Toyota : ఈ SUV కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

టయోటా కు చెందిన SUV కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఏప్రిల్ లో దీని సేల్స్ పెరిగిపోయాయి. గత నెల కంటే ఏప్రిల్ లో 25 శాతం కారు వృద్ధి సాధించడం చూస్తే ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ కారులో ఏముందంటే?

2025 సంవత్సరం ప్రారంభం నుంచి టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్ కారు ప్రత్యేకత చాటుకుంటుంది. ఈ మూడు నెలల కాలంలో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. జనవరిలో ఈ కారు 3,149 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 2,876 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక మార్చిలో దీనిని 3,392 మంది కొనుగోలు చేశారు.తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం చూస్తే టయోటా ఫార్చునర్ కారు 2,904 యూనిట్లు ఎకరాలు జరుపుకుంది. అయితే 2024 ఏడాదిలో ఏప్రిల్ లో ఈ కారును 2,325 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఈ కారు అమ్మకాలు 25% వృద్ధి చెందింది.


వినియోగదారుల అభివృద్ధి లతోపాటు వారి అవసరాలను తీర్చే విధంగా ఈ కారు మార్పులు చేసుకోవడంతోనే అమ్మకాలు పెరిగాయని ఆటోమొబైల్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొత్తగా మార్కెట్లో ఉన్న ఫార్చునర్ కారులో సోలిడ్ బాడీ తో పాటు హై గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ అండ్ టఫ్ గా నిలిచే కెపాసిటీ దీని ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతేకాకుండా లేటెస్ట్గా ఆకట్టుకునే డిజైన్తో పాటు. ఇంటీరియర్ ఫీచర్లు కూడా వినియోగదారులకు అనుగుణంగా ఉన్నాయి.

ఈ కారులో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్, 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ రెండు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంది. సెవెన్ సీటర్ కలిగి ఉన్న ఈ కారును మార్కెట్లో లక్షల ప్రారంభ ధర నుంచి రూ.51.94 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది సొంత అవసరాలతో పాటు వ్యాపార అవసరాలకు కూడా అనుగుణంగా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కారుకు పోటీగా మరో కారు లేకపోవడంతో ఇది ప్రత్యేకంగా నిలుస్తూ అందరిని ఆకర్షిస్తుంది. పెద్ద కుటుంబంలో కలిసి లాంగ్ డ్రైవ్ చేయాలని అనుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కారులో 296 లీటర్ల బూట్స్ పేస్ ను కలిగి ఉండడంతో లగేజీ తో పాటు ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా వెళ్ళవచ్చు.