ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) పదో తరగతి సప్లిమెంటరీ(AP SSC Supplementary Results) ఫలితాలను విడుదల చేసింది. ఈమేరకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లేదా వాట్సాప్ మనమిత్ర నెంబర్ 95523 00009 ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తంగా 1,23,477 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 73.55 శాతం, బాలికలు 80.10శాతం ఉత్తీర్ణత నమోదైంది.