రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్గంజ్లో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్పై దుండగులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు.
పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.