కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. HDFC బ్యాంక్ 2 కఠినమైన నిర్ణయాలు తీసుకుంది…

హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాలు ఆ బ్యాంకు కస్టమర్లపై చాలా ప్రభావం చూపనున్నాయి. ఈ బ్యాంకు తమ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు పొదుపు ఖాతాలపై కూడా భారీగా వడ్డీ రేటులను తగ్గించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేపో రేట్లను తగ్గించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కస్టమర్లకు తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక చేదు వార్త తెలిపింది. మనదేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒకటి. ఈ బ్యాంకులో ఎన్నో లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తాజాగా ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే సేవింగ్స్ ఖాతాలపై కూడా భారీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు కూడా తమ వినియోగదారులకు వడ్డీ రేటులను తగ్గించి భారీ షాక్ ఇచ్చింది.


ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు డబల్ షాక్ తగిలినట్లు అయింది. ఇటీవల రేపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. అంటే ఆర్బిఐ రేపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక బ్యాంకులు కూడా తమ బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయాలు ఎఫ్డి పెట్టుబడిదారులతో పాటు ఆ బ్యాంకులో ఉన్న రుణ గ్రహీతలను కూడా బాగా ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పొచ్చు. జూన్ 10, 2025 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని సమాచారం.

ఇక లోన్లు తీసుకుంటున్న వారికి మాత్రం ఈ బ్యాంకులు కొంచెం ఊరట కలిగించాయి. 10 బేసిస్ పాయింట్లు రుణ రేట్లు తగ్గించి రుణం తీసుకునే వారికి శుభవార్త తెలిపాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ బ్యాంకులో ఉన్న ఎఫ్డి కస్టమర్లకు కనీసం 2.75 శాతం నుంచి గరిష్టంగా 6.60 శాతానికి వడ్డీ రేట్లను అందిస్తుంది. గతంలో ఎఫ్ డి లపై 3 శాతం నుంచి 6.85% వరకు అందించేది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకులో సీనియర్ సిటిజన్స్ కి మాత్రం కనీసం 3.25% నుంచి 7.10% వరకు వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. గతంలో సీనియర్ సిటిజన్స్ కి 3.5% నుంచి 7.35 శాతం వరకు వడ్డీ రేట్లు ఉండేవి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.