Saturday, November 16, 2024

Samba Masuri Rice: డయాబెటిక్ పేషెంట్లకు ఈ బియ్యం వరం… శాస్త్రవేత్తల సలహా ఏంటంటే..

సంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడుల్చిన వంగడం సాంబ మసూరి.. దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో రైతులు ఈ రకం వరినే సాగు చేస్తారు. దీని అన్నం తినడానికి రుచిగా ఉంటుంది. అదే సమయంలో పంట తక్కువ రోజుల్లో పండడం వల్ల రైతుకు పెద్దగా ఖర్చు ఉండదు. నేడు ఈ ఈ రకం వరి వంగడాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ వంటి వివిధ రాష్ట్రాల్లో 1.5 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేస్తున్నారు. CSIR-CMAP నిర్వహించిన జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన CSIR-CCMB సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. హితేంద్ర పటేల్ సాంబా మన్సూరి బియ్యం గురించి వివరించారు.

సాంబా మసూరి బియ్యం బాక్టీరియా ముడత వ్యాధికి నిరోధకతను కలిగి ఉంటుంది. చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్ లేదా డ్రింక్‌ని తినడం లేదా తాగిన తర్వాత రక్తంలో ఎంత గ్లూకోజ్ పెరుగుతుందనే దాని ఆధారంగా ర్యాంక్ చేసే స్కేల్ అని గమనించాలి.
తక్కువ GI ఉన్న బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని చెబుతున్నారు.. తక్కువ GI ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలై మధుమేహం దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మంచి దిగుబడి మరియు చక్కటి ధాన్యం రకాన్ని కూడా చూపింది, దాని మార్కెట్ సామర్థ్యాన్ని మరియు రైతులకు లాభాన్ని పెంచుతుంది. ఇది బాక్టీరియా ముడతకు కూడా నిరోధకతను కలిగి ఉంటుంది.

Uric Acid Problem: కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి వేళ్ల కీళ్లలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. యూరిక్ యాసిడ్‌ను తగ్గించగల 5 ప్రభావవంతమైన హోమ్‌ రెమెడీస్‌ ఇవే..

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేటరీని నివారించడమే కాకుండా, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఒక ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి.
ఎండిన కొత్తిమీర ఆకులు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకుల్లో యూరిక్ యాసిడ్ ను మూత్రంతో తొలగించే గుణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు కొత్తిమీర టీ లేదా కొత్తిమీర నీటిని తీసుకుంటే మంచిది.
యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో వేప ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యను నయం చేస్తుంది. వేప శరీరం మొత్తం నిర్విషీకరణలో కూడా బాగా పనిచేస్తుంది.
రోజువారీ ఆహారంలో చేపలు తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి సులభంగా బయటికి పోతుంది.
ఆయుర్వేదంలో కరక్కాయ (మైరోబాలన్)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నిర్విషీకరణ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్‌లను సులువుగా బయటకు పంపుతుంది. మైరోబాలన్ తీసుకోవడం జీర్ణక్రియకు కూడా మంచిది. దీని సహాయంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. అలాగే గట్ సమస్యలు కూడా నయమవుతాయి.

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

ఏపీలో వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది.. బుధవారం ఒక్కరోజే ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రూ.502 కోట్లు విడుదల చేశారు. అలాగే మిగిలిన పథకలకూ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. అన్ని పథకాలకు రెండు మూడు రోజుల్లో నిధుల విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ డీబీటీ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉత్కంఠరేపింది. పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలకు అనుమతి ఇవ్వాలని పోలింగ్‌కు రెండు, మూడు రోజులు ముందు ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే పోలింగ్‌కు ముందు పథకాలకు డబ్బులు విడుదల చేయడం సరికాదని ఈసీ చెప్పింది. ఎన్నికల ప్రక్రియ జూన్ 6తో ముగుస్తుందని.. అప్పుడు డబ్బులు విడుదల చేయొచ్చని తెలిపింది.
ఎన్నికల సంఘం డీబీటీ పథకాలకు డబ్బులు విడదుల చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మరోసారి ఈసీని కలిసి వినతి ఇవ్వాలని సూచించింది.. ప్రభుత్వం మరోసారి ఈసీని రిక్వెస్ట్ చేసినా అనుమతి ఇవ్వలేదు.. ఇప్పుడు అంత అత్యవసరం ఏముందని.. పోలింగ్ పూర్తైన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని సూచించిది. ఈ క్రమంలో హైకోర్టులో మరోసారి విచారణ జరగ్గా.. నిధులు విడుదల చేసేందుకు ఒక్కరోజు అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం ఈసీని మూడోసారి పథకాల డబ్బుల విడుదల చేసేందుకు అనుమతి కోరినా తిరస్కరించారు. దీంతో నిధుల విడుదలకాలేదు.. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో అకౌంట్లలో జమ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎవరి కంట్రోల్ లో ఉంది ? చెయ్యి జారిపోయిందని సీరియస్, మాట వినకుంటే !

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో ఒకే రోజు జరగడంతో అన్ని పార్టీల నాయకులు పోలింగ్ ఫలితాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించింది.

అయితే ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రాజకీయ కక్షలతో దాడులు జరిగాయి. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గొడవల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయ్యింది. తాము ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఈసీ మండిపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెకరెట్రీ జవహర్ రెడ్డి, డీజీపీని ఢిల్లీకి పిలిపించుకున్న ఈసీ వివరణ కోరింది. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన విరణతో ఈసీ అసహనం వ్యక్తం చేసిందని తెలిసింది. ఈ దెబ్బకు మీడియాతో మాట్లాడకుండా వెనుక గేటు నుంచి సీఎస్, డీజీపీ చిన్నగా జారుకున్నారు. ఇద్దరు అధికారులు ఇచ్చిన విరణతో ఎన్నికల అధికారులు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసీ సీరియస్ అయ్యింది.

ఈసీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద వేటుపడింది. కొందరు అధికారులను బదిలి చెయ్యడంతో కొందరిని సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిన హింసకు వైసీపీ నాయకులకు కొమ్ముకాసిన అధికారులపై వేటు పడటంతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు చేస్తున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని అధికారులను ఈసీ హెచ్చరించిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఈసీ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నదని తెలిపింది, ప్రభుత్వ ఉద్యోగాల చేస్తున్న వారు ఉద్యోగుల్లా ఉండాలని, ఏ పార్టీ నాయకులకు కొమ్ముకాయకూడదని, నియమాలు ఉల్లంఘించి నాయకులు చెప్పినట్లు తల ఊపుకుంటూ వెళ్లి వారు చెప్పినట్లు చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఈసీ హెచ్చరించిందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ను కంట్రోల్ లోకి తీసుకున్న ఈసీ ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నదని తెలిసింది.

జూలై నుండి మహిళల ఖాతాల్లో నెలకి రూ.8,500! ఈ హామీ ఎవరికి అంటే?

దేశంలో నగదు బదిలీ పథకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్కీమ్ ల కింద.. ఇతరాత్ర సాయం చేసే కన్నా.. లబ్ధిదారుల చేతికి నగదు ఇస్తేనే మంచిది అని భావిస్తున్న ప్రభుత్వాలు..

ఆ దిశగా పథకాలను తీసుకొస్తున్నాయి. దీని వల్ల మార్కెట్లో నగదు ప్రవాహం పెరగడమే కాక.. కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ ఎన్నికల వేళ దాదాపు అన్ని పార్టీల నగదు బదిలీ పథకాలకు సంబంధించి హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో హామీ తెర మీదకు వచ్చింది. జూలై నుంచి ప్రతి మహిళ ఖాతాలో 8,500 రూపాయలు జమ చేస్తామంటున్నారు. ఆ వివరాలు..

దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4 ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. ఇండియా కూటమి మహిళా సాధికారిత కోసం పాటు పడుతుందని తెలిపారు. దీనిలో భాగంగా జూలై నుంచి ప్రతి మహిళ ఖాతాలో 8,500 రూపాయలు ఖాతాలో పడనున్నాయి.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న మా సోదరీమణులు భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జూన్ లో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత.. జూలై నుంచి ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.8,500 జమ అవుతుందని.. అంటే ఏడాదికి ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల కన్నా ఎక్కు మొత్తం జమ చేస్తామని.. దీనివల్ల ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని తెలిపారు. అంతేకాక ఆశా, అంగన్‌వాడీ, కిచెన్‌ హెల్పర్‌ల గౌరవ వేతనానికి సంబంధించి కూడా కేంద్రం సహకారం రెట్టింపు కానుంది అన్నారు. రూ. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుంది అని ప్రియాకం గాంధీ హామీ ఇచ్చారు

అంతకుముందు బుధవారం, తన సోదరుడు, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న వేళ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది ప్రియాంక గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్భణం భారీగా పెరిగిందని.. ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిందని విమర్శించింది. గతంలో రూ.400కి లభించే సిలిండర్ ఇప్పుడు రూ.1200కి.. నూనె, పప్పులు, పిండి, చక్కెర, ధరలు భారీగా పెరిగి సామాన్యుల జీవితాలను దుర్భరం చేశాయని విమర్శించింది.

Personal Growth: గద్ద చెప్పే జీవిత సత్యాలు.. ఫాలో అయితే తిరుగే ఉండదు..

భూమిపై ప్రతీ చెట్టు, పుట్ట, జంతువు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. దానిని మనం స్వీకరించే విధానంపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వాటిలో గద్ద ఒకటి.

గద్ద జీవన విధానం నుంచి మన జీవితానికి అవసరమైన కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. ఇంతకీ గద్దలో ఉండే ఆ మంచి గుణాలు ఏంటి.? వాటిని అనుసరిస్తే మనం జీవితంలో జరిగే మార్పు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

* గద్దలు ధైర్యానికి చిహ్నంగా నిలుస్తాయి. వేటాడే సమయంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా బెరుకులేకుండా పోరాటం చేస్తాయి. ఆహారం కోసం ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా, దృఢ నిశ్చయంగా ముందుకు సాగుతాయి. అనుకున్న పని సాధించేందుకు ఇలా పట్టుదలతో ఉండాలనే సందేశాన్ని గద్దలు మనకు అందిస్తాయి.

* గద్దలు చురుకైన చూపుకు పెట్టింది పేరు. అత్యంత షార్ప్‌ ఐపవర్‌ ఉన్న పక్షుల్లో గద్దలు మొదటి స్థానంలో ఉంటాయి. అలాగే గద్ద చూపు లక్ష్యంపైనే ఉంటుంది. అందుకే సముద్రంలో ఉన్న చేపను కూడా ఎంతో పర్‌ఫెక్ట్‌గా పట్టుకోగలుగుతుంది. గద్ద నుంచి నేర్చుకోవాల్సిన మరో పాయింట్‌ ఈ ఏకాగ్రతే.

* స్వేచ్ఛ, స్వాతంత్రానికి గద్ద సూచికంగా నిలుస్తుంది. సాధారణంగా అన్ని పక్షులు గుంపులుగా ఎగిరితే గద్ద ఒక్కటే ఒంటరిగా విహరిస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలన్న సందేశాన్ని గద్ద అందిస్తుంది.

* ఇక గద్దలు ఎలాంటి పరిస్థితులనైనా సమానంగా ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రతికూల వాతావరణానికి అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మలుచుకుంటాయి. తట్టుకొని నిలబడేందుకు తనను తాను మార్చుకుంటాయి.

* గద్దలు ఏకాగ్రతకు పెట్టింది పేరు. ఆహారాన్ని వేటాడే క్రమంలో గద్దలు డిస్బ్రబ్‌ కాకుండా ఉండేందుకు ఒంటరిగా ప్రయణిస్తాయి. గుంపులుగా విహరిస్తే.. వచ్చే శబ్ధం కారణంగా వాటి దృష్టి మరలుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇతర వ్యాపాలకు డైవర్ట్‌ కాకుండా లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేయాలని గొప్ప సందేశాన్ని గద్ద చెబుతోంది.

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ – రోజుకు రూ.50 పొదుపు చేస్తే చేతికి రూ.30లక్షలు! –

Post Office Gram Suraksha Yojana : సాధారణంగా ఎవరైనా భవిష్యత్తు కోసం మంచి లాభాలు అందించే పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అదే టైమ్​లో రెగ్యులర్ ఆదాయంతో తక్కువ రిస్క్ ఉండే స్కీమ్స్​లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పోస్టాఫీస్(Post Office) అందించే పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో ఓ పథకమే.. “గ్రామ సురక్ష యోజన(Gram Suraksha Yojana)”. దీంట్లో రోజూ రూ.50 ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ నాటికి రూ.30లక్షలు అందుకోవచ్చు. ఇంతకీ, ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు? మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? ఎలా చేరాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తున్న.. గ్రామ సురక్ష యోజన స్కీమ్ కేవలం పొదుపు పథకమే మాత్రమే కాకుండా.. హెల్త్ అండ్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ కూడా. దీనిని 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తపాలా శాఖ ప్రారంభించింది. ఈ పథకంలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్​కు సంబంధించిన ప్రీమియం చెల్లించడానికి వివిధ ఆప్షన్లు ఉన్నాయి. అంటే.. నెలవారీగా, మూడు నెలల ప్రాతిపదికన, 6 నెలలకు ఓసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా ఎప్పుడైనా ప్రీమియం డబ్బుల్ని చెల్లించవచ్చు.

ప్రీమియం చెల్లింపు వివరాలు :

గ్రామ సురక్ష యోజన స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు.. ఇలా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే.. అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలన్నమాట. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఎలా వస్తుందంటే?

ఈ పథకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారనే దాన్ని బట్టి.. మీకు వచ్చే రాబడి ఉంటుంది. మీరు.. 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు తిరిగి వస్తాయి.
అదే.. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
ఈ మెచ్యూరిటీ సొమ్ము 80 ఏళ్లు నిండిన తర్వాత అందుతుంది.
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు.
ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
ఈ స్కీమ్​లో బోనస్‌ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.
ఎలా చేరాలంటే?

మీ సమీపంలోని పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఈ స్కీమ్ గురించి అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత సంబంధిత అప్లికేషన్‌ ఫారమ్‌ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అధికారులకు ఇవ్వండి.

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Diabetes: మెంతి గింజల నీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. మీ జీవక్రియను వేగవంతం చేయడానికి మెంతి గింజలు నీరు ఉపయోగపడతాయి.

మధుమేహం, అధిక బరువు , మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వీటన్నింటినీ తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతి గింజల నీటిని తాగితే మంచిది. ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.

అలాగే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మెంతి గింజలను అందాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించవచ్చు. వీటిని పురాతన కాలం నుంచి హెయిర్ ప్యాక్ లు, ఫేస్ ప్యాక్ లుగా కూడా ఉపయోగిస్తున్నారు.

ఖాళీ పొట్టతో మెంతి నీరు తాగితే…
మెంతి గింజల నీటిని పరగడుపున తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

1. జీర్ణక్రియకు సహాయపడుతుంది: మెంతులలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఆహార కదలికను ప్రోత్సహిస్తాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి.

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మెంతి గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
3. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది: మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్… కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. బరువు తగ్గడానికి మద్దతు ఇస్తుంది: మెంతి నీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కేలరీలను అధికంగా తీసుకోకుండా తగ్గించేలా చేస్తుంది.

5. చర్మ ఆరోగ్యానికి: మెంతి పొడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు లేదా మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.

6. రోగనిరోధక శక్తికి: మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

7. మంటను తగ్గిస్తుంది: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటాయి.

8. గుండె ఆరోగ్యానికి: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వల్ల హృదయనాళ పనితీరుకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి మెంతి నీరు ఎంతో సహాయపడుతుంది.
9. నెలసరిలో: మెంతి గింజలు రుతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడతాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

10. జుట్టు పెరుగుదలకు: మెంతుల్లో… ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతి గింజల నీటిని తాగడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

మెంతి గింజల నీటిని ఎలా తయారు చేయాలి?
మెంతులను ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా నెల రోజులు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Jr N.T.RamaRao:కిలేడీ చేతిలో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్..! హైకోర్టు లో కేసు ..

Jr N.T.RamaRao: ప్రముఖ నటుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూ. ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీఆర్‌ తరఫున న్యాయవాది పిటిషన్‌‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం నాడు విచారించింది. ఈ సమయంలో.. ట్రైబ్యునల్‌‌ ఇచ్చిన డాకెట్‌‌ ఆర్డర్‌‌ సమర్పించేందుకు వారం గడువు కావాలని, తదుపరి వెకేషన్‌‌ కోర్టులో విచారణకు అనుమతించాలని ఎన్టీఆర్‌‌ తరుపు న్యాయవాది చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్‌‌ 6న రెగ్యులర్‌‌ కోర్టులో జరుగుతుందని ప్రకటించింది.

అసలేం జరిగింది ?

జూనియర్ ఎన్టీఆర్ 2007లో జాబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో 881 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అయితే.. సుంకు గీత ఆమె కుటుంబం 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి.. రుణం పొందారు. కానీ, ఆమె ఆ రుణం చెల్లించలేదు. స్థలం కొనుగోలు సమయంలో ఆ విషయన్ని తనకు చెప్పలేదని ఎన్టీఆర్ చెప్పుతున్నారు.
ఈ క్రమంలో ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును ఇచ్చాయి. ఆ స్థలంపై ఎన్టీఆర్ కు హక్కులుండవనీ, బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదయింది. ఈ క్రమంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

అమ్మ బాబోయ్ ప్రజలను వణికిస్తున్న 200 రూపాయల నోట్.. కారణం ఏమిటంటే..?

ధనమేరా అన్నిటికి మూలం ఆనాడో చెప్పాడు ఓ సినీ కవి. చక్రవర్తికి, వీధి బిచ్చగత్తెకి బంధువు అవుతానని అందీ మనీ మనీ అన్నాడు మరో రచయిత. డబ్బు ఉంటే సుబ్బిగాడినైనా సుబ్బరాజు గారంటారు అంటూ డబ్బు మనిషికి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందో చెప్పాడు మరో పొయెట్. దుడ్డు మానవ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందీ అనేక సంఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ప్రపంచాన్ని నడిపిస్తుంది కూడా డబ్బే కావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. మనిషి అవసరాలకు, అత్యాశలకు నాందిగా మారింది. దీని కోసమే నేర ప్రవృత్తి మొదలై.. ఇప్పుడు పీక్స్‌కు చేరింది. డబ్బును డబ్బుతోనే మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు కేటుగాళ్లు. అవే నకిలీ నోట్లు.

ఇప్పుడు నకిలీ నోట్ల చెలామణి వ్యవహారం పెట్రేగిపోతుంది. పాత నోట్లు పోయి కొత్త నోట్లు రావడంతో దీన్నే వ్యాపారంగా మలుచుకుంటున్న వారికి వరంగా మారింది. గుర్తించలేని విధంగా, ఏ మాత్రం అనుమానం రాకుండా నకిలీ నోట్లు చేతులు మారుతున్నాయి. విచ్చలవిడిగా ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. రూ. 100, రూ. 200, రూ. 500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో ఈ నకిలీ నోట్ల కలకలం ఎక్కువగా ఉందట. డబ్బు చూస్తేనే స్థానిక దుకాణాదారులు భయపడిపోతున్నారట. నకిలీ నోట్లను గుర్తించడంపై అవగాహన ఉన్న వారికి అయితే పర్వాలేదు కానీ.. మిగిలిన వారి పరిస్థితి ఆగమ్య గోచరం. సామాన్యులు, చిరు వ్యాపారులు సైతం భారీగా మోసపోతున్నారు. బడ్డీ కోట్లు, చిన్న చిన్న దుకాణాదారులు నకిలీ నోట్లకు బలౌతున్నారట.

ఒకప్పుడు రూ. 500, రూ. 1000 నకిలీ నోట్లు చెలామణిలో ఉండేవి. నోట్ల రద్దు చేసిన తర్వాత.. రూ. 2000 వేల నోట్లు వచ్చాయి. దీంతో నకిలీ నోట్లు పుట్టుకొచ్చాయి. వెంటనే పెద్ద నోట్లను రద్దు చేశారు. దీంతో వెయ్యి, రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి. అలాగే పాత నోట్ల స్థానంలోకి కొత్త నోట్లు వచ్చాయి. రూ. 100, రూ. 200, రూ. 500 వచ్చి చేరాయి. అయితే రూ. 100, రూ. 500 కన్నా రూ. 200 నోటు మాత్రం సామాన్యులను, వ్యాపారులను భయపెడుతోంది. ఈ కరెన్సీకి ఎక్కువగా నకిలీ మకిలీ పట్టుకుంది. ఆ నోటు చూస్తుంటేనే అమ్మో.. 200 రూపాయల నోటా అంటూ నోరెళ్లబెడుతున్నారు. చదువుకోని వాళ్లు, పేదలు, వృద్దులు ఈ ఫేక్ నోటు బారిన పడుతున్నారు. జిల్లాలో ఈ కరెన్సీ ఎక్కువగా చెలామణి అవుతుండటంతో దీనిపై పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి సారించాలని చిరు వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు.

హఠాత్తుగా బీపీ పెరిగితే కంట్రోల్ చేసుకోవడం ఎలా..!?

బీపీని ఎప్పుడూ నార్మల్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం . ఇది జరగకపోతే, వ్యక్తి అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే మెదడుకు ఆక్సిజన్ సరిగా అందదు.

ఫలితంగా, వ్యక్తి పక్షవాతానికి గురవుతాడు.

స్ట్రోక్ అనేది తీవ్రమైన వైద్య పరిస్థితి. స్ట్రోక్ సమయంలో, ఒక వ్యక్తి యొక్క సగం శరీరం పనిచేయడం ఆగిపోతుంది, తీవ్రమైన తలనొప్పి, అస్పష్టమైన దృష్టి మరియు మాట్లాడటం కష్టం.

రక్తపోటును పెంచడం ఎంత ప్రమాదకరమో మీరు ఊహించవచ్చు. రక్తపోటును సమతుల్యం చేయడానికి, మీరు డాక్టర్ పరీక్ష తర్వాత క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి మరియు మీ జీవనశైలిని సరిగ్గా నిర్వహించాలి.

మీరు ఎలాంటి డైట్ పాటించినా ఒక్కోసారి రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, దానిని వెంటనే అదుపులోకి తీసుకురాకపోతే, వ్యక్తి జీవితానికి ప్రమాదం ఉండవచ్చు

మీ రక్తపోటు ఎక్కువగా ఉందని మీరు కనుగొంటే, దానిని తేలికగా తీసుకోకండి. మొదట, మీ రక్తపోటు స్థాయిని తనిఖీ చేయండి. ఒత్తిడి 180/120 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటే, అది అధిక రక్తపోటు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు నిద్రపోండి. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది మరియు రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. కనీసం 10 నిమిషాలు పడుకోండి. దీని తరువాత, మీరు సాధారణంగా భావిస్తే, అప్పుడు వైద్యుడిని సంప్రదించండి.

కొన్నిసార్లు నిర్జలీకరణం అధిక రక్తపోటుకు కారణమవుతుంది. ముఖ్యంగా పొలానికి వెళ్లి ఎండలో పనిచేసేవారిలో ఇది సర్వసాధారణం. మీకు తలనొప్పి, కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు విషయంలో ఇటువంటి సంకేతాలను చూడవచ్చు. అప్పుడు వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగాలి. దీని కారణంగా, రక్తపోటు స్థాయి వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో రక్తపోటు స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల రక్తపోటు స్థాయి పెరిగితే, మీరు శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు

రక్తపోటు స్థాయి అకస్మాత్తుగా పెరిగితే, మీరు చల్లని స్నానం చేయవచ్చు. స్నానం చేయడం వల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు రక్త నాళాలు తెరుచుకుంటాయి. స్నానం చేసిన తర్వాత, కొన్నిసార్లు రక్తపోటు స్థాయి కొద్దిగా పెరుగుతుంది. కానీ, స్నానం చేసిన కొద్దిసేపటికే శరీరం పని చేస్తుంది మరియు రక్తపోటు స్థాయి తగ్గుతుంది

AmitShah will become PM: బీజేపీకి 400 సీట్లు వస్తే, పీఎంగా అమిత్ షా, కమలనాధుల్లో చర్చ

AmitShah will become PM: నరేంద్రమోదీ తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా అవుతారా? ఈ మధ్యకాలంలో దీనిపై ఎందుకు చర్చ జరుగుతోంది? 400 పైచిలుకు సీట్లను బీజేపీ ఎందుకు టార్గెట్‌గా పెట్టుకుంది? రాజ్యాంగం ఏమైనా మార్చే అవకాశముందా? ఎన్నికల ముందు ఈ చర్చ ఎందుకొచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. కాకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి దీనికి సంబంధించిన ఓ ఫీలర్ బయటకురావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్లోగన్ 400 పైచిలుకు సీట్లు. ఈ మాట వెనుక అసలు మర్మం ఏమిటన్నది అంతా సస్పెన్స్. కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ బాటలోనే నడవాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు లేకపోలేదు. తొలుత రష్యాకు ప్రధాని అయిన పుతిన్, రాజ్యాంగ సవరణకు కావాల్సినంత మెజార్టీ తెచ్చుకున్నారు. దాని తర్వాత అధ్యక్షుడి పోటీ చేసి కంటిన్యూ అవుతున్నారు. అదే బాటలో ప్రధాని మోదీ అడుగు వేస్తున్నారా అన్న సందేహాలు కలగమానదు.

