Saturday, November 16, 2024

Saving Schemes: అమేజింగ్ స్కీమ్.. భార్యాభర్తలకు 5 ఏళ్లలో రూ.25 లక్షలు!

Small Saving Schemes | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది.
పోస్టాఫీస్ లేదంటే బ్యాంకుల్లో ఈ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ పథకాల్లో చేరొచ్చు. కచ్చితమైన లాభం సొంతం చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల్లో స్కీమ్స్‌లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటిలో కెల్లా ఇందులోనే మీకు అధిక వడ్డీ లభిస్తుంది.

మోదీ సర్కార్ ఇటీవలనే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచేసింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పైకి చేరింది. ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేటు పెంపు అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల వరకు విత్‌డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ, అసలు రెండు కలిపి పొందొచ్చు.
పోస్టాఫీస్‌ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. డిపాజిట్ మొత్తం లిమిట్‌ను పెంచేసింది. డబుల్ చేసింది. అంటే ఇప్పుడు రెట్టింపు డబ్బును దాచుకోవచ్చు.
ఇది వరకు ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 30 లక్షలకు పెంచారు. అంటే సీనియర్ సిటిజన్స్‌ రూ. 30 లక్షల వరకు డబ్బులు దాచుకునే ఛాన్స్ ఉంటుంది.

ఉదాహరణకు మీరు ఈ స్కీమ్‌లో రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. ఐదేళ్ల కాలంలో 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 42.3 లక్షలు లభిస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా వచ్చాయని చెప్పుకోవచ్చు.

వడ్డీ డబ్బులు త్రైమాసికం చొప్పున చెల్లిస్తారు. అంటే మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వస్తాయి. వార్షికంగా వడ్డీ రూపంలోనే మీరు రూ. 2.46 లక్షలు పొందొచ్చు. మార్చి 31 వరకు చూస్తే అప్పుడు 8 శాతం వడ్డీ ఉండేది.

అదే ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరితే అప్పుడు ఇద్దరికీ రూ. 12.3 లక్షలు వస్తాయి. అంటే ఇద్దరికీ కలిపి రూ. 25 లక్షల వరకు వస్తాయని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరడం వల్ల రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

Indian Railways: 10 నిమిషాల్లో సీట్లో కూర్చోవాలి.. లేకుంటే సీటు రద్దు.. రైల్వే కొత్త నిబంధన

సుదూర రైలులో వెళ్తున్నారా? మీరు బెర్త్ రిజర్వ్ చేసుకున్నారా? మీరు ఏదైనా స్టేషన్ నుండి రైలులో వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఆ రోజులన్నీ ముగిసిపోతున్నాయి.
రైల్వే సమయాన్ని లెక్కించబోతోంది. మీరు రైలు ఎక్కాల్సిన ప్రదేశం నుండి 10 నిమిషాలలోపు మీ సీటులో కూర్చోవాలి. లేదంటే మీ బుకింగ్ రద్దు చేయబడవచ్చు. ఈసారి రైల్వే శాఖ ఇలా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అంటే అది రైల్వే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ప్రయాణికులు ముందస్తుగానే ఐఆర్‌సీటీసీ ద్వారానో ఇతర ఆన్‌లైన్‌లో, రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లోనే బుక్‌ చేసుకుంటారు. అయితే ఇండియన్‌ రైల్వే ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది.

చాలా దూరం ప్రయాణించే రైలు ప్రయాణీకులలో చెడు అలవాటు ఉంది. రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ రెండు లేదా మూడు స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కుతుంటారు. ఉదాహరణకు వ్యక్తి హౌరా లేదా సీల్దా స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేశారనుకుందాం.. కానీ అతను బండేల్ లేదా బుర్ద్వాన్ లేదా మరేదైనా స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. ఇలాంటి అలవాటు చాలా మంది ప్రయాణికుల్లో కనిపిస్తుంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని రైల్వే చెబుతోంది.

కొత్త రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు నిర్దేశించిన సమయానికి 10 నిమిషాలలోపు మీ సీటును చేరుకోకపోతే మీరు ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే, నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్ తర్వాత టికెట్ చెకర్ 10 నిమిషాలు వేచి ఉంటాడు. మీరు ఇప్పటికీ మీ సీటుకు చేరుకోకపోతే టిక్కెట్ చెకర్ మీ సీటును ఖాళీగా ఉన్నట్లుగా గుర్తిస్తారు.

సుదూర రైళ్లలో చాలా మంది ప్రయాణికులు టికెట్‌లో పేర్కొన్న స్టేషన్‌కు బదులుగా తదుపరి స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. అలాంటప్పుడు ఏ సీటులో ప్రయాణీకులు ఉన్నారో లేదా ఏ సీటు ఖాళీగా ఉందో గుర్తించడంలో టికెట్ తనిఖీ చేసేవారికి సమస్య ఏర్పడుతుందట. అందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటోంది.

Motivation: నెగిటివ్ ఆలోచనలతో అనర్ధాలే, వాటిని ఇలా తగ్గించుకోండి

కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏమీ జరగకుండానే ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా…
వారిలో మొదలయ్యేవి ప్రతికూల ఆలోచనలే మొదటే. ఇలా ప్రతిసారి ప్రతికూల ఆలోచనలను వల్ల ఒరిగేది ఏమీ లేదు. మిమ్మల్ని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకునేవి కూడా ఈ ఆలోచనలే. కాబట్టి వాటిని మీ మనసులోంచి ఎంతగా తీసేస్తే మీకు విజయం అంతగా దగ్గరవుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం… రెండు దెబ్బతింటాయి. కాబట్టి నెగటివ్ ఆలోచనలను వదిలించుకోవాలి.

నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు నచ్చిన పనులు చేయాలి. వండడం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వాకింగ్‌కి వెళ్లడం వంటి వాటి ద్వారా మనసును మళ్లించుకోవచ్చు. అప్పటికీ ఆలోచనలు వస్తే ఎవరైనా మనసుకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అలా మనసును మళ్లించడం ద్వారా ఆలోచనలను తగ్గించవచ్చు.
సానుకూల ఆలోచనలను పెంచే పుస్తకాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని ప్రతిరోజు చదవడం ద్వారా కూడా మీ ఆలోచనలను మార్చుకోవచ్చు. మీకు నచ్చని విషయాలను ప్రతిరోజూ డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. మనసులోంచి విషయాలు బయటకు పోతే వాటి వల్ల కలిగే ఆలోచనలు తగ్గుతాయి. అందుకే ఎక్కువ మంది డైరీని రాస్తూ ఉంటారు. ఎంతో మహోన్నత వ్యక్తులకు డైరీలు రాసే అలవాటు ఉంది. సానుకూలమైన మాటలు మాట్లాడే వారు, నెగటివ్ మాటలకు దూరంగా ఉండే వారితోనే స్నేహం చేయండి.

మనసు అంటేనే ఆలోచనల మూట. మనసులో ఏవో ఆలోచనలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు 90% సానుకూలమైనవి అయితేనే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం. ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్లకు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలే వస్తాయి. కనుక జీవితంలో మీరు సంతోషాన్ని చిన్నచిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి.అలా అయితేనే ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి.

వైఫల్యం గురించి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే విజయం గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని ఒక నెగిటివ్ థింకింగ్ మొదలవ్వగానే… మీ ఇష్ట దైవాన్ని తెలుసుకోండి. మీకు నిరాశ కమ్మినప్పుడు మీ జీవితంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోండి. గత వైఫల్యాలను పునాదులుగా భావించండి. అంతేతప్ప వాటిని తలుచుకొని నిరాశ పడవద్దు. ముందు మీకు మీరు సానుకూలంగా మారాలన్న నిర్ణయానికి రండిజ. మీరు ఎంత గట్టిగా ఆ నిర్ణయం తీసుకుంటే మీలో మార్పు త్వరగా వస్తుంది.

ఒక చిన్న బంగాళదుంపలో ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ కు బై బై చెప్పవచ్చు..

బంగాళదుంప( potato ).. చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్స్ లో ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు బంగాళదుంపను ఇష్టంగా తింటుంటారు. పైగా బంగాళదుంపతో ఏ రెసిపీ చేసిన కూడా టేస్ట్ అదిరిపోతుంది.
అయితే రుచి గురించి పక్కన పెడితే బంగాళదుంపలో ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ దాగి ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణకు బంగాళదుంప గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక చిన్న బంగాళదుంపను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక చిన్న బంగాళదుంప తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను( onion ) కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. 40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేస్తే బంగాళదుంప ఉల్లిపాయ లో ఉండే పలు సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. జుట్టు రాలడాన్ని అరికడతాయి. అలాగే ఆముదం, ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్ ఫాల్ ను నివారించడానికి తోడ్పడతాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. ఇక నిమ్మరసం చుండ్రు సమస్యను దూరం చేసి స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది. కాబట్టి జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న వారు తప్పకుండా బంగాళదుంపతో ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేయండి. నెలకు రూ.70వేలు గ్యారంటీ

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా?ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియడం లేదా?అయితే మేము మీకో చక్కటి వ్యాపార ప్లాన్ గురించి వివరిస్తాం.
ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. ఇంట్లో కూర్చుండే ఈ వ్యాపారాన్ని చేయోచ్చు. ఖాళీ సమయంలో చేస్తే చాలు. ఇంటి పనులు అన్ని పూర్తయ్యాక ఈ పని చేస్తే నెలకు 70వేలు మీ అకౌంట్లో ఉంటాయ్. మరి ఆ బిజినెస్ ఏంటో ఓసారి చూద్దాం.

టీ షర్టుపై ప్రింటింగ్ బిజినెస్. నేడు మార్కెట్లో ఈ వ్యాపారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో రెడీ ప్రింటెడ్ టీ షర్టులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఎన్నో రకాల టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్స్, రెస్టారెంట్లు, షోరూమ్ లు మొదలైన వాటి సిబ్బంది తమ స్వంత ప్రింటెడ్ టీ షర్టులను ధరించడం ట్రెండ్ గా మారింది. అంతేకాదు ట్రెండింగ్ మీమ్స్ లో తయారు చేసిన టీషర్టులను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని మీరు వ్యాపారంగా మలుచుకున్నట్లయితే మీరు మంచి లాభం పొందవచ్చు.
ఈ టీషర్టుపై ప్రింటింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలంటే తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఇంట్లో నుంచే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి కేవలం 60 నుంచి 70వేలు పెట్టుబడికి అవసరం ఉంటుది. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 40 నుంచి 70వేలు సంపాదించవచ్చు. టీషర్టులు ప్రింటర్, హీట్ ప్రెస్, కంప్యూటర్, పేపర్, టీషర్టు ప్రింటింగ్ కోసం ముడి పదార్థాల రూపంలో అవసరమైన చౌకైన యంత్రం మాన్యువల్ అవసరం. దీని నుంచి టీ షర్టును ఒక నిమిషంలో తయారు చేయవచ్చు.
దీని కోసం మీరు టీషర్టు ప్రింటింగ్ మెషిన్ను కొనుగోలు చేయలి. దీని ధర రూ. 50వేలు ఉంటుంది. మరోవైపు ప్రింటింగ్ కోసం తీసుకున్న సాధారణ క్వాలిటి కలిగిన వైట్ టీ షర్ట్ ధర సుమారు రూ. 120 వరకు ఉంటుంది. దాని ప్రింటింగ్ ధర రూ. 1 నుంచి రూ. 10 వరకు ఉంటుంది. క్వాలిటీ గురించి ఆలోచిస్తే 20 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనీసం 200నుంచి 250 రూపాయలకు అమ్మవచ్చు. మీరు డైరెక్టుగా విక్రయిస్తే కనీసం 50శాతం లాభం పొందుతారు.

Money Transfer: క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు అకౌంట్‌కి నేరుగా డబ్బులు పంపుకోవచ్చని తెలుసా, ఈ విధానం ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చాలా సులభంగా చేయవచ్చు…

Transfer Money From Credit Card To Bank Account: మీకు చిటికెలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డ్‌లు లైఫ్‌గార్డ్‌గా పనిచేస్తాయి.
కానీ కొన్నిసార్లు కొన్ని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించలేరు. చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్‌ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. మీరు ఎల్లప్పుడూ మీ క్రెడిట్ కార్డ్ నుండి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. అటువంటి లావాదేవీ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది.
బ్యాంక్ ఖాతా బదిలీకి క్రెడిట్ కార్డ్ చేయడానికి బ్యాంకులు మిమ్మల్ని అనుమతించినప్పుడు.. మీరు నెట్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్ క్రెడిట్ కార్డ్ లేదా ఫోన్ కాల్ లేదా పరోక్షంగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన ఇ-వాలెట్ ద్వారా బ్యాంక్‌తో నేరుగా బదిలీ చేయవచ్చు. అలాగే మీరు చెక్కులు లేదా ATM నగదు అడ్వాన్స్‌లను ఉపయోగించి డబ్బును బదిలీ చేయవచ్చు.

బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ

మీరు నెట్ బ్యాంకింగ్ యాప్‌ను ఉపయోగించి లేదా ఫోన్‌లో కూడా మీ క్రెడిట్ కార్డ్ నుండి నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు. రోజువారీ, నెలవారీ బదిలీ పరిమితి బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతూ ఉంటుంది.
కాబట్టి, అప్‌డేట్ చేయబడిన సమాచారాన్ని పొందడానికి మీరు దానిని మీ బ్యాంక్‌తో తనిఖీ చేయాలి. మీరు క్రెడిట్ కార్డ్‌తో ఉన్న అదే బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంటే, బదిలీ దాదాపు తక్షణమే జరుగుతుంది. అయితే, మరొక బ్యాంకు ఖాతాకు బదిలీ అయితే, దానికి రెండు నుండి మూడు పనిదినాలు పడుతుంది.

నెట్ బ్యాంకింగ్

మీ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాను నేరుగా యాక్సెస్ చేయడం ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. క్రింద అందించిన విధానాన్ని అనుసరించండి:
దశ 1: మీ బ్యాంక్ వెబ్‌సైట్‌ను తెరవండి

దశ 2: మీ క్రెడిట్ కార్డ్ ఖాతాకు లాగిన్ అవ్వండి

దశ 3: బదిలీ ఎంపికను ఎంచుకోండి

దశ 4: మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి

దశ 5: ఫారమ్‌లో పేర్కొన్న అవసరమైన వివరాలను నమోదు చేయండి

దశ 6: లావాదేవీలను పూర్తి చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించండి

ఫోన్ కాల్

మీకు తక్షణమే నగదు అవసరమైతే, ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోతే, బదిలీకి ఎల్లప్పుడూ ఫోన్ కాల్ అడుగు దూరంలో ఉంటుంది. ఫోన్ కాల్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి ఛార్జీలు నెట్ బ్యాంకింగ్ ద్వారా వసూలు చేయబడిన మొత్తానికి సమానంగా ఉంటాయి. క్రింద అందించిన దశలను అనుసరించండి:

దశ 1: మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేయండి

దశ 2: ఫండ్ బదిలీ కోసం అభ్యర్థన చేయండి

దశ 3: మీరు బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నిర్ధారించండి

దశ 4: బ్యాంక్ ఖాతా నంబర్, అవసరమైన ఇతర వివరాలను అందించండి

దశ 5: లావాదేవీని పూర్తి చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించండి
బ్యాంకు ఖాతాకు పరోక్ష బదిలీ

Paytm, Payzapp వంటి ఇ-వాలెట్‌లు మీరు త్వరగా, సురక్షితంగా లావాదేవీలు చేయడానికి అనుమతించే డిజిటల్ వాలెట్‌లు. ఇవి మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి. KYC పూర్తి కావాలి.

చెక్కులు: ‘చెక్ టు సెల్ఫ్’ అని పిలవబడే సదుపాయం ఉంది, ఇక్కడ మీరు మీకు చెక్ రాసుకోవచ్చు. డబ్బు మీ క్రెడిట్ కార్డ్ నుండి తీసుకుని మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

విధానం ఏమిటి?

దశ 1: చెల్లింపుదారుని పేరును ‘సెల్ఫ్’గా చేర్చండి

దశ 2: చెక్కు వ్రాసేటప్పుడు మీరు సాధారణంగా చేసే ఇతర అవసరమైన సమాచారాన్ని చేర్చండి
దశ 3: చెక్కును మీ బ్యాంక్ బ్రాంచ్‌లో డిపాజిట్ చేయండి

ATM క్యాష్ అడ్వాన్స్: ATM క్యాష్ అడ్వాన్స్ అనేది మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ATM నుండి నగదును ఉపసంహరించుకోవడానికి, ఆ మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి మిమ్మల్ని అనుమతించే సదుపాయం.

విధానం ఏమిటి?

దశ 1: ATMలో మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి నగదు ఉపసంహరించుకోండి

దశ 2: మీ బ్యాంక్ బ్రాంచ్‌లో నగదును డిపాజిట్ చేయండి

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి నగదు ఉపసంహరణకు రుసుములు, ఛార్జీలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. వీటిని నగదు ముందస్తు రుసుములు అంటారు. ఉదాహరణకు, HDFC బ్యాంక్ విత్‌డ్రా చేసిన మొత్తం సొమ్ముపై 2.5% క్యాష్ అడ్వాన్స్ ఫీజును వసూలు చేస్తుంది. నగదు అడ్వాన్స్ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.

డార్క్ సర్కిల్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా.. పుదీనాతో ఇలా చేస్తే వారంలో మాయం అవుతాయి

డార్క్ సర్కిల్స్( Dark circles ).. మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలు చాలా ఉన్నాయి.
ప్రధానంగా చూస్తే స్ట్రెస్, పలు రకాల మందుల వాడకం, కంటి నిండా నిద్ర లేకపోవడం, స్క్రీన్ టైమ్‌ ఎక్కువ అవ్వడం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. అబ్బాయిలు పెద్దగా ఈ సమస్యను పట్టించుకోరు. కానీ అమ్మాయిలు మాత్రం డార్క్ సర్కిల్స్ వల్ల చాలా సతమతమవుతుంటారు. వాటిని వదిలించుకోవడానికి తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.

అయితే అసహ్యంగా కనిపించే డార్క్ సర్కిల్స్ ను వదిలించడానికి పుదీనా ఆకులు( Mint leaves ) ఉత్తమంగా సహాయపడతాయి. సాధారణంగా మనం పుదీనా ఆకులను నాన్ వెజ్ వంటల్లో మాత్రమే ఉపయోగిస్తుంటాము. కానీ పుదీనాతో ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను నివారించడానికి పుదీనాను ఉపయోగించవచ్చు. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు పుదీనా ఆకులను లైట్ గా క్రష్ చేసి వేసుకోవాలి. చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించి ఆపై స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తద్వారా మింట్ సీరం రెడీ అవుతుంది. ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి తయారు చేసుకున్న సీరం ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఆపై ఐదు నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్ లో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. డార్క్ సర్కిల్స్ మరీ అధికంగా ఉంటే ఉదయం స్నానం చేయడానికి ముందు కూడా సీరంను వాడండి. నిత్యం ఈ మింట్‌ సీరంను కనుక వాడితే కేవలం వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్‌ మాయం అవుతాయి. మరియు కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే క్రమంగా దూరం అవుతాయి.

House Collapsed: ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం రేపారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కామారెడ్డిలో రోడ్డు విస్తరణ కోసం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు పనులకు అడ్డంకిగా ఉన్న తన ఇల్లును ఎమ్మెల్యే కూల్చివేయించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో రోడ్ల విస్తరణపై దృష్టి సారించారు. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉందని గుర్తించి ఆ ఇంటిని ఖాళీ చేశారు. మరో ఇంటిలోకి మారిన వెంకటరమణారెడ్డి తన పాత ఇంటిని కూల్చాలని నిర్ణయించారు. శనివారం ఇంటిని కూల్చివేసే పనులు ప్రారంభించారు. జేసీబీ సహాయంతో ఇంటిని అధికారులు కూల్చారు. ఈ పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నిర్మాణంలో నా ఇంటిని కూల్చడం గొప్ప విషయం కాదు. మా ఇంటి కూల్చడం ద్వారానే మార్పు మొదలుపెట్టాం. నన్ను చూసి ప్రజలు కూడా రోడ్డు వెడల్పుకు సహకరించాలని కోరుతున్నా. ఎవరినీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు’ అని స్పష్టం చేశారు.

కామారెడ్డిలో రోడ్ల విస్తరణ వేగవంతం
జిల్లా కేంద్రంగా ఏర్పడిన కామారెడ్డిలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. పట్టణం కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇటీవల కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. అయితే పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రభావం కనిపించింది. ఫలితంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కామారెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకటరమణారెడ్డి కూడా మాస్టర్‌ ప్లాన్‌కు మద్దతు పలుకుతున్నారు. పట్టణ అభివృద్ధికి స్థానికులు సహకరించాలని కోరుతూ ఇప్పుడు తన ఇంటిని కూల్చేసుకున్నారు. కలెక్టరేట్‌కు వెళ్లే ఈ రోడ్డును విస్తరించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో కూల్చివేతలు ప్రారంభించి అనంతరం రోడ్డు పనులు వెంటనే చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Gold: పాత, హాల్‌మార్క్ లేని బంగారం పరిస్థితి ఏంటి ? వాటి విషయంలో ఇలా చేయండి

BIS హాల్‌మార్క్‌తో బంగారు ఆభరణాలను విక్రయించడాన్ని ఆభరణాల వ్యాపారులు తప్పనిసరి చేసింది.
దీనికి సంబంధించి కేంద్రం జూన్ 16, 2021న మార్గదర్శకాన్ని విడుదల చేసింది. అక్కడ పాత హాల్‌మార్క్‌లను సవరించారు. అలాగే జులై 1 నుంచి హాల్ మార్క్ బంగారు ఆభరణాలకు 3 మార్కులు ఉంటాయని సమాచారం. అవి: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్, స్వచ్ఛత/ఫైన్‌నెస్ గ్రేడ్ మరియు 6-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్.

కాబట్టి 1 జూలై 2021కి ముందు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల సంగతేంటి? పాత, హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు లేదా పాత గుర్తులతో హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాల గురించి చింతించకండి. మార్గాలు ఉన్నాయి. ఎవరైనా హాల్‌మార్క్‌లు లేని బంగారు ఆభరణాలను కలిగి ఉంటే, అతనికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఎ) BIS నమోదిత నగల వ్యాపారులచే ఆభరణాల హాల్‌మార్కింగ్. బి) ఏదైనా BIS గుర్తింపు పొందిన పరీక్ష మరియు హాల్‌మార్కింగ్ కేంద్రం నుండి ఆభరణాలను పరీక్షించడం.

వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్ ప్రకారం, వినియోగదారులు BIS జ్యువెలర్స్ ద్వారా పాత బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ చేయవచ్చు. ఆభరణాల వ్యాపారి ఆభరణాలను బిఐఎస్ అస్సేయింగ్ మరియు హాల్‌మార్కింగ్ సెంటర్ నుండి హాల్‌మార్క్ చేస్తారు. గుర్తుంచుకోండి, హాల్‌మార్కింగ్ కోసం ఒక్కో బంగారు ఆభరణానికి రూ. 35 వసూలు చేస్తారు.

BIS అక్రెడిటెడ్ అస్సేయింగ్ మరియు హాల్‌మార్కింగ్ సెంటర్ నుండి జ్యువెలరీ టెస్టింగ్: మరొక ఎంపిక ఏమిటంటే, BIS గుర్తింపు పొందిన అస్సేయింగ్ మరియు హాల్‌మార్కింగ్ సెంటర్ నుండి నగలను పరీక్షించడం. దీనికి ఛార్జీ ఉంది. నగలను పరీక్షించిన తర్వాత, కేంద్రం గుర్తింపును అందిస్తుంది మరియు పరీక్షను నివేదిస్తుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఆభరణాల స్వచ్ఛత గురించి నివేదిక తెలియజేస్తుంది మరియు ఆ తర్వాత ఆభరణాలను విక్రయించినట్లయితే నివేదిక చెల్లుబాటు అయ్యే రుజువుగా పరిగణించబడుతుంది. సందర్భానుసారంగా చెప్పాలంటే, బంగారం స్వచ్ఛతను పరీక్షించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: ఎ) XRF పద్ధతి మరియు బి) అగ్ని పరీక్ష పద్ధతి. ఏ పద్ధతిని పరీక్షిస్తున్నారో కస్టమర్‌కు ముందుగానే తెలియజేయబడుతుంది.
పాత హాల్‌మార్క్ గుర్తులు ఉన్న బంగారు ఆభరణాలను హాల్‌మార్క్డ్ జ్యువెలరీగా పరిగణిస్తారు. BIS వెబ్‌సైట్ ప్రకారం, ఇటీవల ప్రవేశపెట్టిన 6-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌తో ఇప్పటికే హాల్‌మార్క్ చేయబడిన ఆభరణాలు రీ-హాల్‌మార్క్ చేయవలసిన అవసరం లేదు. అమ్మాలనుకున్నా ఇబ్బంది ఉండదు.

Mentally Strong Kids : మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నాడని తెలిపే 5 సంకేతాలు ఇవే…

జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు.

ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు. రిస్క్‌లు తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు. అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. కష్టసమయంలో కూడా బలంగా:

మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే.. అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లవాడికి మంచి సమయం లేనప్పుడు లేదా అతను బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఈ సంకేతాలను చూస్తారు.

2. బిడ్డకు సహనం ఉంది;

పిల్లవాడికి ఓపిక ఉంటే, అతను మానసికంగా బలంగా ఉన్నాడని అర్థం చేసుకోండి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలా మంది పిల్లలు చదువులో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్లీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ బిడ్డ ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడరని చూపుతాయి.

3. తదుపరి చర్య తీసుకునే ముందు ఆలోచిస్తాడు:
మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే, బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక తెలుస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ముందు ఆలోచిస్తారు. వారు తమ మనస్సును ఏర్పరచుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ వారు తమ కోసం సరైన నిర్ణయం తీసుకుంటారు.

4. పిల్లవాడు ఫిర్యాదు చేయడు:
మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు, వారు దేనిపైనా ఫిర్యాదు చేయరు. ప్రతి పరిస్థితిని దృఢంగా ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. అలాంటి పిల్లలు తమకు తాముగా ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు కూడా మొండిగా ఉండరు. అవసరం లేని వాటి కోసం వారు మీపై ఎప్పుడూ పట్టుబట్టరు.

5. పిల్లవాడు తన స్వంత నిర్ణయాలు తీసుకుంటాడు:
మీ బిడ్డ కూడా తన స్వంత నిర్ణయాలు తీసుకుంటే, వాటిని ఎలా పాటించాలో తెలుసుకుంటే, మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నాడని అర్థం చేసుకోండి. మానసికంగా దృఢంగా ఉన్న తర్వాతే, తమ సొంత నిర్ణయాలు తీసుకోగలరని చాలా అవగాహన ఉంటుంది. మరోవైపు, కొంతమంది పిల్లలు సమయానికి ముందే భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు, వారి మనస్సుపై శ్రద్ధ చూపుతారు.

ఈ 5 సంకేతాలు మీ బిడ్డ మానసికంగా కూడా దృఢంగా ఉన్నట్లు చూపుతాయి.

Gold: కేంద్ర ప్రభుత్వ రూల్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసుకోండి…?

రూల్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు. మహిళలు ఎంత బంగారం ఉంచుకోవాలి.. పురుషులు ఎంత బంగారం ఉంచుకోవాలి?.. ఇలాంటి డౌట్స్ మీకు వస్తున్నాయా …అయితే ఇది చదవండి..

రూల్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం నిలువ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు తెలుసుకోండి…

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు… మన డబ్బును, మన సామర్థ్యాన్ని మనకు కావలసినంత ఉంచుకుంటాము, అది తప్పు కాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తంలో బంగారాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ బంగారాన్ని ఉంచవద్దు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న రాష్ట్రానికి మాత్రమే కాదు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా ఇంట్లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ బంగారాన్ని ఉంచకూడదు.

ఇంట్లో ఉన్న బంగారం మొత్తం, ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. వివాహిత, వివాహిత స్త్రీకి నియమాలలో వ్యత్యాసం ఉంది. పురుషులకు కూడా బంగారం ఉంచుకునే హక్కులో తేడా ఉంటుంది. వివాహిత తన ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవడానికి అనుమతి ఉంది. పెళ్లికాని యువతి ఇంట్లో గరిష్టంగా 250 గ్రాముల బంగారాన్ని ఉంచుకునే అవకాశం ఉంది. కుటుంబంలోని పురుషుడికి బంగారం పరిమితి గరిష్టంగా 100 గ్రాములు మించకూడదు.

దాడుల్లో నిర్దేశిత మొత్తానికి మించిన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు అధికారం కల్పించారు. అయితే దాడి సమయంలో ఇంట్లో ఉన్న బంగారం నగదు రూపంలో ఉంటే మాత్రం జప్తు చేయడం కుదరదు. అయితే అధికారులు కావాలంటే ఈ బంగారానికి సంబంధించిన పత్రాన్ని అందించాలి. అందువల్ల బంగారాన్ని సంపదగా, సంపదను అవసరమైనంతగా ఉంచుకోలేరు.

బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారత్. భారతదేశంలో బంగారం చాలా ముఖ్యమైనది. అందువల్ల దిగుమతి మొత్తం కూడా పెరిగింది. 2022లో బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంటుంది. మొత్తం 31.25 టన్నుల బంగారం దిగుమతి అయింది. దేశంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 73% పెరిగాయి. తద్వారా దిగుమతి విలువ 3.45 లక్షల కోట్లకు చేరింది. 2021 నాటికి బంగారం దిగుమతి 2 లక్షల కోట్లకు చేరుకుంది. గత 11 నెలల్లో పెరిగిన బంగారం దిగుమతుల కారణంగా భారత విదేశీ మారక ద్రవ్యలోటు రూ.135 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచంలో బంగారాన్ని వినియోగిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో దిగుమతులు పెరిగాయి.

Primary , High School New CCE Grading Tables

Primary , High School New CCE Grading Tables

Primary Grading Table

High School Grading Table

Primary , High School New CCE Grading Tables

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..

ఏపీలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ (Aarogyasree) సేవలను నేటి నుంచి నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆసుపత్రుల యాజమాన్యాల సేవలు నిలిపివేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి ఆస్పత్రి యాజమాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం..
బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో డిసెంబర్ 25న ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అసలేం జరిగిందంటే..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులకు సంబంధించి రూ.1200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది కాకుండా, పదేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీలతోనే చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్సల ధరలను పెంచాలని ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.

ఆసుపత్రుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు లేఖ రాశారు. గత నెలలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీలపై చార్జీలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
నెలలు గడుస్తున్నా ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల హామీ లభించలేదు. దీంతో నెట్‌వర్క్‌లోని ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు సేవలు కొనసాగుతుండగా, నేటి నుంచి కొత్త రోగులను చేర్చుకోకూడదని నిర్ణయించారు.

గత మూడు నెలల్లో రెండుసార్లు ప్రభుత్వానికి ఆస్పత్రి యాజమాన్యం డెడ్ లైన్ ఇచ్చినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. జనవరి 25 నుంచి సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఈహెచ్‌ఎస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రులకు ఫీజుల చెల్లింపులో జాప్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు చెల్లించకుండా రోగులకు వైద్యసేవలు అందించలేమని ఆసుపత్రులు చెబుతున్నాయి.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. డిసెంబరు 25 నుంచి సేవలను నిలిపివేస్తామని వారు ప్రకటించారు, కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ముందస్తు నోటీసు లేకుండా సేవలను నిలిపివేయాలని తాజాగా నిర్ణయించారు.

ఆహా.. ఏం ఐడియా గురూ.. కారు అద్దెకు తీసుకుని.. నెంబర్‌ ప్లేట్‌ మార్చి..

దర్జాగా షికారు.. గుర్తించి వెంబడించిన యజమాని
– తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలను ఢీ

పంజాగుట్ట(హైదరాబాద్),: జూమ్‌ కార్‌ యాప్‌లో కారు బుక్‌ చేసుకున్నాడు.
కారును యజమానికి తిరిగి ఇవ్వకుండా నెంబర్‌ ప్లేటు మార్చి దర్జాగా తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి అమీర్‌పేట-పంజాగుట్ట(Ameerpet-Panjagutta) మార్గంలో వెళుతుండగా యజమాని కారును గుర్తుపట్టి వెంబండించారు. దొరికిపోతానన్న భయంతో కారు వేగం పెంచి, పలు వాహనాలకు ఢీ కొట్టాడు. దీంతో స్థానికులు కారు ఆపి అతడిని చితకబాదారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ ఆర్‌నగర్‌ ప్రాంతంలో ఉండే మోహన్‌రెడ్డి కార్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడు. కార్లను పలు యాప్‌ల ద్వారా, తెలిసిన వారికి అద్దెకిచ్చేవాడు. గతేడాది అక్టోబర్‌ 25న జూమ్‌ యాప్‌ ద్వారా పాతబస్తీ జహనుమ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అమీర్‌ అలీ(30) కారు (టీఎస్‌09 ఎఫ్‌డబ్ల్యు 9642) సెల్ఫ్‌ డైరవ్‌ చేయడానికి అద్దెకు తీసుకున్నాడు.
తిరిగి ఇవ్వకుండా.. నంబర్‌ ప్లేట్‌ మార్చి తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి అమీర్‌పేటలో అమీర్‌ అలీ కారు నెంబర్‌ మార్చి (టీఎస్‌04 యుసీ 9932) అదే కారులో వెళ్తుండగా చూశాడు. యజమాని కారును గుర్తించి వెంటపడగా, గమనించిన అమీర్‌ అలీ దొరికిపోతాననే భయం తో కారును వేగంగా పంజాగుట్ట వైపు పోనిచ్చాడు.

ఈ క్రమంలో వాహనాలను ఢీ కొడుతూ వచ్చాడు. పంజాగుట్ట అగర్వాల్‌ ఆసుపత్రి సమీపంలో కారును ఆపగా, స్థానికులు అమీర్‌ అలీపై దాడి చేశారు. పంజాగుట్ట పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ అతన్ని చికిత్స నిమిత్తంగాంధీ ఆసుపత్రికి, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారు యజమాని ఇంతకు ముందే ఎస్‌.ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. అమీర్‌ అలీ పై రామచంద్రాపురం, తదితర పీఎ్‌సలలో కేసులు ఉన్నట్లు సమాచారం.

Kinetic E-Luna: లూనా మోపెడ్ రీఎంట్రీకి అంతా సెట్.. కేవలం రూ. 500కే బుక్ చేసుకోండి..

కైనెటిక్‌ లూనా.. ఇప్పటి తరానికి ఈ పేరు అంతగా పరిచయం లేదు గానీ 1970ల్లో అదొక ట్రెండింగ్‌ బైక్‌. ఎవరైనా మోపెడ్‌ అంటే అది లూనా మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో అది కనిపిస్తుండేది.
పెట్రోల్‌తో నడిచే ఈ లూనా ఆ తర్వాత కాలంలో ఉత్పత్తిని నిలిపివేశారు. కాగా ఇప్పుడు మళ్లీ ఈ లూనా రీ ఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్‌ వేరియంట్లో లాంచ్‌ కానుంది. కైనెటిక్‌ గ్రీన్‌ కంపెనీ ఓల్డ్‌ లూనాకే లేటెస్ట్‌ టచ్‌ ఇచ్చి ఈ-లూనా మల్టీ యుటిలిటీ ఈ2డబ్ల్యూగా వచ్చే నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన బుకింగ్‌ సైతం జనవరి 26 నుంచి ప్రారంభించింది. కైనెటిక్‌ గ్రీన్‌ వెబ్‌ సైట్లో రూ. 500 చెల్లించి దీనిని బుక్‌ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం ఫ్లిప్‌ కార్ట్‌ లిస్టింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా..

కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ ఐకానిక్ లూనా సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో పునరాగమనం చేస్తోందని ప్రకటించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. కైనెటిక్ గ్రీన్ మెమరీ లేన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించిందని, ఈ-లూనాను 2024 ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26న బుకింగ్‌లు ఆరంభిస్తున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా స్కూటర్ అని ప్రకటించారు. మెట్రో, టైర్ 1 పట్టణాలలో మాత్రమే కాకుండా భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాలు మరియు గ్రామీణ మార్కెట్‌ల కోసం వినియోగదారుల రహదారి పరిస్థితులు, డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ-లూనా ధృడమైన, మన్నికైన విధానంలో రూపొందిందన్నారు. సంప్రదాయ పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి దీనిని రూపొందించామన్నారు. ఆకట్టుకునే సాంకేతిక లక్షణాలు, పనితీరు సామర్థ్యాలు, పటిష్టమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని చెప్పారు.

ఎక్కడ తయారీ..
కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఇప్పటికే ఈ-లూనా తయారీని ప్రారంభించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ తో కంపెనీకి చెందిన ప్లాంట్లో ప్రతి నెలా 5000యూనిట్లను తయారు చేస్తోంది. అంతేకాక ప్రస్తుతం కైనెటిక్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్లో లిస్ట్ అయ్యి ఉంది. దీని అసలు ధర రూ. 73,990(ఎక్స్ షోరూం)కాగా.. ఫ్లిప్ కార్టలో రూ. 2000 తక్కువకే రూ. 71,990(ఎక్స్ షోరూం)కి కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.

ఈ-లూనా స్పెసిఫికేషన్లు..

కైనెటిక్ ఈ-లూనాకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు కంపెనీ ఇంకా ప్రకటించ లేదు. అయితే 2కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. అలాగే రేంజ్ సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది.

Tulsi Benefits: తులసి ఆకులు రోజూ తింటే చాలు, ఏ వ్యాధి కూడా దరి చేరదు

Tulsi Benefits: తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా మహత్యముంటుంది. ఇంట్లో ఉంచుకుంటే శుభంగా భావిస్తారు. తులసి మొక్కకున్న ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో చాలా విశిష్టత ఉంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తులసి మొక్కలో ఉండే కొన్ని గుణాల వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తడిని దూరం చేయవచ్చు. ఆందోళన తగ్గించుకోవచ్చు. తులసి ఆకుల్ని రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తులసి మొక్కలో ఔషద గుణాలకు కొదవ ఉండదు. ఇమ్యూనిటీని వేగవంతం చేస్తుంది. ఫలితంగా శరీరం వివిధ రకాల వ్యాధులకు గురి కాకుండా కాపాడుకోవచ్చు.

శ్వాస సంబంధిత సమస్యలకు తులసి ఆకులు మంచి పరిష్కారం కల్గిస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే తులసి ఆకులతో కాడా చేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యల్ని దూరం చేయడంలో తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం కడుపు సంబంధిత సమస్యలు దూరం కావడం. తులసి ఆకుల్ని నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి ఆకులతో ఎసిడిటీ తగ్గించవచ్చు. స్వెల్లింగ్ వంటి సమస్యలు దూరమౌతాయి. తులసి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి ఆ నీళ్లు తాగినా అవే ఫలితాలుంటాయి.

తులసి మొక్క ఆకుల్ని రోజూ క్రమం తప్పకుండా నమిలి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. తులసి ఆకుల్ని డైట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా డయాబెటిస్ తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్ ఇతర సమస్యల్నించి కాపాడుకోవచ్చు.

Curd Rice Benefits: పెరుగన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. డోంట్ మిస్!

పెరుగన్నం గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పని లేదు. అందరికీ పెరుగన్నం గురించి తెలుసు. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
నిజానికి పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతున్నారు నిపుణులు. పెరుగన్నంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. మీరు రెస్టారెంట్స్‌లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాళింపు పెట్టి.. నీటిగా ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకొస్తారు. రెస్టారెంట్లలో కూడా చాలా మంది పెరుగన్నాన్ని తింటారు. పెరుగు అన్నం తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది. ఇంకా పెరుగన్నంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్టీరియాతో పోరాడుతుంది..

పెరుగు అన్నం క్రమం తప్పకుండా తింటే రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. పెరుగు అన్నంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు, ప్రేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు పెరుగన్నం తింటే చాలా బెటర్. పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు అన్నం తింటే గ్యాస్, కడపులో నొప్పి, మంట, మల బద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఎముకలు, దంతాలు హెల్దీగా ఉంటాయి..

పెరుగులో క్యాల్షియం కంటెంట్ మెండుగా ఉంటుది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగు అన్నం తింటే ఎముకలు, దంతాలు కూడా గట్టి పడతాయి. పలు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.
బరువు అదుపులో ఉంటుంది:

బరువు తగ్గాలి అనుకున్న వారు పెరుగు అన్నం తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆకలి పెద్దగా వేయదు. దీంతో ఇతర చిరు తిళ్లు తినే అవకాశం ఉండదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది కూడా మీ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, క్యాల్షియంలు మీ ఆకలిని నియంత్రిస్తాయి. ఇలా బరువు తగ్గొచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Without Guarantee Loan: ఈ స్కీమ్‌ కింద గ్యారెంటీ అవసరం లేదు.. సులభంగా లోన్‌ మంజూరవుతుంది..!

Without Guarantee Loan: ఈ రోజుల్లో గ్యారెంటీ లేకుండా లోన్‌ లభించడం చాలా కష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద సులభంగా లోన్‌ పొందవచ్చు.
అయితే ఇందులో పెద్ద మొత్తంలో లోన్‌ లభించదు. చిన్న చిన్న వ్యాపారలు చేసుకోవడానికి రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు లోన్‌ మంజూరు చేస్తారు. వాస్తవానికి కరోనా సమయంలో వీధి వ్యాపారులను అధిక వడ్డీల బారినుంచి కాపాడడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎంత రుణం పొందవచ్చు..

ప్రధాన మంత్రి స్వానిధి యోజన కింద భారత ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా రూ. 50,000 వరకు రుణాలు మంజూరుచేస్తుంది. ఈ డబ్బు వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇస్తారు. జూన్ 1, 2020న ప్రారంభించబడిన ఈ పథకం లక్ష్యం వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం. ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా ప్రజలు సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు.
లబ్ధిదారులు ఎవరు..?

వీధి వ్యాపారులుగా పనిచేసే ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లబ్ధిదారుని వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది కాకుండా లబ్ధిదారునికి ఎటువంటి రుణ ఖాతా ఉండకూడదు. ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా రూ. 50,000 వరకు రుణం మంజూరుచేస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి 3 సంవత్సరాలు. వడ్డీ రేటు సంవత్సరానికి 12 శాతం. కానీ ప్రభుత్వం దానిపై 7% రాయితీ ఇస్తుంది. దీంతో అది 5 శాతానికి తగ్గింది.

రుణం కోసం దరఖాస్తు ప్రక్రియ

> లబ్ధిదారుడు ముందుగా దగ్గరలోని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి.

> లబ్ధిదారుడి అర్హతను బ్యాంక్ తనిఖీ చేస్తుంది.

> అర్హత ఉన్నట్లు గుర్తించినట్లయితే లబ్ధిదారునికి
రుణం కోసం దరఖాస్తు ఫారమ్ ఇస్తారు.

> దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత అవసరమైన పత్రాలను యాడ్‌ చేసి వాటిని బ్యాంకులో అందించాలి.

> దరఖాస్తును పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు.

అవసరమైన పత్రాలు

> ఆధార్ కార్డ్

> పాన్ కార్డ్

> ఓటర్ ఐడి కార్డ్

> బ్యాంక్ ఖాతా పాస్ బుక్

> ఫొటో
పథకం షరతులు

ఈ పథకం కింద మొదటిసారిగా లబ్ధిదారునికి రూ.10,000 వరకు రుణం ఇస్తారు. ఈ రుణం ఎలాంటి హామీ లేకుండా ఉంటుంది. ఈ డబ్బును 12 నెలల్లో తిరిగి చెల్లించడం వల్ల రెండవసారి రూ. 20,000, మూడవసారి రూ. 50,000 మొత్తాన్ని పొందవచ్చు. పథకం కింద వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం చేసుకోవచ్చు.

Budget 2024: రైతులకు శుభవార్త.. రుణాల పరిమితి, సబ్సిడీ, పీఎం కిసాన్ నిధుల పెంపు..!

దేశంలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎంత చేసినా వ్యవసాయం మాత్రం లాభసాటిగా మారడం లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. అయితే కష్టం చేసినా రైతు కన్నా మధ్యలో ఉండే దళారి, ఆ తర్వాత వ్యాపారి బాగుపడుతున్నారు.
అందుకే రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. అందులోనే భాగంగా రైతలకు తక్కు వడ్డీలకే రుణాలు ఇవ్వడం, పీఎం కిసాన్, రైతు బంధు, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ, రైతు బీమా వంటి పథకాలు తీసుకొచ్చారు.

అయితే తెలంగాణలో ప్రస్తుతం పీఎం కిసాన్, రైతు బంధు, రైతు బీమా, ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోంది. విత్తనాలపై సబ్సిడీ ఎప్పుడో ఎత్తేశారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న వేళ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ నాటికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల మేర రైతు రుణాలను పంపిణీ చేసింది.

ఈ రుణాలను రూ.22-25 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. అగ్రిటెక్ స్టార్టప్​లకు కనీసం 10-15 సంవత్సరాల పాటు ప్రత్యేక ట్యాక్స్ డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది. రైతుల ఆదాయాలు పెరగాలంటే ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచాలని డిమాండ్ ఉంది. దీనిపై బడ్జెట్ లో ఏమైనా ప్రతిపాదనలు ఉండే ఛాన్స్ ఉంది.

దేశీయంగా తయారు చేసిన ఎరువులపై సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పలు రకాల ఎరువులపై సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీని మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ.6 వేలను రూ.8 వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలను రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.

ట్రక్కుల వెనుక భాగంలో రోడ్డును తాకేలా వేలాడే ఆ చైన్… ఉపయోగమేమిటో తెలిస్తే… ‘వాట్ ఎన్ ఐడియా’ అంటారు!

కొన్ని ట్రక్కులకు వెనుక భాగాన దిగువన గొలుసు(chain) కట్టి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. ఈ గొలుసు రోడ్డుకు తాకుతూ ఉండటాన్ని కూడా మీరు గమనించే ఉంటారు.
ఇది చూశాక ఈ గొలుసు ఇలా ఎందుకు వేలాడదీశారనే ప్రశ్న మీ మనసులో మెదులుతుంది.

ముఖ్యంగా గుండ్రని ట్యాంక్ ట్రక్కులకు(round tank trucks) ఈ చైన్ కనిపిస్తుంది. అంటే పెట్రోల్, కిరోసిన్ లేదా ఏదైనా గ్యాస్ వంటి ఏదైనా మండే పదార్థాలను(Combustible materials) తరలించే ట్రక్కులకు ఈ గొలుసు కనిపిస్తుంది. ట్రక్కు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు లేదా రాపిడి(Abrasion) కారణంగా, స్టాటిక్ ఛార్జ్ (ఛార్జ్) వెలువడుతుంది. ఫలితంగా ట్రక్కులో స్పార్క్ వచ్చే ప్రమాదం ఉంది.

అటువంటి పరిస్థితిలో మండే పదార్థాలను తీసుకువెళ్లే ట్రక్కుకు అగ్ని ప్రమాదపు ముప్పు(Fire hazard) ఏర్పడుతుంది. దీనిని నివారించడానికే ఈ గొలుసును ట్రక్కుకు కడతారు. ఈ గొలుసు భూమిని తాకుతున్నందున మొత్తం ఛార్జ్ భూమికి చేరుతుంది. దీంతో ఎటువంటి ప్రమాదం(accident) జరగకుండా ట్రక్కు సురక్షితంగా ఉంటుంది. ఈ చైన్ ట్రక్కుపై వచ్చే మొత్తం చార్జీని భూమికి పంపుతుంది. ఈ గొలుసు ఇనుము(iron) లేదా ఏదైనా ఇతర లోహంతో తయారైవుంటుంది. ఇది మంచి విద్యుత్ వాహకం(Conductor of electricity)గా పనిచేస్తుంది.

Vehicle Scratch Remove: కారు, బైక్, స్కూటర్‌కు గీతలు పడ్డాయా? రూ.10తో స్క్రాచెస్‌ తొలగించుకోండిలా!

మీకు కార్ ఉందా…

లేదంటే బైక్, స్కూటర్ వంటివి కలిగి ఉన్నారా? అయితే కచ్చితంగా మీ టూవీలర్ లేదా కారుపై స్క్రాచెస్ పడే ఉంటాయి. కింద పడ్డప్పుడు లేదంటే దేనికైనా తగిలించినప్పుడు వెహికల్‌పై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి.

లేదంటే కొంత మంది ఎవ్వరూ చూడనప్పుడు కావాలనే వెహికల్‌పై స్క్రాచెస్ వేస్తూ ఉంటారు. ఇలా కారణం ఏదైనా, కారు లేదా టూవీలర్లపై స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. దీని వల్ల మనకు కూడా బాధ అనిపిస్తుంది.

గీతలు పడటం వల్ల కారు లేదా టూవీలర్ చూడటానికి బాగుండకపోవచ్చు. మన చూపు కూడా పదే పదే ఆ స్క్రాచెస్ వైపే వెళ్తుంది. మీరు స్క్రాచెస్ పడిన పార్ట్‌కు కొత్తది కొనాలంటే అధిక డబ్బులు ఖర్చు అవుతాయి.

ఇలా కాకుండా వెహికల్ స్క్రాచెస్‌ను సులభంగానే ఇంటి వద్ద నుంచే తొలగించుకునే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో చాలా వీడియోల్లో స్క్రాచెస్ ఎలా తొలగించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

ఇలాంటి టిప్స్‌లో టూత్‌పేస్ట్ కూడా ఒకటి ఉంది. మీరు కేవలం రూ. 10 ఖర్చుతో టూత్ పేస్ట్ ద్వారా వెహికల్ స్క్రాచెస్‌ను తొలగించుకోవచ్చు. అయితే స్క్రాచెస్ ఏ స్థాయిలో ఉన్నాయనే అంశం ప్రాతిపదికన టూత్ పేస్ట్ ఎంత కావాలనే అంశం ఆధారపడి ఉంటుంది.

మీరు మీ కారుపై ఉన్న స్క్రాచెస్‌ను తొలగించుకోవడానికి షోరూమ్‌కు లేదంటే ప్రొఫెషనల్ వద్దకు వెలితే చిన్న స్క్రాచెస్‌కు కూడా మీకు రూ. 5 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే స్క్రాచెస్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాలి.

అయితే మీరు ఇలాంటివి ఏమీ లేకుండా ఇంటి వద్ద నుంచే తక్కువ ఖర్చుతో స్క్రాచెస్ తొలగించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. పూర్తిగా స్క్రాచెస్ వెళ్లిపోతాయని అనుకోవద్దు. ఉన్న స్క్రాచెస్ కనిపించడం మాత్రం కొంత మేర తగ్గుతుంది.

అలాగే మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. కారుకు డెంట్ పడితే దాన్నితొలగించడం కష్టమే. ఎందుకంటే ఆ ప్లేస్‌లో కలర్ పూర్తిగా పోయి ఉంటుంది. అప్పుడు ఆ స్క్రాచెస్ అలానే ఉంటాయి. కలర్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉంటే.. వాటిని కొంత మేర తగ్గించుకోవచ్చు.

మీరు కోల్గేట్ లేదా ఇతర టూత్ పేస్ట్‌ను తీసుకొని దాన్ని స్క్రాచెస్‌పై రుద్దాలి. టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది. ఇది మరకాలను శుభ్రం చేస్తుంది. కారు స్క్రాచెస్‌పై టూత్ పేస్ట్‌తో 2 నుంచి 3 నిమిషాలు రుద్దాలి. తర్వాత క్లాత్‌తో దీన్ని శుభ్రం చేయాలి. స్క్రాచెస్ క్లీన్ అవుతాయి. లేదంటే కొంత మేర స్క్రాచెస్ తగ్గుతాయి.

కచ్చితంగా స్క్రాచెస్ పోతాయని అనుకోవద్దు. ఇలా చేయడం ద్వారా కొంత మేర స్క్రాచెస్ కనిపించడం తగ్గొచ్చు. టూత్ పేస్ట్ మాత్రమే కాకుండా వ్యాక్స్, లెన్స్ క్లీనర్, ఎరేజర్,స్క్రాచ్ రిమూవర్ వంటి వాటి ద్వారా కూడా మీరు స్క్రాచెస్‌ను కొంత మేర తొలగించుకోవచ్చు. వీటి ద్వారా హెడ్ లైట్స్‌ను శుభ్రం చేసుకోవచ్చు.

Gold Rate: దేశంలోనే బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా.. తులం బంగారంపై ఎంత తగ్గిస్తారు..

బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే నగరంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం. తద్వారా మీరు పెద్ద మొత్తంలో నగలు కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇది మీకు బెటర్ చాయిస్ గా నిలుస్తుంది.
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పసిడి ధర 10 గ్రాములకు గాను 60 వేల రూపాయలు దాటింది. ఇది చరిత్రలోనే గరిష్ట స్థాయి. ఒక గ్రాము కొనుగోలు చేయాలన్నా కూడా దాదాపు 6000 పైన ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీరు బంగారు నగలను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు కొనుగోలు చేసే షాపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఒక్క గ్రాము తేడా వచ్చినా మీరు సుమారు 6000 రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోల్చితే కొద్దిగా స్వల్పంగా తక్కువగానే ఉన్నాయి. అయితే మన దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ ధరకు బంగారం లభిస్తుందని ఆలోచిస్తున్నారా అందుకు తక్కువ నా సమాధానం మీకు లభిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. దేశంలోనే అత్యధికంగా బంగారం వినియోగం ఉన్న రాష్ట్రం కేరళ. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తారు. కేరళలోని మలబారు అలాగే తిరువనంతపురం వంటి జిల్లాల్లో బంగారం దుకాణాలు అత్యధికంగా ఉంటాయి.

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్స్ అయిన మలబార్ గోల్డ్, జాయ్ అలుకాస్, బీమాస్ గోల్డ్ లాంటి నగల నగల దుకాణాలు కేరళ కేంద్రంగానే దేశ వ్యాప్తంగా బ్రాంచీలను వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. కేరళ రాష్ట్రానికి బంగారంతో అవినావభావ సంబంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి కూడా కేరళ రాష్ట్రం విదేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికా ఖండంతో కూడా వాణిజ్య సంబంధాలను కేరళ రాష్ట్రం కలిగి ఉంది. పోర్చుగీసు పాలకులు సైతం బంగారం వర్తకాన్ని ప్రోత్సహించారు.

కేరళలోని మలబారు ప్రాంతం బంగారం డిజైన్లకు పెట్టింది పేరు. అలాగే నాణ్యమైన బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మలబారు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, కేరళలోని మలబారు ప్రాంతానికి వెళ్లి బంగారం షాపింగ్ చేయవచ్చు. తద్వారా మీకు నాణ్యమైన బంగారం లభిస్తుంది. అలాగే అరుదైన డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. కేరళలోని పలు నగల దుకాణాల్లో తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. బయట మార్కెట్ ధరల కన్నా బంగారం 5 శాతం తక్కువగా లభిస్తుంది.

కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడులో కూడా బంగారం వినియోగ అత్యధికంగా ఉంటుంది. చెన్నై కేంద్రంగా అనేక బంగారం నగల దుకాణాలు దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. లలిత జ్యువెలర్స్, ఖజానా సహా పలు అనేక దుకాణాలు అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లను అందుకున్నాయి.

బంగారం నగలను కొనుగోలు చేయాలంటే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నెల్లూరు ప్రొద్దుటూరు మార్కెట్లో దేశంలోనే ప్రసిద్ధి చెందాయి అని చెప్పవచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా బంగారం మిగతా ప్రాంతాలతో పోల్చితే నాణ్యతతోనూ, ధరకు తగ్గట్టుగా లభిస్తుంది. అందుకే మీరు పెద్ద మొత్తంలో బంగారు నగలను కొనుగోలు చేయాలంటే ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే మీ పెట్టుబడికి తగిన విలువ లభిస్తుంది

Screaming plants: అరిచే మొక్కల గురించి ఎప్పుడైనా విన్నారా..? వివరాలు

Screaming plants: సాధారణంగా మనుషులు ఒత్తిడికి గురైనప్పుడు.. కోపం వచ్చినప్పుడు..
ఇతరులపై అరవడం చూస్తూ ఉంటాం.. అయితే ఈ ఒత్తిడి కారణంగా వచ్చే కోపం జంతువుల్లో కూడా కామన్ గా కనిపిస్తుంది. అయితే మనుషులు, జంతువులు (Animals) అరవడం కామన్.. అయితే మొక్కలు (Plants) ఎప్పుడైనా అరవడం విన్నారా..? అంతేకాదు ఆ మొక్కలు కూడా ఒత్తిడికి గురవుతాయి అంట..? అలా ఒత్తిడికి గురైనప్పుడు పెద్దగా అరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు మొక్కలపై ఒత్తిడి ఉంటుంది. అవి ఎలా అరుస్తాయి అని డౌట్ పడుతున్నారా.. కానీ అది నిజమే అంటున్నారు.

మొక్కలకి సరిగా నీరు లభించనప్పుడు.. ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు అవి గట్టిగా అరుస్తాయంట. కానీ ఇలా మొక్కల నుంచి వచ్చే అరుపులు ఎవరూ విని ఉండరు. ఒకవేళ విన్నాకూడా అది గాలి కారణంగా మొక్కల నుంచి వచ్చే శబ్ధం అయ్యి ఉంటుందని సర్ధి చెప్పుకుంటాం..
కానీ వాస్తవం ఏంటంటే..? మనుషులు వినలేని, గుర్తించలేని పౌనఃపుణ్యంతో మొక్కలు శబ్దాలు చేస్తాయట, అరుస్తాయట.. వాటిని మానవులు అంత సులువుగా వినలేరని దీని కోసం ప్రత్యేక పరికరాలు వినియోగించాలని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

మొక్కలకు నీరు లభించనప్పుడు.. అవి మానవులు వినలేని పౌనః పున్యంతో కూడిన ‘స్క్రీమ్’ను విడుదల చేస్తాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. జర్నల్ సెల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం మొక్కలు ఒత్తిడికి ప్రతిస్పందనగా గాలిలో శబ్దాలను కూడా ఉత్పత్తి చేయగలవని అంటున్నారు. టెల్ అవీవ్ యూనివర్శిటీ నిపుణులు టొమాటో, పొగాకు మొక్కలు, ఇతర మొక్కలపై పరిశోధనలు చేసి అవి శబ్దాలు చేస్తున్నట్లు గుర్తించారు. మనుషులకు ఆ శబ్దాలు వినిపించకపోయినా.. వివిధ రకాల జీవులు వాటిని వింటున్నాయని వారు గుర్తించారు.
మొక్కలు ‘సెసిల్’ జీవులని అంటే.. శాకాహారంపై ఆధారపడేవని చెబుతున్నారు. దీంతో అవి ఒత్తిడిని తట్టుకోలేవని పరిశోధకులు చెబుతున్నారు. మొక్కల్లో జరిగే.. జీవ రసాయన ప్రతిస్పందనలను పరిశీలించిన పరిశోధకులు.. వాటికి మెరుగైన కాంతి, గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రత, కావాల్సిన రసాయనాలు, నీరు వంటి వాటిని పుష్కలంగా అందించి.. వాటి పెరుగుదలలో వచ్చిన అసాధారణ మార్పులను గమనించారు. ఈ శబ్ద సంకేతాలు గుర్తించి ఆయా సమస్యలను వెంటనే నివారిస్తే.. మొక్కల పెరుగుదల, పునరుత్పత్తిలో పెనుమార్పులు సంభవిస్తాయని అంటున్నారు.
మొక్కలు ఒత్తిడిని ఎదుర్కోవడానికి, నిరోధించడానికి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా లాంటి ఇతర జీవులతో పరస్పరం సంబంధాలు ఏర్పరుచుకుంటాయని చెబుతున్నారు. గతంలోనూ పరిశోధకులు తేనెను ఉత్పత్తి చేసే శబ్దాలను రికార్డు చేసి.. ఏ మొక్కలు అధికంగా తేనెను ఇస్తాయి అన్నది నిర్దారించి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ పరిశోధనలు చేసిన లిలాచ్ హడానీ నేతృత్వంలోని బృందం.. టమోటా, పొగాకు మొక్కలు, వివిధ జాతులు మొక్కలు గాలిలోకి విడుదల చేస్తున్న శబ్దాలను రికార్డ్ చేస్తోంది.
ఈ ధ్వనులు 20-100 కిలోహెర్ట్జ్ పరిధిలో అల్ట్రాసోనిక్‌గా ఉన్నాయని.. దీని కారణంగా మనుషులు వినలేకపోతున్నారని అన్నారు. వీరు పరిశోధనను నిర్వహించడానికి.. 5 శాతం కంటే తక్కువ నీరు శాతం ఉన్న నేలను ఎంచుకున్నారు. అక్కడ మొక్కలు చేస్తున్న శబ్దాలను గుర్తించారు. ఈ పరిశోధనలో ఒత్తిడి లేని మొక్కలు కంటే.. ఒత్తిడికి గురైన మొక్కలు ఎక్కువ శబ్దాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి పరిశోధకులు ఏ జాతులు ఏఏ ధ్వనిని ఉత్పత్తి చేశాయో మాత్రమే కాకుండా.. అది ఏ రకమైన ఒత్తిడితో ఉందో కూడా గుర్తించగలిగారు.
అన్ని మొక్కల్లో ఈ శబ్దాలను పరిశోధకులు గుర్తించలేకపోయారు. కేవలం కొన్నింటిలో మాత్రమే కనుగొన్నారు. ఇలాంటి పరిశోధనలు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి సహాయపడతాయా అన్నది ప్రశ్నార్థకం. శబ్దాల ఆధారంగా మొక్కలను పరిరక్షించుకోవచ్చని.. మరింత ప్రయోగాలు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని శాస్త్రవేత్తులు చెబుతున్నారు.

Business Ideas: ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా ట్రై చేయని బిజినెస్ ఇదే…మూడు నెలల్లో రూ. 5 లక్షల లాభం మీ సొంతం…

నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. మీ వయస్సు మీరక ముందే జీవితంలో సెటిల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటే సరిపోతుంది.

బిజినెస్ చేయాలంటే పెట్టుబడి అనేది తప్పనిసరి మరి మీరు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారా.. ఇంకా ఏమాత్రం ఎదురుచూడద్దు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది. నిరుద్యోగ యువత కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ముద్రా రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ బ్యాంకులో ముద్రా రుణాలను అందిస్తున్నాయి ఈ రుణాలను పొందడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించి చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముద్ర రుణాల కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా రుణం పొందే వీరుంది. ముద్ర రుణాలను 50 వేల నుంచి పది లక్షల వరకు పొందే అవకాశం ఉంది.

ఇప్పుడు ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ వినూత్నమైన వ్యాపార ఐడియా గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. . ప్రస్తుతం పట్టణాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన చాలా పెరిగింది ఈ నేపథ్యంలో చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తినేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకునే వీలుంది.

చిరుధాన్యాలను ఇంగ్లీషులో మిల్లెట్స్ అంటారు. వీటితో చేసినటువంటి స్నాక్స్ విక్రయిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మంచి రుచిగల స్నాక్స్ చిరుధాన్యాలతో మనం తయారు చేసుకునే వీలుంది. చిరుధాన్యాలతో మన సాంప్రదాయ స్నాక్స్ అయినా మురుకులు, సకినాలు, పకోడీలు, లడ్డూలు, వంటివి చేయవచ్చు. రాగులు, కొర్రలు, సజ్జలను ఉపయోగించి మీరు ఈ స్నాక్స్ తయారు చేయవచ్చు. సాంప్రదాయ రుచులను చిరుధాన్యాలతో అందిస్తే జనం ఆదరణ లభించే అవకాశం సులభంగా తగ్గుతుంది.

ఇక సాంప్రదాయ చిరుతిళ్ళతో పాటు మార్కెట్లో విరివిగా లభించే చిరుతిళ్లను కూడా ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా బిస్కెట్లు, కుకీస్, నూడుల్స్ వంటివి తయారుచేసి విక్రయించడం ద్వారా ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లకు మంచి డిమాండ్ ఉంది. తర ఉద్యోగస్తులు విద్యార్థులు బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. వీరికి చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లను పరిచయం చేస్తే మీకు మంచి సేల్స్ లభించే అవకాశం ఉంది. తద్వారా చక్కటి ఆదాయం కూడా పొందవచ్చు.

ఇక బిజినెస్ విషయానికి వస్తే చిరుధాన్యాలతో చేసిన చిరుతళ్లను విక్రయించడానికి ఒక బ్రాండ్ అవసరం కావున ముందుగా ఓ బ్రాండ్ ను సృష్టించుకుని చక్కటి ప్యాకింగ్ పద్ధతులను అవలంబించి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు రుచి నాణ్యత పాటిస్తే మీ వ్యాపారం శాశ్వతంగా మార్కెట్లో నిలిచిపోతుంది.

నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, మన్నం వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

LIC Policy: మహిళల కోసం ఎల్ఐసీ అద్దిరిపోయే ప్లాన్.. రోజుకు రూ.87 ఇన్వెస్ట్ చేస్తే రూ. 11 లక్షలు పొందొచ్చు..

LIC పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ప్రత్యేకంగా మహిళల కోసం LIC అద్దిరిపోయే స్కీమ్స్ అందిస్తోంది. అందులో ఆధార్ శిలా స్కీమ్ మంచి బెనిఫెట్స్ అందిస్తోంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో బీమా రక్షణ, పొదుపు ప్రయోజనాలు రెండింటినీ పొందుతారు. మహిళలు రోజుకు రూ.87 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ కాలానికి ఎక్కువ డబ్బును పొందవచ్చు.

‘LIC ఆధార్ శిలా’ ప్లాన్ మహిళల కోసం రూపొందించబడిన ఎండోమెంట్, నాన్ లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఇది పాలసీ వ్యవధిలో మరణం సంభవించినప్పుడు కస్టమర్ల కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను పోగుచేయడంలో సహాయపడుతుంది. 8 నుంచి 55 ఏళ్ల లోపు మహిళలందరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రీమియం ఇలా ఉంటుంది..
ఆధార్ శిలా పాలసీ మెచ్యూరిటీ సమయం కనిష్టంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. గరిష్టంగా 70 సంవత్సరాలు. ఒక మహిళ ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గరిష్టంగా రూ. 3 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇక వాయిదాలను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన కూడా చెల్లించవచ్చు.

ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది..

మహిళలు తమ 15 ఏళ్ల వయస్సులో రోజుకు 87 రూపాయలు డిపాజిట్ చేస్తే.. ఏడాది కాలంలో రూ.31,755 మొత్తం పొదుపు అవుతుంది. అదేవిధంగా, 10 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేస్తే రూ. 3,17,550 అవుతుంది. ఆ తర్వాత, మెచ్యూరిటీ సమయంలో మొత్తం సుమారు రూ. 11 లక్షలు పొందుతారు.

RO Water: RO నీటిని ఇంట్లో వినియోగిస్తున్నారా? అయితే మీరు ఈ ముఖ్యమైన విటమిన్ లోపం బారిన పడవచ్చు

కుళాయి నీటిలో హానికరమైన టాక్సిన్లు, సీసం వంటి అకర్బన సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటివల్ల ఆరోగ్యానికి చాలా చేటు. అందుకే ఎంతోమంది ఇళ్లల్లో RO లను పెట్టుకుంటున్నారు.
దీన్ని వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే బ్యాక్టీరియా, వైరస్లను ఇది 97% వరకు శుభ్రం చేస్తుంది. ఇవి నీటిలోని మలినాలను తొలగిస్తాయి. అయితే ఒక అధ్యయనం ప్రకారం నిత్యం RO వాటర్ తాగేవారు బి12 లోపానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శాఖాహారులే ఈ విటమిన్ లోపం బారిన పడవచ్చు.

ఎలా బి12 లోపిస్తుంది?
విటమిన్ బి12 మన శరీరానికి అత్యవసరం.అయితే ROలో నీరు ప్రవహిస్తున్నప్పుడు అక్కడున్న ప్యూరిఫైయర్లు నీటిలో ఉన్న కోబాల్ట్ ను తొలగిస్తాయి. విటమిన్ బి12 సంశ్లేషణకు కోబాల్ట్ చాలా అవసరం. ఇది లోపిస్తే మన పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది. విపరీతమైన అలసట వస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా 160 మంది రోగులపై పరిశోధన చేశారు. వారందరిలోనూ బి12 లోపం ఉంది. వారంతా శాఖాహారులు. అంతేకాదు వీరంతా ఇళ్లలో ROను ఉపయోగిస్తారు.అందరిలోనూ విటమిన్ బి12 లోపం వచ్చింది. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు సరిపడేంత ఉత్పత్తి కావు. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ వెళ్లడం తగ్గుతుంది. అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలి.

కనిపించే లక్షణాలు
విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుని వదిలేయకూడదు.
1. కండరాలు బలహీనంగా అనిపిస్తాయి
2. చేతులు, కాళ్లలో తిమ్మిరి పడుతుంది
3. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది
4. ఆకలి తగ్గుతుంది
5. బరువు తగ్గుతారు
6. వికారంగా అనిపిస్తుంది
7. చికాకుగా అనిపిస్తుంది
8. నాలుక సున్నితంగా మారుతుంది

ఏం తినాలి?
విటమిన్ బి12 లోపం బారిన పడకుండా ఉండాలంటే రోజూ కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తినాలి. పాలు, చీజ్, పెరుగు, చికెన్, మటన్, చేపలు, గుడ్లు, సోయా పాలు, పప్పులు… ఇలాంటి వాటిల్లో బి12 పుష్కలంగా లభిస్తుంది. RO నీళ్లు తాగుతున్నా కూడా వీటిని తినడం వల్ల ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు. రోజూవారీ ఆహారంలో ఇక్కడ చెప్పిన ఆహారాల్లో కనీసం రెండింటినైనా తినాలి. అలా తినడం వల్ల విటమిన్ లోపం నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని లోపాన్ని తేలికగా తీసుకోకూడదు.

Gold: బంగారం కొంటున్నారా? ఈ 7 అంశాలను తప్పక గమనించండి.. లేదంటే నష్టపోతారు..

భారతీయులు బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితంగా భావిస్తారు. శనివారం అక్షయ తృతీయ సందర్భంగా ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో రూ.250 కోట్ల విలువైన బంగారం విక్రయాలు జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు.
మీరు కూడా ఆభరణాలు, నాణెం లేదా బిస్కెట్లు వంటి ఏదైనా బంగారు వస్తువును కొనుగోలు చేసినట్లయితే.. భవిష్యత్తులో మీరు నష్టపోకుండా ఉండాలంటే, దాని బిల్లుపై ఈ 7 అంశాలను ఖచ్చితంగా చెక్ చేయాలి.

ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి, దేశంలో గోల్డ్ హాల్‌మార్కింగ్ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను గుర్తిస్తుంది. కాబట్టి ముందుగా మీరు కొనుగోలు చేసిన బంగారానికి హాల్‌మార్క్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

బంగారు కొనుగోలు బిల్లుపై ఈ 7 అంశాలను చెక్ చేయండి..

బంగారం కొనుగోలు తరువాత దానికి సంబంధించిన బిల్లు చాలా ముఖ్యం. భవిష్యత్తులో బంగారాన్ని విక్రయించే సందర్భంలో.. సరైన విలువను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. అదే సమయంలో, వివాదం విషయంలో కీలకంగా ఉంటుంది. అందుకే.. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల బిల్లులో ఈ 7 వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

1. వస్తువు పేరు, వివరణ: బిల్లులో తప్పనిసరిగా బంగారు గొలుసు, దాని ఐటెమ్ నంబర్ వంటి వివరాలు పూర్తిగా ఉండాలి.

2. ఎన్ని నగలు తీసుకున్నారు: బిల్లులో మీరు ఎన్ని వస్తువులు తీసుకున్నారనే సమాచారం ఉండాలి.

3. బరువు: మీరు కొనుగోలు చేసిన బంగారు వస్తువు ఖచ్చితమైన బరువు ఎంత. ఈ వివరాలు బిల్లుపై ఉండాలి.

4. స్వచ్ఛత: బంగారం 22 క్యారెట్, 18 క్యారెట్, 24 క్యారెట్ సమాచారం బిల్లుపై ఉండాలి.

5. గోల్డ్ రేట్: మీరు కొనుగోలు చేసిన రోజు బంగారం ధర ఎంత, మేకింగ్ ఛార్జీలుగా మీ ఆభరణాల వ్యాపారి ఎంత వసూలు చేశారు. ఈ సమాచారం కూడా బిల్లులో ఉండాలి.

6. రత్నం లేదా వజ్రం వివరాలు: మీ బంగారు వస్తువులో ఏదైనా రత్నం, విలువైన రాయి లేదా వజ్రం పొందుపరచబడి ఉంటే, దాని వివరాలను కూడా బిల్లులో పేర్కొనాలి. ఇందులో ఆ వస్తువు క్యారెట్, ధర మొదలైనవి ఉంటాయి.

7. ధర: మీరు చేసిన కొనుగోళ్ల మొత్తం విలువ ఎంత, అది కూడా బిల్లులో ఉండాలి.
దీనితో పాటు, బిల్లుపై హాల్‌మార్కింగ్ ఛార్జీలను కూడా ప్రస్తావిస్తున్నారు. 2022 మార్చి 4 నుంచి హాల్‌మార్కింగ్ ఛార్జ్ రూ.45కి పెరిగింది. అంతకుముందు రూ.35 ఉంది.

మీరు అద్దె ఇంట్లో ఉన్నారా? 11 నెలలకే ఎందుకు ఒప్పందం చేసుకుంటారో తెలుసా? ఇక్కడ సమాచారం ఉంది

సాధారణంగా, చాలామంది తమ స్వస్థలం నుండి ఇతర నగరాలకు లేదా ఇతర జిల్లాలకు ఉపాధి, ఉద్యోగ బదిలీ మరియు కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం కోసం వలసపోతారు.
ఈ వరుసలో చాలా మంది ఉన్నారు మరియు దీనికి చాలా ఉదాహరణలు ఈ రోజు మన ముందు ఉన్నాయి.

వివిధ కారణాల వల్ల నగరాన్ని వదిలి వేరే నగరానికి వచ్చిన ప్రజలు నివసించడానికి పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లను ఎంచుకుంటున్నారు. ఈ అద్దె ఇళ్లలో ఏదో ఒక ఉపాయం ఉందా? కనుగొనడం మొదటి కష్టం, కనుగొన్న తర్వాత అంగీకరించడం రెండవ కష్టం! ఆయతు, వాస్తు, యాంబియన్స్‌ అన్నీ ఉన్నా తనిఖీ చేయడం కష్టం.

వీటన్నింటికీ మించి ఒప్పందం! సంబంధిత ఇంటి యజమాని అద్దెదారుతో 11 నెలల ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇది యజమాని మరియు అద్దెదారు మధ్య చట్టపరమైన ఒప్పందం. ఇది అంగీకరించబడి సంతకం చేయబడితే, అద్దెదారు 11 నెలలలోపు ఇంటిని సులభంగా వదిలి వెళ్ళలేరు. అలా చేస్తే, వారు అడ్వాన్స్ చేసిన డబ్బును యజమాని తన వద్ద ఉంచుకుంటాడు.
ఈ అద్దె ఒప్పందం 11 నెలలకు మాత్రమే ఎందుకు? 12 నెలల నుంచి ఏడాది వరకు ఎందుకు చేయడం లేదనే ప్రశ్న ఇప్పటికీ పలువురిని వేధిస్తోంది. దీని వెనుక కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సమాధానం ఉంది.

11 నెలల అద్దె ఒప్పందం ఎందుకు? దేశంలో అద్దె ఒప్పందాల కోసం చట్టంలో తగిన నిబంధనలు రూపొందించబడ్డాయి. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908లోని సెక్షన్ 17(డి) ప్రకారం, అద్దె ఒప్పందం అవసరం. అయితే, ఈ ఒప్పందం కనీసం ఒక సంవత్సరం పాటు జరగాలి మరియు అద్దె ఒప్పందం లేదా లీజు ఒప్పందాన్ని నమోదు చేయవలసిన అవసరం లేదు. ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం. సరళమైన భాషలో చెప్పాలంటే, మీ యజమాని 11 నెలల వరకు మాత్రమే అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకోగలరు.
చిన్న పొరపాటు కారణంగా, ఆస్తి యజమానులు వారి స్వంత ఆస్తి కోసం సంవత్సరాల తరబడి న్యాయ పోరాటాలు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా 11 నెలల అద్దె ఒప్పందం కుదిరింది. అద్దె అద్దె చట్టం ప్రకారం, అద్దెకు సంబంధించి యజమాని మరియు అద్దెదారు మధ్య ఏదైనా వివాదం ఉంటే, అప్పుడు విషయం కోర్టుకు వస్తుంది, ఆపై అద్దెను నిర్ణయించే హక్కు కోర్టుకు ఉంటుంది.

ఒక యజమాని 11 నెలల అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకుంటే, అతను స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ తప్పనిసరి కాదు మరియు ఇది ఇంటి యజమాని ఖర్చును కూడా ఆదా చేస్తుంది.

నోటరీ చేయబడిన అద్దె ఒప్పందం 11 నెలల వరకు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. వివాదం విషయంలో, ఈ ఒప్పందాలను సాక్ష్యంగా సమర్పించవచ్చు. అటువంటి రేట్ డ్రాఫ్ట్ తయారు చేయడానికి, రూ.100 లేదా రూ.200 స్టాంప్ పేపర్ ఉపయోగించబడుతుంది,

Drinking Water Formula : ఒక వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లను తాగాలో చెప్పే సూత్రం = (బరువు/10)-2

Drinking Water Formula : మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెలుసుకోవచ్చు.

ఫార్ములా.. ఓ వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి = ( ఆ వ్యక్తి బరువు/10)-2

ఉదాహరణకు 60 KG ల బరువున్న వ్యక్తి తాగాల్సిన నీటి పరిమాణం= (60/10)-2. ఇది 6-2 అవుతుంది. అంటే 4 లీటర్లు అన్నమాట. అంటే.. 60 KG ల బరువున్న వ్యక్తి రోజుకు తాగాల్సిన నీటి పరిమాణం 4 లీటర్లు అని తెలుస్తుంది. 70 Kg ల వ్యక్తి 5 లీటర్లు, 80 Kg ల వ్యక్తి 6 లీటర్లు.. ఇలా శరీర బరువును బట్టి తాగాల్సి ఉంటుంది.

Drinking Water Formula
Note : 3 సంవత్సరాల లోపు పిల్లలకు 1 లీటర్ నీటి ఆవసరం ఉంటుంది. మరీ చిన్న పిల్లల విషయంలో వారి అవసరాన్ని బట్టే నీటిని తాగించాల్సి ఉంటుంది. అధికంగా 8 లీటర్ల కంటే కూడా ఎక్కువ నీళ్లను తాగడం శ్రేయస్కరం కాదు. కనుక ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగా నీళ్లను తాగాల్సి ఉంటుంది.

Vastu Tips : ఈ దిక్కులో తలపెట్టి పొరపాటున నిద్ర పోయినా దరిద్రం అయస్కాంతంలా అతుక్కోవడం ఖాయం

మనలో చాలామంది తమ దినచర్యలో భాగంగా తెలిసి లేదా తెలియక ఇలాంటి ఎన్నో పనులు చేస్తుంటారు. తెలిసి తెలియని తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది.
సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఫలితంగా అనేక రకాల నష్టాలను భరించవలసి ఉంటుంది. వీటిలో ఒకటి తప్పు దిశలో పాదాలతో నిద్రించడం. వాస్తు శాస్త్రంలో, వ్యక్తి సరైన దిశలో తల, పాదాలను ఉంచడం ద్వారా నిద్రించే దిశను నిర్ణయించారు. మనిషి ఏ దిక్కున తలపెట్టి పడుకోవాలో, ఏ దిక్కులో పాదాలు పెట్టుకోవాలో పేర్కొన్నారు. కానీ అవగాహన లేకపోవడం వల్ల దానిని అనుసరించడం లేదు. ఒక వ్యక్తి తప్పుడు దిశలో నిద్రపోతే, అతని శరీరంలోని శక్తి మొత్తం బయటకు వెళ్లిపోతుంది, ఎందుకంటే తప్పుడు దిశలో పాదాలు పెట్టి నిద్రించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఈ దిక్కున పాదాలు పెట్టి నిద్రించకూడదు:
వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా దక్షిణ దిశలో పాదాలు పెట్టి నిద్రించకూడదు. దక్షిణ దిశను యమదూత, యమ ప్రతికూల శక్తి దిశగా పరిగణిస్తారు, కాబట్టి ఈ దిశలో పాదాలను ఉంచి నిద్రించకూడదు. మీరు కూడా ఇప్పటి వరకు ఫాలో కాకపోతే ఈరోజే అప్రమత్తంగా ఉండండి.

తూర్పు దిశలో మీ పాదాలను ఉంచవద్దు:

వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి తన పాదాలను తూర్పు దిశలో ఉంచి నిద్రించకూడదు. సూర్యుడు ఈ దిశలో ఉదయిస్తాడు. తూర్పు దిశలో పాదాలతో నిద్రించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

పాదాలను తప్పుడు దిశలో ఉంచడం వల్ల కలిగే నష్టాలు:
వాస్తు శాస్త్రంలో ఒక వ్యక్తి తూర్పు లేదా దక్షిణ దిశలో పాదాలతో నిద్రపోతే, ప్రతికూల ఆలోచనలు, భయానక కలలు వస్తాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇది కాకుండా, ప్రజలు నిరాశ, భయానికి గురవుతారు. ఈ దిశలలో పాదాలతో నిద్రించడం అశుభం.

వాస్తు శాస్త్రం ప్రకారం, వ్యక్తి పాదాలను ఉత్తర దిశలో ఉంచి నిద్రించడం మంచిది. దీనివల్ల సుఖం, శ్రేయస్సు, శాంతి, ధన లాభం, వయసు పెరుగుతాయి. అంతే కాకుండా తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల జ్ఞానం లభిస్తుంది. మీరు కూడా మీ పాదాలను తప్పుడు దిశలలో ఉంచి నిద్రిస్తున్నట్లయితే, ఈరోజే జాగ్రత్తగా ఉండండి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Health

సినిమా