ప్రతి నెలా కేవలం రూ. 1000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు రూ. 57 లక్షలు సంపాదించవచ్చు

కాంపౌండింగ్ ఎఫెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి అధిక లాభాలను అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పథకం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కేవలం మీరు వెయ్యి రూపాయలు సిప్ చేయడం వలన కాసుల పంట పండించుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక భరోసా కోసం ఏదో ఒక స్కీమ్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్రం అలాగే పెట్టుబడులు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం వలన దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకోవచ్చు. ఏ స్కీంలో పెట్టుబడి పెట్టాలో అర్థం కాని సామాన్య పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న స్కీమ్స్ సురక్షితమైన మరియు లాభదాయకమైన మార్గంగా చెప్పవచ్చు. వీటిలో ఉండే కొన్ని ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్న సమయంలో కూడా తట్టుకొని నిలకడగా రాబడిని ఇచ్చి అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇటువంటి అద్భుతాన్ని ప్రస్తుతం మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సెప్షన్ ఆపర్చునిటీస్ ఫండ్ విషయంలో కూడా చూడవచ్చు.


ఇందులో మీరు కేవలం ప్రతినెల రూ.1000 రూపాయలు సిప్ ఇన్వెస్ట్ చేయడం వలన ఏకంగా రూ.57 లక్షలను అందుకోవచ్చు. వినియోగదారుల ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి ఈ ఫండ్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. కనీసం ఐదు ఏళ్లకు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు షాట్ అండ్ లాంగ్ టర్మ్ లో మార్కెట్ అస్థిరతను తట్టుకోగలము అని సిద్ధంగా ఉన్నవాళ్లు ఈ ఫండ్స్లో పెట్టుబడి చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కన్సెప్షన్ ఆపర్చునిటీస్ స్కీమ్ దేశంలో ఉన్న ప్రముఖ ఆధారిత కంపెనీల పనితీరును పరిశీలించి నిఫ్టీ ఇండియా కన్సెప్షన్ టిఆర్ఐ బెంచ్ మార్కును అనుసరిస్తుంది అని తెలుస్తుంది. వినియోగదారుల వస్తువులు మరియు సేవలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంగా మూలధన వృద్ధిని సాధించడం అనేది ఈ ఫండ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఫండ్ మే 31, 2025 నాటికి నికర ఆస్తుల విలువ ఏయూఎం రూ.3,028 కోట్లకు చేరుకుందని సమాచారం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.