Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేయండి. నెలకు రూ.70వేలు గ్యారంటీ

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా?ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియడం లేదా?అయితే మేము మీకో చక్కటి వ్యాపార ప్లాన్ గురించి వివరిస్తాం.
ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. ఇంట్లో కూర్చుండే ఈ వ్యాపారాన్ని చేయోచ్చు. ఖాళీ సమయంలో చేస్తే చాలు. ఇంటి పనులు అన్ని పూర్తయ్యాక ఈ పని చేస్తే నెలకు 70వేలు మీ అకౌంట్లో ఉంటాయ్. మరి ఆ బిజినెస్ ఏంటో ఓసారి చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

టీ షర్టుపై ప్రింటింగ్ బిజినెస్. నేడు మార్కెట్లో ఈ వ్యాపారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో రెడీ ప్రింటెడ్ టీ షర్టులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఎన్నో రకాల టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్స్, రెస్టారెంట్లు, షోరూమ్ లు మొదలైన వాటి సిబ్బంది తమ స్వంత ప్రింటెడ్ టీ షర్టులను ధరించడం ట్రెండ్ గా మారింది. అంతేకాదు ట్రెండింగ్ మీమ్స్ లో తయారు చేసిన టీషర్టులను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని మీరు వ్యాపారంగా మలుచుకున్నట్లయితే మీరు మంచి లాభం పొందవచ్చు.
ఈ టీషర్టుపై ప్రింటింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలంటే తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఇంట్లో నుంచే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి కేవలం 60 నుంచి 70వేలు పెట్టుబడికి అవసరం ఉంటుది. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 40 నుంచి 70వేలు సంపాదించవచ్చు. టీషర్టులు ప్రింటర్, హీట్ ప్రెస్, కంప్యూటర్, పేపర్, టీషర్టు ప్రింటింగ్ కోసం ముడి పదార్థాల రూపంలో అవసరమైన చౌకైన యంత్రం మాన్యువల్ అవసరం. దీని నుంచి టీ షర్టును ఒక నిమిషంలో తయారు చేయవచ్చు.
దీని కోసం మీరు టీషర్టు ప్రింటింగ్ మెషిన్ను కొనుగోలు చేయలి. దీని ధర రూ. 50వేలు ఉంటుంది. మరోవైపు ప్రింటింగ్ కోసం తీసుకున్న సాధారణ క్వాలిటి కలిగిన వైట్ టీ షర్ట్ ధర సుమారు రూ. 120 వరకు ఉంటుంది. దాని ప్రింటింగ్ ధర రూ. 1 నుంచి రూ. 10 వరకు ఉంటుంది. క్వాలిటీ గురించి ఆలోచిస్తే 20 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనీసం 200నుంచి 250 రూపాయలకు అమ్మవచ్చు. మీరు డైరెక్టుగా విక్రయిస్తే కనీసం 50శాతం లాభం పొందుతారు.

Related News