ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు… ఆ మూడు డిమాండ్లపై సస్పెన్స్

ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఐక్యవేదికతో ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాధించిన పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిచినప్పటికీ..కొన్ని అంశాల్లో మాత్రం ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ముందు 15 డిమాండ్లను ఉంచినట్టు తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పీఆర్‌సీ, పదోన్నతులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్లు, సహా మరి కొన్ని అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


అయితే ఉపాధ్యాయ సంఘాలు పెట్టిన చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ.. ప్రధాన డిమాండ్లైన ఫౌండేషన్ స్కూల్స్ రద్దు, బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు, ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో ఉపాధ్యాయ సంఘాల పట్టుపట్టాయి. హై స్కూల్ లలో 45 మంది విద్యార్థులు దాటిన తరగతులకు రెండో సెక్షన్ పెట్టే అశంతో పాటు సమాంతర మాధ్యమంగా తెలుగు మీడియంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రకటించాల్సిందే అని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. ఈ మూడు అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తమకు నేరుగా మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.