BSNL Best Offer: ఈ ప్లాన్ వేసుకుంటే మార్చి 2026 వరకు రీఛార్జ్ అక్కర్లేదు!

కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను చాలా తక్కువ బడ్జెట్ లో అమలు చేస్తోంది. ఈ ప్లాన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.


జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు తమ టెలికమ్యూనికేషన్ సేవలను పోటాపోటీగా అందిస్తున్నాయి. అయితే టారిఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 5G సేవలను అందిస్తున్నా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచడంతో ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లోకి కస్టమర్లు మారుతున్నారు. అందుకే బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ అందించే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ ఏంటో తెలుసా? బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 12 నెలలు. ఈ ప్లాన్ ద్వారా అన్ని లోకల్, STD కాల్స్ ను సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ గా ఫ్రీగా చేయొచ్చు.

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు మొత్తం 600 GB డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ డేటా లిమిట్ లేదు. అందువల్ల మీరు ఈ డేటాను ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. లేదా ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు. అదనంగా ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయకుండా ఉండాలనుకునే వారికి రూ.1,999 ప్లాన్ చాలా బెస్ట్ ప్లాన్.

ఇన్ని ప్రయోజనాలున్న రీఛార్జ్ ప్లాన్ జియో లో కూడా ఉంది. కాని దీని ధర బీఎస్ఎన్ఎల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ.

జియో రూ. 3,599 ధరతో 365 రోజుల చెల్లుబాటు ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది. రోజువారీ పరిమితి 2.5 GB. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అదనంగా మీకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్‌తో పోలిస్తే జియో ప్లాన్ చాలా ఖరీదైనది. ఇది అదనంగా 300 GB డేటాను అందించినప్పటికీ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఈ ప్లాన్ ఏకైక ప్రయోజనం 5G అపరిమిత ఇంటర్నెట్ సేవను అందిస్తుంది. కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకుంటే డౌట్ లేకుండా బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్‌ను తీసుకోవడం బెస్ట్.