అదే జరిగితే ఇండియా కూడా అధ్యక్ష పాలనకు శ్రీకారం చుడుతుందా? అప్పుడు అధికారాలన్నీ ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే బీజేపీ రూలింగ్‌లోకి వచ్చాక బ్రిటీష్ చట్టాలను చాలా వరకు మార్చింది. ఈ క్రమంలో అధ్యక్ష తరహా పాలనకు కమలనాధులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మోదీ అధ్యక్షుడైతే, ప్రధానిగా అమిత్ షా ఉండడం ఖాయం. అన్నట్లు ఆ మధ్య దేశంలో అధ్యక్ష ఎన్నికల గురించి భారీగా చర్చ జరిగింది. దీనికి కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు గతంలో పాలించిన పెద్దలు పలు సందర్భాలు చెప్పిన మాటలు గుర్తు చేశారు.

సీన్ కట్ చేస్తే.. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధానమంత్రి కావడం ఖాయమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన నేతలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎలాంటి పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ ప్రధాన సిద్ధాంతం. ఈ నిబంధనను తీసుకొచ్చింది నరేంద్రమోదీయే. ఈ క్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషి, యడ్యూరప్పుతోపాటు పలువురు రాజకీయాలకు దూరమయ్యారన్నది కేజ్రీవాల్ బలంగా చెప్పినమాట.

ప్రధాని నరేంద్రమోదీకి వచ్చే ఏడాదితో 75ఏళ్లు నిండుతాయి. ఆయనకు రిటైర్మెంట్ వయస్సు దగ్గరపడినట్టే. ఈ లెక్కన మోదీ తర్వాత రేసులో ఉన్నది అమిత్ షా అన్నది కేజ్రీవాల్ లెక్క. మరి తీసుకొచ్చిన నిబంధనను మోదీ కంటిన్యూ చేస్తారా? ఈ క్రమంలో ప్రెసిడెంట్ ఎన్నికలకు తెరలేపుతారా? అన్నది అసలు ప్రశ్న. కొద్దిరోజులు ఆగితే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడడం ఖాయమని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నమాట.

Gold Rates Record : బంగారం భారమే.. రికార్డు ధరకు చేరిన పసిడి

Gold Rate Crossed Record Price : భవిష్యత్తులో సామాన్యుడు బంగారం కొనాలన్నది కలగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే.. పెరుగుతున్న బంగారం ధర అలా ఉంది. రూ. 60 వేల నుంచి ఇప్పుడు ఏకంగా రికార్డు ధరకు చేరింది. అందని ద్రాక్షలా మారింది బంగారం. అందలమెక్కి కూర్చున్న బంగారం ధర.. ఎప్పుడు కిందికి దిగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడెలాగూ పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణమాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పుడు పెరిగినా కనీసం అప్పుడైనా బంగారం ధరలు తగ్గకపోవా అని ఎదురుచూస్తున్నారు పసిడిప్రియులు.

కానీ బంగారం మాత్రం నేను దిగనంటే దిగనంటోంది. వారం 10 రోజుల క్రితం 70 వేలకు తగ్గుతూ వచ్చిన బంగారం.. మళ్లీ పెరిగింది. ఏకగా రూ.74 వేల మార్కును దాటింది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అని వాపోతున్నారు కొనుగోలుదారులు.

ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలిలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,180, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,010గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,030, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,860గా ఉంది. బెంగళూరు, కోల్ కతా, ముంబై నగరాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

OTT Movie Suggestion: మీరు ఎన్నో మర్డర్ మిస్టరీస్ చూసుండొచ్చు.. OTTలో ఈ మూవీని చూస్తే వణికిపోతారు!

నిజంగా చెప్పాలంటే సినిమాలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది. ఆ మూవీస్ స్టోరీస్ ఎలా ఉన్నా.. అందులో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. సినిమా చిన్నదైనా పెద్దదైన సరే.. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక ప్లాట్ ఎవరిని ఒకరిని ఇంప్రెస్స్ చేస్తుంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో దాదాపు థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఓటీటీ లో మంచి పేరు తెచ్చుకుంటుంటే.. అసలు ఏ అంచనా లేకుండా విడుదల చేసిన సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. మేకర్స్ కూడా దీని గురించి సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇక కొద్దిసేపు హర్రర్, రొమాన్స్ జోనర్స్ పక్కనపెట్టేస్తే.. అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే జోనర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇటువంటిదే. ఈ సినిమాను మీరు మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా అక్కడ క్రైమ్ ప్లాట్ కూడా ఉండే ఉంటుంది. మరి ఆ క్రైమ్ సైకో పాత్ ను, సస్పెన్స్ జోడిస్తే.. కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథేంటంటే.. ఈ అపార్ట్మెంట్ లోకి ఓ కొత్త జంట ప్రవేశిస్తారు. అయితే ఈ జంట ఎవరి చేతనో హత్య చేయబడతారు. ఇక ఈ హత్య కేసును సాల్వ్ చేయడానికి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అతని పేరు దీపక్ . అతను వెంటనే ఈ కేసును సాల్వ్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ కేసును సాల్వ్ చేయడం అనుకున్నంత సులువుగా అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఒకటే ప్రదేశంలో 16 వేరు వేరు సంఘటనలు జరుగుతాయి. పైగా అవన్నీ జరగడానికి 16 గంటల సమయం పడుతుంది. మరి ముఖ్యంగా దీనిలో 16 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు.

ప్రతి గంటకు ఆ కేసు గందరగోళంగా తయారౌతుంది. చాలా నేరాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇలా అన్ని ప్లాట్స్ కేసును మరింత ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకుని వెళ్తాయి. చి అసలు ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు ! ఆ 16 సంఖ్యకు ఈ సినిమాకు సంబంధం ఏంటి ! ఆ మర్డర్స్ అంతా ప్లాన్ గా చేస్తుంది సైకో కిల్లర్ ఆ లేకుంటే ఇంకెవరైననా ! అసలు ఏం ఆశించి ఈ మర్డర్ చేశారు !.. దీపక్ చివరికి ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. వరి వరకు కూడా ఈ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అనేది.. చాలా ఎంగేజింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే “16-ఎవ్రీ డీటెయిల్ కౌంట్“.

ఇక క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంటే అందరి ఊహ మలయాళీ, తమిళ చిత్రాలవైపు వెళ్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఓ తెలుగు సినిమా .. తెలుగులో కూడా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

పొరపాటున కూడా ఈ ఐదు విషయాలు ఎవరికీ చెప్పకండి.. మీ పురోభివృద్ధి ఆగిపోతుంది..

ఎవరి జీవితంలోనైనా సరే విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు.

ఎదుటి వ్యక్తులు మీకు ఎంత ప్రత్యేకమైన వారు అయినా సరే.. అంటే చివరకు మీ జీవిత భాగస్వామికి కూడా చెప్పకూడదు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విధానంలో చెప్పిన విషయాలను పాటిస్తే ప్రగతి మెట్లు సులభంగా అధిరోహించవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సమాజంలో గౌరవం పొందవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా తన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఏ విషయాలు ఎవరికీ చెప్పకూడదంటే

పురుషులు కుటుంబ వివాదాలు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా బయటి వ్యక్తులకు చెప్పకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అంతేకాదు భార్యపై కోపం వచ్చినప్పుడు, ఆమె స్వభావం, ప్రవర్తన లేదా అలవాట్ల గురించి ఎవరికీ చెప్పకండి. ఈ విషయాలను మరొక వ్యక్తితో పంచుకుంటే..వారు ఆ సమయంలో పట్టించుకోకపోవచ్చు,.. తర్వాత ఏదైనా పరిణామాలు జరిగినప్పుడు మీరు చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు.

ఈ విషయాలను కూడా గోప్యంగా ఉంచండి

జీవితంలో మీకు ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే సరదాగా కూడా ఎవరితోనైనా ఆ విషయాలను చెప్పకూడదు. సాధారణంగా ఇలాంటి విషయాలను తమ సన్నిహితులతో సరదాగా చెబుతుంటారు. అయితే ఇలాంటి విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. అందువల్ల మీకు ఎప్పుడైనా అవమానకరమైన సంఘటనలు ఎదురైతే వాటిని మనసులో దాచుకోవాలి.

డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి

సంపాదించిన డబ్బు మిమ్మల్ని సామర్థ్యమైన వ్యక్తిగా చూపిస్తుంది. నేటి కాలంలో డబ్బు ప్రతి వ్యక్తికి ఒక శక్తి. అందువల్ల ఆర్థిక పరిస్థితి లేదా డబ్బు సంబంధిత సమస్యలను ఎవరికీ చెప్పకండి. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. డబ్బు కొరత ఉందని ఇతరులకు తెలియగానే వారు కూడా మీకు దూరంగా ఉంటారు. కనుక మీ ఆదాయాన్ని ఇతరులకు చెప్పరాదు. అదే విధంగా మీ ఆర్ధిక ఇబ్బందులను తెలియజేయరాడు.

గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు

యోగా గురువు దగ్గర దీక్ష తీసుకున్నట్లయితే ఆ గురువు చెప్పిన గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు. గురుమంత్రంలో చాలా రకాలు ఉన్నాయి. జీవితంలో ఒకరి నుంచి మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటే అది కూడా గురుమంత్రం లాంటిదే. అందుకే నీ గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే అవసరమైనప్పుడు, ఈ గురు మంత్రాలు మాత్రమే మీకు సహాయపడతాయి. మీకు జీవితంలో విజయాన్ని అందిస్తాయి.

విరాళాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచండి

జీవితంలో మీరు ఏ దానం చేసినా దానిని రహస్యంగా ఉంచాలి. ఆ దానం గురించి ఎవరికీ చెప్పకూడదు. అటువంటి రహస్య దానాల వలన జీవితంలో విజయాన్ని పొందుతారు. పురోగతికి మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరికైనా మీరు చేసిన దానం గురించి చెబితే అప్పుడు పుణ్యం లభించదు.

టాలీవుడ్ నెంబర్ ఎవరో తేల్చేసిన లేటెస్ట్ సర్వే… మెగా హీరోలకు భారీ షాక్!

నెంబర్స్ గేమ్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. ఎవరు టాప్ ఎవరు లోయస్ట్ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. చిత్ర పరిశ్రమలో ఈ లెక్కలకు మరింత విలువ ఉంటుంది. తాజా సర్వే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో తేల్చేసింది.

ఒక హీరో స్టార్డం అతని మార్కెట్, ఫ్యాన్ బేస్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. టాలీవుడ్ ప్రస్తుతం డజనుకు పైగా టాప్ హీరోలు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థ ఏప్రిల్ 24 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించింది. తెలుగు మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్స్ పేరిట జరిగిన సర్వే లో కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అభిప్రాయం ఆధారంగా ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి ఆడియన్స్ అభిప్రాయంలో టాప్ 10 హీరోలు ఎవరో చూద్దాం…
విజయ్ దేవరకొండకు ఆడియన్స్ 10వ ర్యాంక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ టైర్ 1 హీరో కాదు. ఈ మధ్య వరుస ప్లాప్స్ పడుతున్నాయి. అయినా ఆయనకు టాప్ 10లో చోటు దక్కింది.

సీనియర్ స్టార్స్ లో చిరంజీవి మాత్రమే ఇప్పటికీ సత్తా చాటుతున్నాడు. వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. ఆయనకు 9వ ర్యాంక్ దక్కింది. నెక్స్ట్ విశ్వంభర టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

మాస్ మహరాజ్ రవితేజకు ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు. అయిన ఆయనకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. దాంతో ప్రేక్షకులు ఆయనకు 8వ ర్యాంక్ ఇచ్చారు.

ఇక 7వ ర్యాంక్ హీరో నానికి దక్కింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం టైర్ 2 హీరోల్లో నానినే నెంబర్ వన్. దసరా, హాయ్ నాన్న విజయాలతో నాని జోరు మీదున్నారు.
అనూహ్యంగా 6వ ర్యాంక్ కి పడిపోయారు పవన్ కళ్యాణ్. గత రెండేళ్లుగా రాజకీయాల్లో బిజీ అయ్యారు. అందుకే ఆయనకు టాప్ 5లో చోటు దక్కలేదు. ఇటీవల ఆయన నటించిన భీమ్లా నాయక్, బ్రో నిరాశపరిచాయి.
రామ్ చరణ్ కి 5వ ర్యాంక్ దక్కింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు టాప్ 3లో లేకపోవడం ఊహించని పరిణామం. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్ ర్యాంక్ మెరుగయ్యే అవకాశం కలదు.

4వ ర్యాంక్ అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప మూవీ అల్లు అర్జున్ రేంజ్ మార్చేసింది. ఆయన నటించిన పుష్ప 2 పై నార్త్ ఇండియాలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
నందమూరి హీరో ఎన్టీఆర్ కి 3వ ర్యాంక్ దక్కింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో ఫేమ్ రాబట్టాడు. వార్ 2, దేవర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆడియన్స్ 2వ ర్యాంక్ కట్టబెట్టారు. మహేష్ బాబు ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయినప్పటికీ ఆయన భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారని అర్థం అవుతుంది.

ఇక బాహుబలి స్టార్ ప్రభాస్ కి మూవీ లవర్స్ అగ్రస్థానం కట్టబెట్టారు. 1వ ర్యాంకు ఇవ్వడం ద్వారా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఆయనే అనే తేల్చేశారు. ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్. అయితే మిగతా హీరోల అప్ కమింగ్ చిత్రాల రిజల్ట్ ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి.

ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
దీంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మన్యం, అల్లూరి, ప.గో, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటు పిడుగులు సైతం పడతాయని, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.

WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. ఆ తరువాత అతని నంబర్‌తో మీకు పని ఉండకపోవచ్చు. నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్‌లు పంపడం ఎలా అనేది చాలా మందికి తెలియదు.

ఉదాహరణకు మీరో ఫొటో స్టూడియోకి వెళ్లారనుకోండి.. అక్కడ మీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కోసం సదరు ఫొటో స్టూడియో యజమాని నంబర్‌ని తీసుకుంటారు. అనంతరం సేవ్ చేసుకుని ఫొటోని వాట్సప్ చేస్తారు. తరువాత ఆ నంబర్‌తో మనకు పని ఉండకపోవచ్చు. గతంలో నంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సప్ చాట్ చేయగలిగే వాళ్లం. కానీ, వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య తీరిపోయింది. దీని గురించి సింపుల్‌గా తెలుసుకుందాం.

వాట్సప్‌ని ఓపెన్ చేయండి

ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

నంబర్‌ని కాపీ చేయండి. అనంతరం సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని పేస్ట్ చేయండి.

ఆ నంబర్‌పై వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని నంబర్ సేవ్ చేసుకోకుండానే షేర్ చేయొచ్చు.

TS TET | ఎట్ట‌కేల‌కు టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

TS TET | హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి హాల్ టికెట్లు. వాస్త‌వానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఒక రోజు ఆల‌స్య‌మైంది. నిన్న‌టి నుంచి టెట్ అభ్య‌ర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మొత్తానికి గురువారం సాయంత్రం టెట్ హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో ఉంచారు.

టెట్ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే జ‌ర్న‌ల్ నంబ‌ర్, పుట్టిన తేదీ(టెన్త్ మెమో) త‌ప్ప‌నిస‌రి. ఈ రెండు లేక‌పోతే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌డం అసాధ్యం. ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించిన‌ప్పుడు జ‌ర్న‌ల్ నంబ‌ర్ జ‌న‌రేట్ అయి ఉంటుంది. ఆ నంబ‌ర్‌తో పాటు పుట్టిన తేదీని స‌మ‌ర్పించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం https://tstet2024.aptonline.in/tstet ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.

