ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనడుస్తోంది. ఏపీలో డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేవీ రాజేంద్రనాథ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎలాంటి ఎన్నికల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు నియమించే అవకాశం ఉంది. దీనిపై ఏపీ పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా సిద్దం చేసి పంపాలని ఎన్నికల సంఘం సీఎస్‌ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 1990 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారి సీహెచ్ తిరుమల రావు సీనియారిటీ ప్రకారం ప్యానల్ జాబితాలో చోటు సంపాధించుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

డీజీపీ ఎంపిక జాబితాలో అంజనా సిన్హా, మాది రెడ్డి ప్రతాప్‎లు ఉన్నారు. అంజనా సిన్హా 1990 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‎గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక డీజీపీ ప్యానల్ సభ్యుల జాబితాలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి 1991 బ్యాచ్‎కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరికో ఒక్కరికి ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది. ఒక వేళ ఈ ముగ్గురిని కాకుండా మరొకరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న హరీష్ కుమార్ పేరును కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈయన 1992 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *