మళ్లీ పాక్ తోక జాడిస్తే.. జరిగేది అదే.. ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన మోడీ

పాకిస్తాన్‌(Pakistan)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.


భారత బలగాలకు నా సెల్యూట్‌. ఆపరేషన్‌ సింధూర్‌లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారు. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితం. మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశాం. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలిచింది. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్‌లు హతమార్చాయి. గ్లోబల్‌ టెర్రరిజానికి బహావల్పూర్‌ ఒక యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీని కుప్పకూల్చాం. భారత్ చర్యలతో పాక్ నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. దాదాపు 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టాం.

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది. ఒకే ఒక్కదాడితో పాకిస్తాన్‌ బెంబేలెత్తిపోయింది.. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాక్‌ మనపై ఎదురుదాడి చేసింది.. స్కూల్స్‌, ఆసుప్రతులు, గురుద్వార్‌లను టార్గెట్‌ చేసింది.. పాక్‌ ఏవిధంగా వ్యవహరించిందో ప్రపంచమంతా చూసింది. పాక్‌ మిస్సైల్స్‌ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి.. పాక్‌ మిస్సైల్స్‌ భారత్‌లోకి రాలేకపోయాయి.. కానీ, మనం పాక్‌ గుండెల్లో బాంబులు పేల్చాం.. పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లకు తీవ్రంగా నష్టం చేశాం.. మన దాడితో పాకిస్తాన్‌ ఆత్మరక్షణలో పడింది.. సాయం కోసం ప్రపంచదేశాలను ఆశ్రయించింది. దేశమే ప్రథమం అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని మరోసారి ఉగ్రవాదానికి పాల్పడతామంటే చూస్తూ ఊరుకోం.. ఉగ్రవాదం ఏ రోజుకైనా పాక్‌ను నాశనం చేస్తుంది.. ఉగ్రవాదాన్ని ముట్టుబెడితేనే పాక్‌కు మనుగడ.. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవు.. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు. మరోసారి పాకిస్తాన్ తోక జాడిస్తే పతనం ఖాయం. మా దెబ్బ ఎలా ఉంటుందో కనీసం మీ ఊహకు కూడా అందదు. ఇదే ఫైనల్ వార్నింగ్. మా సహనాన్ని పరీక్షించొద్దు అని పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.