ఇక టెట్ ప‌రీక్ష‌లు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రెండు విడ‌త‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.

Health tips | వీటిని దూరం పెడితే రక్తం పలుచబడి ఆరోగ్యం మెరుగవుతుందట..!

Health tips : ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు సంభవిస్తాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే ఈ అనారోగ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా గుండె జబ్బులు రావద్దంటే రక్తం పలుచగా ఉండేలా చూసుకోవాలి. రక్తం పలుచగా ఉంటేనే గుండెకు పంపింగ్ సులభమవుతుంది. అందుకే రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. ఒకసారి గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటివి వస్తే మాత్రం ఈ మెడిసిన్స్ జీవితకాలం వాడాల్సిందే. లేదంటే లైఫ్ స్టైల్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకోవాలి.

చాలామంది ఉప్పు, నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తింటున్నారు. ఇలాంటి వాటి వల్లనే రక్తం చిక్కగా మారుతుంది. ఒకసారి రక్తం చిక్కగా మారితే దాన్ని పలుచగా చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి రక్తం చిక్కబడక ముందే లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఉదయం, సాయంత్రం తక్కువగా ఉడికిన ఫుడ్ తీసుకోవాలి.

మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉడికిన ఫుడ్ తింటే బెటర్. అంతే కాకుండా అందులో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా కూడా మోతాదు కంటే తక్కువ ఉంటేనే మంచిది. బయటి ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉండేవి అస్సలు తినొద్దు. అలాంటి లైఫ్‌స్టైల్‌ను ఫాలో అయితే నెలా, రెండు నెలల తర్వాత మెడిసిన్ మానిసేనా ఇబ్బందిలేని స్థాయిలో ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంగన్వాడీ టీచర్ సుజాత మృతిపై వీడనున్న మిస్టరీ..

తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.

అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర్, తాడ్వాయి స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర దర్యాప్తు చేశారు. పలు అంశాలు వెలువడ్డాయి. హత్యకు సంబంధాలు ఉన్న సరిహద్దు ఏటూర్ నాగారం మండలానికి చెందిన ఇద్దరినీ, ఇంకొకరిని ముగ్గురిని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలిసింది.

అంగన్వాడి టీచర్ సుజాత మృతిపై మిస్టరీ వీడనుంది. నేడు రేపు మీడియా ఎదుట వివరాలు వెల్లడించేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.పోలీసులు ముమ్మరంగా విచారణ..హత్య జరిగిన అతి తక్కువ సమయంలోనే 12 గంటల లోపు పూర్తి సమాచారం సేకరించినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పసర సిఐ శంకర్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి నిర్విరామ కృషి చేశారు. హత్య జరిగిన బుధవారం సాయంత్రం కాటాపూర్ మూడో సెంటర్ కేంద్రాన్ని, ఆ బజారులోన సమస్యలను అక్కడి పరిస్థితులను పరిశీలించి, విచారణ చేపట్టారు. అన్నారం పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా, ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా ఎటునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరిని, మరొకరిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. చనిపోయిన రోజు, ముందు రోజు, మృతి చెందిన తర్వాత ఏం జరిగింది అన్నదానిపై అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పసర సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతో నిరంతర నిర్విరామ కృషితో అతి త్వరలో కేసు మిస్టరీ వీడనుంది.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏపీలో అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టిడిపి శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది.

చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేకమార్లు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళనల క్రమంలో, దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచింది. గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రత అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు.

24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో చంద్రబాబుకు భద్రత
తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా , చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12 ×12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.

చంద్రబాబుకు ఎందుకింత భద్రత
ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంటిలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకీ భద్రత పెంపు అన్నది ఆసక్తిగా మారింది. ఒకపక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు రక్షణ తగ్గించిన కేంద్రం, ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచటం ఢిల్లీ పొలిటికల్ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

ఏపీలో హింసాత్మక ఘటనలతో ఆందోళన
ఇక ఏపీలోనూ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు, అభ్యర్థుల పైన కూడా కొనసాగుతున్న ఎటాక్ లు వెరసి జూన్ నాలుగు వరకు శాంతి భద్రతల విషయంలో ఏపీలో కొనసాగుతున్న ఆందోళనల నేపధ్యంలో చంద్రబాబుకు భద్రత పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది.

Cleaning Teeth Techniques: రోజు సరిగా బ్రష్ చేయకపోతే ఏం అవుతుందో తెలుసా..?

Cleaning Teeth Techniques: ప్రతి రోజు ఉదయం లేవగానే పళ్లు తోముకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే దంతాలు శుభ్రంగా ఉంటేనే రోజంతా దుర్వాసన లేకుండా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే బ్రష్ చేసుకోవడంలో చాలా మంది సోమరితనం ప్రదర్శిస్తుంటారు. ఏదో అలా పైపైన బ్రష్ చేసి మమ అనేస్తారు. కానీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసన, పిప్పళ్లు, పంటి నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల బ్రష్ చేసుకునే సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రష్ చేసుకునే విధానంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. బ్రష్ పై పేస్ట్ అప్లై చేసుకోగానే దానిని చిగుళ్ల కింద వరకు తోమాలి. దంతాల పైకి, కిందకు శుభ్రం చేసుకోవాలి. అనంతరం దవడ పళ్ల కింద బ్రష్ తో దంతాలను శుభ్రం చేయాలి. లోపల కూడా దంతాలను పై నుంచి కింద వరకు నీటిగా తోముకోవాలి.

దవడ పళ్ల వద్ద 45 డిగ్రీలుగా బ్రష్ ను అటు ఇటు తిప్పుతూ శుభ్రం చేయాలి. బ్రష్ చేసుకోవడం వల్ల దంతాల మధ్యలో క్లీన్ అవుతుంది. అంతేకాదు చిగుళ్లకు కూడా మసాజ్ అయ్యేలా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దంతాలు రంగు మారకుండా, దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. మరోవైపు బ్రష్ లను 2 నుంచి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. 6 నెలలకు ఒకసారి డెంటిస్టును సంప్రదించి, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి.

చక్కెర పదార్థాలు, పొగాకు, సిగరెట్, మద్యం వంటివి తీసుకోవడం వల్ల దంతాలు పాడవుతాయి. మరోవైపు మూడు పూటలా తిన్న తర్వాత దంతాలను, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

Aarambham Movie Review: ఆరంభం మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో రొటీన్ కమర్షియల్ డ్రామా సినిమాలతో పాటు విభిన్నమైన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు కూడా భిన్నంగా ఉండే సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆరంభం అనే ఒక సైఫై థ్రిల్లర్ ని ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో సుప్రీతా సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాని ఏవిటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద అభిషేక్ వీటి నిర్మించారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు అజయ్ నాగ్ పరిచయమయ్యారు. ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

ఆరంభం కథ విషయానికొస్తే
కాలాఘాటి జైల్లో ఒక మర్డర్ కేసు నిమిత్తం రెండున్నర ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు మిగిల్(మోహన్ భగత్). ఉదయాన్నే ఉరితీయాలి అని అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. అతనిని బంధించిన సెల్ చెక్కుచెదరలేదు, తాళాలు కూడా వేసిన వేసినట్టే ఉన్నాయి. అయినా అతను ఎలా తప్పించుకున్నాడో తెలియక జైలు సిబ్బంది తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తమ వల్ల కాదని భావించి అసలు ఏం జరిగిందో కనిపెట్టాలని భావించి ఒక డిటెక్టివ్(రవీంద్ర విజయ్)ని పిలిపిస్తారు. అయితే మిగిల్ రాసుకున్న పుస్తకం అతని సెల్ లో దొరుకుతుంది. ఆ పుస్తకంలో అతను చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి( భూషణ్) దగ్గర పెరిగాడని, అతను ఒక డేజావు ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడని ఉండడమే, కాక అతని జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఉంటాయి. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు? అతని కథ ఏమిటి? ఈ ప్రయోగం ఏమిటి మిగిల్ ఎవరిని మర్డర్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు? రేపు ఉరి వేస్తారనగా ఎలా తప్పించుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ ఈ ఆరంభం అనే సినిమా ఒక కన్నడ పాపులర్ నవలలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. లైన్ గా చూసుకుంటే సింపుల్ కథని ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేలా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేలాగానే ఏడు అధ్యాయాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా మొదలైనప్పటి నుంచి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొన్ని ఎమోషన్స్ మాత్రం వర్కౌట్ అయ్యేలా అనిపించాయి. ముఖ్యంగా మనం ఎక్కువగా వినే డేజావు ఎక్స్పరిమెంట్ కాస్త ఆసక్తికరమనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఈ మధ్య రొటీన్ గా జరుగుతున్న తంతులాగానే ఈ సినిమా చివర్లో మరో భాగం చేసే అవకాశం ఉందనేలా హింట్ ఇచ్చారు. ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టే విధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటి తరహాలోనే ఈ సినిమా కూడా సాగుతుంది. అయితే దాన్ని ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారు అనేదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక నటీనటుల విషయానికొస్తే కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా మోహన్ భగత్ బాగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ చిన్న చిన్న సినిమాలు కూడా చేసిన అతను ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించి ఒకసారిగా అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఉన్నంతలో మోహన్ భగత్ ఆకట్టుకున్నాడు. ఇక సుప్రీతా సత్యనారాయణ కూడా తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక సురభి ప్రభావతి పాత్ర ఒక రేంజ్ లో పేలింది. సైంటిస్ట్ పాత్రలో అర్జున్ రెడ్డి ప్రొఫెసర్ భూషణ్ మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ఇక లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీతో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి. ఎక్కడో ఒక రిమోట్ గ్రామంలో సినిమా షూట్ చేసిన విధానం ప్రేక్షకులకు కాస్త కొత్త ఫీల్ ఇస్తుంది. ముఖ్యంగా గ్రీనరీని హైలెట్ చేస్తూ సినిమాటోగ్రఫీ పనితనం కనిపిస్తుంది. ఇక పాటలు అంత గుర్తుంచుకునేలా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం అదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం కూడా సినిమా మొత్తం మీద మాట్లాడుతుంది. సింపుల్ కథనే కొత్త స్క్రీన్ ప్లేతో నడిపించాలనే ప్రయత్నం చేశారు కానీ అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా ఆరంభం ఒక సరికొత్త స్క్రీన్ ప్లే తో వచ్చిన మంచి ప్రయోగం.. అయితే కామన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

Late Night Sleeping Habit : లేట్​ నైట్​ పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అర్థరాత్రి దాటాక నిద్రపోతే అర్థాయుష్షు తప్పదట

Sleeping late at night is very dangerous to your health : బిజీ లైఫ్, సోషల్ మీడియా నిద్రను దూరంచేస్తుంది. ముఖ్యంగా సోషల్​మీడియా​ అనేది ఎంతగా ప్రభావం చేస్తుందంటే..

కనీసం నిద్రపోవడాన్ని కూడా వదిలేసి దానిలోనే మునిగిపోతున్నాడు. సినిమాలు, సిరీస్​లు, ఐపీఎల్.. ముఖ్యంగా రీల్స్, మీమ్స్​కి బాగా అలవాటైపోయి.. శరీరానికి అత్యంత అవసరమైన నిద్రని కోల్పోతున్నారు. అర్థరాత్రి దాటేవరకు ఆన్​లైన్​లో ఉంటూ.. ఎప్పటికో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అయితే ఇలా నిద్రను ఆపేసుకుని.. అర్థరాత్రి దాటిన తర్వాత పడుకునేవారికి తాజాగా అధ్యయనం షాకింగ్ విషయం తెలిపింది. లేట్​గా నిద్రపోయేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని, దానివల్ల ఆయుష్షు తగ్గిపోతుందని తేల్చింది.

ఈ తరహా నిద్ర మంచిది కాదు

రాత్రి అనేది నిద్రకు సంబంధించినది. ఆ సమయంలో ప్రశాంతత దొరుకుతుంది. చుట్టూ నిశ్శబ్ధంగా ఉండి.. నిద్రను ఆహ్వానిస్తుంది. ఆ రోజుల్లో రాత్రి తొమ్మిది అయ్యిందంటే.. వెంటనే నిద్రపోవాలని.. తెల్లవారు జాము 5 అయితే నిద్రలేవాలని అనుకునేవారు. దీనినే రివేంజ్ బైడ్​టైమ్ ప్రోక్రాస్టినేషన్ అంటారు. కానీ ఇప్పుడు 12 దాటినా నిద్రపోరు.. ఆఫీస్​ లేనివారు అయితే ఉదయం 9 అయినా నిద్రలేవరు. ఈ తరహా నిద్ర అస్సలు మంచిది కాదు అంటున్నారు. మరి కొందరు లేట్​నైట్​ పడుకుని.. అవసరాన్ని బట్టి ఉదయాన్నే తొందరగా లేస్తారు. దీనివల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. ఇది మరింత ప్రాణాంతకమవుతుంది.

శరీరంపై తీవ్ర ప్రభావాలు ఉంటాయి

నిద్రవేళలు డిస్టర్బ్ అయితే సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది శారీరక, మానసిక సమస్యలను పెంచి.. దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. సాధారణంగా నిద్ర అనేది.. శారీరక, మానసిక సమస్యలను రిపేర్ చేస్తుంది. కానీ నిద్ర సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు రిపేర్ అవ్వడం అటుంచి.. సమస్యలు పెరిగేలా చేస్తుంది. కచ్చితంగా రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇది మానసిక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. రాత్రి నిద్ర అంటే ఉదయం వరకు పడుకోవాలని కాకుండా.. రాత్రి త్వరగా పడుకుని.. తెల్లవారుజామునే నిద్రలేచేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ శక్తి స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలు తెలిపాయి.

ఆ నిద్ర లేకపోతే ఈ సమస్యలు తప్పవు

రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే.. బరువు పెరుగుతారని నిపుణులు తెలిపారు. తర్వాత మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా పగలు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం కష్టతరమవుతుందని తెలిపారు. అంతేకాకుండా దృష్టిలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, చురుకుగా లేకపోవడం వంటి జరుగుతాయి. జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా ప్రారంభమై.. మెల్లిగా ఇవి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. స్థూలకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్నిరకాల క్యాన్సర్​లు వస్తాయి. ఇవన్నీ మీ ఆయుష్షును తగ్గిస్తాయని.. అందుకే తగినంత నిద్ర అవసరమని చెప్తున్నారు.

రాత్రి నిద్రతో కలిగే ప్రయోజనాలు

నిద్రలేకపోవడం వల్ల చేసే పనిపై దృష్టి పెట్టలేరు. దీనివల్ల ప్రతికూల చర్యలు జరుగుతాయి. ప్రమాదాలు, గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. చదువుపై దృష్టి పెట్టలేరు. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలు కూడా నాశనమవుతాయి. నిద్రలో శరీరంలో రిలాక్స్ అవుతుంది కానీ.. మెదడు బాగా కష్టపడి పనిచేస్తుంది. మన ఆరోగ్య సమస్యలను రిపేర్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేయడం.. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని పెంచడం వంటి వాటిని ఇంప్రూవ్ చేసి.. మానసికంగా బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకే మెరుగైన నిద్ర అలవాట్లను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను దూరం చేసే కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల నిద్రనాణ్యత పెరుగుతుందని చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘mannam web’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Health Tips: నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారికి… షుగర్ వస్తుందా? తప్పక తెలుసుకోండి

నేటి పరిస్థితుల్లో చాలా మంది యువతకు రాత్రిపూట పని చేసే అలవాటు ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా నైట్ షిఫ్ట్ అనివార్యంగా మారింది. కానీ రాత్రిపూట మేల్కొని పని చేయడం మీ ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుందని గమనించాలి.

ముఖ్యంగా ఇటీవలి నివేదిక ప్రకారం, రాత్రిపూట మేల్కొని పని చేయడం వల్ల మన వివిధ శరీరాల్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి.

రాత్రిపూట ఎక్కువ గంటలు పనిచేసే వారికి మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో నైట్ షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల మన శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు సంభవిస్తాయని మరియు నేరుగా ప్రోటీన్లలో మార్పులు సంభవిస్తాయని వెల్లడించింది. మీరు వరుసగా మూడు రోజులు రాత్రిపూట మేల్కొని పని చేస్తే, మీరు ఊబకాయం, మధుమేహం మరియు అభివృద్ధి లోపాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.

రాత్రిపూట పని చేయడం వల్ల మధుమేహం ఎందుకు వస్తుంది?
ఎక్కువ గంటలు మేల్కొని పనిచేయడం , రాత్రిపూట పని చేయడం వల్ల మన శరీరం యొక్క పెరుగుదల మార్పులలో అసమతుల్యత ఏర్పడుతుంది . శరీరంలోని ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని పెంచుతుంది, ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం, మన శరీరంలోని జీవ గడియారం ఉదయం మరియు రాత్రి సమయంలో మన శరీరం చేయవలసిన పనిని చూసుకుంటుంది. మనం ఈ జీవ గడియారాన్ని సరిగ్గా పాటించనప్పుడు, అవి శరీరంలో వివిధ మార్పులకు కారణమవుతాయి, ఒత్తిడిని కలిగిస్తాయి . ఆరోగ్య రుగ్మతలకు కారణమవుతాయని ప్రొఫెసర్ హన్స్ వాన్ డంజన్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, వరుసగా మూడు రోజులు రాత్రిపూట మేల్కొని పని చేస్తే, మన జీవ గడియారం ప్రభావితమవుతుందని, అందువల్ల డీహైడ్రేషన్ ఊబకాయం సంభావ్య అంశాలు ఎక్కువగా ఉన్నాయని అతను తన పరిశోధనలో చెప్పాడు. పరిశోధనా బృందం రక్తంలోని కణాలలోని ప్రోటీన్లను పరిశీలించి, రాత్రి నిద్ర లేకుండా పని చేయడం వల్ల కలిగే మార్పులను పర్యవేక్షించింది. ఈ ప్రొటీన్లలో కొన్ని ముఖ్యమైన మార్పులను చూపించనప్పటికీ, చాలా సైట్‌లు రాత్రిపూట పని చేయడం వల్ల మార్పులను చూపించాయి. ముఖ్యంగా రాత్రిపూట పనిచేసేవారిలో గ్లూకోజ్ నియంత్రణను నియంత్రించే ఈ ప్రొటీన్లు పూర్తిగా వ్యతిరేక ప్రక్రియలో పనిచేస్తాయని అధ్యయనం వెల్లడించింది. నైట్ షిఫ్ట్ కార్మికులు ఇన్సులిన్ ఉత్పత్తి , సున్నితత్వంలో విభిన్నంగా ఉంటారని కూడా ఇది నివేదించింది. ఇవి కాకుండా, ఎక్కువ గంటలు మేల్కొని పని చేయడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు , స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది.

మధుమేహం మరియు ఊబకాయం నుండి తమను తాము రక్షించుకోవడానికి రాత్రిపూట పనిచేసేవారికి 5 చిట్కాలు:

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. రోజువారీ వ్యాయామం , పెరుగుదల పర్యవేక్షణ చాలా ముఖ్యం
రోజూ తగినంత నీరు త్రాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. అలాగే కిడ్నీలు మెరుగ్గా పని చేస్తాయి.
పౌష్టికాహారం తినండి. ఇది శరీరం యొక్క వ్యాధిని కలిగించే శక్తిని పెంచుతుంది. చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
మితంగా తినండి. ముఖ్యంగా, శరీరానికి హాని కలిగించే కొవ్వులు కలిగిన ఆహారాన్ని తక్కువగా తినడం లేదా పూర్తిగా నివారించడం అవసరం.ప్రాసెస్ చేసిన ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్ మానేయడం, ఇంట్లో వండిన భోజనం తినడం చాలా ఆరోగ్యకరమైనది.

AP Election 2024: సీఎం జగన్ ప్రమాణస్వీకార తేదీ ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్టంలో ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. దేశంలో నూతన ట్రెండ్‌ని జగన్ తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పాలన చేస్తాం. పథకాలు కొనసాగిస్తూ మరింత మంచి పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. లబ్ది చేకూరుతేనే ఓటు వేయండని అడిగిన నాయకుడు జగన్. పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. పథకాలు పూర్తి స్థాయిలో మళ్లీ అమలు కావాలని ప్రజలు అనుకుంటున్నారు’’ అని బొత్స అన్నారు.

టీడీపీ కావాలని దాడులకి దిగుతోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని, తాము మంచి చేశాము కాబట్టి నమ్మకంంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నట్టు పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్, వైస్సార్ పాలన తర్వాత మంచి పాలన జగన్ అందిస్తున్నారు. మేము సహనంతో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు ఎక్కువ చేస్తుంది. మా నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. మళ్లీ ప్రభుత్వం నడపాల్సింది మేము కాబట్టి సహనంతో ఉన్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. జగన్ ఇచ్చిన పథకాలు చూసి ఓటింగ్ శాతం పెరిగింది. మేము అణగారిన వర్గాలకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. టీడీపీ ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చిందో బయటికి తీయండి. చెప్పింది చేస్తాడు కాబట్టి జగన్‌ని ప్రజలు నమ్మి మళ్ళీ గెలిపించబోతున్నారు.

హైటెక్ సిటీ కట్టింది ఎవరో నాకు తెలియదా.. నేను ఉమ్మడి రాష్టంలో మంత్రిగా చేశాను. ఈ ఆఫీస్ అప్‌డేట్ చేస్తే చంద్రబాబుకి ఏం అయింది. ఎన్నికల కమిషన్ పెడింగ్ పెట్టిన డీబీటీ పథకాల అమౌంట్ ఈ రోజు ఖాతాలో పడ్డాయి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Tollywood: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టాలీవుడ్ హీరో.. బీసీసీఐ రిప్లై ఏంటంటే?

ప్రస్తుతం దేశమంతాటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ సందడి మొదటి కానుంది. జూన్ 2 నుండి పొట్టి వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది.

ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటకే టీమిండియాతో పాటు అన్న టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ తో ముగియనుంది. అంటే త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. ఇందుకోసం బీసీసీఐ కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్లికేషన్లను గూగుల్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంచింది. దీంతో చాలామంది మాజీ క్రికెటర్లు భారత జట్టు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో అప్లికేషన్లను గూగుల్ ఫార్మ్స్ లో ఉంచడంతో బీసీసీఐ కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. చాలామంది సరదాగా కోచ్ పదవి కోసం అప్లికేషన్లను పంపిస్తున్నారు. అందులో టాలీవుడ్ హీరో కమ్ దర్శకుడు కూడా ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్. అవును టీమిండియా ప్రధాన కోచ్ పదవికి చాలామంది గూగుల్ ఫార్మ్స్ ఫిల్ చేసినట్లే..ఈ హీరో కమ్ డైరెక్టర్ కూడా అప్లై చేశాడు. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే ఆ గూగుల్ ఫార్మ్స్ ఫిల్ చేసి పంపించాక .. ‘మేము ఈ దరఖాస్ ను స్వీకరించలేం’ అంటూ బీసీసీఐ నుండి రిప్లై కూడా వచ్చింది.

‘టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు సంబంధించి ఫామ్ నింపడం సరదాగా ఉంటుందని అనుకున్నాను. ఈ ప్రకారం దరఖాస్తు చేశాను. ఏం జరిగిందో మీరే చూడండి. ఏదో ఒక రోజు నా పిల్లలకు టీమిండియా హెడ్ కోచ్ కావాలని అనుకున్నానని చెబుతాను.. కానీ’ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

AP Elections 2024: ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది. సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది.

వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 12 మంది అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అప్‌‌డేట్ చేయాలని స్పష్టం చేసింది.

ఇక పల్నాడు జిల్లా కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు నేడే రేపో సీఎస్‌పై వేటుపడే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ ముగిసిన 15 రోజుల దాకా 25 సీఆర్‌పీఎఫ్ బలగాల్ని ఏపీ పంపించాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ బలగాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

ఏపీలో అలర్లు.. సీఎస్, డీజీపీకి హైకోర్టు కీలక అదేశాలు

ఏపీలో పలు చోట్ల అల్లర్లు కొనసాగుతున్నాయి.మే 13న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. వైసీపీ, టీడీపీ నాయకులు కొట్టుకున్నారు.

ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు చాలా గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఘర్షణలను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడో ఓ చోట ఘర్షణలు జరుగుతున్నాయి.

దీంతో ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. ఎన్నికల తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయని, అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే ఘర్షణలను అరికట్టాలని పిటిషన్‌లో దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం… వెంటనే గొడవలు అరికట్టాలని సీఎస్‌తో పాటు డీజీపీ, సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Health

సినిమా