అమెజాన్‌లో భారీ ఉద్యోగాలు.. 5 రోజుల పని.. రూ.30 వేల జీతం

ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ రొబోటిక్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌లో అసోసియేట్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేసింది.


ఇందులో ఎంపికైన అభ్యర్థులు గో- ఏఐ ఆపరేషన్స్ టీమ్‌లోని ML డేటా ఆపరేషన్స్‌ అసోసియేట్‌గా పని చేస్తారు. పనిలో భాగంగా 15 నుంచి 20 సెకన్ల నిడివి ఉండే షార్ట్ వీడియోలను చూసి రివ్యూ చేసి జడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వందలకు పైగా వీడియోలను వేగంగా, పర్ఫెక్ట్ గా రివ్యూ చేసి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్ట్‌లకు సంబంధించిన లోపాలు లేకుండా, ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఇక ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. కంపెనీ అవసరాల మేరకు ఏ షిఫ్టులోనైనా పని చేసేవిధంగా ఉండాలి. కొన్నిసార్లు వీకెండ్స్, హాలిడేస్‌లలో కూడా వర్క్ చేసే అవసరం రావొచ్చు. ఏదైనా నాన్ టెక్నికల్ రోల్‌లో మినిమమ్ 6 నెలల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ML డేటా ఆపరేషన్స్‌లో అసోసియేట్‌గా రోజుకు 9 గంటల చొప్పున వారంలో 5 రోజుల పని ఉంటుంది.

ఇంటర్వ్యూ ఆధారంగా జీతం ఉంటుంది. ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ.3.6 లక్షల మధ్య వేతనం ఉంటుంది. పీఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అమెజాన్ అధికారిక వెబ్ సైట్ లేదా ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.