మన పూర్వీకులు తిన్నది ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి,ఇలా చేసుకోండి

ఈ రోజుల్లో ఆరోగ్యం మంచిగా ఉంటే అదే కోటి రూపాయలు అని భావిస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచే ఆరోగ్యం మీద అందరిలో ఎక్కవు అటెన్షన్ పెరిగిందని చెప్పవచ్చు.


మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటాం. అమ్మమ్మలకాలం నాటి ఓ బ్రేక్ ఫాస్ట్ ఈ రోజుల్లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఒక అద్భుతమైన ఫుడ్ జొన్న గుగ్గిల్లు. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలుచేసే జొన్న గుగ్గిల్లు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

జొన్న గుగ్గిల్లు తయారీకి కావాల్సిన పదార్థాలు

-జొన్నలు

-నెయ్యి

-పసుపు

-ఇంగువ

-పచ్చిమిర్చి

-ఎండు మిర్చి

-ఉల్లిపాయ

-కొత్తిమీర

-కరివేపాకు

-వెల్లుల్లి

-జీలకర్ర

-అల్లం

-పచ్చి శెనగపప్పు

-ఉప్పు

-క్యారెట్ తురుము

జొన్న గుగ్గిల్లు తయారీ విధానం

-1 కప్పు జొన్నలను 10 గంటల పాటు నానబెట్టుకోవాలి.

-తర్వాత ఆ జొన్నలను శుభ్రంగా కడిగి ఓ కుక్కర్ లో వేయండి. ఇందులోనే పావు కప్పు పల్లీలు, ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మంటను మీడియంలో ఉంచి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. నొక్కి చూస్తే జొన్నలు మెత్తగా అవ్వాలి.

-తర్వాత వాటిని ఓ జాలిలో వేసుకుని అందులోని నీరంతా పోయేలా చూసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు,6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వేసి వేయించుకోండి.

-ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత అందులో చిటికెడు పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపేసి ఉడికించిన జొన్నలు,రుచికి సరిపడా కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలా కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.

-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో క్యారెట్ తరుము లేదా కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు,నిమ్మరసం పిండుకొని కలుపుకోండి. అంతే జొన్న గుగ్గిల్లు రెడీ. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా సహాయపడుతుంది.