Friday, November 15, 2024

BREAKING: ఏపీ DGPగా హరీశ్ గుప్తా

BREAKING: ఏపీ DGPగా హరీశ్ గుప్తా

AP డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీనియార్టీ జాబితాలోని IPS అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా.. హరీశ్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ను బాధ్య తలు తీసుకోవాలని సూచించింది.

AP Elections 2024: మరో సీనియర్ పోలీస్ అధికారిపై ఈసీ వేటు..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

వైకాపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. మరోవైపు అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్‌ కుమార్‌ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Ambassador: 1964 లో అంబాసిడర్ కారు ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే.. అప్పట్లో వస్తువులకు సంబంధిచిన పాత బిల్స్, హోటల్స్ లో టిఫిన్స్ కు సంబంధించిన బిల్స్ .. కొన్ని అరుదైన ఫోటోలు.. అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓ హోటల్ లోని టిఫిన్స్ కు సంబంధించిన బిల్స్ గురించి వచ్చిన పోస్ట్ తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు 1964 లో ఓ అంబాసిడర్ కార్ బిల్ వైరల్ అవుతుంది. అప్పట్లో అంబాసిడర్ కార్ ధర ఎంతో తెలిస్తే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడంటే మార్కెట్ లో రకరకాల కార్లు వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు అంబాసిడర్ కార్ అంటే ఎంతో ప్రత్యేకం. ఈ కారుకు బ్రిటిష్ మూలాలు ఉన్నా కూడా.. దీనిని ఇండియన్ కార్ గానే భావిస్తూ ఉంటారు. అప్పట్లో అంబాసిడర్ కారు రోడ్ పైకి వస్తుంది అంటే.. దానిని అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. పైగా అంబాసిడర్ కార్ కు “కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్” గా ఓ మంచి పేరు కూడా ఉండేది. ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు… సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి.. ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా కూడా ఈ కార్ నే వినియోగించే వారు. అప్పట్లో ఈ కార్ ఉంటె వాళ్ళు రిచ్ అన్నట్లే లెక్క. ఇక ఇప్పుడు ఉన్న జెనెరేషన్ కు తగినట్లు రకరకాల ఫీచర్స్ తో కార్లు అందుబాటులోకి రావడంతో.. అంబాసిడర్ కారు వెనుక పడిపోయింది. అసలు ఇంతకీ ఇప్పుడు ఈ అంబాసిడర్ గురించి ఎందుకు వచ్చిందంటే.. అప్పట్లో ఉండే దీని ధరకు సంబంధించిన బిల్స్ బయట పడ్డాయి.

What is the price of Ambassador car in 1964!

ఇప్పుడు లక్షలు, కోట్లు పెట్టనిదే కార్ రావట్లేదు. అలాంటిది అప్పట్లో కేవలం వేళల్లోనే అంబాసిడర్ కార్ వచ్చిందటే నమ్మగలమా.. అవును .. 1964 లో అంబాసిడర్ కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. ఆ బిల్ ను గమనించినట్లయితే.. అక్టోబర్ 20, 1964 లో ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ అపుడు ఆ కారు ధర ఎంతంటే.. కేవలం రూ.16,495 మాత్రమే.. అసలు కారు ధర రూ.13,787 కాగా, సేల్స్ ట్యాక్స్ రూ.1493, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రూ. 897 , రు నంబర్ ప్లేట్‌కు రూ.7 ఇలా మొత్తంగా దీని ధర రూ.16,495 అన్నమాట. దీనితో ఈ బిల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ధర చూసిన ఇప్పటి జనరేషన్ వారు .. దీనిని చూసి నోటి మీద వేలు వేసుకుంటున్నారు. పైగా దీనికి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

AP EAPCET Hall Ticket 2024 Download Direct Link – AP EAMCET 2024 హాల్ టికెట్ : రేపు AP EAMCET హాల్ టిక్కెట్ల విడుదల.. ఇది పరీక్షల షెడ్యూల్

JNT University Kakinada on behalf of APSCHE will release online hall ticket or admit card soon for Andhra Pradesh Engineering, Agriculture and Pharmacy Common Entrance Test (AP EAPCET) 2024 for the academic year 2024-25 for admission into the First Year of Engineering, Agriculture and Pharmacy course. All eligible aspirants can download hall ticket online at AP EAPCET official website at cets.apsche.ap.gov.in from 07th May 2024 onwards for AP EAPCET or AP EAMCET 2024.

AP Engineering, Agricultural and Pharmacy courses (MSET ) admissions కోసం APEPA Hall Tickets రేపు (May 7) విడుదల కానున్నాయి. అభ్యర్థులు official website https://cets.apsche.ap.gov.in/ నుండి hall tickets లను download చేసుకోవచ్చు.APCET పరీక్షలు May 16-23 నుండి నిర్వహించబడతాయి.

ఈ పరీక్షను Jawaharlal Nehru Technological University Kakinada (JNTUK ) నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని universities, private, unaided అనుబంధ engineering, agriculture and pharmacy courses in universities కోసం EAPSET-2024 నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

May 16, 17 తేదీల్లో Agriculture and Pharmacy exams ,May 18 నుంచి 23 వరకు Engineering exams , ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిక్షాలను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.

Download link of Hall tickets

AP Elections: ఏపీ పోలీస్ బాస్‌గా శంఖబ్రత, బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. డీజీపీ పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను పంపించినట్టు తెలిసింది. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి సోమవారం నాడు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు.

Kavitha: దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు

దిల్లీ: మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేడు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్‌ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారాసకు కవిత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరఫున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని.. సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు కవితకు బెయిల్‌ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ICSE 10th class results 2024 : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల

సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది ఉత్తీర్ణులయ్యారు. 99,901 మంది విద్యార్థులు ఐఎస్సీ క్లాస్​ 12 పరీక్ష రాయగా.. అందులో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్​ఈ పాస్​ పర్సెంటేజ్​ 99.47శాతం కాగా.. ఐఎస్​సీ పాస్​ పర్సెంటేజ్​ 98.19శాతంగా నమోదైంది. ఐసీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు పాలయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్​ అయ్యారు. 10 క్లాస్, ​12 క్లాస్ ఫలితాలను www.cisce.org అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సీఐఎస్సీఈ తెలిపింది. డిజీలాకర్​లో ఫలితాలను https://results.digilocker.gov.in ద్వారా చూడొచ్చు.

విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- ఇవాల్యుయేషన్​​ వెసులుబాటును కల్పిస్తున్నట్లు సీఐఎస్​సీఈ ప్రకటించింది. ఒక్కో సబ్జెక్ట్ కి రీ-చెకింగ్​కి రూ. 1000, రీ- ఇవాల్యుయేషన్​కి రూ. 1,500 చెల్లించాలని సూచించింది. ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్​ 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్​ 21న నిర్వహించారు. ఇప్పటికే ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ కంపార్ట్​మెంట్​ పరీక్షలను డిస్కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు విద్యార్థులు, గరిష్ఠంగా రెండు సబ్జెక్ట్స్ ​లో ఇంప్రూవ్​మెంట్​ పరీక్షలు రాసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సీఐఎస్​సీఈ వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భూవివాదాలు కూడా వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఈ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ (Former IAS PV Ramesh) సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌లో తాను బాధితుడినే అని పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల భూములపై హక్కు లేకుండా చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ మండిపడ్డారు.

మాజీ ఐఏఎస్ ట్వీట్ ఇదే..

‘‘నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం’’ అంటూ పీవీ రమేష్ ఆవేదనతో ట్వీట్ చేశారు.

5 Day Work In A Week: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే వారానికి ఐదు రోజుల పని దినాలు షురూ..!

భారతదేశంలోని బ్యాంకు ఉద్యోగులు ఎప్పటినుంచో వారానికి ఐదు పని దినాలు కోరుకుంటున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) మరియు ఎంప్లాయీస్ యూనియన్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది కాబట్టి, బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులు పని చేయాలనే డిమాండ్ త్వరలో నెరవేరే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి మాత్రమే పెండింగ్‌లో ఉంది, 2024 తర్వాత బ్యాంకు ఉద్యోగులు దీనిని పొందుతారని భావిస్తున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు కొంత కాలంగా శనివారాలు సెలవుతో 5 రోజుల పనివారం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. దీని వల్ల కస్టమర్ సర్వీస్ గంటలలో ఎలాంటి తగ్గింపు ఉండదని వారు హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంలోని ఐదు పనిదినాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

డిసెంబర్ 2023లో, ప్రభుత్వ ఆధ్వర్యంలోని, ప్రైవేట్ రుణదాతలు మరియు బ్యాంక్ యూనియన్‌లను కలిగి ఉన్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో ప్రభుత్వ ఆమోదానికి లోబడి 5 రోజుల పని వారానికి సంబంధించిన ప్రతిపాదన ఉంది. తదనంతరం మార్చి 8, 2024న, IBA మరియు బ్యాంక్ యూనియన్లు 9వ ఉమ్మడి నోట్‌పై సంతకం చేశాయి. IBA మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సంతకం చేసిన జాయింట్ నోట్‌లో శని మరియు ఆదివారం సెలవులతో 5 రోజుల వారానికి మార్పు చేసినట్లు వివరించబడింది. అయితే ఐబీఏ, బ్యాంకు యూనియన్లు అంగీకరించినా తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకింగ్ గంటలను మరియు ఇంటర్ బ్యాంక్ కార్యకలాపాలను నియంత్రిస్తున్నందున ఈ ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎటువంటి గడువును ప్రకటించలేదు.

కానీ ఈ నిర్ణయం ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో ప్రభుత్వంచే తెలియజేయబడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం శనివారాలు అధికారికంగా సెలవులుగా గుర్తించబడ్డాయి. ఆమోదం. నివేదికల ప్రకారం, ప్రభుత్వం వారానికి 5 రోజుల పనిని ఆమోదించినట్లయితే, సవరించిన పని గంటలు కూడా పని దినాన్ని 40 నిమిషాలు, 9:45 నుండి సాయంత్రం 5:30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకు శాఖలు రెండో, నాలుగో శనివారాల్లో మూతపడనున్నాయి. 2015 నుండి, బ్యాంకు యూనియన్లు అన్ని శని మరియు ఆదివారాల్లో ఆఫ్‌లను డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం, RBI మరియు ప్రభుత్వం IBAతో ఏకీభవించాయి మరియు రెండు మరియు నాల్గవ శనివారాలను సెలవులుగా ప్రకటించాయి.

ఆ హీరో అలా చేస్తాడనే చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టీవ్ రోల్‌లో చేసి మెప్పించాడు. అయితే రాజ్ తరుణ్ ఇటీవల అక్కినేని హీరో నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్ గా ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్‌ తో వస్తున్న ఈ మూవీకి జె శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవి కిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక శారీ డ్రేపర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన గీతా భగత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రైటర్ డార్లింగ్ స్వామి ఇంత చెబుతున్నారు కానీ మీరు చీరలో రాలేదు ఏమిటి ? అని అడిగితే ఆమె తడుముకోకుండా హీరో కడతాడు అని చీర కట్టుకోలేదు అని కామెంట్ చేసింది. దీంతో ఈవెంట్ కి హాజరైన వారంతా నవ్వేశారు.

Health Tips : బెల్లం, పాలను కలిపి తీసుకుంటే ఇన్ని లాభాలా.. తెలిస్తే వదలరు..!

Health Tips : ఆరోగ్యానికి పాలు, బెల్లం దివ్య ఔషధాలు అనే చెప్పుకోవాలి. ఈ రెండు వేర్వేరుగా తీసుకోవడం మాత్రమే మనకు ఇప్పటి వరకు బాగా తెలుసు. బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. బెల్లంను తీసుకుంటే ఇవన్నీ దొరుకుతాయి. ఇక పాలను తాగితే మాత్రం దంతాలు ధృడంగా ఉంటాయి. దాంతో పాటు ఎముకలు చాలా బలంగా మారుతాయి. అంతే కాకుండా బాడీకి విటమిన్ డీ కూడా దొరుకుతుంది. అయితే ఈ రెండింటినీ కలిపి తింటే చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇమ్యూనిటీ పవర్ కోసం..
పాలలో బెల్లంను వేసుకుని తింటే బాడీలో ఉండే అదనపు కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. అంతే కాకుండా బాడీని నిత్యం యాక్టివ్ గా ఉంచుతుంది. బెల్లం, పాలలో ఉండే కొన్ని సహజ లక్షణాలు బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. దాంతో పాటు రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి…

ఇక జుట్టు ఆరోగ్యానికి బాగా పని చేస్తాయి. జుట్టును నిత్యం మెరిసేలా చేయడంతో పాటు చుండ్రు, ఇతర అలర్జీ సమస్యలను తగ్గిస్తుంది ఈ మిశ్రమం.చాలామంది ఈ రోజుల్లో నడుము నొప్పితో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. పాలు, బెల్లం కలిపి తింటే నడుము నొప్పి తగ్గిపోతుంది.అంతే కాకుండా నీరసం, అలసట త్వరగా వచ్చే వారికి ఇది మంచి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే మాత్రం శక్తిబాగా పెరుగుతుంది.

ఇక అజీర్ణం సమస్యలు ఉన్న వారికి కూడా ఇది మంచిగాపని చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇది బాగా పని చేస్తుంది.మలబద్దంకం తో పాటు పొట్ట సమస్యలను బాగానే తగ్గిస్తుంది ఈ మిశ్రమం. బెల్లంలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్్టరోలైట్ తను సమతుల్యం చేయడంలో సాయం చేస్తుంది.దానికి తోడు వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసు బెల్లం, పాలు తాగడం వల్ల మీ బాడీ త్వరగా శక్తిని గ్రహిస్తుంది. అంతే కాకుండా వేగంగా బాడీ యాక్టివ్ అవుతుందని చెప్పుకోవాలి.

వ్యాయామం చేసిన తర్వాత బెల్లం, పాలను కలిపి తీసుకుంటే బాడీ అలసట నుంచి త్వరగా బయటపడుతుంది.ఇక నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో ఇవి రెండు బాగాపని చేస్తాయి. స్ట్రెస్ ఏజెంట్ లా ఇది పని చేస్తుంది. గ్లాసు పాలు తాగడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. మంచి నిద్ర లభిస్తుంది మీకు.

AP RGUKT IIIT 2024 Admissions: Dates, Eligibility

AP RGUKT CET 2024 IIIT Exam date 2024 in AP after 10th Iiit notification 2024 ap after 10th IIIT Nuzvid Iiit notification 2024 date IIIT Idupulapaya Admissions 2024 RGUKT Notification AP RGUKT 2024 Online Application APRGUCET Notification AP

ADMISSIONS NOTIFICATION FOR UNDER GRADUATE PROGRAMS – 2024-25 AY

No.1/RGUKT-AP/UG/Admissions/2024-25 Dt: 06-05-2024

Online applications are invited from eligible candidates for admission in to the Six Year Integrated B.Tech Programme in RGUKT-AP campuses located at Nuzvid, Idupulapaya, Ongole and Srikakulam for the academic year 2024-25. Interested candidates can apply online for admission through AP online centers/University website www.rgukt.in from 08-05-2024, 11.00 am.

For detailed notification and important dates including last date for receiving online applications, visit University website www.rgukt.in

AP RGUKT IIIT notification for 2024 has beenà released, detailing the admissions process for the academic year 2024-2025. Here are the key highlights:

AP RGUKT IIIT 2024 Admissions: Dates, Eligibility
Eligibility: Candidates should have passed SSC (10th class) or any other equivalent examination recognized by the Governments of A.P. State & Telangana State/CBSE/ICSE conducted in 2024 in the first attempt¹.

Special Category Certificate Verification: For special categories (PH/CAP/NCC/Sports), certificate verification will take place at RGUKT-Nuzvid Campus, Eluru District, with specific dates allocated for each category from **July 5-9, 2024**¹.

Provisional Selection List Announcement: The provisional selection list for all campuses, other than special categories, will be announced following the verification process

RGUKT AP Admission: వచ్చే వారంలో ట్రిపుల్ఎటీ ప్రవేశాల ప్రకటన!
* నాలుగు క్యాంపస్లలో 4,400 సీట్ల భర్తీ

* ఈనాడు ప్రతిభ డెస్క్: రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో (ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2024-25 విద్యా సంవత్సరానికి పీయూసీ-బీటెక్ ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల కాబోతోంది.

వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల:

‣వర్సిటీ అధికారులు వీలైనంత త్వరగా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ‣నోటిఫికేషన్ విడుదల తర్వాత, ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జులై నెలలో తరగతులు ప్రారంభం కానున్నాయి.

మొత్తం సీట్లు:4400

‣ నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.

►రాష్ట్ర విద్యార్థులకు 85% సీట్లు కేటాయించారు.

‣మిగిలిన 15% సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడతారు.

అర్హత:

‣పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు.

‣ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్య తేదీలు:

‣నోటిఫికేషన్ విడుదల తేదీ: 06.05.24

►ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.05.24 11am

Official Website

Download Complete Notification

MS Dhoni: ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలి.. టీమిండియా మాజీ క్రికెటర్ విమర్శలు!

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న సమయంలో అద్భుతమైన గెలుపును నమోదు చేసింది గైక్వాడ్ సేన. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సీఎస్​కే అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో సీఎస్​కే పాయింట్స్ టేబుల్​లో థర్డ్ ప్లేస్​కు ఎగబాకింది. అయితే చెన్నై నెగ్గినా గానీ ఎంఎస్ ధోని ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఐపీఎల్-2024లో ధోని ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 110 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 224గా ఉంది. చివరి రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో టీమ్​ భారీ స్కోర్లు అందుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అయితే మాహీ ఉన్న ఫామ్​కు, నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు కొడుతున్న పద్ధతికి కాస్త ముందే బ్యాటింగ్​కు వస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా రికవరీ అవకపోవడంతో అతడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్​కు దిగుతున్నాడు. నిన్న పంజాబ్​తో మ్యాచ్​లో తొమ్మిదో స్థానంలో ఆడాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శలకు దిగారు.

Former Indian cricketer criticizes Dhoni

ఎంఎస్ ధోని ఇలాగే నంబర్ 9లో బ్యాటింగ్​కు దిగాలని భావిస్తే అతడి బదులు మంచి బౌలర్​ను టీమ్​లోకి తీసుకుంటే సరిపోతుందని భజ్జీ అన్నాడు. ఆ ప్లేస్​లో ఓ బౌలర్​ను ఆడిస్తే వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో వచ్చి కొన్ని పరుగులు చేస్తాడు కదా.. అలాంటప్పుడు జట్టులో మాహీ అవసరం ఏం ఉందని ఇన్​డైరెక్ట్​గా క్వశ్చన్ చేశాడు. బ్యాటింగ్​ ఆర్డర్​లో పైకి వచ్చి ఆడలేనప్పుడు ధోని ఆడటం ఎందుకని ప్రశ్నించాడు. మాహీ ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని టర్బనేటర్ సూచించాడు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్​కు రావడం చెన్నైకి మంచిది కాదని.. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరింత ముందుకు వచ్చి ఆడాలని పఠాన్ అన్నాడు. ఒకట్రెండు ఓవర్లు ఆడితే టీమ్​కు ఏమాత్రం లాభిందని స్పష్టం చేశాడు.

Amazon Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది. అందుకే, ఈ Amazon Sale నుండి మరిన్ని ఆఫర్లు యూజర్ల కోసం అందిస్తోంది. అందులోనూ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఇందులో Sony Smart Tv పైన అమెజాన్ అందించిన జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు చూడనున్నాము.

Amazon Sale Sony Smart Tv
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు సోనీ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74L స్మార్ట్ టీవీ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. సోనీ యొక్క 55 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి 45% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది . ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ కేవలం రూ ధరకే లభిస్తుంది.

Amazon Sale Sony Smart Tv
Sony Smart Tv
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన All Banks Debit and Credit Card డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అంటే, ఈ సోనీ స్మార్ట్ టీవీ ని బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసినట్లయితే రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా యూజర్లు అందుకోవచ్చు. Buy From Here

Sony Smart Tv ప్రత్యేకతలు

సోనీ బ్రావియా 55 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 3840 x 2160 స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4K HDR,లైవ్ కలర్, 4K X Reality Pro మరియు Motion Flow XR100 వంటి ఫీచర్స్ తో హై క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీ 20 Watts అందించగల ఓపెన్ బఫెల్ స్పీకర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ కాన్వాయ్‌ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్‌ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జనసైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలో నుంచి వైకాపా వర్గీయులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేలోపు వైకాపా వర్గీయులు టపాకాయలు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు.. నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. సాయిధరమ్‌తేజ్‌ తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్‌ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుణ్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పంపించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయిపై వేసిన రాయి తనకు తగిలినట్లు క్షతగాత్రుడు శ్రీధర్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్‌ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక ఉక్రోషంతో వైకాపా వర్గీయులు దాడికి దిగినట్లు జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దాడికి పాల్పడిన తీరును జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌కు స్థానికులు వివరించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుణ్ని పరామర్శించారు. ఓటమి భయంతోనే వంగాగీత ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం కల్లా నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. కడప, కర్నూలు నుంచి కొందరు పిఠాపురం వచ్చారని సమాచారం తమకు ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

18 ఏళ్లు నిండితే చాలు అక్రమసంబంధం పెట్టుకోవచ్చు: హైకోర్టు

ఇటీవలే కాలంలో కోర్టులు అనేక సంచలన తీర్పులు ఇస్తున్నాయి. కొన్ని తీర్పులు అయితే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కుటుంబ విషయాలు, వివాహేతర సంబంధం, శృOగారంకి సంబంధించిన అంశాలపై కోర్టులు అనేక సంచలన, ఆసక్తికరమైన తీర్పులు ఇస్తుంటాయి. ఇప్పటికే వివాహేత సంబంధం పలు కోర్టులు కీలక తీర్పులు ఇచ్చాయి. అలానే వరకట్నం, ఇతర కుటుంబ అంశాలకు సంబంధించి..కూడా పలు హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. తాజాగా ఓ కోర్టులు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. మరి.. ఆ తీర్పు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా లైంగిక సంబంధాలు అనేవి భార్యభర్తల మధ్యే ఉండాలని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అలా కాకుండా ఇతరులతో సంబంధం పెట్టుకుంటే నేరంగా భావిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో అయితే అలా ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. ఆ గ్రామ పెద్దలు శిక్షలు కూడా వేస్తారు. కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టు..వీటన్నిటికి భిన్నంగా తీర్పు ఇచ్చింది. పద్దెనిమిది ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నా, చేసుకోకపోయినా ఇష్టప్రకారం.. ఇల్లీగల్ రిలేషన్ ఉంటే తప్పు లేదని హైకోర్టు తెలిపింది. అంటే కోర్టు ఇచ్చిన తీర్పు చూసినట్లు అయితే వారి వివాహ స్థితితో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య పర్సపర అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిగితే ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేసింది.

ఓ యువతిని వివాహితుడు మోసం చేశాడనే కేసు విచారణలోకి వచ్చింది. ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానే సాకుతో వివాహితుడు మోసం చేశాడనే కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుదీర్ఘ విచారణ చేసిన అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టులు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ఉంటే అది అత్యాచారం లేదా మోసం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. అతను బలవంతపు సంబంధం పెట్టుకున్నట్లు, రే*ప్ చేసినట్లు ధృవీకరించబడలేదు కాబట్టి అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

అంతేకాక నిందితుడి పెళ్లైన విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి సంబంధాన్ని కొనసాగించిందని.. ఇద్దరు ఇష్టపడే చేశారని కోర్టు అభిప్రాయపడింది. ఇక ఈ తీర్పు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్రమ సంబంధం పెట్టుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో సంప్రదాయాలు మంటగలిసిపోతాయని.. ఇష్టారీతిన రెచ్చిపోతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య కల్చర్ మన భారత్‌లోకి పూర్తిగా వచ్చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనడుస్తోంది. ఏపీలో డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేవీ రాజేంద్రనాథ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎలాంటి ఎన్నికల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు నియమించే అవకాశం ఉంది. దీనిపై ఏపీ పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా సిద్దం చేసి పంపాలని ఎన్నికల సంఘం సీఎస్‌ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 1990 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారి సీహెచ్ తిరుమల రావు సీనియారిటీ ప్రకారం ప్యానల్ జాబితాలో చోటు సంపాధించుకున్నారు.

డీజీపీ ఎంపిక జాబితాలో అంజనా సిన్హా, మాది రెడ్డి ప్రతాప్‎లు ఉన్నారు. అంజనా సిన్హా 1990 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‎గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక డీజీపీ ప్యానల్ సభ్యుల జాబితాలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి 1991 బ్యాచ్‎కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరికో ఒక్కరికి ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది. ఒక వేళ ఈ ముగ్గురిని కాకుండా మరొకరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న హరీష్ కుమార్ పేరును కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈయన 1992 బ్యాచ్‎కు చెందిన ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

చేతుల పై ముడతలు వస్తున్నాయా.. చర్మాన్ని ఇలా బిగుతుగా మార్చుకోండి..

వయస్సు దాటిన తర్వాత చర్మం పై ముడతలు కనిపించడం సహజం. అయినా ఆ ముడతలను నివారించడానికి తమ ముఖ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి అనేక నివారణలు, ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటారు. అంతే కాదు ముఖాన్ని అందంగా ఉంచుకునేందుకు చికిత్సలు చేయించుకుంటారు. కానీ చేతులు, కాళ్ళ చర్మాన్ని విస్మరిస్తారు. పెరుగుతున్న వయస్సు మీ ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మం పై ప్రభావం చూపుతుంది. దీని ద్వారా ఎవరైనా మీ వయస్సును సులభంగా అంచనా వేయవచ్చు. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంతో పాటు చేతుల చర్మం పై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెరుగుతున్న వయస్సుతో చేతులు, కాళ్ళ చర్మం కూడా మారడం ప్రారంభమవుతుంది. చర్మంలో ముడతలు, వదులుగా ఉండటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీరు వృద్ధుల్లాగా కనిపించవచ్చు. చాలా సార్లు ఈ సమస్య వయస్సు రాకముందే సంభవిస్తుంది. దీనికి కారణాలు సరైన చర్మ సంరక్షణ తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం. ప్రస్తుతానికి, చేతులు, కాళ్ళ చర్మాన్ని ఎలా బిగుతుగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.

కొబ్బరి నూనె, బాదం నూనె ఉపయోగించాలి..

చేతులు, కాళ్ల చర్మం యవ్వనంగా ఉండాలంటే కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి రాసుకోవచ్చు. ఈ రెండు నూనెలతో మీ చర్మం పోషణ పొంది క్రమంగా చర్మం బిగుతుగా మారుతుంది. వాస్తవానికి, కొబ్బరి నూనె మీ చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా చేస్తుంది. అయితే బాదం నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు నూనెలను మిక్స్ చేసి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చేతులకు, కాళ్లకు అప్లై చేయండి.

సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి..

నిజానికి ముఖం కంటే మన చేతులు నీరు, సబ్బు, డిటర్జెంట్ మొదలైన వాటిని ఎక్కువగా తాకడం వల్ల చేతుల చర్మం పొడిబారే అవకాశం ఉంది. అందువల్ల, మీరు మీ చేతులకు మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తూ ఉండాలి. మీరు చేతులు, కాళ్ళ చర్మాన్ని తేమగా ఉంచుకోకపోతే, చర్మంలో తేమ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీ చేతులు చాలా పొడిగా, నిర్జీవంగా మారుతాయి. అలాగే ప్రజలు తమ ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేస్తారు. కానీ వారి చేతులను విస్మరిస్తారు. దీని కారణంగా, మీ చేతుల చర్మం దెబ్బతినడం ప్రారంభమవుతుంది.

చేతుల పై ముడుతలను తొలగించేందుకు ఈ ప్రత్యేక ప్యాక్‌..

చేతుల చర్మం యవ్వనంగా, అందంగా ఉండాలంటే ఒక గిన్నెలో వెన్న తీసుకుని అందులో బ్రౌన్ షుగర్ కలపండి. దీని తరువాత ఈ పేస్ట్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్ట్‌ని చేతులు, పాదాలకు బాగా పట్టించి, కాసేపు అలాగే ఉంచి, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

Weight Loss: ఈ డ్రింక్స్ ను రోజుకు ఒక్కసారి తాగితే సులువుగా బరువు తగ్గుతారు..

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో చేస్తుంటారు.. బరువు తగ్గితే సగం రోగాలు తగ్గుతాయని స్వయంగా వైద్యులే సలహా ఇస్తున్నారు.. బరువు తగ్గడం అంత సులువు కాదు..శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నిలువ ఉండడం వల్ల హానికర బ్యాక్టీరియాలు పెరిగే అవకాశముంది. ఈ బరువుల సమస్యను కేవలం పానియాలు తాగి తగ్గించుకునే ప్రయత్నం చేయచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

జీలకర్ర వాటర్..

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి శరీరంలో వేడిని పెంచి బరువును తగ్గించడంలో సహాయ పడతాయి.. అలా బరువు తగ్గిపోతారు..

గ్రీన్ టీ..

గ్రీన్ టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కెటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వల్ల కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుకే రోజుకు ఒక కప్ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు..

బ్లాక్ టీ..

బ్లాక్ టీ అంటే టీ డికాషన్.. అందరికీ తెలిసే ఉంటుంది. క్యాలరీలను బర్న చేసే కెఫిన్ ఉంటుంది. శరీరంలో కొవ్వును కరిగించి పాలిఫెనాల్స్ ఈ టీలో ఉండటం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

నీళ్లు..

ప్రతి రోజు నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో 20 నుంచి 30 శాతం క్యాలరీలు బర్న్ అవుతాయని చెబుతున్నారు.. నీళ్లు ఎక్కువగా తాగే వాళ్లకు బరువు కంట్రోల్ లో ఉంటుంది.. అందుకే రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాదు ప్రోటీన్ డ్రింక్స్ తో పాటుగా యాపిల్ సైడర్ వెనిగర్‌ ను కూడా తాగవచ్చునని చెబుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనేవారు కాస్త వ్యాయామం కూడా చెయ్యడం మంచిది.. అప్పుడే బరువు కంట్రోల్ ఉంటుంది.

Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా? అయితే డేంజర్లో పడ్డట్లే..

మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర ముంచుకోస్తుంది.. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నిద్ర వస్తుంది.. అయితే కొంతమంది మాత్రం నిద్రపోతారు.. మరి కొంతమంది మాత్రం నిద్రపోతే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని భయపడుతుంటారు.. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం అవ్వగానే నిద్ర రావడం సహజమే. అయితే నిపుణులు ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయాని చెబుతున్నారు.. భోజనం తిన్న వెంటనే పడుకుంటే జీర్ణ రసాలు తిన్న ఆహారంలో కలుస్తాయి.. దాంతో ఆమ్లత్వం ఏర్పడుతుంది..

అలా ఆమ్ల స్వభావం కారణంగా గొంతు మంట ఏర్పడుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తెస్తుంది.. అప్పుడు జీర్ణం అవ్వదు.. జీర్ణ వ్యవస్థ పని తీరు తగ్గుతుంది.. అంతేకాదు గురక కూడా వస్తుందట.. అందుకే భోజనం అయ్యాక ఒక గంట తర్వాత పడుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.. తిన్న వెంటనే ఒక పదినిమిషాలు వాక్ చెయ్యడం మంచిది.. ఆ తర్వాత అరగంట తర్వాత నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు..

Cucumber Benefits : ఎండాకాలంలో కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

కీరదోస కాయను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది.. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి.. సమ్మర్ లో కీరాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకుంటే వేడిని తగ్గించాలి.. వడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.. వేసవిలో ఈ కాయలు మనకు బాగా ఉపయోగపడతాయి.. ముఖ్యంగా డిహైడ్రేషన్ కు గురవ్వకుండా కాపాడుతుంది. వీటిలో 95 శాతం నీళ్లు ఉంటాయి..

ఇక శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అంతేకాదు వీటిలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారు కచ్చితంగా వారి ఆహారంలో దోసకాయని యాడ్ చేసుకోవాలి.. ఇంకా చెప్పాలంటే వేడిని తట్టుకొనేలా, ఎప్పుడు శరీరాన్ని హైడ్రెడ్ గా ఉండేలా చేస్తుంది.. ట్యాన్ రిమూవల్ గా కూడా పనిచేస్తుంది.. చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది.

కసితో ఓటేశాం! మేమేంటో ప్రభుత్వానికి చెప్పే సమయం వచ్చింది: ఉద్యోగులు

కసితో ఓటేశాం!

» మేమేంటో ప్రభుత్వానికి చెప్పే సమయం వచ్చింది: ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి ): “ఐదేళ్లుగా ఉద్యోగులను చులకనగా చూస్తూ అన్ని విధాలుగా నిర్బంధాలు విధించిన ఈ ప్రభుత్వం గద్దె దిగాలి.. అందుకే కసితో ఓటేశాను. ప్రతి ఉద్యోగీ నాలాగే కసితో ఓటేశారు” అని విశా ఖలోని ఏయూలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఆది వారం ప్రారంభమైంది. ఇక్కడ మెజారిటీ ఉద్యోగులు కూటమి అభ్యర్థులకే ఓటేసినట్టు చెప్పారు. ఓటు రూపంలో తమ నిరసన తెలిపామని రిటైర్మెం ట్కు దగ్గరలో ఉన్న ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగులంటే ఏమిటో.. చెప్పే సమయం వచ్చింది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశా’ అని మహిళా ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అవకాశం దొరుకుతుందని టీచర్ ఒకరు ప్రశ్నించారు. తొలిరోజు ఓటేయడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూ కట్టారు. మొత్తంగా 5వేల మంది ఓటేశారని ఉపా ధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు వివరించారు.

ఓట్లేయలేం.. మీ నోట్లు మాకొద్దు

ఒంగోలు, న్యూస్టుడే: ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు

వైకాపాకు ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు. ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచే స్తున్నారు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరస్కరిస్తు న్నారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం పాఠశాల వద్ద ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా.. సమీ పంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్య ర్థిస్తూ రూ.5 వేలు ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్క రించిన ఆమె నేరుగా తెదేపా శిబిరం వద్దకు వచ్చి రూ. పది వేలు అందజేస్తూ ‘ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి.. ఇది మీ పార్టీకి నా విరాళం’ అని చెప్పారు.

IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

Orange Cap: ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ రేసులో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 11 మ్యాచుల్లో 542 పరుగులు చేశాడు.

రెండో స్థానంలో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. అతడు 10 మ్యాచుల్లో 509 పరుగులు బాదాడు. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. 11 మ్యాచుల్లో అతడు 424 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవాలంటే ఆయా బ్యాటర్ల జట్లు ప్లే ఆఫ్‌లోకి ప్రవేశిస్తేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

అత్యధిక పరుగులు బాదిన టాప్-10 ప్లేయర్స్

ఆటగాడు మ్యాచులు ఇన్నింగ్స్ పరుగులు
1 విరాట్ కోహ్లీ 11 11 542
2 రుతురాజ్ 10 10 509
3 సాయి సుదర్శన్ 11 11 424
4 రియాన్ పరాగ్ 10 9 409
5 కేఎల్ రాహుల్ 11 10 406
6 ఫిలిప్ సాల్ట్ 11 11 406
7 రిషబ్ పంత్ 11 11 398
8 ట్రావిస్ హెడ్ 9 9 396
9 సంజూ శాంసన్ 10 10 385
10 సునీల్ నరైన్ 11 10 380

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

Royal Challengers Bengaluru : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కాస్త ఆల‌స్యంగా పుంజుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు నుంచి ఏడో స్థానానికి ఎగ‌బాకింది. లీగ్ ద‌శ‌లో ఆర్‌సీబీ ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ డుప్లెసిస్ సేన ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.?

ష‌ర‌తు 1 : ఎట్టి ప‌రిస్థితుల్లో ఆర్‌సీబీ లీగ్ ద‌శ‌లో మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించాలి. అప్పుడు ఆ జ‌ట్టు 7 విజ‌యాల‌తో 14 పాయింట్లను క‌లిగి ఉంటుంది. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ నెట్‌ర‌న్‌రేటు -0.049గా ఉంది. మిగిలిన మ్యాచుల్లో భారీ విజ‌యాలు సాధించి వీలైనంత మేర నెట్‌ర‌న్‌రేటును మెరుగుప‌ర‌చుకోవాలి.

ష‌రతు 2 : బెంగ‌ళూరు మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచిన‌ట్ల‌యితే.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ లేదా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లు త‌మ మిగిలిన లీగ్ మ్యాచుల్లో ఒక‌టి కంటే ఎక్కువ విజ‌యాలు సాధించ‌కూడ‌దు. ఎందుకంటే రెండు జ‌ట్లు కూడా 10 మ్యాచులు ఆడి 12 పాయింట్ల‌తో ఉన్నాయి.

ష‌ర‌తు 3 : అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం 10 పాయింట్ల‌తో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు రెండు కంటే ఎక్కువ విజ‌యాలు సాధించ‌కూడ‌దు.

ష‌ర‌తు 4 : టాప్‌-4 నిలిచేందుకు పంజాబ్ కింగ్స్ సైతం పోటీప‌డుతోంది. 10 మ్యాచులు ఆడిన ఆ జ‌ట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. ఆ జ‌ట్టు సైతం రెండు కంటే ఎక్కువ మ్యాచులు గెల‌వ‌కూడ‌దు.

పై నాలుగు జ‌రిగితేనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ లీగ్ ద‌శ‌లో ఆర్‌సీబీ ఆడాల్సిన మూడు మ్యాచుల్లో ఒక్క‌టి ఓడిపోయినా కూడా ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయిన‌ట్లే.

ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్

వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణంతో ఉండగానే మట్టిలో పూడ్చేశారు. అటుగా వెళ్తోన్న ఓ ట్యాంకర్ డ్రైవర్ మట్టిలో ఏదో కదులుతున్న ఆనవాళ్లు గుర్తించి తవ్విచూశాడు. పసిగడ్డు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానిక ఉపాధి కూలీల సాయంతో ఆసుపత్రికి తరలించి పసికందుకు పునర్జన్మను ప్రసాదించాడు. గుండెలు పిండేసే ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయరహదారి పక్కన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్‌ డ్రైవర్‌ రాందినయ్‌ జాతీయరహదారి పక్కనే ఉన్న నీటి తొట్టి నుంచి శనివారం నీటిని రోడ్డు విస్తరణ పనులకు తీసుకువెళ్తున్నాడు. నీటితో ట్యాంకర్‌ను నింపుతున్న క్రమంలో రహదారి పక్కనే మట్టిలో ఓ శిశువు కాళ్లు, చేతులు కదులుతూ కనిపించింది. మట్టిని తొలగించి చూడగా ఓ ఆడశిశువు కనిపిచింది. కొన ఊపిరితో పాప కొట్టుమిట్టాడుతోంది. లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. అక్కడే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను పిలిచి శిశువును కాపాడారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు రాగా.. వారి వాహనంలోనే దామెర క్రాస్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఆడ శిశువు కావడంతో తల్లిదండ్రులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి కళ్లు ఎప్పుడు ఎందుకు మూసి ఉంచుతారు? – కారణం ఇదేనట! – Fascinating Facts About Tirumala

Fascinating Facts About Tirumala Balaji : భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇది దేశంలోనే రెండో అత్యంత ధనిక దేవాలయం. కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోరికలు తీర్చే.. శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే.. తిరుమలలో(Tirumala) కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే ఆయన కళ్లు ఎప్పుడూ మూసే ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు స్వామి వారి కళ్లు ఎందుకు మూసి ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? దీనిపై పండితులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వేంకటేశ్వరుని కళ్లు ఎందుకు మూసి ఉంచుతారంటే?

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల దేవస్థానాన్ని కలిగయుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. అయితే.. ఇక్కడ శ్రీహరి అవతారంలో కొలువై ఉన్న తిరుమలేశుడి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతారు. తెల్లని క్లాత్ కడతారు. అయితే, ఎందుకు స్వామి వారి నేత్రాలు మూసి ఉంచుతారనే దానికి పండితులు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. వేంకటేశ్వరుని కళ్లు విశ్వశక్తికి మించినవని.. అందుచేత భక్తులు శ్రీవారి కళ్లలోకి నేరుగా చూడలేరట. ఈ కారణం చేతనే.. తిరుమల బాలాజీ కళ్లు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు.

అయితే, ప్రతి గురువారం వేంకటేశ్వర స్వామి కళ్ల ముసుగును మారుస్తారట. ఆ టైమ్​లో మాత్రమే కొన్ని క్షణాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలరని పండితులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. మీరు తిరుమల వేంకటేశ్వరుని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి.

స్వామివారి విగ్రహ రహస్యం : తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేశుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారుతుందట. ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదట. అంతేకాదు.. గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందట. ఇది కూడా నేటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది.

విగ్రహ రాతి విశిష్టత : ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలి పోతుంది. కానీ, నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు. అయినా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం.

గర్భగుడిలో దీపాల రహస్యం : తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం.. గర్భగుడిలోని వేంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు. నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.

తిరుమల వెళ్తున్నారా? – కొండపై గదులు దొరక్కపోతే ఏం చేయాలి? – ఇలా చేస్తే పక్కా! – Rental Rooms In Tirumala

Rental Rooms in Tirumala : తిరుమల కొండపై వెలసిన వేంకటేశ్వర స్వామి దర్శనానికి సాధారణ రోజుల్లోనే భక్తులు పోటెత్తుతారు. అలాంటిది ఇక సెలవు దినాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. భక్తజనంతో తిరుమల గిరులు కిక్కిరిసిపోతాయి. ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో.. కొండపై ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లాకర్లు మొదలు.. అద్దె గదుల వరకు అన్నీ నిండిపోతాయి. ఫలితంగా.. అత్యవసరమైన వారు రూములు లభించక అవస్థలు పడుతుంటారు.

అందుకే.. చాలా మంది ముందుగానే ఆన్​లైన్​లో దర్శన టికెట్లు, అద్దె గదులు బుక్​ చేసుకొని వెళ్తుంటారు. నెల రోజులు ముందుగానే టీటీడీ రూమ్​ల బుకింగ్​ ఓపెన్ చేస్తుంది. అయితే.. బుకింగ్ తెరిచిన కాసేపటికే గదులు మొత్తం నిండిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని గదులు బ్లాక్​ చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన “డయల్ యువర్ ఈవో” కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గదుల బుకింగ్​ సమస్యను కూడా భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. స్పందించిన ఈవో గదులు అత్యవసరమైన వారు ఎలా బుక్​ చేసుకోవచ్చో వివరించారు.

టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలో ఈ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానాలు చెప్పారు. ఆన్‌లైన్‌ లో విడుద‌ల చేస్తున్న టికెట్లు వెంట‌నే అయిపోతున్నాయని.. ఎంత ప్రయత్నించినా బఫరింగ్ అవుతోందే తప్ప టికెట్లు బుక్ కావడం లేదని.. ఇదంతా చూస్తుంటే పారదర్శకత లోపించిందేమో అనే సందేహం కలుగుతోందని ఓ భక్తుడు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈవో.. శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ చాలా పారదర్శకంగా ఉందన్నారు. ఎటువంటి అనుమానాలకూ చోటు లేదని చెప్పారు.

తిరుమల కొండపై 7,500 గదులు మాత్రమే ఉన్నాయని ఈవో చెప్పారు. ఇందులో 50 శాతం గదులు ఆన్​లైన్​ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎంతో మంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుంటారు కాబట్టి.. వెంటనే అయిపోయే అవకాశం ఉందన్నారు. ఆన్​లైన్​లో రూమ్స్​ దొరకని భక్తులు.. తిరుమలలో సీఆర్వోలో నమోదు చేసుకోవడం ద్వారా రూమ్స్​ పొందే అవకాశం ఉందని ఈవో చెప్పారు

Fat Burning Drink: మీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుందా? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి చాలు..

Fat Burning Drink: చియా సీడ్స్ అనే పేరు చాల మంది ఈ మధ్య వింటున్నారు. చాలా మందికి అసలు వీటి గురించి తెలియదు. వీటిని మనం నిత్యం వాడుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. సుఖ విరోచనం అవుతుంది. శరీర బరువు కూడా బాగా తగ్గుతారు. బరువును పెంచకుండా చేయడానికి ,బ్లడ్లో కొలెస్ట్రాల్ చేరకుండా చేయడానికి హెల్తీగా ఉండటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చీయా సీడ్స్. దీనివల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించడానికి , డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువగా ఇన్ల్ఫమేషన్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాడీ లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి చీయా సీడ్స్ ఉపయోగపడుతున్నాయి. చీయా సీడ్స్ లో ఉండే పోషకాలు ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. వంద గ్రాముల చీయా సీడ్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

క్యాల్షియం 636 మిల్లీగ్రాములు అంటే పాల కంటే ఫైవ్ టైమ్స్ క్యాల్షియం లభిస్తుంది. 330 మిల్లీగ్రాముల మెగ్నీషియం ,ఫాస్పరస్ 450 మిల్లీగ్రాముల ఉంటుంది. మెదడు కణాల పనితీరును నియంత్రించడం జరుగుతుంది. పొటాషియం 400 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇవన్నీ పోషకాలు కలిగిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బాడీ లో గుండె సంబంధమైన వ్యాధులు రావు. ఎందుకంటే చియా సీడ్స్ కొలెస్ట్రాల్ ను కట్ చేస్తుంది.

ఆరోగ్య సమస్యలు రాకుండా నిరోధించే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ చీయా సీడ్స్‌లో ఉన్నాయి. ఈ చియా సీడ్స్ లో ముఖ్యంగా 34 గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. మీరు ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ఉండే కొవ్వు లాంటివి ఆహారంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటివి చేరకుండా కాపాడతాయి. ఇందులో ఉండే పీచు బాగా ఉపయోగపడతాయి ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్ధాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. చీయా సీడ్స్ పిండి పదార్ధాలు లోపలికి వెళ్లకుండా పిండిపదార్ధాలు చక్కెరగా మారి రక్తంలో చక్కెర పెరగనివ్వకుండా చేస్తుంది.

చీయాసీడ్స్‌ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్సులిన్ నిరోధకత రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ముఖ్యంగా చీయాసీడ్స్ డయాబెటిస్‌ ఉన్నవారికి తరచూ గాయాలు మానవు. దెబ్బలు గాయాలు మానకుండా పోతాయి. అలాంటి వారికి ఇన్ల్ఫమేషన్‌ తగ్గించడానికి కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతాయి. 2007వ సంవత్సరంలో టొరంటోలో ఈ పరిశోధనలో చేసిన సైంటిస్టులు ఈ విషయం చెప్పారు.

చీయా సీడ్స్‌ తీసుకునే విధానం..
అయితే, చీయా సీడ్స్‌ మన ఆహారంలో చేర్చుకుంటే వాటిని ఓ ఆరు గంటలపాటు మందుగానే నానబెట్టుకుని తీసుకోవాలి. ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇలా ముందుగానే నానబెట్టి తీసుకోవాలి. అలాగే టైం లేనప్పుడు ఎప్పుడైనా ఒక గంట రెండు గంటలు నీళ్లలో నానబెట్టి వాటిని తీసేసి మీరు తినే సలాడ్‌లో వేసుకుని తీసుకోండి. వేడి వేడి సూప్ తో తీసుకుంటే బాగుంటుంది. లేదా డ్రెస్సింగ్ మాదిరి వేసుకుని కూడా తీసుకోవచ్చు. రెండు స్పూన్లు నీళ్లు వేసి నానబెట్టి దానికి తేనె నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు.

Refrigerator: ఈ విషయం తెలిస్తే ఫ్రిజ్ వాడాలంటే భయపడతారు

Refrigerator: ఫ్రిజ్ ను వాడని వారు ఉంటున్నారా? ప్రతి ఒక్కరు ఈ మధ్య ఈ ఫ్రిజ్ ను వాడుతున్నారు. పూరి గుడిసెల నుంచి పెద్ద పెద్ద విల్లాల వరకు ఈ ఫ్రిజ్ లు ఉంటున్నాయి. ఇక ఈ ప్రిజ్ లు మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. వామ్మో ఇదేంటి ఫ్రిజ్ కు ఏమైనా ప్రాణం ఉందా ప్రాణాలు తీయడానికి అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు మీరు కింద తెలిపిన విషయం చదివిన తర్వాత ఫ్రిజ్ వాడాలంటే భయపడతారు. ఇంతకీ ఈ ఫ్రిజ్ లు మనుషులకు ఎలాంటి నష్టాలను తెస్తున్నాయో ఓ సారి తెలుసుకోండి.

మానవులు ఆరోగ్యాన్ని పాడు చేసే మొట్టమొదటి వస్తువు ఏది అంటే ఫ్రిజ్ అంటున్నారు నిపుణులు. అయితే ఫ్రిజ్ లో కూరగాయలను, ఇతర ఐటమ్స్ ను పెట్టినప్పుడు రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ చల్లదనం ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కు తగ్గట్టు ఉన్న ఆహార పదార్థాల వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ వాటిని వేడి చేసి తినడం వల్ల ఆయా వస్తువుల్లో ఉన్న పోషక విలువలను పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు ఆ పదార్థాలు విషంగా కూడా మారవచ్చు అంటున్నారు నిపుణులు.

నమిలి తినడం అనే ప్రాసెస్ లో లాలాజలం చాలా ఉపయోగపడుతుంది. కానీ చల్లని పదార్థాలు తినడం వల్ల ఈ లాలాజలం రాదు అంటున్నారు నిపుణులు. అంతేకాదు జీర్ణ వ్యవస్థ కూడా ఎక్కువగా పనిచేయదు. తిన్న ఆహారం జీర్ణం అవదట. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయట. ప్రిజ్ లో పెట్టిన పదార్థాలను తినాలి అనుకున్న రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు ఉంచాలట. లేదంటే చాలా సమస్యలు వస్తాయట.

గతంలో చాలా మంది రాత్రి అన్నం తినేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక రోజు లోనే పాడయ్యే పదార్థాలను రెండు మూడు రోజులు ఉంచి మరీ తింటున్నారు. ఇలాంటి వాటివల్ల మరింత సమస్యలు పెరుగుతున్నాయి. చెడిపోయే ఆహారాన్ని చల్లదనం వల్ల రెండు మూడు రోజులు ఉంచి తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే ఫ్రిజ్ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. సో ఫ్రిజ్ ను ఉపయోగించే ముందు కాస్త ఆలోచించి వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. మరి తస్మాత్ జాగ్రత్త.

Heat Waves: సూర్యుడు చంపేస్తున్నాడు.. ఒకేరోజు 19 మంది మృతి

Heat Waves: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలో దంచికొడుతున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 45 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.

వడగాలుల తీవ్రత పెరిగే ఛాన్స్‌..
శనివారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఆది, సోమవారాల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

వడదెబ్బకు 19 మంది మృతి..
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 19 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవో బత్తుల భూమయ్య, భీర్‌పూర్‌ మండలం మగేళ శివారు గోండగూడెంకు చెందిన కొమురం సోము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌మండలం భల్లునాయక్‌ తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్‌ రామన్న అస్వస్థతకు గురై మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రునాయక్‌ మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన దేవయ్య, సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట కు చెందిన యాదయ్య వర్గల్‌కు చెందిన నాగయ్య మృతిచెందారు.

వరంగల్‌ జిల్లాలో ఆరుగురు..
వడదెబ్బతోఒక్క వరంగల్‌ జిల్లాలోనే ఆరుగురు మృతిచెందారు. చెన్నారావుపేట మండలానికి చెందిన భాస్కర్, హరియా తండాకు చెందిన నర్సింహ, ఇప్పల్‌తండాకు చెందిన అజ్మీర మంగ్యా, రంగాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య, కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేలక లస్మయ్య వడదెబ్బతో ప్రాణాలు విడిచారు.

ఇద్దరు ఉపాధి కూలీలు..
కామారెడి డజిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామానికి చెందిన రాములు, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులకు చెందిన వనమాల ఉపాధి పనిస్థంలోనే కుప్పకూలారు.

Health

సినిమా