ధర రూ.1599 కే 38 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC, ENC ఫీచర్‌లతో నెక్‌బ్యాండ్ విడుదల

రియల్‌మి నుంచి ఇవాళ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు నెక్‌బ్యాండ్‌ కూడా విడుదల అయింది. రియల్‌మి 14 ప్రో 5G, రియల్‌మి 14 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా రియల్‌మి బడ్స్‌ వైర్‌లెస్‌ 5 ANC నెక్‌బ్యాండ్‌ (Realme Buds Wireless 5 ANC) లాంచ్ అయింది. ఈ నెక్‌బ్యాండ్‌ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌, డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి హెడ్‌ఫోన్స్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల పూర్తి వివరాలు.


రియల్‌మి బడ్స్‌ వైర్‌లెస్‌ 5 ANC నెక్‌బ్యాండ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు : డిజైన్‌ పరంగా ఈ హెడ్‌ఫోన్స్‌ ఆకట్టుకుంటోంది. ఈ నెక్‌బ్యాండ్‌ 13.6 mm డైనమిక్‌ బాస్‌ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఈ నెక్‌బ్యాండ్ రియల్‌మి లింక్‌ యాప్‌ తో కనెక్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఈ యాప్‌ ద్వారా EQ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

ANC, ENC ఫీచర్‌లు : ఈ రియల్‌మి నెక్‌బ్యాండ్ 3 నాయిస్‌ రిడక్షన్ లెవల్స్‌తో గరిష్ఠంగా 50dB వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్టు చేస్తుంది. మరియు కాల్‌ క్లారిటీ కోసం ఎన్విరాన్‌మెంటర్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. 360 డిగ్రీల స్పేషియల్‌ ఆడియో అనుభూతిని అందిస్తోంది. 45ms లో లేటెన్సీ ను కలిగి ఉంది. 38 గంటల బ్యాటరీ లైఫ్‌ : రియల్‌మి బడ్స్‌ వైర్‌లెస్ 5 ANC హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 38 గంటలపాటు (ANC Off Mode) వినియోగించుకోవచ్చు. అయితే ANC ఫీచర్‌ ఆన్‌ చేసి నెక్‌బ్యాండ్‌ను వినియోగిస్తుంటే బ్యాటరీ లైఫ్‌ 20 గంటల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.

దీంతోపాటు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం వాల్యూమ్‌తో సుమారు 20 గంటలపాటు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. ఈ నెక్‌బ్యాండ్‌ IP55 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ హెడ్‌సెట్‌ బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. అంటే రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ధర, సేల్‌ వివరాలు : రియల్‌మి నెక్‌బ్యాండ్‌ ధర రూ.1,799 గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1,599 కే కొనుగోలు చేయవచ్చు. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఇ-స్టోర్‌, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, ట్విలైట్‌ పర్పుల్, డాన్‌ సిల్వర్‌ రంగుల్లో లభించనున్నాయి. నెక్‌బ్యాండ్‌తోపాటు రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు 16 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ వైట్‌ నుంచి బ్లూ కలర్‌లోకి మారుతుంది. అదే 16 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత పెరుగుతుంటే బ్లూ నుంచి వైట్‌ రంగులోకి మారుతుంది. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది.