ICSE 10th class results 2024 : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల

సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది ఉత్తీర్ణులయ్యారు. 99,901 మంది విద్యార్థులు ఐఎస్సీ క్లాస్​ 12 పరీక్ష రాయగా.. అందులో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్​ఈ పాస్​ పర్సెంటేజ్​ 99.47శాతం కాగా.. ఐఎస్​సీ పాస్​ పర్సెంటేజ్​ 98.19శాతంగా నమోదైంది. ఐసీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు పాలయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్​ అయ్యారు. 10 క్లాస్, ​12 క్లాస్ ఫలితాలను www.cisce.org అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సీఐఎస్సీఈ తెలిపింది. డిజీలాకర్​లో ఫలితాలను https://results.digilocker.gov.in ద్వారా చూడొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- ఇవాల్యుయేషన్​​ వెసులుబాటును కల్పిస్తున్నట్లు సీఐఎస్​సీఈ ప్రకటించింది. ఒక్కో సబ్జెక్ట్ కి రీ-చెకింగ్​కి రూ. 1000, రీ- ఇవాల్యుయేషన్​కి రూ. 1,500 చెల్లించాలని సూచించింది. ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్​ 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్​ 21న నిర్వహించారు. ఇప్పటికే ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ కంపార్ట్​మెంట్​ పరీక్షలను డిస్కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు విద్యార్థులు, గరిష్ఠంగా రెండు సబ్జెక్ట్స్ ​లో ఇంప్రూవ్​మెంట్​ పరీక్షలు రాసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సీఐఎస్​సీఈ వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *