టెన్త్, ఇంటర్ పాసైన వారికి శుభవార్త: 5 నోటిఫికేషన్ లు..22000పైనే ప్రభుత్వ ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

10వ తరగతి, ఇంటర్మీడియట్ పాసైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే వారికి భారీ శుభవార్త. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), SSC CHSLతో సహా అనేక రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ లు రిలీజ్ అయ్యాయి.

వీటి ద్వారా కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది.

SSC CHSL అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్ష. దీని ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) వంటి పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 10, 12వ తరగతి పాస్ అయిన కోసం ఐదు లేటెస్ట్ రిక్రూట్‌మెంట్స్ ఇప్పుడు చూద్దాం.

Related News

RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024

ఆర్‌పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 10వ తరగతి అర్హతతో 4208 కానిస్టేబుల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 14 చివరి తేదీ. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 28 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్)కి మూడేళ్ల సడలింపు లభిస్తుంది. RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ssc chsl రిక్రూట్‌మెంట్ 2024

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసైనవాళ్లు SSC CHSL కి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా,ఖాళీగా ఉన్న 3712 డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మే 7 చివరి తేదీ. SSC వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్‌మెంట్ 2024

నోవోదయ విద్యాలయ సమితి (NVS)లో 1377 నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా నర్స్, ఆఫీసర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి పోస్టులపై రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ nvs.ntaonline.in ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30. ఈ పోస్టులకు విద్యార్హత 10వ తరగతి పాస్, 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్, BA/B.Sc.

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) లేదా AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్/హ్యాండీ ఉమెన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 10వ తరగతి ఉత్తీర్ణులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 422 ఖాళీలు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ https://www.aiasl.in/ని ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ఉద్యోగం చేయాలనేది చాలామందికి ఓ డ్రీమ్. అయితే ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఐబీలో మొత్తం 660 వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు మే 30 లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *