కొందరు ఎండు చేపలను తినడం అస్సలు ఇష్టపడరు. ఎండు చేపలను చూస్తేనే చిరాకు పడతారు. బాగా వాసన వస్తాయని, వాటిని తినాలంటేనే అసహ్యంగా ఫీలవుతారు. అయితే పచ్చి చేపల కంటే ఎండు చేపలలోనే, బోలెడన్ని పోషకాలు ఉంటాయని వాటిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండు చేపలలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవి ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఎండు చేపలలో ఫుల్ పోషకాలు ఎండు చేపలలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎండు చేపలలో ఉన్న పోషకాలు తెలిసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా వాటిని తప్పనిసరిగా తింటారని చెబుతున్నారు. ఇక ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి చెబుతూ, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని చెపుతున్నారు.
ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మన ఎముకల బలాన్ని పెంపొందించడానికి, కండరాల నిర్మాణానికి ఎండుచేపలలో ఉండే ప్రోటీన్లు సహకరిస్తాయని చెబుతున్నారు. ఎండు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు. అంతేకాదు విటమిన్ బి12చేపలలో ఎక్కువగా ఉండటం వల్ల అవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అని, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన నాడీవ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఎండు చేపలు తింటే ఇమ్యూనిటీ ఎండు చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని బలపరుస్తుంది అని చెబుతున్నారు. ఎండు చేపలలో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల మన దంతాలు బలోపేతం అవుతాయని, మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు, ఎండు చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని, మహిళలకు వచ్చే మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తాయని చెబుతున్నారు.
కీళ్ళనొప్పులు మాయం పాలిచ్చే తల్లులు ఎండు చేపలను తినడం వల్ల వారిలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి12 కారణంగా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఎండు చేపలలో లభించే పోషకాలు క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరమవుతుందని చెబుతున్నారు. ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
వీళ్ళు ఎండు చేపలు తినకుంటేనే మంచిది అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలను తినకుండా ఉంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. మూత్రపిండాల వ్యాధులు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు, వైద్యుని సంప్రదించిన తర్వాత వైద్యుని సూచన మేరకు మాత్రమే ఎండు చేపలను తినవచ్చని చెబుతున్నారు.