ఇంటర్ లో సైన్స్ స్ట్రీమ్ చదివిన విద్యార్థులు ఆ తరువాత బీటెక్ లేదా మెడిసిన్ ని కెరీర్ ఆప్షన్ గా ఎంచుకుంటారు. చాలా మంది మెడిసిన్ లేదా ఇంజినీర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు.
కానీ, ఈ రెండు మాత్రమే కాకుండా ఇంటర్ తరువాత చాలా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నిజానికి చాలా మందికి వీటి గురించి తెలియదు కూడా. తెలిసినవారు అందులో రాణించి లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు. మరి అలాంటి కెరీర్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:
ప్రెజెంట్ ఏ రంగంలో అయినా డేటా అనేది చాలా ప్రధానం. ఫైనాన్స్, హెల్త్, ఈ-కామర్స్ ఇలా అన్ని రంగాల్లో డేటా తప్పనిసరి. అందుకే ప్రస్తుతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఫుల్ డిమాండ్ ఉంది. కాబట్టి ఇంటర్ తరువాత కంప్యూటర్ సైన్స్, ఏఐ లేదా డేటా సైన్స్ లాంటి వాటిలో B.Sc చేయడం ఉత్తమం. దీనిలో ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ముందు ముందు ఇంకా పెరగవచ్చు.
ఫొరెన్సిక్ సైన్స్:
ఫొరెన్సిక్ నిపుణులు అందించే వివరాలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎలా ఉపయోగపడుతాయో ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఆధారాల సేకరణలో వాళ్ళు అందించే సహాయం అంత ఇంతా కాదు. అందుకే దీనికి సంబంధించి ప్రత్యేకమైన డిపార్టుమెంటును కేటాయించారు. ప్రస్తుతం ఫొరెన్సిక్ సైన్స్ కి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి.. ఇంటర్ తరువాత ఫోరెన్సిక్ సైన్సెస్ లో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివినవారికి పోలీస్ డిపార్ట్మెంట్, సీబీఐ, ఎన్ఐఏ వంటి సంస్థల్లో సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లుగా పనిచేసే అవకాశం లభిస్తుంది.
బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్స్:
కొరోనా తరువాత ప్రపంచం మొత్తం బయోటెక్నాలజీ యొక్క శక్తిని గుర్తించింది. ముందు ముందు దీని ప్రత్యేకత ఇంకా పెరగవచ్చు. కాబట్టి, ఇంటర్ తరువాత B.Sc బయోటెక్నాలజీ లేదా జన్యుశాస్త్రం చదవడం మంచిది. వ్యాక్సిన్ డెవలప్మెంట్, జెనెటిక్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, అగ్రిటెక్ రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ స్టడీస్:
వాతావరణ పరిస్థితులను అంచనా వేసి రాబోవు విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడం అనేది ఇప్పుడు చాలా అవసరం. అందుకే దీనికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కాబట్టి.. ఇంటర్ తరువాత ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లేదా సస్టెయినబిలిటీ స్టడీస్ లో B.Sc చేయడం ద్వారా ఎన్జీవోలు, ప్రభుత్వ పాలసీ థింక్ ట్యాంక్ లు, అంతర్జాతీయ సంస్థల్లో మంచి మంచి అవకాశాలు పొందవచ్చు.