నకిలీ అపాయింట్​మెంట్​ ఆర్డర్లు..అకౌంట్లలో జీతాలు!

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.2.40 కోట్లు వసూలు చేసి నకిలీ అపాయింట్​మెంట్​లెటర్లతో బురిడీ కొట్టించిన ఓ మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్ తనకు ఉన్నతాధికారులతో పరిచయం ఉందని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తండాలో కొందరికి మాయమాటలు చెప్పాడు. దీంతో పోలంపల్లికి చెందిన గుగులోతు రమేశ్​టీచర్ ఉద్యోగం కోసం విడతల వారీగా రూ.63 లక్షలు ప్రేమ్​తండ్రి ఖాతాకు ట్రాన్స్​ఫర్​చేశాడు. రమేశ్​ను నమ్మించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం ప్రభుత్వ స్కూల్​లో ఉద్యోగం వచ్చినట్టుగా నకిలీ అపాయింట్​మెంట్​ఆర్డర్ సృష్టించి, సర్వీస్ పుస్తకాన్ని కూడా అందజేశాడు. ఫైనల్ ఆర్డర్ వచ్చేంతవరకు స్కూలుకు వెళ్లొద్దని, ఒక నెల జీతాన్ని కూడా అకౌంట్​లో వేశాడు.
ఒకే ఇంట్లో మోసపోయిన ముగ్గురు…
పోలంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు కూడా ప్రేమ్​చేతిలో మోసపోయారు. భానోత్ తులసీరామ్, ఇతడి ఇద్దరి కూతుళ్లు కలిసి రూ.1.20 కోట్లు ముట్టజెప్పారు. తులసీరాంకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఆర్డర్ పోస్ట్ లో పంపాడు. ట్రిపుల్​ఐటీ చేసిన ఇతడి కూతురు భూమికకు పాల్వంచ కేటీపీఎస్ లో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఆర్డర్ ఇచ్చాడు. తులసీరాం మరో కూతురు శ్రీలేఖకు ఖమ్మంలో రికార్డ్ అసిస్టెంట్ జాబ్​ఇప్పిస్తానని చీట్​చేశాడు. పోలపల్లి గ్రామానికే చెందిన మరో నిరుద్యోగ యువతి అజ్మీరా దివ్య వద్ద రూ.30 లక్షలు తీసుకొని నకిలీ ఆర్డర్ పంపాడు. పేరుపల్లికి చెందిన రఘు నుంచి రూ.30 లక్షలు తీసుకొని మెగా కంపెనీలో సబ్ కాంట్రాక్ట్​ఇప్పిస్తానని మోసం చేశాడు. ఇలా రెండేండ్లుగా కొందరి అకౌంట్లలో జీతాలు కూడా వేస్తున్నాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇలా బయటపడింది…
పలువురికి జాబ్​లు ఇప్పిస్తానని నమ్మించిన ప్రేమ్​కుమార్ ​డబ్బులను తన తండ్రి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ ​చేయించుకునేవాడు. తర్వాత తన మరదలి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​చేసేవాడు. తండ్రి అకౌంట్​నుంచి ఆఫీసర్​అకౌంట్​కు పోతుందని చెప్పిన ప్రేమ్..​రోజులు గడుస్తున్నా ఉద్యోగం మాట ఎత్తకపోవడంతో డబ్బులిచ్చిన ఒకరికి అనుమానం వచ్చింది. ప్రేమ్​తండ్రి అకౌంట్​చెక్​చేయించగా డబ్బులు ఆఫీసర్​కు కాకుండా అతడి మరదలికి వెళ్తున్నట్టు తేలింది. దీంతో ఆమెను నిలదీయగా తనకు తన బావ అప్పు ఇచ్చేది ఉందని, ఆ డబ్బులే పంపించాడని చెప్పింది. దీంతో తమకు పంపిన ఆర్డర్స్​ను చెక్​చేయించగా నకిలీవని తేలింది. దీంతో బాధితులంతా కలిసి కులంలో పంచాయితీ పెట్టించారు. కానీ, డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రేమ్​ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఒకరైన బానోతు తులసీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుగులోత్ ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి, కారేపల్లి ఎస్ఐ రాజారాం విచారణ నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *