‌, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా. ఇక ఒకటో అరో ఉంటాయంతే’ అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. అయిదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు. మొత్తంగా రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులతో 8వ జాబితాను బుధవారం విడుదల చేశారు.

అంబటి కుటుంబానికి రెండా.. ఒకటేనా?
పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైకాపాను వీడి మళ్లీవచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పైగా సత్తెనపల్లిలో కొందరు మంత్రి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది.

కందుకూరులో 12 రోజులకే మళ్లీ మార్పు
కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్‌ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైకాపాలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే.. బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు.

కుమారుడిని తప్పించి అల్లుడికి..
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల 2న నియమించారు. ఆయన దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను బుధవారం నియమించారు.

జీడీ నెల్లూరులో మూడోసారి మార్పు
గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు. జనవరి 18న నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడటంతో అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకుంది. నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈ నెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది.

ఒంగోలులో ముందుగానే నిర్ణయించినా..
ఒంగోలు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైకాపా పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ.. సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు.

ఇప్పటికి ఆరుగురు ఎంపీలు ఔట్‌
అధికార వైకాపాలో పార్లమెంటు సభ్యుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సరిగ్గా వారం కిందటే వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోక్‌సభ సభ్యులు డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణరాజు (నరసాపురం) రాజీనామా చేశారు. అంటే అయిదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు వైకాపాను వీడారు. మరోవైపు గొడ్డేటి మాధవి (అరకు), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం)లకు ఈసారి వైకాపా పెద్దలు ఎక్కడా టికెట్‌ కేటాయించలేదు. మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఇటీవల నియమించారు. కానీ, వెంటనే అక్కడ మరో కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకువచ్చి మాధవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరోచోట టికెట్‌ ఇస్తారా లేదా అనే విషయంపై ఆమెకు స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయబోనని ఆ పార్టీ అధిష్ఠానానికి తేల్చి చెప్పేశారు.

కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్‌ హోస్టెస్‌లు!

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (PIA)కు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో (Canada) వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. గత నెలలో ఒకరు కనిపించకుండా పోగా.. తాజాగా మరో మహిళా సిబ్బంది తప్పిపోయారు. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది కెనడాలో మాయమవడం గమనార్హం.

ఇస్లామాబాద్‌ (Pakistan) నుంచి కెనడాకు వెళ్లిన పీకే-782 విమానంలో మరియం రజా అనే ఎయిర్‌ హోస్టస్‌ ఉన్నారు. టొరంటోలో దిగిన ఆమె.. మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు హాజరుకాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ యూనిఫామ్‌తోపాటు ‘థ్యాంక్యూ పీఐఏ’ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. మరియం రజా గత పదిహేనేళ్లుగా పీఐఏలో పనిచేస్తున్నట్లు సమాచారం. పీఐఏ అధికార ప్రతినిధి ప్రకారం.. తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాది ఇది రెండో కేసు అని పేర్కొన్నారు.

గతేడాది ఏడుగురు..
కెనడాకు వచ్చిన పాకిస్థానీ ఎయిర్‌హోస్టెస్‌లు ఇలా అదృశ్యం కావడం 2019 నుంచి మొదలైందట. ఇటీవల ఇది మరింత పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏడుగురు పీఐఏ విమానయాన సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇలా వెళ్లిపోయినవారు కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్థానీ ఎయిర్‌లైన్స్‌ (PIA) భావిస్తోంది. కొన్నేళ్ల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమానయాన ఉద్యోగి పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని.. అనంతరం అనేకమందికి సలహా ఇవ్వడంతో మిగతావారు కూడా అదే బాట పట్టినట్లు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది.
కెనడాలో ఆశ్రయం పొందే విధానం సరళంగా ఉండటంతోనే ఇటువంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పీఐఏ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. విమానయాన సంస్థ వాదన ఇలా ఉన్నప్పటికీ.. సిబ్బందికి తక్కువ వేతనాలు, సంస్థ భవిష్యత్తుపై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం అదృశ్యమవుతున్నారని అంచనా వేస్తున్నారు.

ఆహార కల్తీలో నెంబర్ 1 గా మారిన హైదరాబాద్.. వివరాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. NCRB సర్వే చేసిన 19 నగరాల్లో.. హైదరాబాద్ 246 ఆహార కల్తీ కేసులతో అగ్రస్థానంలో ఉంది.
దేశంలోని మొత్తం కేసులలో ఇది 84 శాతం. కల్తీని తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో కేవలం 30 మంది ఆహార భద్రతా అధికారులు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జిఓ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్రంలో విపరీతంగా ఆహార కల్తీలు పెరిగిపోయాయని అంటున్నారు. లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి ఆహారం కల్తీ చేస్తున్నారని తేలింది. సరిగా నిల్వ చేయకపోవడం.. ప్యాకింగ్ కోసం ఉపయోగించే పదార్థాల కారణంగా ఆహారం కల్తీ జరుగుతోంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఆహార కల్తీలు

పండ్లను కృత్రిమంగా మాగేయడానికి (ముఖ్యంగా మామిడి, అరటిపండు) హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈథెఫోన్, ఎథ్రెల్, కాల్షియం కార్బైడ్‌లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆహార పదార్థాల రంగు, వాసన, ఆకృతిని నిలుపుకోవడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. అధికారుల అనుమతులు పొందిన ఆహార పదార్థాలు ఎలాంటి హాని కలిగించవు కానీ.. చౌకైన, నిషేధించిన పదార్థాలు ప్రమాదాలను కలిగిస్తాయి.

కల్తీ ఆహారాన్ని తీసుకోవడం పిల్లలతో సహా ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కల్తీ ఆహారం వల్ల అలర్జీ, పేగులు దెబ్బతినడం, చూపు కోల్పోవడం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఖర్చులు తగ్గించుకోడానికి, అత్యాశతో వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు.

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 అంటే ఏమిటి?

1954లో ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రవేశపెట్టారు. ఆహార కల్తీపై అనేక ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. చివరగా, అన్ని చట్టాలను ఏకీకృతం చేయడానికి, పార్లమెంటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 (FSS చట్టం)ను రూపొందించింది. చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం.. ఉత్పత్తి, ప్రాసెసింగ్, దిగుమతి, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని దశలలో ఆహారంలో ఉపయోగించే పదార్థాల నాణ్యత తప్పనిసరి. చట్టం ప్రకారం, ఏ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కూడా అసురక్షితమైన, తప్పుగా బ్రాండ్ చేసిన, ఏ మాత్రం ప్రమాణాలు లేని వస్తువులను వాడకూడదు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం వంటివి చేయకూడదు. చట్టం బలంగా ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత, రాజకీయాలు, అవినీతి కారణంగా నిబంధనలు పాటించడం లేదు.

Pawan Kalyan : ఎంపీగా బరిలో పవన్ కళ్యాణ్. ? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఎవరున్నారు..?

Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈసారి ఎలాగైనా వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దేదించాలి అనే ప్రణాళికతో టీడీపీ మరియు జనసేన కూటమిగా కలిసి ముందుకు వెళుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా బరిలో దిగబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ఈసారి పవన్ కళ్యాణ్ రెండు సీట్లకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు ఎమ్మెల్యే సీట్లకు కాదు దానిలో ఒకటి ఎమ్మెల్యే మరియు రెండవది ఎంపీ సీట్లు అని తెలుస్తోంది. ఈ విధంగా రెండు సీట్లకు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వలన 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తును తిరుగులేనిదిగా మలుచుకోవాలనే పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా అడుగులు వేస్తున్నారట.

అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి గెలిచినట్లయితే అదేవిధంగా మూడోసారి బీజెపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కచ్చితంగా కేంద్రంలో మంత్రి అవుతారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లయితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి అధికారం సాధించగలిగితే దానిలో అతి ముఖ్య భూమికను పవన్ కళ్యాణ్ పోషించగలుగుతారు.ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా సరే ఎంపీగా గెలిస్తే మాత్రం కేంద్రంలో మంత్రిగా ఉండటం వలన తన పార్టీ అధికారం కోల్పోకుండా ఉంటుంది. అయితే ఈ సలహా పవన్ కళ్యాణ్ కు ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం అని సమాచారం. పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం కోరిందట. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీ తో కలిసి కూటమిగా ముందుకు వెళుతున్న ఈ కీలక సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోతే ఆయనను అభిమానించే వారు చాలామంది కూటమి గెలుపులో ఉత్సాహంగా పాల్గొనలేక పోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.
అయితే టీడీపీ జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో అత్యధికంగా సీట్లను గెలిపించుకొని వారి మంత్రులకు పదవులు దక్కించుకొని తాను ఎంపీగా గెలిచి మంత్రి కావాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు చాలా మంది పుకార్లు గానే పరిగణిస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కచ్చితంగా అది ఒక మాస్టర్ ప్లాన్ అవుతుందని అర్థం అవుతుంది. దీనివలన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక స్టాండ్ లభిస్తుందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది కూడా ఒక వ్యూహాత్మకంగా పరిగణించబడుతుంది. చూడాలి మరి ఈ ప్రచారాలు ఎంతవరకు నిజమవుతాయో.

డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం సురక్షితం కాదు: తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ

చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్స్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాక్లెట్స్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన చాక్లెట్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్‌ కొన్నాడు. రాపర్ ఓపెన్ చేసి తీరా తిందామనుకునే సరికి సజీవంగా ఉన్న పురుగు కనిపించింది.

దీంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడంపై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ నిర్దారించింది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్నప్తి చేసింది.

అయితే క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో కొనుగోలు చేసిన క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగులున్న ఆ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వార్మ్స్ (తెల్ల పురుగులు) ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించారు.

AP SA-2 Timetable 2023-24

AP SA-2 Timetable 2023-24

 

Formative Assessment -4 Principles of valuations.

FA4 EXAM TELUGU ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 1st Class TELUGU ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 2nd Class TELUGU ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 3rd Class TELUGU ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 4th Class TELUGU ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 5th Class TELUGU ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 6th Class TELUGU ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 7th Class TELUGU ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 8TH Class Telugu Key Download 

FA4 Exam 9th Class Telugu Key Download

FA4 EXAM MATHS ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 1st Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 2nd Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 3rd Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 4th Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 5th Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 6th Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 7th Class  MATHS ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 8th Class  MATHS ANSWER KEY DOWNLOAD 

 FA4 EXAM 9th Class  MATHS ANSWER KEY DOWNLOAD

 

FA4 EXAM ENGLISH ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 1st Class  ENGLISH ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 2nd Class  ENGLISH ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 3rd Class  ENGLISH ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 4th  Class  ENGLISH ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 5th  Class  ENGLISH ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM HINDI ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 6TH CLASS HINDI ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 7TH CLASS HINDI ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 8TH CLASS HINDI ANSWER KEY DOWNLOAD 

 FA4 EXAM 9TH CLASS HINDI ANSWER KEY DOWNLOAD 

PRE FINAL  EXAM 10TH CLASS HINDI ANSWER KEY DOWNLOAD

FA4 EXAM EVS ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 3rd Class  EVS EM ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 4th Class  EVS EM ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 5th Class  EVS EM ANSWER KEY DOWNLOAD  

 

FA4 EXAM 3RD CLASS EVS TM KEY DOWNLOAD

FA4 EXAM 4th CLASS EVS TM KEY DOWNLOAD 

FA4 EXAM 5th CLASS EVS TM KEY DOWNLOADDOWNLOAD

 

FA4 EXAM PHYSICS – BIOLOGY – GENERAL SCIENCE ANSWER KEYS DOWNLOAD

  GENERAL SCIENCE FA4 KEYS

FA4 EXAM 6TH CLASS  SCIENCE ANSWER KEY DOWNLOAD 

FA4 EXAM 7TH CLASS  SCIENCE ANSWER KEYS DOWNLOAD 

 

BIOLOGY FA4 KEYS

FA4 EXAM 8TH CLASS  BIOLOGY  KEY DOWNLOAD 

FA4 EXAM 9TH CLASS  BIOLOGY  KEY DOWNLOAD 

 

PHYSICS FA4 KEYS

FA4 EXAM 8TH CLASS  PHYSICS KEY BY PMR DOWNLOAD 

FA4 EXAM 9TH CLASS  PHYSICS KEY BY PMR  DOWNLOAD 

FA4 EXAM SOCIAL ANSWER KEYS DOWNLOAD

FA4 EXAM 6TH Class SOCIAL ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 7TH Class SOCIAL ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 8TH Class SOCIAL ANSWER KEY DOWNLOAD  

FA4 EXAM 9TH Class SOCIAL ANSWER KEY DOWNLOAD 

Cleaning Hack : వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేసే బదులు ఇలా వాడండి.. మీ కిచెన్‌ మెరుస్తుంది..! మీ పని మరింత ఈజీ..?

వంట గదిలో ఎన్నో రకాల పాత్రలు ఉపయోగిస్తుంటాం. తవా, కడాయి ఇలా అనే వంటకాల కోసం అనేక పాత్రలను వాడుతుంటాం..ఆహారం వండేటప్పుడు ఈ రెండు పాత్రలు మాడిపోవడం వల్ల నల్లగా మారుతుంటాయి.
దీన్ని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బును వాడుతుంటారు. మరికొందరు దీన్ని శుభ్రం చేసుందుకు బూడిదను కూడా ఉపయోగిస్తారు. ఇప్పటికీ, మీ వంట పాత్రలు మునుపటిలా మెరుస్తూ కనిపించవు..అలాంటప్పుడు ఈ వంటగది చిట్కాలు మీకు సహాయపడతాయి.

మీరు మీ వంటకాలను కొత్తవిగా చూడాలనుకుంటే, మీ ఇంట్లో ఉన్న ఖాళీ మందు పన్నీలు మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. మనం తరచుగా మందులను వాడుతుంటాం.. అవి ఖాళీ అయిన తర్వాత వాటిని చెత్తగా పారేస్తాం. మీరు కూడా ఇలా చేస్తుంటే ఇకపై పరేయకండి..ఎందుకంటే ఖాళీ మెడిసిన్ రేపర్లు మీ వంటగది పనిని సులభతరం చేస్తాయి. వంటగదిలో ఔషధ రేపర్లను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
మాడిన వంట పాత్రలు మెరిసేలా చెయొచ్చు..

అన్నింట్లో మొదటిది మాడిన కడాయి, పాన్‌ మునుపటిలా మెరవాలంటే.. ముందుగా దానిపై ఉప్పు, స్వీట్ సోడా లేదా ఇనో వేయండి.. ఇప్పుడు దానిపై కొద్దిగా వేడినీరు పోయాలి. ఇప్పుడు మెడిసిన్ రేపర్ సహాయంతో 2-4 నిమిషాలు రుద్దండి. ఈ ట్రిక్ వాడకంతో మీ వంటింట్లోని తవా, లేదంటే పాన్ మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తుంది.

కత్తెరకు పదును పెట్టవచ్చు..

కత్తెర అంచుని పదును పెట్టడం కూడా చేసుకోవచ్చు. చాలా సార్లు కత్తెర అంచు చాలా మొండిగా మారుతుంది. దాంతో ఏదీ సరిగ్గా కత్తిరించబడదు. అటువంటి పరిస్థితిలో, దాని అంచు మెడిసిన్‌ కవర్ సహాయంతో పదును పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక రేపర్ తీసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండండి. దీన్ని కనీసం 2-3 నిమిషాలు చేయండి. కత్తెర అంచు చాలా పదునుగా మారుతుంది.

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్ పదును పెట్టుకోవచ్చు..

మీరు మిక్సర్ గ్రైండర్ బ్లేడ్‌లను మెడిసిన్ రేపర్‌తో పదును పెట్టవచ్చు. దీని కోసం, కత్తెరతో మందు రేపర్ చిన్న ముక్కలను కత్తిరించండి.
దీన్ని ఒక జాడీలో వేసి రెండు నిమిషాలు తిప్పండి. ఈ ట్రిక్ సహాయంతో, మిక్సర్ బ్లేడ్ అంచు పదును పెట్టబడుతుంది. ఇక్కడో విషయం గుర్తుంచుకోండి. దాని పదునైన అంచు కారణంగా ట్యాబ్లెట్‌ రేఫర్‌ చాలా పదునైన అంచుని కలిగి ఉంటుంది. ఒక్కోసారి చేతులు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్రీ కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు.. ఆ నగరం ఎలా మునిగిపోయింది?

మన దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మనకు కనిపించే పురాతన దేవాలయాలలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాధీష్ దేవాలయం కూడా ఒకటి.
ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ద్వారకాధీష్ ఆలయం శ్రీ కృష్ణుడికి అంకితం చేశారు.

ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం హస్తకళకు చాలా ప్రసిద్ధి చెందింది. 5000 సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తరువాత, శ్రీ కృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడని, తర్వాత ద్వారకా నగరం శ్రీ కృష్ణుని నివాసంగా ఉండేదని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించాడు. అయితే శ్రీ కృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ కృష్ణుడు మధుర వదిలి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు ?
శ్రీ కృష్ణ భగవానుడి బాల్యం మధుర నగరంలో గడిచింది. కానీ కంసుడిని చంపిన తరువాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు. కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు. కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి, కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని, మధుర పై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు. అతను శ్రీ కృష్ణుని చేతిలో పదే పదే ఓడిపోయాడు. అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు.

మధుర పై 17 సార్లు దాడి..

జరాసంధుడు వరుసగా 17 సార్లు మధుర పై దాడి చేసి ఓడిపోయాడు. దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు. దీని తరువాత కృష్ణుడు నేనే కంసుడిని చంపానని, కంసుడిని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మపరిశీలన చేసుకున్నాడు. యుద్ధంలో నష్టాలు రావడంతో మధుర రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. అందుకే ద్వారక వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

జరాసంధుని మరణం తన చేతుల్లో రాయలేదని కృష్ణుడికి తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు యదువంశీయులందరితో కలిసి మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మథుర ప్రజలపై జరాసంధులు చేస్తున్న అకృత్యాలను ఆపడానికి, శ్రీ కృష్ణుడు రాత్రిపూట మధురను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు గుజరాత్ వెళ్లి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు. ఈ నగరానికి ద్వారక అని పేరు పెట్టారు. మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు.

ద్వారక నగరం ప్రధాన చార్ ధామ్‌లలో ఒకటైన శ్రీ కృష్ణుడి నగరం. గుజరాత్‌లోని కతియావార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఉంది. ద్వారకకు గొప్ప చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో ద్వారకలో సగభాగం సముద్రంలో మునిగిపోయిందని, నేటికీ ద్వారక సముద్రం తనలో అనేక రహస్యాలను కలిగి ఉందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి నగరానికి గాంధారి ఇచ్చిన శాపం, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడికి ఒక మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిందని ఇలాంటి పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Samalu: గుండెపోటు రాకుండా అడ్డుకోవాలా? ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి

Samalu: సిరి ధాన్యాల్లో సామలు ముఖ్యమైనది. ఒకప్పుడు వీటిని అధికంగా తినేవారు. కానీ ఎప్పుడైతే తెల్ల బియ్యం వాడకం పెరిగిందో అప్పటినుంచి సామలు తినడం చాలా తగ్గించేశారు. నిజానికి సామలతో ఎన్నో రకాల వంటకాలు చేయొచ్చు. దోశెలు, ఊతప్పం, పులావ్, ఉప్మా… ఇలా నచ్చినవన్నీ చేసుకోవచ్చు. అయినా కూడా వీటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. సామలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది.
సామలు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం ఇది. పోషకాలతో నిండి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి కూడా తగినంత దొరుకుతాయి. ఎవరికైతే గ్లూటెన్ ఆహారమో పడదో వారు… గోధుమ, బార్లీ వంటివి వదిలి సామలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సామలను తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీనివల్ల డయాబెటిక్ రోగులు ఆరోగ్యంగా ఉంటారు. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు సామలను తింటే మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పేగు కదలికలను ప్రోత్సహించడంలో సామలవీ కీలక పాత్ర.

సామలు తింటే ఈ సమస్యలు రావు
సామలు తిన్నవారిలో మలబద్ధకం వంటి సమస్యలు రావు. జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఫైబర్ చాలా అవసరం. సామల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పొట్ట ఆరోగ్యంగా ఉండడం ఖాయం.

ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ప్రతి రోజూ సామలను తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ వల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో చేరే క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.
గుండె ఆరోగ్యానికి సామలు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సామలు కచ్చితంగా తినాలి. ఇది మీ గుండెకి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెపోటు వంటివి రాకుండా ఉంటాయి. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Chanakya Niti : జీవితంలో ముందు ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించండి

చాణక్యుడు జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. చాలామంది విజయం సాధించేందుకు కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. కానీ విజయం సాధించలేరు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. నిజానికి చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన సమాచారం చాలా విలువైనది. ఇప్పటికీ వాటిని పాటించేవారు ఉన్నారు.

మీరు కూడా జీవితంలో వైఫల్యాలను నివారించాలనుకుంటే, ఆచార్య చాణక్యుడు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలి. వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. విజయం సాధించాలని ప్రతి వ్యక్తి కోరిక. అయితే విజయం అనేది అంత ఈజీగా రాదు. జీవితంలో మీ చిన్న పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. జీవితంలో అపజయాన్ని నివారించాలనుకుంటే ఆచార్య చాణక్యుడి సూచనలను అనుసరించడం ద్వారా వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

ఆత్మవిశ్వాసమే బలం
ఆత్మవిశ్వాసం ఆధారంగా ఒక వ్యక్తి చాలా కష్టమైన పనులు, పరిస్థితులలో కూడా తన మార్గాన్ని సులభంగా కనుగొంటాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోనివ్వదు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు. ఆత్మవిశ్వాసం ఒక సైన్యంలా పనిచేస్తుంది. మిమ్మల్ని ఓడించడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందని చాణక్య నీతి చెబుతుంది.

జ్ఞానమే నిజమైన స్నేహితుడు
ప్రతి వ్యక్తికి జ్ఞానం నిజమైన స్నేహితుడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం అది పుస్తక జ్ఞానం లేదా ఏదైనా పని చేసే అనుభవం కావచ్చు. ఒక వ్యక్తి జ్ఞానం ఎప్పుడూ వృథా కాదు. తెలివైన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. అందుకే ముందు జీవితంలో జ్ఞానం సంపాదించాలని చాణక్య నీతి చెబుతుంది.

కృషి ఉంటేనే విజయం
ఒక వ్యక్తి తన కృషి ఆధారంగా అసాధ్యమైన ప్రతి విషయాన్ని సుసాధ్యం చేయగలడు. ఒక వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను త్వరగా లేదా తరువాత పొందుతాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి సూత్రం. చాణక్య నీతి కూడా అదే చెబుతుంది.. కష్టే ఫలి.

ఇతరుల మాటలు నమ్మెుద్దు
నేటి కాలంలో ఒక వ్యక్తి వైఫల్యానికి పెద్ద కారణం ఇతరుల మాటలు నమ్మడం. మనుషులు ఒకరి మాటలకు మరొకరు ప్రభావితులవుతున్నారు. కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమకే హాని కలుగుతుందని చాణక్య నీతి చెబుతుంది. ఒక వ్యక్తికి ఎప్పుడూ చెవులు సరిగా పని చేయాలి. ఇతరులు ఏదైనా చెబితే ఆ విషయాన్ని ఆలోచించాలి.

డబ్బు సరిగా వాడుకోవాలి
ప్రతి సందర్భంలోనూ కళ్ళు, చెవులు తెరిచి ఉంచే వ్యక్తి అప్రమత్తంగా ఉంటాడు. అతను ఎప్పుడూ వైఫల్యాన్ని ఎదుర్కోడని చాణక్య నీతి చెబుతుంది. ఇది కాకుండా ఒక వ్యక్తి తన డబ్బును సద్వినియోగం చేసుకోవాలని కూడా సలహా ఇచ్చాడు చాణక్యుడు. డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుని, చెడు సమయాల్లో భద్రంగా ఉంచుకునే వ్యక్తి జీవితంలో ఓడిపోడు.

Sneezing Benefits : తుమ్ములు ఆపుకోకండి.. తుమ్మితే ఎంత మంచిదో

Sneezing Benefits In Telugu : తుమ్ములను ఆపుకొనేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనివలన చాలా సమస్యలు వస్తాయి. నిజానికి తుమ్మడం అనేది మంచిది.
మీరు రోజుకు ఎన్నిసార్లు తుమ్ముతారు. దాని గురించి లెక్కించకపోవచ్చు. ఇది మీకు అంత ముఖ్యమైనది కాదు.. కానీ అసలు విషయం ఏంటంటే.. తుమ్ములు మీ ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తుందని మీకు తెలుసా? తుమ్ములు ఆరోగ్యానికి చాలా మంచిది. ముక్కులో దుమ్ము లేదా చికాకు ఉన్నప్పుడు మాత్రమే తుమ్ములు వస్తాయని మనం భావిస్తాం. ఎవరైనా పదే పదే తుమ్మితే జలుబు వచ్చిందని అనుకుంటాం. అయితే తుమ్ముల వెనుక మీ ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అవును ఇది నిజం.
చాలా మంది జలుబు, ఫ్లూ ఉన్నప్పుడు ఎక్కువగా తుమ్ముతారు. అంటే వారికి చికిత్స అవసరం. తుమ్ము అనేది నిజానికి ముక్కు, మెదడు, మీ శరీరంలోని వివిధ కండరాల మధ్య చాలా సంక్లిష్టమైన పరస్పర చర్య. తుమ్ము అనేది రిఫ్లెక్స్ (అసంకల్పిత) చర్య (మీ నియంత్రణలో లేదు). ముక్కు కొన నుండి ముక్కు వెనుక భాగంలో ఏదో ఒక కారణంగా ప్రేరేపించబడుతుంది. ఇది నాసికా భాగాల లైనింగ్‌ను చికాకుపెడుతుంది.

తుమ్మితే ఆరోగ్యానికి మంచిది
ఆసక్తికరంగా తుమ్ములకు గాలిలో ఉండే కణాలు మాత్రమే కారణం కాదు. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతికి గురైనప్పుడు తుమ్ముతారు. ఈ విషయాన్ని ఫోటో స్నీజ్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. తుమ్ములు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముక్కు నుండి శరీరంలోకి ప్రవేశించే దుమ్ము, వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ముందు తుమ్మడం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇది అనేక అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది.

తుమ్మును ఆపుకోకూడదు
కొంతమంది తుమ్మును ఆపుతారు. ఇలా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. మనం తుమ్మినప్పుడు, మన గుండె కొన్ని మిల్లీసెకన్ల పాటు పనిచేయడం ఆగిపోతుంది. ఇది మీరు గ్రహించని, మీకు తెలియని విషయం. అందుచేత తుమ్ములు వచ్చేటపుడు ఆపేయకండి. మీరు ఎంత వేగంగా తుమ్మితే అంత మంచిది.
తుమ్మును ఆపితే ఇలా జరిగింది
గతేడాది ఏప్రిల్‌లో ఇలాంటి వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తుమ్మును అడ్డుకున్నందున అతని గొంతులో చిన్న రంధ్రం ఏర్పడింది. యూఎస్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. అతడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తుమ్మును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అది అతని గొంతులో చిన్న రంధ్రం చేసింది. తుమ్ము వచ్చినప్పుడు నోటిని, ముక్కును గట్టిగా మూసుకున్నాడు. వెంటనే గొంతు నొప్పి అనిపించింది. భయాందోళనకు గురైన వైద్యుడి వద్దకు వెళ్లాడు. గొంతులో చిన్న రంధ్రం ఉన్నట్టుగా వైద్యుడు చెప్పాడు. ఆ వ్యక్తి తుమ్మును ఆపుకోవడంతో గొంతుపై ఒత్తిడి 40 శాతం పెరిగింది. దీంతో అతని గొంతులో రంధ్రం ఏర్పడింది.

అందుకే తుమ్మును ఆపుకోవడం కూడా మంచిది కాదు. తుమ్మితేనే ఆరోగ్యానికి మంచిది. తుమ్మడం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. తుమ్మును అస్సలు ఆపుకోకూడదు. తుమ్మును అస్సలు ఆపుకొనే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గుండె సంబంధిత ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు.

ఎన్నికల వేళ.. ఆ వివాదాస్పద చట్టం అమలుకు కేంద్రం చర్యలు

CAA: గతంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం.
ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.

ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ స్పష్టతను ఇచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

మార్చి మొదటివారంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకుని రావడానికి హోం మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే నెల రెండో వారం నాటికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉండటం వల్ల అంతకంటే ముందే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులను ఆదుకోవడం, వారికి దేశ పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

దీనితో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో- మరోసారి ఈ వివాదాస్పద చట్టాన్ని అమలు చేయడానికి పూనుకుందని సమాచారం. మార్చి మొదటివారంలోనే నోటిఫై చేస్తుందని అంటున్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. పలు రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలను చేశాయి. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడు కూడా సీఏఏ అమలుకు పెద్దగా సుముఖంగా లేదు.

E 69 Highway: భూమి, ఆకాశం కలిసేది అక్కడే

E 69 Highway: ‘భూమి విశాలంగా ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉంటుంది. ఇవి రెండు కలిసే అవకాశం లేదు.’ చిన్నప్పుడు పాఠశాలల్లో ఇలానే కదా ఉపాధ్యాయులు చెప్పేవారు.
అయితే ఇప్పుడు దానిని మార్చుకోవాలేమో. “భూమి, ఆకాశం కలుస్తాయని” చదువుకోలేమో. ఎందుకంటే ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు పరిశీలన జరపగా భూమి, ఆకాశం కలుస్తాయని తేలింది. భూమి అంతం అక్కడే అని శాస్త్రవేత్తలు నిరూపించడంతో ఆ ప్రాంతంపై అందరికీ ఆసక్తి పెరిగింది. కొంతమంది ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఒకసారి ఆది దర్శనీయ ప్రదేశం అయింది.

భూగర్భ శాస్త్ర నిపుణుల అధ్యయన ప్రకారం ఐరోపాలో చివరి రోడ్డు ఉందని తెలిసింది. అక్కడ భూమి, ఆకాశం కలుస్తాయట. ఇక్కడితో ప్రపంచ రహదారి మార్గం ముగుస్తుందట. ఐరోపాలోని E -69 హైవే చివరి రహదారి చిరునామా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని తేల్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. భూమి చివరి అంచుపై నడిచి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఈ రోడ్డు ముగిసిన చోట భూమి, ఆకాశం రెండూ కలుస్తాయి.

ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.. నార్వే ప్రాంతంలోని E-69 హైవే చివరి అంచుకు వెళ్తే సముద్రం కనిపిస్తుంది. ఈ రహదారి భూమి అంచున ఉంది. ఇక్కడ విరుద్ధమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో బతకడం చాలా కష్టం. ఆ ప్రాంతం మొత్తం ఉత్తరార్థ గోళంలో ఉండటంతో విపరీతంగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయి. వాతావరణం అత్యంత దుర్లభంగా ఉండటంతో మనుషులు బతకడం చాలా కష్టం. వాతావరణం లో కూడా ఆమ్లజని అతి తక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే అక్కడి వాతావరణం లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మనుషులు బతికేందుకు అనువుగా ఉంటుందా? ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవిస్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? భవిష్యత్తులో ఆ సముద్రం ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారు.

కస్టమర్‌ అకౌంట్ నుంచి రూ. 13.5 కోట్లు మోసం చేసిన బ్యాంకు మేనేజర్

Fraud- ICICI Bank Manager | భారత సంతతి అమెరికన్ మహిళ.. ఐసీఐసీఐ బ్యాంకులో మదుపు చేసిన రూ.13.5 కోట్ల సొమ్మును సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్వాహా చేశాడు.
వాటిని మోసపూరిత కార్యక్రమాల్లో ఖర్చు చేశాడని శ్వేతా శర్మ బీబీసీకి చెప్పారు. అమెరికాలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.13.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశానని, వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు బీబీసీకి శ్వేత శర్మ తెలిపారు. తన భర్తతో కలిసి భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్ ద్వారా సదరు బ్యాంకు మేనేజర్’ను కలుసకున్నట్లు చెప్పారు.

అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల 5.5-6 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు మేనేజర్ నమ్మ బలికాడని శ్వేతా శర్మ చెప్పారు. కానీ, నాకు అతడు ‘ఫేక్ స్టేట్‌మెంట్లు, నా బ్యాంకు ఖాతా పేరిట ఫేక్ ఈ-మెయల్ ఐడీ నకిలీవి క్రియేట్ చేశాడని, బ్యాంకు నోటిపికేషన్లు ఏమీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలం (2019 సెప్టెంబర్-2023 డిసెంబర్) మధ్య తమ జీవితమంతా పొదుపు చేసిన రూ.13.5 కోట్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.16 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

కానీ గత నెలలో మెరుగైన రిటర్న్స్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో ఆ మనీ తుడిచి పెట్టుకుపోయిందని అదే బ్యాంకుశాఖ మరో అధికారి చెప్పారని శ్వేతా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్యాంకు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐసీఐసీఐ అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులకు ఫిర్యాదు చేశామని, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారి ప్రతినిధి చెప్పారు.

Free Internet: మొబైల్ డేటా అయిపోయినప్పుడు ఈ చిన్న ట్రిక్ తో ఉచిత ఇంటర్నెట్ ని ఉపయోగించవచ్చు

Free Internet: కొన్నిసార్లు మీరు ఇంటి నుండి బయటికి వెళ్లినప్పుడు మీ డేటా ప్యాక్ అయిపోతుంది. ఆపై మీరు ఒకరి నుండి హాట్‌స్పాట్ కోసం అడగాలి లేదా కొన్నిసార్లు మీరు దాన్ని టాప్ అప్ చేయాలి వస్తుంది. అలాంటి పరిస్థితికి పరిష్కారమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. Facebook Wi-Fi ఫౌండర్ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది. దాన్ని ఉపయోగించి మీరు ఉచిత ఇంటర్నెట్‌ని (Free Internet) పొందవచ్చు. Facebook ప్రకారం.. స్థానిక వ్యాపారాలు Wi-Fi హాట్‌స్పాట్‌లను కలిగి ఉంటాయి. అవి చాలా వరకు ఉచితం.

ఈ Wi-Fi హాట్‌స్పాట్‌లను Facebook కూడా ధృవీకరిస్తుంది కాబట్టి వాటిని విశ్వసించవచ్చు. ఫేస్‌బుక్ లో ఈ ఫీచర్ ఉందని తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ఈ ఫీచర్ ఫేస్‌బుక్‌లో దాగి ఉంది. దీనిని ఫేస్‌బుక్ రహస్య సాధనం అని కూడా పిలుస్తారు. ఈ సాధనాన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఇద్దరూ ఉపయోగించవచ్చు. ఇప్పుడు Facebookలో Wi-Fi హాట్‌స్పాట్‌లను ఎలా కనుగొనాలో తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఫేస్‌బుక్ యాప్‌లోకి లాగిన్ అయి, పక్కనే వచ్చే మూడు లైన్లపై క్లిక్ చేయాలి.
దీని తర్వాత సెట్టింగ్‌లు & గోప్యతా ఎంపికకు వెళ్లండి. అక్కడ మీరు Find Wi-Fi ఎంపికను పొందుతారు. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు సమీపంలో అందుబాటులో ఉన్న పబ్లిక్ Wi-Fi హాట్‌స్పాట్‌లతో పాటు మ్యాప్, లొకేషన్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటు మీరు Wi-Fi హాట్‌స్పాట్ వివరాలను తెలుసుకోవాలనుకుంటే..పేరు, వేగం, కవరేజ్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందించి క్లిక్ చేయండి.
మీ సమాచారం కోసం ఎయిర్‌టెల్ టెలికాం కంపెనీ అధికారిక యాప్ ద్వారా మీరు మీ మొబైల్‌ను రీఛార్జ్ చేసుకుంటే రూ. 359 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై ఎయిర్‌టెల్ 2 కూపన్ల 1 GB డేటాను అందిస్తుంది. మీరు రూ. 479 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్టెల్ తన కస్టమర్లకు 1 GB యొక్క 4 కూపన్లను ఇస్తుంది. అలాగే జియో వోడాఫోన్‌లలో కూడా ఇటువంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చాలా టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఉచిత డేటాను అందిస్తాయి.

Mudupu: అసలు ముడుపు అంటే ఏమిటి? వేంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి?

Mudupu: చాలా మంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామి వారికి ముడుపు కడతారు. అసలు ఈ ముడుపు అంటే ఏంటి? వేంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే దాని గురించి చిలకమర్తి వివరించారు.
మానవులు తమ జీవితములో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి. ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి. ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని చిలకమర్తి తెలిపారు.
ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని చిలకమర్తి తెలిపారు.

వేంకటేశ్వరస్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత నిత్య దీపారాధన చేయాలి. మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి.

ఒక తెల్లటి వస్త్రం తీసుకుని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి.

కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Ceiling Fan and AC : ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వాడుకోవచ్చా?

వేసవి కాలం మొదలైంది. అందుకే ఈ సమయంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ని వాడుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.
కొందరేమో అలానే నడిపిస్తారు. కొందరేమే ఫ్యాన్ ఆపేస్తారు. ఇలా చేయడం వలన లాభం ఉంటుందా? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.

ఏసీ వాడుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేయకూడదని కొందరు అంటుంటారు. ఎందుకంటే అది వేడి గాలిని కిందికి నెట్టివేస్తుందని వివరణ ఇస్తారు. అయితే మీరు సీలింగ్ ఫ్యాన్‌ని ఏసీతో వాడితే గదిలోని గాలి చల్లబడుతుంది. ఇది మొత్తం గదిని చల్లబరుస్తుంది. సీలింగ్ ఫ్యాన్ గదిలోని ప్రతి మూలకు చల్లని గాలిని పంపుతుంది. ఆ సమయంలో ఏసీ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు.

