Friday, November 15, 2024

Lok Sabha Election 2024: ఒకే వీధి.. తండ్రిది ఏపీ.. కొడుకుది తెలంగాణ!

Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో రాజుపేటలో వీధికి ఒకవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాయి. దీంతో శ్రీనివాస్‌ ఇల్లు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ఈ గ్రామం నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొడుకు ఇళ్లు తెలంగాణలో..
ఇక శ్రీనివాస్‌ కొడుకు జనకీరామ్‌ అదే వీధిలో రోడ్డుకు మరోవైపు స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ప్రాంతం తెలంగాణ పరిధిలో ఉంది. దీంతో ఇప్పుడు తండ్రి ఇల్లు ఆంధ్రప్రదేశ్‌లో, కొడుకు జానకీరామ్‌ ఇల్లు తెలంగాణ పరిధిలోకి వచ్చింది.

తండ్రి ఓటు అటు.. కొడుకు ఓటు ఇటు..
ఇక ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో మహబూబాబాద్‌లోక్‌సభ స్థానానికి, ఏపీలో అరకు లోక్‌సభ స్థానంతోపాటు రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. కొడుకు కుంటుంబం తెలంగాణలోని లోక్‌సభ స్థానానికి ఓటు వేయనుండగా, తండ్రి శ్రీనివాస్, అతని భార్య మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ, రంపచోడవరం అసెంబ్లీకి ఓటు వేయనున్నారు.

జిల్లా తెలంగాణలోనే..
ఇవన్నీ ఇలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రం తెలంగాణలో ఉంది. భూభాగం పరంగా తెలంగాణలో ఉన్నా.. లోక్‌సభ స్థానాల ఏర్పాటు నేపథ్యంలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీటి పరిధి మారే అవకాశం ఉంది.

ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ : చంద్రబాబు

టిడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే.. ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ అమల చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధర్మవరం సభలో ప్రకటించారు.
దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతామని.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఇస్తామన్నారు. పింఛన్ కోసం జగన్ వృద్ధులను పొట్టన పెట్టుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచించినా.. మండుటెండలో సచివాలయానికి రావాలని ఇబ్బందిపెట్టారు. శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జగన్ కి ముందే తెలుసు అన్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా చేశారు. ఇప్పుడేమో గులకరాయి దాడి నాటకాలు ఆడుతున్నారు. ఓటమి ఖాయమని తెలిసి.. కొత్త నాటకాలు మొదలుపెట్టారు. మూడు రాజధానుల పేరుతో జగన్ అసలు రాజధాని లేకుండా చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు. అమరావతిని దేశంలోనే నెం.1 గా చేస్తామన్నారు.

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ తో కదం తొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయులు.. ఎవరి పడ్డాయంటే?

Oplus_131072

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఉద్యోగుల చైతన్యం దేనికి సంకేతం? తొలి రోజే కదం తొక్కడం ఎవరికి ఇబ్బందికరం? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనపై ఉద్యోగ ఉపాధ్యాయులు విసిగిపోయారు. రద్దు చేస్తామన్న సిపిఎస్ సంగతిని జగన్ మర్చిపోయారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలను సైతం తగ్గించేశారు. ఒకటో తేదీన జీతం అన్నది మరిచిపోయేలా చేశారు. అందుకే తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వం పై.. గత కొద్ది రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుతామని ఎన్నో సందర్భాల్లో హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నడూ లేని విధంగా తొలిరోజు బ్యాలెట్ ఓటు వేసేందుకు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కడం విశేషం.

సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి లక్షన్నర దరఖాస్తులు వచ్చేవి. ఎన్నికల విధుల దృష్ట్యా కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఇష్టపడేవారు కాదు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడం అనేది ఒక ప్రక్రియగా మారడంతో ఎక్కువమంది ఓటు వేసేవారు కాదు. ఈసారి పట్టు పట్టి మరి రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టింది. వాటన్నింటిని అధిగమించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లను పొందగలిగారు. నిన్నటి నుంచి ఓటు వేయడం ప్రారంభించారు.

ఓటు అనేది ఆత్మ ప్రబోధానుసారం వేసినా.. చాలామంది తాము వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసామని చెబుతున్నారు. దాదాపు నూటికి 90 శాతానికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. చాలామంది ఈ విషయాన్ని బాహటంగానే చెప్పుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సలహాలు సూచనలతో నిండిపోయాయి. ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని.. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పలానా పార్టీకి ఓటు వేయాలని నేరుగా చెప్పకపోయినా.. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పినా.. అది కచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా వేయాలని చెప్పడమేనని తెలుస్తోంది. అయితే ఇందులో కరుడుగట్టిన జగన్ అభిమానులు సైతం.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు.

Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు. రేపు 29 మండలాల్లో, ఎల్లుండి 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. సోమవారం శ్రీకాకుళం10, విజయనగరం 13, పార్వతీపురంమన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.., కర్నూలు జిల్లా జి. సింగవరం- 45.6, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురం- 45.5, ప్రకాశం జిల్లా వెలిగండ్ల -45.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైయస్సార్ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురం- 45.1, అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె -44.7, పల్నాడు జిల్లా రావిపాడు-44.4, చిత్తూరు జిల్లా పుంగనూరు- 43.6, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు- 43.3, అల్లూరి జిల్లా యెర్రంపేట- 43.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు,117 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండతీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

AP DGP Transfer: జగన్‌కు బిగ్ షాక్.. డీజీపీపై ఈసీ వేటు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని సూచించింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.

కాగా, ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది.

విపక్షాల రియాక్షన్స్..

కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చాక డీజీపీ ఒక్కసారి అయినా ప్రెస్ మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నమ్మకం కలిగించలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్ సేవలో తరించడమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందన్నారు.

సీనియర్లను పక్కనపెట్టి మరీ డీజీపీగా బాధ్యతలు

డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా నియమించిన జగన్‌ ప్రభుత్వం..రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి (రెగ్యులర్‌) డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా.. సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా పదవి వరించింది. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే…పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధాంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్‌ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది.

Bank ఉద్యోగం మీ లక్ష్యమా?.. పరీక్ష రాయకుండానే Job పొందే అవకాశం..

ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత అంతటి క్రేజ్ ఉండే జాబ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి బ్యాంకు జాబ్స్ మాత్రమే. బ్యాంకు ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తూ ఉంటుంది. నిత్యం బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూనే ఉంటారు. బ్యాంకు ఉద్యోగమైతే మంచి జీతం. వారానికి రెండు రోజులు సెలవులు ఇతర సౌకర్యాలు ఉంటాయి. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంకు ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే ఇదే మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
జీతం:
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా నెలకు రూ. 25,000 జీతం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటుగా.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005 చిరునామాకి పంపాలి. ఆఫ్ లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మే 15,2024.

IPLతో ఢీ అంటున్న పాకిస్థాన్.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే!

క్రికెట్ అనే కాదు.. వరల్డ్ స్పోర్ట్స్​లో రిచ్ లీగ్స్​లో ఒకటిగా ఐపీఎల్ పేరు తెచ్చుకుంది. ఈ లీగ్ వల్లే భారత క్రికెట్ బోర్డు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. బీసీసీఐకి ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఏటా నెలన్నర పాటు నిర్వహించే ఐపీఎల్ వల్ల బోర్డు ఖాతాలో వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. స్ట్రీమింగ్ రైట్స్, అడ్వర్టయిజ్​మెంట్స్, స్పాన్సర్ల నుంచి ధనంతో బీసీసీఐ ఖజానా నిండిపోతోంది. దీంతో వరల్డ్ క్రికెట్​ను శాసించే స్థితికి భారత్ చేరుకుంది. ఆసియా క్రికెట్​తో పాటు ఐసీసీలోనూ బీసీసీఐ ఏం చెబితే అది జరగాల్సిందే అనేలా పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఐపీఎల్​తో ఢీ అంటే ఢీ అంటోంది పాకిస్థాన్.

అన్ని దేశాలు లీగ్స్ నిర్వహిస్తుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఓ లీగ్​ను స్టార్ట్ చేసింది. అదే పాకిస్థాన్ సూపర్ లీగ్. ఈ లీగ్ సక్సెస్ అవడంతో పీసీబీకి మంచి ఆదాయం సమకూరింది. అయితే ఈ లీగ్​కు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిన పాక్ బోర్డు.. ఆ పని మానేసి ఇప్పుడు బీసీసీఐతో పెట్టుకుంటోంది. సాధారణంగా పీఎస్​ఎల్​కు ఐపీఎల్ షెడ్యూల్​కు మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ ఐపీఎల్ సక్సెస్​ను చూసి ఓర్వలేని పాక్ బోర్డు.. క్యాష్ రిచ్ లీగ్​ను ఖతం చేయాలని కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే సరిగ్గా ఐపీఎల్ నిర్వహించే టైమ్​లోనే పీఎస్​ఎల్​ను ఆర్గనైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఐపీఎల్ విండో మార్చి నుంచి మే మధ్యలో ఉంటుందనేది తెలిసిందే. ఇప్పుడు పీఎస్​ఎల్​ను కూడా సరిగ్గా ఇదే విండోలో నిర్వహించాలని పీసీబీ పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్​ను పడగొట్టాలంటే సరిగ్గా అదే టైమ్​లో పీఎస్​ఎల్​ను విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటోందట. అయితే ఈ వార్త గురించి తెలిసిన నెటిజన్స్ పాకిస్థాన్​పై విమర్శలకు దిగుతున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదేనని అంటున్నారు. ఐపీఎల్​కు ఏ విధంగానూ పీఎస్​ఎల్ సాటిరాదని.. ఇది పాక్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని చెబుతున్నారు. ఒకే టైమ్​లో ఐపీఎల్​కు పోటీగా పెడితే యాడ్స్, వ్యూస్ పరంగా లాసెస్ తప్పవని హెచ్చరిస్తున్నారు. రోమాన్ పావెల్, జేసన్ రాయ్, సికిందర్ రజా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, షమర్ జోసెఫ్, రీలీ రూసో, డేవిడ్ విల్లే లాంటి ఆటగాళ్లు ఈ రెండు లీగ్స్​లోనూ ఆడతారు. ఒకవేళ ఐపీఎల్​ టైమ్​లో పీఎస్​ఎల్ నిర్వహిస్తే ఎక్కువ డబ్బులు ఇక్కడే వస్తాయి కాబట్టి ఈ ప్లేయర్లు పాక్​కు వెళ్లరు. అది వాళ్లకు నష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.

పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్.. రోజుకు రూ. 50 పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షలు!

కేంద్రప్రభుత్వం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ ప్రజలక కోసం అందుబాటులోకి తెచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి వివిధ రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సేవింగ్ స్కీమ్స్ అమల్లో జరుగుతుండగా..మరికొన్ని పోస్టాఫీస్, బ్యాంకుల వంటి వాటి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోస్టాఫీస్ లో ఓ అద్భుత సేవింగ్ స్కీమ్ ఉంది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పోస్టాపీస్ ద్వారా ఎన్నో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి గ్రామ్ సురక్ష స్కీమ్. ఇది కేవలం సేవింగ్స్‌ మాత్రమే కాకుండా హెల్త్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ పాలసీ కావడం ప్రత్యేకం. 1955లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ లోకి చేరిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తరువాత దాని ఫలాలను అందుకుంటాడు. ఈ స్కీమ్ లో వచ్చే బోనస్ తోపాటు డబ్బును అందిస్తారు. టర్మ్ పాలసీ పూర్తి కాకుండానే బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు.

ఈ స్కీమ్ చేరేందుకు 19 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు అర్హులు. 19 నుంచి 50 మధ్య వయస్సు ఉండే ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ప్రీమియం కట్టే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారిగా ప్రీమియం చెల్లింపును పెట్టుకోవచ్చు. అలానే ప్రీమియం చెల్లింపు విషయంలో మూడు స్థాయిలో పెట్టుకోవచ్చు. అది 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ ప్రీమియంలో ఏదీ నచ్చిన ఆప్షన్ ఎంపిక చచేసుకోవచ్చు. అలానే ద్వారా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాత రుణ పొందే అవకాశం ఉంది. ఈ రుణంపై 10 శాతం వడ్డీ ఉంటుంది.

ఇక ఈ స్కీమ్ ద్వారా ఎలా బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం.. ఉదాహరణకు మీకు రూ. 30 లక్షలు రిటర్న్‌ రావాలంటే ఎంత చెల్లించాలి, ఆ లెక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారు అనుకుందాం. దానికి 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. చివర్లో 31.60 లక్షల రూపాయలు పొందుతారు. అదే రూ.10 లక్ష మొత్తానికి 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.33.4 లక్షలు వరకు వస్తుంది. అలానే 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. 34.60 లక్షల రూపాయల మెచ్యూరిటీ పొందొచ్చు.

55 ఏళ్ల మెచ్యూరిటీ కోసం నెలకు 1515 రూపాయలు ఇన్వెస్టే చేయాల్సి ఉంటుంది. ఆ 1515 రూపాయలను రోజుకు లెక్కిసే.. సుమారు రూ. 50 మాత్రమే అవుతుంది. ఒకవేళ 58 ఏళ్లకు పెట్టుకున్నట్లు అయితే అదే అమౌంట్ రూ.1463కి తగ్గుతుంది. అలానే 60 ఏళ్ల వరకు పెట్టుకున్నట్లు అయితే ఇంకా తగ్గి రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా అలా ఈ స్కీమ్ ద్వారా రోజు 50 రూపాయలు పెట్టి..చివర్లో రూ.30 లక్షలు పొందవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఈ స్కీమ్ లో చేరారు. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం కోసం మీ సమీపంలోనే పోస్టాఫీస్ ను సంప్రదించవచ్చు.

AP Elections: చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ.. జరగబోయేది ఇదేనట..!

Andhra Pradesh: అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Naidu) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకశంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ, రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైనా వీరువురు చర్చించారు. అయితే, ఇదే భేటీలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా అమిత్ షా.. చంద్రబాబుతో చెప్పారట.

తమకు ఉన్న నివేదికల ప్రకారం.. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చంద్రబాబుకు అమిత్ షా చెప్పారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుస్తుందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారని నివేదికలు పేర్కొన్నట్లు అమిత్ షా చెప్పారట. అలాగే.. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎండలను సైతం లెక్క చేయకుండా రోజుకు మూడు సభల్లో చంద్రబాబు పాల్గొనడాన్ని అమిత్ షా ప్రశంసించారు.

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకుని సోమవారం నాడు గుంటూరు(Guntur) సీఐడీ కార్యాలయానికి రావాలంటూ టీడీపీ ఆఫీసుకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీకి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు టీడీపీకి నోటీసులు జారీ చేశారు.

సీఐడీ అధికారులపై టీడీపీ నేతలు ఫైర్..

టీడీపీ కేంద్రకార్యాలయానికి సీఐడి అధికారులు రావడంపై ఆనం వెంటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. డిజీపీ వైఎస్ రాజేంధ్రనాధ్ రెడ్డి ఆదేశాలతో పరిగెత్తుకొనివచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు నోటీసులు ఇచ్చారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక చెత్త యాక్టు తీసుకొస్తే దానిని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. మరో నెల రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్న సమయంలో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారని జగన్‌ను ఆనం ప్రశ్నించారు. అవ్వతాతలకు పెన్షన్లు చంద్రబాబు వలనే అపివేశారని చెబుతున్న వైసీపీ నాయకుల మాటలు జవహార్ రెడ్డికి వినిపించలేదా? అని ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు.. టీడీపీ నాయకుల మీద దుష్పచారం చేస్తే వారిపై కేసు నమోదు చేయరా? అని ఆనం ప్రశ్నించారు. రాత్రికిరాత్రే జగన్ తన ప్రచారాన్ని ఆపేసి టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయడానికి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారని విమర్శించారు. ఆరు రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని చంద్రబాబు మీద కేసులు నమోదు చేయడానికి వచ్చాడని.. మరో నెల రోజుల్లో జగన్ వెల్లిపోతాడని.. ఇప్పటికైన సీఐడీ అధికారులు మారాలని హితవు చెప్పారు. ఎవరైనా పేపర్లో ఫోటోలు వేసుకున్నేవాళ్లను చూశాం కానీ.. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఆనం విమర్శంచారు. పెన్షన్ కారణంగా చినిపోయిన అవ్వతాతల హత్య కేసులు అన్ని జవహార్ రెడ్డి మీదనే పెట్టాలని వ్యాఖ్యానించారు.

AP Elections 2024: ఈసీ కీలక ప్రకటన.. ఆ Postal Ballot ఓటర్లకు మరో అవకాశం

ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. త‌మ ఎన్నిక‌ల‌ డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం..

ఎలక్షన్ కమిషన్ (Election Commission) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. త‌మ ఎన్నిక‌ల‌ డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక ప్రకటన చేశారు. విజయనగరం జిల్లా జేఎన్టీయూ గుర‌జాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌ను ఆయన సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ‌, హెల్ప్ డెస్క్స్, క్యూలెన్లు, పోలింగ్ బూత్‌ల‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా.. ఓట‌ర్లతో మాట్లాడి వారి స‌మ‌స్యల‌ను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకునేందుకు గాను ఈ నెల 7, 8 తేదీల్లో మ‌రో అవకాశం ఇస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము పని చేస్తున్నామని అన్నారు. అన్ని ఫెసిలిటేష‌న్ సెంట‌ర్లలో క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను, హెల్ప్ డెస్క్‌ల‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు రాష్ట్రవ్యాప్తంగా ప‌క్కా ఏర్పాట్లు చేశామని.. ఎన్నిక‌ల సిబ్బందికి ఇప్పటికే రెండు విడ‌త‌ల శిక్షణ ఇచ్చామని చెప్పారు. వివిధ విభాగాల‌ నుంచి తాము ఫిర్యాదుల్ని స్వీక‌రిస్తున్నామన్న ఆయన.. సీ-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయన్నారు. ఇప్పటివ‌ర‌కు సుమారు 16,000 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 99 శాతం ఫిర్యాదుల‌పై చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

సూపర్ స్కీమ్.. రోజుకు 100 పొదుపు చేస్తే చాలు.. 10 లక్షలు చేతికి.. ఎలా అంటే?

ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతోంది. డబ్బు సంపాదన కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడులు పొందుతున్నారు. అయితే ఇది రిస్క్ తో కూడుకున్న పని ఒక్కోసారి నష్టాలు రావొచ్చు.. ఉన్న ఆస్తులు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవచ్చు. గ్యారంటీ రిటర్న్స్ ఉండడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఆ పథకంలో రోజుకు 100 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు 10 లక్షలు అందుకోవచ్చు.

సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే అది మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. ఆకస్మికంగా వచ్చే ఆపదల నుంచి మీరు పొదుపు చేసిన డబ్బు కాపాడుతుంది. అయితే మనీ ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడిపెడితే సురక్షితమైన రాబడులను పొందొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడులను అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ను ప్రవేశపెట్టింది. బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఆ పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈ పథకంలో రోజుకు 100 చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయం వరకు మీరు 10 లక్షలు పొందొచ్చు.

పీపీఎఫ్ స్కీమ్ లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది.

పీపీఎఫ్ పథకం ద్వారా 10 లక్షలు పొందాలంటే?
పీపీఎఫ్ పథకంలో రోజుకు 100 చొప్పున నెలకు మూడు వేలు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు ఏడాదికి 36 వేలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఈ విధంగా 15ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్లలో మీ పెట్టుబడి మొత్తం 5.4 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడి మొత్తంపై మీకు 4.4 లక్షల వడ్డీ వస్తుంది. పథకం మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి, దానిపై వచ్చిన వడ్డీ కలుపుకుని మీకు రూ. 10 లక్షల వరకు చేతికి వస్తాయి. అధిక రాబడులు పొందాలనుకునే వారు ఈ పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మేలు అని నిపుణులు చెబుతున్నారు.

Blood Clotting : శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది…? కారణాలు ఇవేనా..? జాగ్రత్తలు తీసుకోకపోతే..?

Blood Clotting : శరీరంలో రక్తం గడ్డ కట్టడం అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. దీని కారణంగా అనేక రకాల ప్రాణాంతక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలు శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది..?దానికి గల కారణాలేంటి..?వాటిని ఎలా ఎదుర్కోవాలి..?వంటి విషయాలు గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.రక్తం గడ్డ కట్టడానికి దారి తీసే కారణాలలో అనేక రకాల అంశాలు ఉంటాయి. అయితే దీనికి ప్రారంభ దశలో చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే మాత్రం శరీరమంతా రక్తం గడ్డకట్టి గుండెపోటు , హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. ఇక ఇది ప్రాణంతకరం కూడా కావచ్చు. అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం చాలా సందర్భాలలో గుండెపోటు మరియు హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రక్తం గడ్డ కట్టడం వలన వచ్చాయని తెలిసింది.

Blood Clotting : ఈ సమస్య ఎవరిలో ఎక్కువ….
అయితే గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించే ప్రతి 1 మిలియన్ మహిళల్లో దాదాపు 1200 మందికి రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని తాజాగా మెట్రో హాస్పిటల్ లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ తెలియజేశారు. శరీరంలో రక్తం గడ్డకట్టక పోవడానికి గర్భ నిరోధకాలు కూడా ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ ఏం చెబుతున్నారంటే… కరోనా వైరస్ కారణంగా త్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ తో త్రంబోసిస్ సంభవిస్తుందట. ఇక ఈ వైరస్ అనేది గుండె ధమనులలో రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందట. దీంతో గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లుగా వారు తెలిపారు.

Blood Clotting ధూమపానం చేసేవాళ్లు…
అదేవిధంగా ధూమపానం చేసే 1 మిలియన్ మందిలో 17,000 మందికి రక్తం గడ్డకట్టే సమస్య వస్తుందట. అదేవిధంగా ఈస్ట్రోజన్ కలిగిన మందులను తీసుకోవడం వలన కూడా ఈ ప్రమాదం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరంలో కొవ్వు పెరగడం మధుమేహం కీళ్ల నొప్పులు అధిక బీపీ వంటి సమస్యల వలన కూడా రక్తం గడ్డ కడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. గమనించగలరు.

Salt : ఉప్పును తక్కువగా తీసుకుంటున్నారా. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!

Salt : ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాగని తక్కువ పరిమాణంలో తీసుకుంటే కూడా ప్రమాదమే. అయితే ఈ రోజుల్లో అధిక రక్తపోటు మరియు మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు వాటిని నివారించడానికి తక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్న మాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం సోడియం ఉప్పు అనేది ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ . ఇది కణాలలోని నీటి యొక్క పరిమాణాన్ని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రక్తంలో సోడియం తక్కువ అయినట్లయితే హైపోనట్రేమియా సంభవిస్తుందట. దీని కారణంగా శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Salt : రక్తంలో సోడియం ఎంత ఉంటే మంచిది…
నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం రక్తంలో సోడియం లీటర్ కు 135 నుండి 145 మిల్లీక్వివలెంట్లు ఉండాలట. ఇక 135 mEq/L కంటి తక్కువ స్థాయిలో రక్తంలో సోడియం లోపం ప్రారంభమవుతుంది. ఇక ఈ సమస్య శరీరంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కావున వెంటనే దీనిపై చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Salt : సోడియం లోపిస్తే ఏమవుతుంది…
రక్తంలో సోడియం లోపించటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఆందోళన ఒత్తిడి లేదా నరాల సంబంధిత సమస్యలు రావచ్చు. అంతేకాక ఆయాసం తలనొప్పి వాంతులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కండరాల తిమ్మిరి కూడా సోడియం లోపానికి సంకేతమని చెప్పొచ్చు.

Salt లక్షణాలు….
రక్తంలో సోడియం లోపం అనేది అనేక రకాల కారణాల వలన వస్తుంది. అయితే ఉప్పు తక్కువగా తీసుకునే వారిలో ఇది లోపం కావచ్చు. అలాగే శరీరంలో అధిక నీరు ఎలక్ట్రోలైట్స్ కోల్పోయే వారు కూడా సోడియం లోపంతో బాధపడతారు. అంతేకాక ఈ సమస్య అధిక సారం , వాంతులు, యాంటీ డిప్రెసెంట్ మందుల వలన కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఈ సోడియం లోపం అనేది మనకు రక్తంలో కనిపిస్తుంది. దీని వలన శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇక దీనిని నివారించడానికి ద్రవరూపంలో ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవడం మానేయాలి.అలాగే ఉప్పును తగిన పరిమాణంలో తీసుకోవాలి. తక్కువగా తీసుకున్నట్లయితే గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాక ప్రతిరోజు 3000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకున్న వారిలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు రక్తంలో సోడియం లోపాన్ని నివారించాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు సరిపడా సోడియం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే దానిని సరైన పరిమాణంలో తీసుకోవటం ఆరోగ్యానికి మేలును కలగజేస్తుంది. అయితే తాజాగా ఓ అధ్యయనాలలో వెల్లడించిన నివేదిక ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గ్రాముల ఉప్పు తినాలి. తద్వారా మీరు సోడియం లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు. అలాగని ఉప్పు మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే అది రక్తపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

ఈ ఫోన్ నెంబర్ వాడితే కన్ఫామ్ చావే.. ఒకే నెంబర్ వాడి ముగ్గురు మృతి.. దెబ్బకు నెంబర్ రద్దు..

ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. దీంతో వాటి వెనక మూలాలు ఏమిటనేది రహస్యంగానే మిగిలిపోతున్నాయి. అలాంటి ఒక ఘటనే.. బల్గేరియాలోని అన్ లక్కీ ఫోన్ నెంబర్ వెనకాల ఉన్న మిస్టరీ. ఈ మొబైల్ నెంబర్‌ను వాడిన ముగ్గురు వరుసగా మృతిచెందారు. వారు ఈ ఫోన్ నెంబర్‌ను వాడుతున్న సమయంలో మృతిచెందడంతో.. ఆ నెంబర్ వాడాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దెబ్బకు ఆ ఫోన్ నెంబర్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
వివరాలు.. బల్గేరియన్ మొబైల్ ఫోన్ కంపెనీ మొబిటెల్ +359 888 888 888 ఫోన్ నెంబర్‌ను జారీ చేసింది. ఈ నంబర్ మొదటి యజమాని.. మొబిటెల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్లాదిమిర్ గ్రాష్నోవ్. ఈ ఫోన్ నెంబర్ వాడుతున్న సమయంలో.. వ్లాదిమిర్ గ్రాష్నోవ్ తన 48 ఏళ్ల వయసులో 2001లో క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించాడు. అయితే వ్లాదిమిర్‌కు క్యాన్సర్ సోకేలా అతని బిజినెస్ ప్రత్యర్థి రేడియోధార్మిక విషాన్ని ప్రయోగించాడనే పుకార్లు అప్పట్లో వచ్చాయని డైలీ మెయిల్ నివేదించింది.
ఆ తర్వాత ఫోన్ నెంబర్‌ను బల్గేరియన్ మాఫియా బాస్ కాన్‌స్టాంటిన్ డిమిత్రోవ్‌కు పంపారు. డిమిత్రోవ్ 2003లో తన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని తనిఖీ చేసేందుకు నెదర్లాండ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ అతడిని ఓ వ్యక్తి కాల్చిచంపాడు. నివేదికల ప్రకారం.. అతని సామ్రాజ్యం మొత్తం విలువ 500 మిలియన్ పౌండ్లు. మాఫియా బాస్ డిమిత్రోవ్‌, మోడల్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు దుండగడు అతడిని కాల్చి చంపాడు. ఆ సమయంలో డిమిత్రోవ్‌ వద్ద మొబైల్ ఉంది. నివేదికల ప్రకారం.. డిమిత్రోవ్ డ్రగ్-స్మగ్లింగ్ ఆపరేషన్ పట్ల అసూయతో రష్యన్ మాఫియా ఈ హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ ఫోన్ నంబర్ వ్యాపారవేత్త, ఎస్టేట్ ఏజెంట్ కాన్‌స్టాంటిన్ డిషిలేవ్‌కు పంపబడింది. అయితే అనుహ్యంగా బల్గేరియా రాజధాని సోఫియాలోని భారతీయ రెస్టారెంట్ వెలుపల డిషిలేవ్ కూడా కాల్చి చంపబడ్డాడు. నివేదికల ప్రకారం.. డిషిలేవ్‌ తన హత్యకు ముందు రహస్యంగా భారీ కొకైన్ ట్రాఫికింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాడు. 130 మిలియన్ పౌండ్ల డ్రగ్‌ను కొలంబియా నుండి దేశంలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అతను మరణించాడు.
దీంతో ఆ ఫోన్‌ నెంబర్‌పై అన్ లక్కీ నెంబర్ అనే ముద్రపడింది. ఈ దెబ్బతో ప్రభుత్వం కూడా ఆ నెంబర్‌ను నిలిపివేయబడింది. ఇప్పుడు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేసినప్పుడు.. ఫోన్ “అవుట్‌సైడ్ నెట్‌వర్క్ కవరేజ్” అని రికార్డ్ చేయబడిన సందేశాన్ని అందుకుంటారు. ఈ పరిణామాలపై మొబిటెల్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మేము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. మేము వ్యక్తిగత నెంబర్ల గురించి చర్చించలేం’’ అని చెప్పారు.

Gudivada: గుడివాడలో హోరాహోరీ.. కొడాలి నాని పరిస్థితి ఎలా ఉందంటే..!?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా (AP Elections) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్‌ నాని (Kodali Nani), టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము (Venigandla Ramu) పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన నానీ ఐదోసారి కూడా గెలవాలని తహతహలాడుతున్నారు. అయితే అదంత సునాయాసంగా కనిపించడం లేదని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై బూతుల దాడిలో ముందుండే నానీ ఓటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కసితో పనిచేస్తున్నాయి.

Venigandla-Ramu.jpg

ఒకనాడు టీడీపీ కంచుకోట

గుడివాడ.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది (2009లో పామర్రులోకి వెళ్లింది). సొంత గడ్డపై మమకారంతో 1983లో ఎన్టీఆర్‌ తన రాజకీయ అరంగేట్రానికి ఈ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు. గుడివాడ వాసులూ అంతే మమకారంతో ఆయన్ను గెలిపించారు. 1985లోనూ విజయం సాధించారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పరుగులు తీసింది. అందమైన రహదారులతోపాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్‌ స్టేడియం నిర్మించారు. టీడీపీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ జెండా ఎగిరింది. ఒక్కసారి కాంగ్రెస్‌, గత రెండుసార్లు వైసీపీ గెలుపొందింది. కొడాలి నానీ వరుసగా నాలుగు సార్లు (2004, 2009ల్లో టీడీపీ తరఫున, 2014,19ల్లో వైసీపీ తరఫున) విజయం సాధించారు. వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న టీడీపీ.. ఎన్నారై వెనిగండ్ల రామును ఎన్నికలకు రెండేళ్ల ముందే రంగంలోకి దింపింది. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ఆయన చొచ్చుకుపోయారు. మాజీ ఎమ్మెల్యే, స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు తొలుత ఆయనకు దూరంగా ఉన్నా అధిష్ఠానం జోక్యంతో ప్రస్తుతం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రాము సతీమణి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 

Kodali-Nani-Campagin.jpg

విధ్వంసం, కేసినోలు.. సెంటిమెంట్‌..

నానీ సైతం దీటైన వ్యూహాలతో ఐదోసారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. తనపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గ్రహించి.. ఆఖరి అస్త్రంగా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని.. గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. అయితే ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరుగా ఉన్న గుడివాడలో గత ఐదేళ్లలో విధ్వంసం రాజ్యమేలింది. తాగునీటికీ ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీటిదీ అదే పరిస్థితి. వీటికితోడు నాని గుడివాడను జూదశాలగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కేసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా గుడివాడ నిలిచిపోయింది. నానీ మూడేళ్లు రాష్ట్ర మంత్రిగా చేశారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడానికే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొడుతున్నారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. రోడ్ల బాగునూ నానీ పట్టించుకోలేదు. టిడ్కో ఇళ్లను ఐదేళ్లపాటు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్నికల ముందు సీఎం జగన్‌తో ప్రారంభింపజేసి హడావుడి చేశారు. ఈ పరిణామాల దరిమిలా ఆయన చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Kodali-And-Jagan.jpg

AP Elections: ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తేల్చేశాయ్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.

 

  • కూటమికే ఉద్యోగుల మొగ్గు.. వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు!!
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 4శాతం ఓట్లను ప్రభావితం చేయనున్న ఉద్యోగులు
  • కూటమివైపే ఉద్యోగుల మొగ్గు.. ఎండలో మండుతూనే ఓర్పుతో ఓటేశారు
  • రెండేళ్ల కిందటే ఉద్యోగుల అంతిమ నిర్ణయం, సమయం రావటంతో చూపించారు
  • ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులతో పెరగనున్న శాతం

ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballot) తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే వారు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారన్నది నిగ్గు తేలుతోంది! టీడీపీ (Telugu Desam) కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు తమ అంతరాత్మ సాక్షిగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించబోతున్నారన్నది స్పష్టమౌతోంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వంపై (YSR Congress) ఉద్యోగులు రెండేళ్ల కిందటే మనసు విరిగిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది అర్ధమౌతోంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 3 రోజుల పాటు దాదాపుగా 20వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు అర్థమౌతోంది. ఈ లెక్కన చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమౌతోంది. ఉద్యోగులే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలే ఎక్కువ.

Postal-Ballots.jpg

ఇదిగో లెక్కలివీ..!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 20వేల మంది ఉద్యోగులంటే 1.17 శాతం ఓటర్లే అనుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులను కనీసం ఇద్దరిని కలుపుకుంటే 4శాతానికి పెరుగుతుంది. ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే 3శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలుగుతున్నారంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుంటా రు. వీరే కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా భారీగా ఉంటారు. కుటుంబ సభ్యులే కాకుండానే వీరంతా 15వేల మంది వరకు ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిపి 45వేల మంది అవుతారు.

YS-Jagan-Sabha.jpg

రైళ్లు పరిగెడుతున్నాయ్!

వీరంతా కలిపితే మరో 2.64 శాతం మంది ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల 3శాతం, నాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు కలిపి 2.64 శాతం మొత్తంగా 5.64 శాతం మేర ఉద్యోగులు ప్రభావితం చూపబోతున్నారన్నది స్పష్టంగా అర్థమౌతోంది. పోనీ మరో 1.64 శాతం కూడా తీసివేద్దాం. ఇలా చూసినా 4 శాతం మేర ఓట్లను ఎన్టీఆర్‌ జిల్లాలో ఉద్యోగులు ప్రభావితం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతం పెద్దగా తేడా ఏమీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 4 శాతం ఓట్లను ఆయా పార్టీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలుగుతాయన్నది స్పష్టంగా అర్ధమౌతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలకు కదంతొక్కిన ఉద్యోగులను చూసి వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.

పట్టాలెక్కిన ఫస్ట్‌ ప్రైవేట్‌ రైలు! టిక్కెట్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్ ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సుదరూ ప్రయాణాలు చేయాలనుకునేవారికి రైల్వే ప్రయాణం ఎంతో సురక్షితం, సౌకర్యం అని భావిస్తుంటారు. భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగంలోకి వస్తాయి. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తుంది. రైల్వే టికెట్ తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ అందుకే మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా రైల్ ప్రయాణాలు చేస్తుంటారు. భారతీయ రైల్వేలు కార్పోరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో అదే స్థాయిలో నిర్వహణ శైలిని అలవర్చుకుంటుంది. తొలిసారిగా ప్రైవేట్ రైల్ పట్టాలెక్కింది. ఏ రాష్ట్రం.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రైల్ పట్టాలెక్కనుంది. కేరళ నుంచి ప్రైవేట్ రైలు సర్వీస్ తిరువనంత పురం నుంచి జూన్ 4న ప్రారంభం కానుంది. భారతీయ రైల్వే భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట లో భాగంగా ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్స్ ద్వారా ఈ కొత్త రైల్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే టికెటింగ్ తో పాటు ఇతర సేవలు జరుగుతున్నప్పటికీ ఎస్ఆర్ఎంపీఆర్ ద్వరా రైలు, సిబ్బంది ఇతర సౌకర్యాలు అందించబడతాయని ప్రిన్సీ ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ తెలిపారు. ఈ రైల్లో అన్ని వసతులు చాలా క్లాస్ గా ఉంటాయని.. ఒక్కసారి ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తే ఆ అనుభవమే వేరు అని అన్నారు.

ఈ ట్రైన్ గోవా, ముంబై, అయోధ్యకు సర్వీసులు నిర్వహిస్తుంది. మొదటి ప్రయాణం గోవా.. ఇందుకోసం ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, త్రిసూర్, కొజికోడ్, ఎర్నాకులం, కన్నూర్, కాసర్గోడ్ స్టేషన్లలో ఎక్కవుచ్చు. ఈ ట్రైన్ లో ఒకేసారి 750 మంది వరకు ప్రయాణం చేసే వెసులుబాటలు ఉంది. ఈ ట్రైన్ లో 2 స్లీపర్ క్లాస్ బోగీలు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్, 2 సెకండ్ క్లాస ఏసీ కోచ్ లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు వైద్య నిపులు, 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ ట్రైన్ లో ఆహారం, వై-ఫై సౌకర్యలు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందించబడుతుంది. ఈ ట్రైన్ లో సందర్శన స్థలాలు టూర్ ప్యాకేజ్ లో భాగంగా ఉంటాయి.

నాన్ – ఏసీ స్లీపర్ లో 4 రోజులు గోవా ట్రిప్ కోసం, ఒక్కొ ప్రయాణికుడు రూ.13,999 చెల్లించాల్సి ఉంటుంది. 3 టైర్ ఏసీ అయితే రూ.15,150, 2టైర్ ఏసీ అయితే రూ.16,400 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక ముంబై ట్రిప్ కోసైం రూ.15,050, రూ.16,920, రూ.18,825 గా నిర్ణయించారు. అయోధ్య కోసం 8 రోజుల యాత్రకు రూ.30,550, రూ.33,850, రూ.37,150 గా చార్జీలు ఉన్నాయి. 10 ఏళ్ల వయసు లోపు పిల్లలకు టిక్కెట్టు ఫ్రీ.. ఆ పై వయసు పిల్లలకు హాఫ్ టికెట్. ఈ యాత్ర అయోద్య,వారణాసి, ప్రయాగ్ రాజ్ లోని దేవాలయాలు, యాత్రా స్థలాలను కవర్ చేస్తుంంది.

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారితే చాలు.. అన్ని విలాసాలు కాళ్లదగ్గరకు వచ్చిపడతాయి. కాస్త ఫేమస్ అయిన ప్రతీ ఒక్కరు.. చాలా లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోతుంటారు. ఇక ఇండస్ట్రీలో స్టార్స్ గా చలామణీ అయ్యేవారి గురించి అయితే చెప్పనక్కర్లేదు కళ్లు చెదిరే లగ్జరీ లైఫ్ గడుపుతారు. సినిమా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో సకల సౌకర్యాలను అనుభవిస్తారు. కాని ఇక్కడ ఒక హీరో మాత్రం వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
సాధారణంగా రిచెస్ట్ హీరోలు భారీ భవనాలలో నివసిస్తారు. లగ్జరీ కార్లు వాడతారు. ఉదాహరణకు షారుఖ్ ఖాన్ మన్నత్ వందల కోట్లు పెట్టి కొన్నాడు.. ఇంటిముందు నేమ్ ప్లేట్ కే 25 లక్షలుపెట్టాడు షారుఖ్.. ఇక అమితాబ్ బచ్చన్ జల్సా అయితే.. ముంబయ్ లోనే కాస్ట్లీ హౌస్ అని చెప్పాలి. అయితే ఇందుకుభిన్నంగా ఉన్నాడు ఒక హీరో. వేల కోట్లు సంపాదిస్తున్న ఆయన చిన్న 1 BHK ప్లాట్ లో ఉంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్ .

దాదాపు 30 ఏళ్లుగా బాలీవుడ్‌ ను ఏలుతున్నాడు సల్మాన్ ఖాన్. టాప్ హీరోలలో ఎప్పుడూ ముందు వరూసలో ఉంటాడు. 60 ఏళ్ళకు దగ్గరగా ఉన్న ఈ టాప్ హీరో.. ఇంకా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తునే ఉన్నారు. అంతే కాదు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ దాదాున 2900 కోట్ల ఆస్తిని సంపాదించారట. కాని ఆయన మాత్రం చాలా సింపుల్ గా సింగల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటారట.

స్టార్ హీరోలు ముందయ్ లో ..భారీ బంగ్లాలు, సీ ఫేసింగ్ విలాల్లో నివసిస్తున్నా, సల్మాన్ ఖాన్ గత నాలుగు దశాబ్దాలుగా బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని ఒక 1 BHK ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. సల్మాన్ మాత్రమే కాదు అతని కుటుంబం, తల్లిదండ్రులు, ఇద్దరు నటుడు సోదరులు, అందరూ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో వివిధ అంతస్తులలో వివిధ ఫ్లాట్స్‌లో ఉంటున్నారు.
ఈ అపార్ట్ మెంట్ కింద సల్లు బాయ్ 1 BHK ఫ్లాట్‌లో నివసిస్తాడు. పైన 3 బెడ్ రూమ్స్ ఉన్న ప్లాట్ లో తల్లీ తండ్రి ఉంటారట. ఇంత సంపాదిస్తూ.. అంత చిన్న ఇంట్లో ఉండటానికి కారణం ఏంటంటే.. తన తల్లికి దగ్గరగా ఉండాలన్న ఇష్టంతో సల్మాన్ ఖాన్ ఇంత సింపుల్ గా ఉంటున్నాడట. అంతే కాదు చాలా కాలం వరకూ ఆయన సైక్లింగ్ చేస్తూ… షూటింగ్స్ కు వెళ్ళేవాడట. ఆయనకు సైక్లింగ్ అంటే అంత ఇష్టం. సైకిల్ వెనకాల ఆయన కార్లు.. సెక్యూరిటీ వచ్చేవారట.

కాని ఇప్పుడు సల్మాన్ ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో.. టైట్ సెక్యూరిటీ మధ్య సల్మాన్ ఖాన్ ఉంటున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారు ను ఉపయోగిస్తున్నారు. 2900 కోట్లకు అధిపతి అయిన సల్మాన్ ఖాన్.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లలా బంగ్లా లేదు. కానీ పన్వెల్‌లో 150 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది, అక్కడ ఆయన ప్రతి సంవత్సరం కొన్ని నెలలు గడుపుతాడు.

ఓటరు గమనిక: ఈ విధంగా మీ మొబైల్‌లో ‘ఓటర్ స్లిప్’ డౌన్‌లోడ్ చేసుకోండి

ఓటర్లు తమ ఓటరు స్లిప్పులను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మే 7న చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్.

బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

ఎలక్టోరల్ రోల్‌లో పేర్లు ఉన్న నమోదిత ఓటర్లకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటరు సమాచార కార్డులను (వీఐఎస్) జారీ చేసింది.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సంఘం ఓటర్లకు ఓటర్ స్లిప్ లేదా VISని జారీ చేస్తుంది, ఇందులో గది నంబర్, తేదీ మరియు గంటతో సహా పేరు, వయస్సు, లింగం, అసెంబ్లీ నియోజకవర్గం మరియు పోలింగ్ స్టేషన్ స్థానం వంటి సంబంధిత సమాచారం ఉంటుంది. స్లిప్‌లో QR కోడ్ కూడా ఉంది, ఇది ఓటరు వివరాలను ధృవీకరించడం సులభం చేస్తుంది.

మీ ఫోన్‌లో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేదా వీఐఎస్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

1. ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
2. ‘ఇ-ఎపిక్’ ఎంపికపై క్లిక్ చేయండి
3. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, పాస్‌వర్డ్ మరియు OTPని ఉపయోగించి లాగిన్ చేయండి (మళ్లీ రిజిస్టర్ కాకపోతే)
4. మీ EPIC నంబర్‌ను నమోదు చేయండి (ఓటర్ ID కార్డ్ చూడండి)
5. దీని తర్వాత, మీరు మీ ఓటర్ స్లిప్ వివరాలను చూడగలరు
6. VIC పత్రాన్ని తెరవడానికి OTPని మళ్లీ నమోదు చేయండి

వెబ్‌సైట్‌ని ఉపయోగించి VISని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

1. “ https://voters.eci.gov.in/ ”ని తెరవండి
2. ఫోన్ నంబర్, పాస్‌వర్డ్ మరియు OTP ఉపయోగించి లాగిన్ చేయండి (మీరు వెబ్‌సైట్‌కి కొత్త అయితే రిజిస్టర్ చేసుకోండి)
3. “E-Epic డౌన్‌లోడ్” ఎంపిక
4పై క్లిక్ చేయండి. ఎపిక్ నంబర్ ఎంటర్ (మీ ఓటరు ID కార్డ్‌లో కనుగొనబడింది)
5. పూర్తి చేసిన తర్వాత, VISతో పాటు ఇ-ఎపిక్ డౌన్‌లోడ్ చేయబడుతుంది.

Pension News: పెన్షనర్లకు మోదీ సర్కార్ గిఫ్ట్- కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్ సేవలు

Pension Department: మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమ ఈ వార్త. అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ‘ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్’ రూపొందించింది. ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ గురించి పూర్తి వివరాలు వెంటనే తెలుసుకోండి.

పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి
‘ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్’ 5 రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్కచోటికి తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛనుదారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలా మంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.

SMS లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం
ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావటంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది. ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత, సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. ఇది పెన్షనర్‌కు తన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్‌లో సేవ్ చేయటానికి, ఎలక్ట్రానిక్‌గా PPOని జారీ చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తోంది.

కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ ఫించను సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫారం-16, చెల్లించిన- స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే.

Toilet Flush : టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్లు ఎందుకు ఉన్నాయి? ఏ బటన్‌ను ఎప్పుడు, ఎందుకు నొక్కాలో తెలుసా..?

ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వాష్‌రూమ్‌కు టాయిలెట్‌కు వెళతారు. వెస్ట్రన్, ఇండియన్ అనే రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. అయితే.. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ ట్రెండ్ చాలా పెరిగింది. ఇప్పుడు మీరు ఎత్తైన భవనాల్లోని చాలా ఇళ్లలో కమోడ్‌ను చూస్తుంటారు.. అయితే… ఇవి కొంతమందికి సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా మోకాళ్లలో సమస్య వచ్చి కూర్చోలేని వారు. కమోడ్ యొక్క ఫ్లష్ ట్యాంక్ నుండి నీటిని ఫ్లష్ చేయడానికి, మీరు ఒక బటన్‌ను నొక్కవలసి ఉంటుందని గమనించి ఉండాలి. కానీ.. అక్కడ ఒకటి కాదు రెండు బటన్లు ఉన్నాయి. ఒక పెద్ద బటన్ మరొక చిన్న బటన్ ఉంది. రెండు బటన్ల పనితీరు ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్లష్ ట్యాంక్‌పై రెండు బటన్లు ఎందుకు ఉన్నాయి? మీరు దేన్ని నొక్కినప్పుడు ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫ్లష్ ట్యాంక్‌పై రెండు బటన్లు ఎందుకు ఉన్నాయి? : ఫ్లష్ ట్యాంక్‌పై రెండు బటన్లు ఎందుకు ఉన్నాయో చాలా మందికి తెలియదు. కొంతమంది ఒకేసారి రెండు బటన్లను కూడా నొక్కుతారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవుతుందా? ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల కమోడ్‌లు, టాయిలెట్ ఫ్లష్‌లు అందుబాటులో ఉన్నాయి. కొందరికి ఒకే బటన్‌ ఉండగా, కొన్నింటికి రెండు బటన్‌లు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల క్రితం, టాయిలెట్ ఫ్లష్‌లో ఒక బటన్ మాత్రమే అందించబడింది, కానీ ఇప్పుడు అది లేదు. క్రమంగా టెక్నాలజీ మారడంతో పాటు ఫ్లష్ ట్యాంక్ డిజైన్ కూడా మారిపోయింది. వాస్తవానికి, ఫ్లష్ ట్యాంక్‌లో అలాంటి రెండు బటన్‌లు అందించబడలేదు. ఈ రెండు బటన్లు వేర్వేరు మార్గాల్లో పనిచేస్తాయి. ఇవి నీటి ఆదాతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి.

మరుగుదొడ్లు వాడే సమయంలో నీటిని జాగ్రత్తగా వాడాలని, నీరు వృథా కాకుండా చూడాలని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు. మీరు పెద్ద బటన్‌ను నొక్కినప్పుడు, అది ఒక ఫ్లష్‌కు 6-7 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. చిన్న బటన్‌ను నొక్కితే తక్కువ నీరు వస్తుంది. చిన్న బటన్‌ను నొక్కితే 3-4 లీటర్ల నీరు ఖర్చవుతుంది. కొన్నిసార్లు నీటిని విడుదల చేసే సామర్థ్యం కూడా ఫ్లష్ ట్యాంక్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ట్యాంక్ పెద్దగా ఉంటే రెండు బటన్లలో నీరు వేర్వేరు పరిమాణంలో వస్తుంది.

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌.. ఇండియాలోనే తయారైన ఈ బైక్‌ విడుదల ఎప్పుడంటే?

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని బజాజ్ ఆటో జూన్ 18, 2024న విడుదల చేయనుంది. దీనికి సంబంధించి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కొత్త పల్సర్ NS400z బైక్‌ లాంచ్‌ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యంత చౌక ధరలో సీఎన్‌జీ బైక్‌ని తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కొత్త బజాజ్ సీఎన్‌జీ (Bajaj CNG) మోటార్‌సైకిల్‌ 100-125 సీసీ ఇంజిన్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనో షాక్‌ని కలిగి ఉండనుంది. దీనితో పాటు డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్ సెటప్‌లతో రానుంది. ఈ బైక్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సింగిల్-ఛానల్ ఎబిఎస్ లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఈ బైక్‌కి ఎటువంటి పేరుని సంస్థ నిర్ణయించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ బైక్‌కి “బ్రూజర్” (Bruzer) అనే పేరును ట్రేడ్ మార్క్ చేసింది. ఈ రిజిస్టర్డ్‌ చేయబడిన అఫీషియల్‌ పేరుతోనే బైక్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొదటి బజాజ్ సీఎన్‌జీ బైక్‌తో భారత్‌లో కొన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్‌ ఆటో రంగంలో అగ్రగామిగా ఉంది. భవిష్యత్తులోనూ భారత్‌లో మరిన్ని సీఎన్‌జీ మోడళ్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్‌ బైక్స్‌ మాత్రమే ఎక్కువగా చలామణీలో ఉన్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే చాలా కంపెనీలు ఈవీ రంగంపై దృష్టి సారించాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అధిక రేంజ్‌ అందించే విధంగా వీటిని సంస్థలు రూపొందిస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో కార్లు, ఇతర వాహనాలు సీఎన్‌జీ ఇంజిన్‌తో నడుస్తున్నాయి. తాజాగా బజాజ్‌ ప్రకటనతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాంప్రదాయ వానాలకు భిన్నంగా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్న జనం తాజాగా బజాజ్‌ ప్రకటనతో సీఎన్‌జీ వైపూ అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ బైక్‌ ఒక్కసారి మార్కెట్‌లో విడుదల అయ్యాక దాని పనితీరు ఆధారంగా రెస్పాన్స్‌ వస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ బైక్‌ని సంస్థ రూపొందించి టెస్ట్ రన్‌ని కూడా సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌ల ధర కాస్త ఎక్కువగానే ఉండనున్నాయి. అయితే ధరలు ఎక్కువే ఉన్న దాని వల్ల అనేక లాభాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతి త్వరలోనే రాబోయే ఈ CNG మోటార్‌సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇతర సాధారణ బైక్‌ల కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. దీనివల్ల తయారీ వ్యయం పెంచినట్లు మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అయితే, సీఎన్‌జీ బైక్ నిర్వహణ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల ధరల పెరుగుదల వినియోగదారులపై ఎటువంటి ప్రభావం ఉండదని వారు చెబుతున్నారు. ఈ బైక్‌ ధర రూ.80,000 కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది కిలోకు 70 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి బజాజ్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా బైక్‌ విడుదల తేదీని ప్రకటించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

మండుటెండల్లో ఏపీ వాసులకు గుడ్ న్యూస్

మండుటెండల్లో ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు చల్లని కబురు వచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులు పాటు చిత్తూరు, పల్నాడు, అనకాపల్లి, విశాక, శ్రీకాకుళం , విజయనగరం, మన్యం జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సెక్స్ స్యాండల్ ఎఫెక్ట్, ఎన్డీఏలో ఫస్ట్ వికెట్, మోదీపై ఒత్తిడి, లాక్కోలేక, పీక్కోలేక బీజేపీ తంటాలు !

మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబానికి చెందిన ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు రాజకీయ లెక్కలను తారుమారు చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు రాజకీయాలు చేసిన మాజీ ప్రధాని దేవెగౌడతో సహా మొత్తం ఆయన కుటుంబానికి నల్లమచ్చగా మిగిలిపోయింది. రానున్న రోజుల్లో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఫ్యామిలీకి ప్రజ్వల్ రేవణ్ణ అమావాస్యను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు హాసన్ జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉన్న దేవేగౌడ కుటుంబానికి సంబంధించిన అన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబానికి, జేడీఎస్ పార్టీకి చాలా ఇబ్బంది కలిగించడమే కాకుండా కూటమిగా ఏర్పడిన బీజేపీకి కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కామ్ కేసును బీజేపీ నేతలు సమర్థించలేక, అటు ఖండించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి తారుమారు అవుతోంది కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని ఎదిరిస్తూనే బీజేపీతో అధికారం పంచుకుని, ఆ తర్వాత అదే బీజేపీకి దూరంగా ఉండి రాజకీయాలు చేసిన హెచ్‌డీ దేవెగౌడ తరువాత కాంగ్రెస్ తో దోస్తి కట్టారు. దేవేగౌడ అంటేనే కుటుంబం రాజకీయాలు అని అనేక ఆరోపణలు వచ్చాయి. మాజీ ప్రధాని దేవేగౌడ కుమారులు హెచ్‌డీ రేవణ్ణ తన భార్యాపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా మొత్తం హాసన్‌లో రాజకీయంగా ఆయనే ప్రభావం చూపించే స్థాయికి ఎదిగారు. AD హాసన్ జిల్లా ప్రజలు కూడా ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతు ఇచ్చి ఆయన్ను గెలిపించారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఆయన మనవళ్లు ప్రజ్వల్ రేవణ్ణ, నిఖిల్ కుమారస్వామి కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే కోరికతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన మనవళ్లను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అంటే ఎక్కువ అభిమానం ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ ఆయన రాజకీయ జీవితం కూడా త్యాగం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

చాలా సంవత్సరాలు పోటీ చేసి గెలిచిన హాసన్ నియోజకవర్గాన్ని మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం వదిలిపెట్టిన మాజీ ప్రధాని దేవేగౌడ తరువాత ఆయన తుమకూరు వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీఎస్, కాంగ్రెస్ పొత్తు కారణంగా బీజేపీని జేడీఎస్ వ్యతిరేకించింది. దీనికి తోడు దేవెగౌడ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతే కాకుండా దేవేగౌడ ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా హిందూ సంస్థలను రాజకీయంగా అవమానించడం ప్రారంభించారు.

వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకోగా, తుమకూరులో దేవెగౌడ ఓడిపోయారు. కానీ ప్రజ్వల్ రేవణ్ణ దేవెగౌడ కుటుంబానికి చెందిన వారసుడు కాబట్టి హాసన్‌లో విజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్ణ దేవెగౌడ రాజకీయ జీవితంలో దిమ్మతిరిగేలా చేసినా ఆయన్ను హాసన్ నియోజకవర్గ ప్రజలు వదల్లేదు. అలాంటి హాసన్ నియోజకవర్గాన్ని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు గత లోక్ సభ ఎన్నికల సమయంలో సీటు ఇచ్చారు. ఏదో ఒక రోజు తన మనవడు ఢిల్లీ స్థాయిలో తన పేరును కాపాడుతాడనే ఆశతో మాజీ ప్రధాని దేవేగౌడ ఇంతకాలం ఉన్నారు. అయితే సెక్స్ స్యాండల్ కేసుతో దేశంలోనే తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ ఫేమస్ అయిపోతాడని మాజీ ప్రధాని దేవేగౌడ ఊహించి ఉండరని జేడీఎస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దెబ్బకు జేడీఎస్ తో ఎన్డీఏ అతి త్వరలోనే తెగతెంపులు చేసుకుంటుందని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది

ఈ పండు బెరడు పొడిని వేడి నీళ్లలో వేసుకుని తాగితే ఎంత ఎక్కువైనా షుగర్ నార్మల్ అవుతుంది!

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉత్తమ మార్గం: శీతాకాలం మాదిరిగానే మధుమేహంతో బాధపడేవారికి వేసవిలో కూడా చాలా కష్టంగా ఉంటుంది, మధుమేహంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగేకొద్దీ రక్తంలో చక్కెర స్థాయి కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది ఇది మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు మరియు నాడీ వ్యవస్థ వంటి ముఖ్యమైన అవయవాలకు హాని కలిగించే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

సహజ పదార్ధాలతో తయారు చేయబడిన కొన్ని రెమెడీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహం అనేది జీవితాంతం నయం చేయలేని వ్యాధి. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన ఆహారంతో దీనిని చక్కగా నిర్వహించవచ్చు.

పండ్ల చెట్టు బెరడు:
స్టార్ ఫ్రూట్ పేరు అందరూ వినే ఉంటారు. తినడానికి తియ్యగా ఉండే ఈ పండును రకరకాల పేర్లతో పిలుస్తారు. దీనిని ధార పులుపు, కరంబల పండు, కరబల, కరిమడల్, కమరద్రక్షి, నక్షత్ర పుల్లని అంటారు. ఈ చెట్టు యొక్క బెరడు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఒక మూలికగా ఉపయోగించబడుతుంది, దీనిని అర్జున బెరడు అని కూడా పిలుస్తారు.

అర్జున బెరడు యొక్క ప్రయోజనాలు:
ఇందులో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కారకాలన్నీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వైరస్లు, ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ బెరడును తీసుకోవడం వల్ల మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడంతోపాటు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు, ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది.

మధుమేహంలో అర్జున్ బెరడును వినియోగించే మార్గాలు :
ఒక కప్పు నీటిని మరిగించండి. తర్వాత దానికి కొంచెం అర్జున బెరడు పొడిని కలపండి.
ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత వడపోసి తాగాలి.

స్వీపర్‌తో ప్రేమలో పడిన MBBS డాక్టర్.. ఈ ప్రేమకథ ఓ అద్భుతం!..

ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, సరైనా ఎత్తు ఉందా, ఆస్తి ఉందా, ఉంటే ఎంతుంది.. అనేవి చూడరు.. అవన్ని సెకండరీ అవుతాయి. సభ్యసమాజం ఎంత నిరసన వ్యక్తం చేసినా ప్రేమలో ఉన్న జంటను కలవకుండా అడ్డుకోలేకపోతున్నారు. ఇక అలాంటిదే ఒకటి జరిగింది. ఈ లేటేస్ట్ లవ్ స్టోరీని ఓ అద్భుతం అని అంటున్నారు కొందరు నెటిజన్స్. విషయానికి వస్తే.. పాకిస్థానీ జంటకు సంబంధించిన కథ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వైద్యురాలు తాను పనిచేసే ఆసుపత్రిలోనే స్వీపర్‌తో ప్రేమలో పడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

ఈ డాక్టర్ పేరు కిశ్వర్ సాహిబా, ఆమె భర్త పేరు షాజాద్. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం, షాజాద్ తన పనిని చాలా అంకితభావంతో చేసేవాడని, ఇది నన్ను మంత్రముగ్ధులను చేసింది అని పాకిస్థానీ మహిళా డాక్టర్ కిశ్వర్ చెప్పారు.

ఆయన పని తీరు చూసి.. నేను వెంటనే షాజాద్‌కి ప్రపోజ్ చేశాను. మొదట్లో, షెహజాద్ నా ప్రతిపాదనకు ఆశ్చర్యపడి, దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు. అయితే తర్వాత కిష్వర్ ప్రేమను నమ్మి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక షెహజాద్ చేసే పనిని ఆసుపత్రిలోని ఇతర వ్యక్తులు ఎగతాళి చేసేవారు. అటువంటి పరిస్థితిలో ఈ జంట తమ ఉద్యోగాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. షాజాద్ ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాడు, కిశ్వర్ స్వతంత్రంగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తోంది. సొంతంగా మంచి క్లినిక్‌ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ జంట.

కిశ్వర్, షెహజాద్‌ల ఈ ప్రేమకథ ఇప్పుడు వైరల్ అవుతోంది, అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు.. ఈ లవ్ స్టోరీ 2022 లో జరిగింది. ఓ యూట్యూబ్ ఇంటర్వూలో షాజాద్ మాట్లాడుతూ.. నేను అదృష్టవంతుడిని తెలిపాడు.. తాను ముగ్గురు వైద్యుల కార్యాలయాల్లో, గదులు శుభ్రం చేస్తూ, టీ ఇచ్చేవాడినని.. ఒకరోజు కిశ్వర్ తన ఫోన్ నంబర్ అడిగారని, ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించామని తెలిపారు.

Fuel Credit Card: ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. ఏడాదికి 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ

ఇటీవల కాలంలో భారతదేశంలో క్రెడిట్ కార్డుల యూజర్లు పెరిగాయి. కాబట్టి ప్రస్తుతం కస్టమర్లకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నందున క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవడం గందరగోళంగా మారింది. వినియోగదారు ప్రాధాన్యతల ఆధారంగా బ్యాంకులు తమ కార్డ్‌లపై ఆఫర్‌లు, ప్రయోజనాలను అనుకూలీకరిస్తాయి. కార్డు జారీచేసేవారు తమ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లు, రివార్డ్ పాయింట్‌లు, ఫ్యూయల్ పాయింట్‌ల వంటి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇంధన క్రెడిట్ కార్డ్ ద్వారా వినియోగదారుడు పెట్రోలు పంపులో వారి ఖర్చులపై సర్‌ఛార్జ్ మినహాయింపును మాత్రమే కాకుండా ఉచిత ఇంధనాన్ని కూడా పొందే అవకాశం ఉంది. అలాంటి క్రెడిట్ కార్డును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందిస్తుంది. ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ మీ రోజువారీ ఖర్చులపై సంవత్సరానికి 50 లీటర్ల వరకు ఇంధనాన్ని సంపాదించుకునే అవకాశాన్ని అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఇంధన కార్డుకు సంబంధించిన ముఖ్య లక్షణాలు, ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ముఖ్య లక్షణాలు
మీరు సంవత్సరానికి 50 లీటర్ల వరకు ఉచిత ఇంధనాన్ని సంపాదించవచ్చు
ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్‌లలో మీ ఖర్చుల్లో 5 శాతం ఫ్యూయల్ పాయింట్‌లుగా సంపాదించాలి. (మొదటి 6 నెలల్లో నెలకు గరిష్టంగా 250 ఇంధన పాయింట్‌లు, కార్డ్ జారీ చేసిన 6 నెలల తర్వాత గరిష్టంగా 150 ఫ్యూయల్ పాయింట్‌లు)
మీ ఖర్చుల్లో ఐదు శాతం కిరాణా, బిల్లు చెల్లింపులపై ఇంధన పాయింట్‌లుగా సంపాదించవచ్చు. అంటే ప్రతి కేటగిరీలో నెలకు గరిష్టంగా 100 ఇంధన పాయింట్‌లను పొందవచ్చు.
అన్ని ఇతర కొనుగోళ్లపై (యూపీఐలావాదేవీలతో సహా) ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 1 ఫ్యూయల్ పాయింట్‌ని పొందండి.
ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అదనపు ఫీచర్లు
కార్డ్ కాంప్లిమెంటరీ ఇండియన్ ఆయిల్ ఎక్స్‌ట్రీమ్ రివార్డ్ ఎస్‌టీఎం ప్రోగ్రామ్ (ఐఎక్స్ఆర్‌పీ) సభ్యత్వాన్ని అందిస్తుంది.
రివాల్వింగ్ క్రెడిట్ అంటే ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నామమాత్రపు వడ్డీ రేటుతో రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యాన్ని అందిస్తుంది.
మీ ఇండియన్ ఆయిల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను పోగొట్టుకుంటే మీరు దానిని వెంటనే బ్యాంక్‌నకు సంబంధించిన 24-గంటల కాల్ సెంటర్‌కు నివేదించాలి. నష్టాన్ని నివేదించిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్‌లో చేసిన ఏదైనా మోసపూరిత లావాదేవీలపై మీకు ఎలాంటి బాధ్యత ఉండదు.
ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు
ఈ కార్డు భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్లలో 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును అందిస్తుంది. కనీసం రూ. 400 లావాదేవీపై ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కో స్టేట్‌మెంట్ సైకిల్‌కు గరిష్టంగా రూ. 250 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఫ్యూయల్ పాయింట్ రిడెంప్షన్
ఒక కస్టమర్ కాంప్లిమెంటరీ ప్రోగ్రామ్ సభ్యత్వాన్ని ఉపయోగించి ఉచిత ఇంధనం కోసం ఇంధన పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ఫ్యూయల్ పాయింట్‌లను ఎక్స్ఆర్‌పీ మార్చడం ద్వారా పాల్గొనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అవుట్‌లెట్‌లో రిడెంప్షన్ (ఇక్కడ 1 ఎఫ్‌పీ= 96 పైసలు). ఇంధన పాయింట్లు 2 సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతాయి.

Viral Video: ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ హీరో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మువీ ‘పుష్ప’ ఏ ముహూర్తాన విడుదలైందో గానీ.. నాటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల స్మంగ్లింగ్‌ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్‌ గూడ్స్‌ దాచిపెడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బంగారం, డ్రగ్స్‌, డబ్బు, మద్యం.. ఇలా అదీఇదని లేకుండా అక్రమరవాణాకు టాలెంట్‌ను ఓ రేంజ్‌లు వాడేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్బుతో మభ్యపెట్టి, ఓటర్లను ఆకర్షించేందుకు.. పలు పార్టీల నేతలు నానాతిప్పలు పడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా నేరుగా నగదు రవాణా చేస్తే పోలీసులు సీజ్‌ చేస్తున్నారని తమ మద్ధతుదారులతో వివిధ మార్గాల్లో నగదు, మద్యం వంటి తాయిలాలను చేరవేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల చిత్రవిచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్‌లో ఏకంగా రూ.20 లక్షల నోట్ల కట్టలు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ టూ వీలర్‌పై విజయవాడకు వెళ్తుండగా ఖమ్మం జిల్లా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరువకముందే అచ్చం అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు తన స్కూటీని మద్యం షాపుగా మార్చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.


స్కూటీలో ఏకంగా వంద క్వార్టర్ల మద్యం సీసాలు దాచాడు. గోపయ్య వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో నందిగామ నగర శివారులో పోలీసులు అతడి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో తెలంగాణలో తయారైన మద్యం సీసాలు ఉన్నాయి. వీటిని కోదాడ నుంచి నందిగామకు తరలిస్తున్నట్లు గోపయ్య వెల్లడించాడు. దీంతో బైకుతో పాటు మద్యం సీసాలను కూడా పోలీసులు సీజ్‌ చేసి, కేసు నమోదు చేసుకున్నారు.

సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణం.. మహిళలకు బంపర్ ఆఫర్..

కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపులోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ పథకం పేరు లక్ పతి దీదీ. దీనిలో మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పిస్తారు. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలో అసలు లక్ పతి దీదీ పథకానికి అర్హత ఏమిటి? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రస్తుత సమాజంలో మహిళ కేవలం వంట గదికే పరిమితం కావడం లేదు. మకుటం లేని మహరాణిలా గృహ సీమను పాలిస్తూనే.. ఉద్యోగ, వ్యాపారాల్లోనూ సత్తా చాటుతోంది. మన దేశంలోని చాలా కంపెనీల్లో ప్రస్తుతం మహిళా సీఈఓలే ఉన్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ పరిస్థితులు దీనికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. అయితే మహిళలు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రం సాధిస్తేనే కుటుంబమైనా.. సమాజమైనా వేగంగా వృద్ధి సాధిస్తుందని అనేక మంది నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా సంక్షేమానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపులోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ పథకం పేరు లక్ పతి దీదీ. దీనిలో మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పిస్తారు. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలో అసలు లక్ పతి దీదీ పథకానికి అర్హత ఏమిటి? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత మొత్తంలో రుణం వస్తుంది? దాని ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..
మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిల్లో ఈ లక్ పతి దీదీ ఒకటి. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా 2023లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దీనిని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2024-25 ఇంటరిమ్ బడ్జెట్లో దాదాపు 3కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చాలని నిర్ధేశించుకున్నారు. ఈ పథకాలనికి అర్హతల గురించి ఇప్పుడు చూద్దాం..

లక్ పతీ దీదీ పథకానికి అర్హతలు..
ఇది మహిళలకు.. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ.. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకం ద్వారా రుణం పొందేందుకు అర్హలు. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
దరఖాస్తునకు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఎస్‌హెచ్‌జీ సభ్యత్వ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అవసరం అవుతాయి. వీటిని సిద్ధం చేసుకున్నాక మీ జిల్లలోని మహిళా శిశు అభివృద్ధి శాఖకార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లక్ పతీ దీదీ పథకం గురించి దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. ఆ ఫారమ్ తీసుకొని అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత పైనే పేర్కొన్న డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలి. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలుంటే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.

అవసరమైన శిక్షణ కూడా..
ఈ పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. అది మంజూరైన తర్వాత వ్యాపారానికి అవసరమైన శిక్షణను కూడా అందిస్తారు. వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్ లైన్ వ్యాపారం, బిజినెస్ సంబంధించిన శిక్షణను అందించి వారి కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తారు.

Health

సినిమా