మఖానాలో తగిన మోతాదులో ప్రొటీన్ ఉంటుంది. దీన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. ఇది శరీరం బలహీనతను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
మెగ్నీషియం, పొటాషియంతో సహా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. అదే సమయంలో పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మఖానాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పాలలో కలిపి తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మీరు రాత్రి నిద్రపోకపోతే, మఖానాను పాలలో కలిపి తినండి. మెగ్నీషియం, పొటాషియం ఇందులో ఉంటాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మఖానాను పాలతో కలిపి తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో తక్కువ క్యాలరీ కంటెంట్ ఉంటుంది. మఖానాను పాలతో కలిపి తీసుకుంటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది, దీనివల్ల బరువు తగ్గుతారు.
మఖానాలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. మఖానాలో ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీన్ని రోజువారీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. అంతేకాదు.. ఫూల్ మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మఖానాలో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి.
మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానా రక్తంలోకి గ్లుకోజ్ విడుదలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది మంచి స్నాక్.