కొరటాల డైరెక్షన్లో బన్నీ మూవీ పిక్స్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ మూవీ థియేటర్‌లలో ఇంకా సందడి చేస్తూనే ఉంది. రూ.2000 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌తో ఇంకా సినిమా రన్ చేస్తున్నారు.


సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల మరో 20 నిమిషాల్లో సన్నివేశాలు యాడ్ చేసి డిటేల్‌ చేశారు. దీనికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ వస్తుందని. చాలా డౌట్లకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఓటీటీ వర్షన్‌లోనూ మరో 10 నిమిషాల ఫీడ్‌ను యాడ్ చేస్తున్నట్లు టాక్. ఇక పుష్ప 2 సందడి అయిపోతున్న క్రమంలో.. బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనే అంశంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. బన్నీ సినిమా నటించనున్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతుందని.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు రాని కథతో ఈ సినిమా ఉండనుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవ్వనుందని.. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని.. బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే సినిమాను మొదలు పెట్టాలని ఆలోచనలో బన్నీ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగానే.. బన్నీ సినిమాల జాబితాలో మరింత మంది దర్శకులు చేరారు. నెల్సన్ దిలీప్‌, అట్లీ, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిన్నీ కలిశారని.. వీళ్లిద్దరు కాంబోలో కూడా సినిమా ఉండబోతుందంటూ వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా మరో డైరెక్టర్ కొరటాల శివతో.. బన్నీ సినిమాకు సిద్ధమయ్యాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా ప్రకటించినా ఏవో కారణాలతో ఆ సినిమా సెట్స్‌పైకి రాలేదు. అదే కథతో దేవర తెరకెక్కించారని చాలా వార్తలు వైరల్ అయిన కొరటాలా దానిని ఖండించారు. అయితే ఇటీవల కొరటాల మరో స్క్రిప్ట్‌ని అల్లు అర్జున్ కోసమే రాసుకొని నరేట్ చేశాడట. యూపీ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రాబోతుందని సమాచారం. కలెక్షన్‌లతో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. మూవీ నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రభావంతోనే యూపీ బ్యాక్ డ్రాప్‌లో బన్నీ కోసం కొరటాల కథని రాసుకున్నారని.. ఆ కథ బన్నీకి కూడా నచ్చిందని.. పూర్తి చేసి వివరించమని కోరినట్లు తెలుస్తుంది. ఈ కాంబో నిజంగానే ఫిక్స్ అయితే మాత్రం.. ఆడియన్స్‌కు పండుగ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం కొరటాల దేవర 2 సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఈ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. సినిమా పూర్తి అయిన వెంటనే.. బన్నీ బౌండరీ స్క్రిప్ట్‌ పూర్తి చేసి సినిమా తెరకెక్కిస్తారని సమాచారం.