Sneezing Benefits : తుమ్ములు ఆపుకోకండి.. తుమ్మితే ఎంత మంచిదో

Sneezing Benefits In Telugu : తుమ్ములను ఆపుకొనేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనివలన చాలా సమస్యలు వస్తాయి. నిజానికి తుమ్మడం అనేది మంచిది.
మీరు రోజుకు ఎన్నిసార్లు తుమ్ముతారు. దాని గురించి లెక్కించకపోవచ్చు. ఇది మీకు అంత ముఖ్యమైనది కాదు.. కానీ అసలు విషయం ఏంటంటే.. తుమ్ములు మీ ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తుందని మీకు తెలుసా? తుమ్ములు ఆరోగ్యానికి చాలా మంచిది. ముక్కులో దుమ్ము లేదా చికాకు ఉన్నప్పుడు మాత్రమే తుమ్ములు వస్తాయని మనం భావిస్తాం. ఎవరైనా పదే పదే తుమ్మితే జలుబు వచ్చిందని అనుకుంటాం. అయితే తుమ్ముల వెనుక మీ ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అవును ఇది నిజం.
చాలా మంది జలుబు, ఫ్లూ ఉన్నప్పుడు ఎక్కువగా తుమ్ముతారు. అంటే వారికి చికిత్స అవసరం. తుమ్ము అనేది నిజానికి ముక్కు, మెదడు, మీ శరీరంలోని వివిధ కండరాల మధ్య చాలా సంక్లిష్టమైన పరస్పర చర్య. తుమ్ము అనేది రిఫ్లెక్స్ (అసంకల్పిత) చర్య (మీ నియంత్రణలో లేదు). ముక్కు కొన నుండి ముక్కు వెనుక భాగంలో ఏదో ఒక కారణంగా ప్రేరేపించబడుతుంది. ఇది నాసికా భాగాల లైనింగ్‌ను చికాకుపెడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

తుమ్మితే ఆరోగ్యానికి మంచిది
ఆసక్తికరంగా తుమ్ములకు గాలిలో ఉండే కణాలు మాత్రమే కారణం కాదు. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతికి గురైనప్పుడు తుమ్ముతారు. ఈ విషయాన్ని ఫోటో స్నీజ్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. తుమ్ములు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముక్కు నుండి శరీరంలోకి ప్రవేశించే దుమ్ము, వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ముందు తుమ్మడం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇది అనేక అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది.

తుమ్మును ఆపుకోకూడదు
కొంతమంది తుమ్మును ఆపుతారు. ఇలా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. మనం తుమ్మినప్పుడు, మన గుండె కొన్ని మిల్లీసెకన్ల పాటు పనిచేయడం ఆగిపోతుంది. ఇది మీరు గ్రహించని, మీకు తెలియని విషయం. అందుచేత తుమ్ములు వచ్చేటపుడు ఆపేయకండి. మీరు ఎంత వేగంగా తుమ్మితే అంత మంచిది.
తుమ్మును ఆపితే ఇలా జరిగింది
గతేడాది ఏప్రిల్‌లో ఇలాంటి వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తుమ్మును అడ్డుకున్నందున అతని గొంతులో చిన్న రంధ్రం ఏర్పడింది. యూఎస్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. అతడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తుమ్మును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అది అతని గొంతులో చిన్న రంధ్రం చేసింది. తుమ్ము వచ్చినప్పుడు నోటిని, ముక్కును గట్టిగా మూసుకున్నాడు. వెంటనే గొంతు నొప్పి అనిపించింది. భయాందోళనకు గురైన వైద్యుడి వద్దకు వెళ్లాడు. గొంతులో చిన్న రంధ్రం ఉన్నట్టుగా వైద్యుడు చెప్పాడు. ఆ వ్యక్తి తుమ్మును ఆపుకోవడంతో గొంతుపై ఒత్తిడి 40 శాతం పెరిగింది. దీంతో అతని గొంతులో రంధ్రం ఏర్పడింది.

అందుకే తుమ్మును ఆపుకోవడం కూడా మంచిది కాదు. తుమ్మితేనే ఆరోగ్యానికి మంచిది. తుమ్మడం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. తుమ్మును అస్సలు ఆపుకోకూడదు. తుమ్మును అస్సలు ఆపుకొనే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గుండె సంబంధిత ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *