సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా


ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పనుల దగ్గర నుంచి ప్రైవేట్‌గా చేసే ఏ పనికైనా కూడా మన సంతకం ఏదొక చోట పెట్టక తప్పదు. కొందరు తమ పేరునే సంతకంగా పెడితే.. మరికొందరు షార్ట్ అండ్ స్వీట్‌గా పేరులో వచ్చే మొదటి లెటర్స్‌ను సంతకంగా పెడతారు. ఇంకొందరైతే అందరిని ఎట్రాక్ట్ చేసే విధంగా కలిపిరాతతో తమ సంతకాన్ని పెడుతుంటారు. ఇక కొందరి సంతకాన్ని మనం గమనించినట్లయితే.. వారికి తమ సంతకం కింద ఎప్పుడూ రెండు చుక్కలు పెడుతుండటం అలవాటు. అయితే మీకో విషయం తెలుసా.? మీరు పెట్టే సంతకం.. మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుందట. మరి అదేంటో చూసేద్దామా..

సంతకం కింద రెండు చుక్కలు పెట్టేవారు చాలా నమ్మకమైన వ్యక్తులని.. తమ ఉనికిని ఎప్పుడూ వ్యక్తం చేస్తారట. వారి ఎమోషన్స్ వ్యక్తీకరించడంలో.. అలాగే ఇతరుల భావోద్వేగాలను అర్ధం చేసుకోవడంలోనూ క్లారిటీతో ఉంటారట. వీరు చాలా ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా.. అందరితోనూ సులువుగా కలిసిపోతారట.

ఈగో అనేది లేకుండా.. ఎవరినైనా కూడా ఇట్టే మెచ్చుకుంటారు. ఈ వ్యక్తులు అటు వృత్తి, ఇటు వ్యక్తిగత విషయాల్లో నిజాయితీగా ఉండటమే కాకుండా.. ఎప్పుడూ నిజాలు మాట్లాడతారు. ఈ వ్యక్తిత్వంతోనే ఇతరులకు వీరి పట్ల గౌరవం, నమ్మకం బాగా పెరుగుతాయి. అటు పని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని వీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటారు. అంతేకాదు ఈ వ్యక్తులకు క్రియేటివిటీ కూడా ఎక్కువే.