రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆకస్మిక దాడులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఎస్‌వోటీ పోలీసులు గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్ (Madhapur) ప్రాంతాల్లోని పలు పబ్బులలో తనిఖీలు చేపట్టారు.
నిబంధనలను అతీక్రమించి పబ్ రన్ చేస్తున్న క్లబ్ రఫ్, ఫ్రూట్ హౌస్‌లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పబ్బుకు వచ్చిన పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. నలుగురు యువకులు డ్రగ్స్‌తో పాటు గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ టీమ్, మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు వారు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.