మన పూర్వికులు చేపల పులుసును ఇలా చేసుకునేవారట,అందుకే కరోనాను కూడా తట్టుకున్నారు, ఎలా అంటే?

మన పూర్వికులు గతంలో చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు. వారు వండుకునే విధానం కూడా చాలా సహజసిద్ధంగా ఉండేది. ఎంచుకునే పదార్థాలు కూడా ఎలాంటి రసాయనాలు లేకుండా పండించినవి ఉండేవి.


గతంలో చేపలు తినాలంటే చెరువులో ప్రత్యేకంగా పట్టుకొని వచ్చి తినేవారు. ఆ చేపలు కూడా సహజసిద్ధంగా బతికినవే ఉండేవి. అందుకే వాటిని తినడం వల్ల వారికి ఎన్నో రేట్ల శక్తి వచ్చేది. కరోనా లాంటి మరమ్మత్తులను సైతం తట్టుకొని నిలబడ్డారంటే వారు అలాంటి ఆరోగ్యకరమైన ఆహరం తినడమే కారణం.

అయితే పూర్వికులు ప్రత్యేకంగా చేసుకునే ఆహార పదార్థాలలో చేపల పులుసు కూడా ఒకటి. ఎలాంటి మసాలాలు లేకుండా దీనిని తయారుచేసుకునేవారు. అసలు పూర్వీకుల పద్దతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పూర్వీకుల చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

స్థానికంగా పట్టుకున్న చేపలు

ఆవ నూనె

పసుపు

కారం

ఉల్లిపాయలు

టమోటా

చింతపండు

కరివేపాకులు

తయారీ విధానం

ముందుగా సహజంగా పెరిగిన చేపలను చెరువుల నుంచి పట్టుకొచ్చేవారు. వాటిని శుభ్రంగా కట్ చేసుకొని ఎలాంటి మురికి లేకుండా బాగా కడుక్కునే వారు. ఆ తరువాత ఒక సైజులో ముక్కలను కోసుకునేవారు.

ఆ తరువాత ఒక బండపైన.. కొన్ని పండు మిర్చి, ఒక పసుపు కొమ్ము, ఉల్లిపాయ, టొమాటో, కరివేపాకులు వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా మెత్తగా రుబ్బుకునేవారు. అలా రుబ్బుకున్న మసాలాను ఒక పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకునేవారు.

ఆ తరువాత కట్టెల పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని.. అందులో ఆవ నూనె వేసుకునే వారు. ఆ తరువాత అందులో చేప ముక్కలను వేసుకొని వేయించుకునేవారు. అనంతరం దానిపై మసాలా పేస్ట్ వేసుకునేవారు. అనంతరం పులుపు కోసం చింతపండు జ్యూస్ వేసుకొని, చేపల ఉడకడానికి తగిన నీళ్లు పోసుకొని ఉడికించుకునే వారు. ఆ తరువాత గరిట లేకుండానే పులుసును కలుపుతూ ఉండేవారు. చివరికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పులుసును దించుకునేవారు.

నిజం చెప్పాలంటే ఇప్పటికీ మనలో చాలా మంది నానమ్మలు, అమ్మమ్మలు ఈ మాదిరిగానే చేపలు పులుసు చేస్తున్నారు. చాలా మందికి ఇలాంటి చేపల పులుసు తిన్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. ఒకవేళ ఉంటే.. ఇప్పుడే మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి.