ఫుల్ ట్యాంక్ తో 900 కి.మీ ప్రయాణించగల ఈ కారు ధర రూ. 5 లక్షలు – ఇది హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

 మన దేశంలో, టాటా కార్లకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. మారుతి కార్లలాగే టాటా కార్లు కూడా కామన్‌ మ్యాన్‌ నమ్మకాన్ని గెలుచుకున్నాయి.


బడ్జెట్‌ రేటులో రావడంతో పాటు ప్రయాణ సమయంలో కుటుంబానికి రక్షణ ఉండడం ఈ కారుకు ప్లస్‌ పాయింట్స్‌. భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందడానికి & ఈ కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఇప్పుడు, టాటా మోటార్స్‌ బ్రాండ్‌లోని ఎంట్రీ లెవల్ టియాగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో సందడి చేస్తోంది. మీ డబ్బును పొదుపు చేసేందుకు ఈ కారులో CNG ఇంజిన్‌ ఉంది & ప్రయాణీకులకు బలమైన భద్రత కూడా లభిస్తుంది. గత నెలలో (మే 2025) ఏకంగా 6 వేలకు పైగా ప్రజలు టియాగో కారును కొనుగోలు చేశారు. దేశీయ మార్కెట్లో, ఇది Maruti Wagon R &Hyundai Grand i10 Nios తో పోటీ పడుతుంది.

భారీ డిమాండ్‌ ఉన్న టాటా కారు
టాటా మోటార్స్‌ ప్రకటించిన సేల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, మే 2025లో మొత్తం 6,407 మంది కొత్త కస్టమర్లు టాటా టియాగోను కొనుగోలు చేశారు. అంటే, రోజుకు సగటున 207 కార్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలం (మే 2024) కంటే 8 శాతం ఎక్కువ. ఈ గణాంకాలు టియాగో ICE & EV రెండింటికీ సంబంధించినవి.

టాటా టియాగో ధర & ఫీచర్లు
టాటా టియాగో ప్రారంభ ఎక్స్-షోరూమ్‌ ధర (Tata Tiago ex-showroom price) రూ. 5 లక్షలు. దీని టాప్-ఎండ్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ రేటు రూ. 8.45 లక్షల వరకు ఉంటుంది. టాటా టియాగో కారు 12 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో పెట్రోల్ & CNG రెండు ఎంపికలూ ఉన్నాయి. టియాగోలో 1199 cc 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 86 PS శక్తిని & 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేయగలదు.

టాటా టియాగో CNG వెర్షన్‌లో, ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని పొందుతుంది & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారుకు 242 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ కారణంగా గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైవ్‌ చేయవచ్చు. కారు ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు & వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు, ఇవి మంచి బ్రేకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి.

టాటా టియాగో ఎంత మైలేజ్ ఇస్తుంది?
కంపెనీ వెల్లడించిన ప్రకారం, టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 20.09 కి.మీ. మైలేజీ ‍(Tata Tiago Petrol Version Mileage) ఇస్తుంది & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ టాటా కారు లీటర్‌కు 19 కి.మీ. మైలేజీ ఇస్తుంది. టియాగో CNG మోడల్‌ (Tata Tiago CNG Version Mileage), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 కి.మీ/కి.గ్రా. & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 కి.మీ/కి.గ్రా. మైలేజీ ఇవ్వగలదు. మీరు ఈ కారు రెండు ట్యాంక్‌లను (పెట్రోల్‌ & CNG) నింపితే సులభంగా 900 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.