ఆశ్చర్యం.! విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్..

హ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 242 మందితో లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది ఎయిరిండియా విమానం. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది.


భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆ ట్వీట్‌ వైరల్ అవుతోంది.

ఈ ప్రమాదాన్ని ‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. ‘2025లో ఏవియేషన్ వృద్ది అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే, విమానం కూలింది అనే బ్రేకింగ్ మనల్ని కలిచి వేస్తాయి’. అని ఆ మహిళ 6 నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. ‘ఓ విమాన ప్రమాదం జరుగుతుందని.. అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్టు మళ్లీ చెప్పుకొచ్చింది’. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరలవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.