గదిలో కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఇది గదిలోని చల్లని గాలి బయటకు రాకుండా చేస్తుంది. నిజానికి సీలింగ్ ఫ్యాన్‌ను ఏసీతో ఉపయోగించినప్పుడు మీరు సులభంగా విద్యుత్తును ఆదా చేయవచ్చు. అలాగే AC ఉష్ణోగ్రత 24 నుండి 26 మధ్య ఉండాలి. ఫ్యాన్‌ను తక్కువ వేగంతో ఉంచాలి.ఇలా చేయడం వల్ల గది మొత్తం త్వరగా చల్లబడుతుంది. ఏసీ ఆన్ తక్కువ పాయింట్లు పెట్టి.. ఫ్యాన్ ఎక్కువ పాయింట్లు పెడితే కరెంట్ బిల్ మోగిపోతుంది.

ఏసీ పాయింట్స్ తగ్గించి.. ఫ్యాన్ కూడా తక్కువలో పెడితే.. గది అంతటా గాలి ప్రసరిస్తుంది, త్వరగా చల్లబరుస్తుంది. దీంతో ఖర్చు తగ్గుతుంది. అయితే మనం 6 గంటల పాటు ఏసీని ఉపయోగించినప్పుడు 12 యూనిట్లు.. అదే సమయంలో ఏసీతో ఫ్యాన్‌ను ఉపయోగిస్తే 6 యూనిట్లు మాత్రమే కరెంట్ కాలుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ ఖర్చు కూడా ఆదా అవుతుంది.

ఏసీ, సీలింగ్ ఫ్యాన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అటువంటి దానిని శుభ్రం చేసేందుకు కచ్చితంగా టిప్స్ పాటించాలి. అప్పుడే ఫ్యాన్ శుభ్రంగా ఉంటుంది. బాగా తిరుగుతుంది. ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అంత తేలికైన పని కాదు. ఎంత శుభ్రం చేసినా దుమ్ము, ధూళి ఉంటుంది. అది కాస్త వెళ్లి ఫ్యాన్ మీద ఉంటుంది. మీరు ఏసీ ఆన్ చేసి సీలింగ్ ఫ్యాన్ పెడితే దానిపై ఉన్న దుమ్ము గదిలో వ్యాపిస్తుంది.

ఫ్యాన్‌ను కచ్చితంగా శుభ్రం చేయాలి. లేదంటే దుమ్ము పేరుకుపోయి ఇబ్బందులు వస్తాయి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దానిపై ఉన్న చిన్న దుమ్ము రేణువులు మనలోకి వెళ్లే అవకాశం ఉంది. ఫ్యాన్, ఏసీని కచ్చితంగా శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే సమస్యలు తలెత్తుతాయి.

Lifestyle: వయసు ఆధారంగా రోజుకు ఎంత దూరం నడవాలో తెలుసా.?

ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ నడవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకింగ్ కీలక పాత్ర పోసిస్తుందని, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వాకింగ్‌తో చెక్‌ పెట్టొచ్చు.
అయితే నడక మంచిదని అందరికీ తెలిసిదే కానీ ఏ వయసు వారు ఎంత సేపు నడవాలన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ వయసు వారు, ఎంత దూరం వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌కి వెళ్లడం లేదా యోగా చేయడం కంటే నడకను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ కచ్చితంగా కొంత దూరమైన నడవాలని సూచిస్తుంటారు. నడక బెస్ట్‌ ఎక్సర్‌సైజ్‌గా చెబుతుంటారు. నడక మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. అయితే ఒక రోజులో ఎంతసేపు నడవాలి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పరిశోధకులు అభిప్రాయం ప్రకారం ఏ వయసు వారు ఎంత సేపు నడవాలో ఇప్పుడు చూద్దాం.
స్వీడన్‌లోని కోల్‌మార్ విశ్వవిద్యాలయంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడవాలి. ఎందుకంటే ఇది బరువును అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో, జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని ఈ అధ్యయనంలో తెలిపారు. దీని ప్రకారం.. 6 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న వారు రోజుకు కనీసం 15 వేల అడుగులు నడవాలి. అయితే అమ్మాయిలు 12 వేల అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.

అలాగే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు స్త్రీ, పురుషులు ఇద్దరూ రోజుకు కనీసం 12 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 40 ఏళ్లు పైబడిన వారిలో సహజంగానే ఆరోగ్య సంబధిత సమస్యలు మొదలవుతాయి, కాబట్టి ఈ వయసులో వారు రోజుకు 11 వేల అడుగులు నడవాలి. 50 ఏళ్లు పైబడిని వారు రోజుకు 10 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వాళ్లు రోజుకు 8 వేల అడుగులు నడిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

LIC Policy: ఆడపిల్లలపెళ్లికోసం సూపర్ పాలసీ.. ప్రతిరోజు రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు పొందవచ్చు..!

LIC Policy: లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ (ఎల్​ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ ప్రతి ఒక్కరి కోసం అద్భుత మైన పాలసీలను రూపొందిస్తుంది.
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికోసం తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయం వచ్చే పాలసీలను ప్రవేశపెట్టి చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్​ఐసీ ఒక సూపర్​ ప్లాన్​ ప్రవేశపెట్టింది. దానిపేరు ఎల్​ఐసీ కన్యాదాన్​ పాలసీ . ఇందులో నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆమె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకోవాలంటే మీరు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 3 ఏళ్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కూతురి వయస్సును బట్టి పాలసీ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి

కుమార్తె జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ పాస్ బుక్ ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవడానికి మీరు సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు.

రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు

కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 పొదుపు చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. ఈ మొత్తాన్ని కుమార్తె తదుపరి చదువుల కోసం లేదా ఆమె పెళ్లికోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు 27 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పాలసీకి బీమా కూడా వర్తిస్తుంది. పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు చెల్లిస్తారు.

బెల్‌లో ఇంజినీర్‌ నియామకాలు , బీటెక్‌ అర్హతతో దరఖాస్తుకు అవకాశం

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన 34 ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులకు పోటీ పడాలంటే.. బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. సీ++, ఎస్‌డబ్ల్యూ టెస్టింగ్, ఎస్‌డబ్ల్యూ డాక్యుమెంటేషన్, పైతాన్‌ నైపుణ్యంతోపాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

‣ కోర్సులో భాగంగా చేసిన అకాడమీ/ టీచింగ్‌/ రిసెర్చ్‌ వర్క్, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్‌ వర్క్‌లను అనుభవంగా పరిగణించరు.

‣ బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత పొందిన పని అనుభవాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు.

మొత్తం 34 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 13, ఓబీసీలకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 02, ఎస్సీలకు 04, ఎస్టీలకు 03 కేటాయించారు.

01.01.2024 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.472. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్షకు 85, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఎంపికైన అభ్యర్థుల పేర్లను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. అభ్యర్థులను ప్రాథమికంగా 3 ఏళ్ల కాలానికి విధుల్లోకి తీసుకుంటారు. తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో ఏడాది పొడిగిస్తారు.

‣ మొదటి సంవత్సరం నెలకు రూ.40 వేల వేతనం, రెండో ఏడాది రూ.45 వేలు, మూడో ఏడాది రూ.50 వేలు, నాలుగో ఏడాది రూ.55 వేల వేతనం చెల్లిస్తారు.

‣ వేతనంపైన నెలకు 10 శాతం ఏరియా అలవెన్స్‌ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ ప్రీమియం, స్టిచింగ్‌ చార్జీలు, ఫుట్‌వేర్‌ అలవెన్స్‌కు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తారు.

కోర్సులో భాగంగా చేసిన అకాడమీ/ టీచింగ్‌/ రిసెర్చ్‌ వర్క్, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్‌ వర్క్‌లను అనుభవంగా పరిగణించరు.

బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత పొందిన పని అనుభవాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు

గమనించాల్సినవి

‣ ఎంపిక చేసిన అభ్యర్థులను సంస్థకు చెందిన ఏ యూనిట్‌లోనైనా నియమించే అవకాశం ఉంటుంది.

‣ విధి నిర్వహణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సివుంటుంది.

‣ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక కేటాయింపులు/ సడలింపులు వర్తిస్తాయి.

‣ ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తుతోపాటు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2024

వెబ్‌సైట్‌: http://www.bel-india.in/

కోస్ట్‌ గార్డులో కమాండెంట్‌ కొలువులు , డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం

భారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. ఎంపికైనవాళ్లు గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా పొందవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.

ఈ పోస్టులకు మహిళలూ అర్హులే. దాదాపు ఏటా ఈ ప్రకటన వెలువడుతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో విభాగంలోనూ 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా కంప్యూటరైజ్డ్‌ కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్టు (సీసీబీటీ), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీఅండ్‌డీటీ) ఉంటాయి. సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో మాట్లాడాలి. స్టేజ్‌-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్‌-3 నిర్వహిస్తారు. అందులో భాగంగా.. సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-3లోనూ మెరిస్తే స్టేజ్‌-4లో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో విజయవంతమైతే స్టేజ్‌-5లో భాగంగా స్టేజ్‌-1, 3ల్లో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఉద్యోగంలో..

వీరికి ఐఎన్‌ఏ, ఎజమాళలో 22 వారాల శిక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి.

అర్హతలు..

పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)

1) జనరల్‌ డ్యూటీ ఖాళీలు: 50

అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు అవసరం.

2) టెక్నికల్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌) ఖాళీలు: 20

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. అలాగే ఇంటర్‌ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి.

వయసు: పై రెండు పోస్టులకూ జులై 1, 2024 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే 01.07.1999 – 30.06.2003 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 157 సెం.మీ. ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 6 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

పరీక్షలు: స్టేజ్‌-1 ఏప్రిల్, స్టేజ్‌-2 మే, స్టేజ్‌-3 జూన్‌-ఆగస్టు, స్టేజ్‌-4 జూన్‌-నవంబరు, స్టేజ్‌-5 డిసెంబరులో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgcat/

Brain Stroke Risk Factors : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే అద్భుతమైన 10 మార్గాలివే.. తప్పక పాటించండి!

Brain Stroke Risk Factors : ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఇతరేతర అనారోగ్య సమస్యల కారణంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. హార్ట్ అటాక్ మాదిరిగా సైలంట్ వచ్చే వాటిలో బ్రెయిన్ స్ట్రోక్‌ ఒకటి. ఎప్పుడు వస్తుందో గుర్తించడం కష్టం. స్ట్రోక్ అనేది.. మెదడులో నిర్దిష్ట ప్రాంతానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల సంభవించవచ్చు. ఇది మెదడు కణాలకు హాని కలిగించవచ్చు. అడల్ట్ స్ట్రోక్స్ వస్తే మాత్రం మరణం లేదా శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది. మెదడుకు తీవ్రహాని కలిగించే అవకాశం ఉంది.
స్ట్రోక్ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రంగా ఆలోచించడం, కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది, దృశ్య సమస్యలు, నడవలేకపోవడం పక్షవాతం వంటివి జీవితాంతం బాధిస్తాయి. దీని కారణంగా కొన్ని శరీర భాగాలను కదిలించలేరు. కండరాల బలహీనతకు దారితీస్తుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించలేరు. మింగడం, నమలడం కష్టంగా ఉంటుంది. సరిగా నిద్రపోలేరు. స్ట్రోక్‌ నివారించలేం.. కానీ, అదృష్టవశాత్తూ.. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఏయే మార్గాలను పాటించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి :
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. అధిక ఉప్పు, చక్కెర, కొవ్వులను నివారించండి. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.

2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి :
రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు సార్లు వ్యాయామం చేస్తుండాలి. తద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడంలో సాయపడుతుంది.

3. ఒత్తిడిని తగ్గించుకోండి :
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ధ్యానం, డీప్ బ్రీతింగ్ లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.

4. ధూమపానం మానేయండి :
ధూమపానం రక్త నాళాలు దెబ్బతినడం, రక్తపోటును పెంచడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మానేయడం చాలా మంచిది. లేదంటే.. అది మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

5. మద్యం వినియోగాన్ని తగ్గించండి :
అధిక ఆల్కహాల్ తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకోవడాన్ని బాగా తగ్గించండి. లేదంటే పూర్తిగా మానేసిన ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించుకోండి.

6. బరువు అదుపులో ఉండాలి :
అధిక బరువు లేదా ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

7. రక్తపోటును నియంత్రించండి :
అధిక రక్తపోటు అనేది స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. నియంత్రణలో ఉంచడానికి మీ వైద్యుని కలిసి అవసరమైన జాగ్రత్తలు, చికిత్స తీసుకోండి.

8. మధుమేహాన్ని నియంత్రించండి :
మధుమేహం రక్తనాళాలకు నష్టం కలిగించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి.

9. తగినంత నిద్ర :
నిద్ర లేకపోవడం అధిక రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్‌కు ఇతర ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. ప్రతి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరమని గుర్తించుకోండి.

10. మానసికంగా చురుకుగా ఉండండి :
పజిల్స్ పూర్తి చేయడం లేదా చదవడం కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటి మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా ఒత్తిడిని తగ్గించి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతుంది.

ఈ మార్గాలను అనుసరించడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి కీలక ప్రమాదాలను పరిష్కరించుకోవచ్చు. తద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా, మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెదడు పనితీరును మెరుగుపర్చవచ్చు. స్ట్రోక్‌ సమస్యను కూడా తగ్గించవచ్చు.

జేబుపై మరింత భారం .. పెరగనున్న కిరాణా వస్తువుల ధరలు

న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీదారులు 2024లో కిరాణా వస్తువుల ధరలను 2–-4శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, అధిక వేతన ఖర్చుల కారణంగా ధరలు పెంపు అనివార్యంగా మారిందని ఫాస్ట్​ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్​ఎంసీజీ) కంపెనీలు చెబుతున్నాయి. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, ఇమామీ వంటి కంపెనీలు ధరల ఆధారిత వృద్ధి పరిశ్రమకు తిరిగి వస్తుందని చెప్పాయి. మనదేశపు అతిపెద్ద ఎఫ్​ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ కూడా కొంత పెరుగుదలని ఆశిస్తోంది.

డాబర్ తన ఫుడ్​ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ధరలను ఇది వరకే 2.5శాతం పెంచినట్లు తెలిపింది. అయితే ఇమామీ ఈ సంవత్సరం సుమారు 3 శాతం వరకు ధరల పెంపుదలని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎఫ్​ఎంసీజీ వృద్ధి రికవరీకి అమ్మకాలతో పాటు ధరల పెరుగుదల కీలకమని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ధరలలో ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా గత సంవత్సరం చాలా కంపెనీలు ఇబ్బందిపడ్డాయి. ఎఫ్​ఎంసీజీ కంపెనీల వృద్ధిలో దాదాపు 65-–70శాతం వాల్యూమ్ నుంచి, మిగిలినవి ధరల నుంచి వస్తుంది. తృణధాన్యాలు, మసాలాలు, తేనె వంటి ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెల ధరలు మాత్రం దిగివచ్చాయి.

నకిలీ అపాయింట్​మెంట్​ ఆర్డర్లు..అకౌంట్లలో జీతాలు!

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.2.40 కోట్లు వసూలు చేసి నకిలీ అపాయింట్​మెంట్​లెటర్లతో బురిడీ కొట్టించిన ఓ మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్ తనకు ఉన్నతాధికారులతో పరిచయం ఉందని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తండాలో కొందరికి మాయమాటలు చెప్పాడు. దీంతో పోలంపల్లికి చెందిన గుగులోతు రమేశ్​టీచర్ ఉద్యోగం కోసం విడతల వారీగా రూ.63 లక్షలు ప్రేమ్​తండ్రి ఖాతాకు ట్రాన్స్​ఫర్​చేశాడు. రమేశ్​ను నమ్మించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం ప్రభుత్వ స్కూల్​లో ఉద్యోగం వచ్చినట్టుగా నకిలీ అపాయింట్​మెంట్​ఆర్డర్ సృష్టించి, సర్వీస్ పుస్తకాన్ని కూడా అందజేశాడు. ఫైనల్ ఆర్డర్ వచ్చేంతవరకు స్కూలుకు వెళ్లొద్దని, ఒక నెల జీతాన్ని కూడా అకౌంట్​లో వేశాడు.
ఒకే ఇంట్లో మోసపోయిన ముగ్గురు…
పోలంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు కూడా ప్రేమ్​చేతిలో మోసపోయారు. భానోత్ తులసీరామ్, ఇతడి ఇద్దరి కూతుళ్లు కలిసి రూ.1.20 కోట్లు ముట్టజెప్పారు. తులసీరాంకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఆర్డర్ పోస్ట్ లో పంపాడు. ట్రిపుల్​ఐటీ చేసిన ఇతడి కూతురు భూమికకు పాల్వంచ కేటీపీఎస్ లో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఆర్డర్ ఇచ్చాడు. తులసీరాం మరో కూతురు శ్రీలేఖకు ఖమ్మంలో రికార్డ్ అసిస్టెంట్ జాబ్​ఇప్పిస్తానని చీట్​చేశాడు. పోలపల్లి గ్రామానికే చెందిన మరో నిరుద్యోగ యువతి అజ్మీరా దివ్య వద్ద రూ.30 లక్షలు తీసుకొని నకిలీ ఆర్డర్ పంపాడు. పేరుపల్లికి చెందిన రఘు నుంచి రూ.30 లక్షలు తీసుకొని మెగా కంపెనీలో సబ్ కాంట్రాక్ట్​ఇప్పిస్తానని మోసం చేశాడు. ఇలా రెండేండ్లుగా కొందరి అకౌంట్లలో జీతాలు కూడా వేస్తున్నాడు.

ఇలా బయటపడింది…
పలువురికి జాబ్​లు ఇప్పిస్తానని నమ్మించిన ప్రేమ్​కుమార్ ​డబ్బులను తన తండ్రి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ ​చేయించుకునేవాడు. తర్వాత తన మరదలి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​చేసేవాడు. తండ్రి అకౌంట్​నుంచి ఆఫీసర్​అకౌంట్​కు పోతుందని చెప్పిన ప్రేమ్..​రోజులు గడుస్తున్నా ఉద్యోగం మాట ఎత్తకపోవడంతో డబ్బులిచ్చిన ఒకరికి అనుమానం వచ్చింది. ప్రేమ్​తండ్రి అకౌంట్​చెక్​చేయించగా డబ్బులు ఆఫీసర్​కు కాకుండా అతడి మరదలికి వెళ్తున్నట్టు తేలింది. దీంతో ఆమెను నిలదీయగా తనకు తన బావ అప్పు ఇచ్చేది ఉందని, ఆ డబ్బులే పంపించాడని చెప్పింది. దీంతో తమకు పంపిన ఆర్డర్స్​ను చెక్​చేయించగా నకిలీవని తేలింది. దీంతో బాధితులంతా కలిసి కులంలో పంచాయితీ పెట్టించారు. కానీ, డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రేమ్​ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఒకరైన బానోతు తులసీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుగులోత్ ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి, కారేపల్లి ఎస్ఐ రాజారాం విచారణ నిర్వహిస్తున్నారు.

AP DSC 2024-ఆ అభ్యర్థుల ఫీజును వాపసు చేస్తాం: AP విద్యాశాఖ

SGT posts లకు దరఖాస్తు చేసుకున్న BED అభ్యర్థుల దరఖాస్తు రుసుమును వాపసు చేయనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ప్రకటించారు.

AP TET 2024 పరీక్ష | అమరావతి: Secondary Grade Teacher ((SGT ) పోస్టులకు BED అభ్యర్థులు అనర్హులంటూ AP High Court ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. BED SGT ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును వాపసు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని అభ్యర్థుల Aadhaar number తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు.
AP TET కు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి hall tickets website లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 120 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 76.5 శాతం మంది SGT అభ్యర్థులకు నచ్చిన తొలి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలపై ఏవైనా సందేహాలుంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం టెట్ , DSC helpdesk లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పనిచేస్తాయి. Help desk phone numbers 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997

ట్రూకాలర్ అవసరం లేకుండా.. ఫోన్ చేసేది ఎవరో ఇలా కూడా తెలుసుకోవచ్చు !

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా Truecaller యాప్ ఉండాలి. వారికి తెలియని నంబర్ నుండి కాల్ లేదా సందేశం వచ్చినట్లయితే, వారు వెంటనే ట్రూకాలర్‌ను తనిఖీ చేస్తారు. అంతే కాకుండా కొన్ని స్పామ్ కాల్‌ల గురించి మనం వాటిని లిఫ్ట్ చేయడానికి ముందే తెలుసుకుంటాం. దీంతో ఫేక్ కాల్స్ నుంచి యూజర్లకు కొంత ఉపశమనం లభించినట్లయింది. అయితే ఈ ట్రూ కాలర్ లేకుండా ఎవరు కాల్ చేస్తున్నారో స్పామ్ కాల్స్, మొబైల్ యూజర్లకు తెలియకుండా ఉండేందుకు TRAI టెలికాం ఆపరేటర్లకు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

వినియోగదారుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న TRAI త్వరలో టెలికాం కంపెనీలకు సప్లిమెంటరీ సర్వీస్‌గా కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్‌ను అందించాలని నిర్ణయించింది. దీని కారణంగా, Truecaller వంటి యాప్‌లతో సంబంధం లేకుండా కాలర్ మొబైల్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. మొబైల్‌లో సేవ్ చేసిన పేర్లతో పాటు, మన ఫోన్‌లో సేవ్ చేయని నంబర్‌ల నుండి ఎవరు కాల్స్ చేశారో మనకు తెలుస్తుంది. ఇండియాలో డిఫాల్ట్‌గా ఈ కాలర్ ఐడీ సేవలు అందుబాటులో ఉంటాయని సమాచారం.

Good News : పొదుపు సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మిషన్ శక్తి స్కీం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 27)న ప్రకటించారు. మిషన్ శక్తి బజార్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో మిషన్ శక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ వడ్డీ లేని రుణాలు మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్ సులభతరం చేయడమే మిషన్ బజార్ లక్ష్యమని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో హస్తకళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, హెల్త్ కేర్ ప్రాడక్ట్, సాంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు ఉత్పత్తులతో సహా 1,000 రకాల ప్రాడక్ట్స్ మిషన్ శక్తి బజార్ అందిస్తుంది.

వడ్డీ వాపస్ కోసం రూ.145 కోట్లు విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో 5,000 మిషన్ శక్తి బజార్‌లను ఏర్పాటు చేయాలని, 70 లక్షల మంది మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులకు రూ. 730 కోట్లు, యూనిఫాంలు మరియు బ్లేజర్‌ల కొనుగోలు కోసం మిషన్ శక్తికి రూ. 1.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. సంఘాలు ఈ ఏడాది రూ. 15,000 కోట్ల రుణాలు పొందాయని, మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నవీన్ పట్నాయక్ అన్నారు. మహిళల ఆర్థిక శక్తిని, నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.

Health

సినిమా