Saturday, November 16, 2024

Bettings on Ap Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు, లక్షకు 5 లక్షలు బెట్టింగ్

Bettings on Ap Elections: ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఓటర్లు కూడా గతంలో ఎన్నడూ లేనంత చైతన్యంగా పోలింగులో పాల్గొన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది.

ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారం ఎవరిది, ఓటరు నాడి ఎటుందనేది తేలడం లేదు. బెట్టింగులు మాత్రం పీక్స్‌కు చేరుుతున్నాయి. లక్షకు ఐదు లక్షలు కూడా కాస్తున్నారు.

ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన-బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇరు వర్గాలు 120కు పైగా సీట్లతో అధికారం చేజిక్కించుకుంటామంటున్నాయి. ఈలోగా పందెం రాయుళ్లు హడావిడి పెరిగింది. వాట్సప్, టెలీగ్రామ్ ద్వారా పందేలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారు, మెజార్టీ ఎంత వస్తుంది, అధికారం ఎవరికి వస్తుంది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలతో పాటు మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల, హిందూపురంలో మెజార్టీ ఎంత ఉంటుందనే విషయాలపై పందేలు కాస్తున్నారు. లక్షకు 5 లక్షలు కూడా పెందేలు కాస్తున్నారు.

కోడి పందేల తరహాలో బెట్టింగులు కన్పిస్తున్నాయి. అత్యధిక పందేలు కాస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఇక రెండో స్థానంసలో నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందంటూ ఓ వ్యాపారి 2.5 కోట్లు బెట్టింగు వేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఉండిలో రఘురామకృష్ణంరాజుపై బెట్టింగు జరుగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంకు వచ్చే ఎమ్మెల్యే , ఎంపీ సీట్లపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగులు ఎక్కువగా నడుస్తున్నాయి. సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ బెట్టింగులు నడుపుతున్నారు. ఎక్కువశాతం బెట్టింగులు కూటమి విజయంపై జరుగుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వస్తుందనే అంశంపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న బెట్టింగులన్నీ పోలింగ్ సరళిపై అంచనాలు, సొంత సర్వేలు, మీడియా కధనాల ఆధారంగా సాగుతున్నవే. జూన్ 4న ఈ పందేలు ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తాయో ఎవరి కొంప ముంచుతాయో తెలియడం లేదు.

Uggani Or Borugula Upma : క‌ర్నూలు హోటల్స్‌లో చేసే ఫేమ‌స్ ఉగ్గాని.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Uggani Or Borugula Upma : చాలా మంది ఉద‌యం ర‌క‌ర‌కాల టిఫిన్ల‌ను చేస్తుంటారు. కొంద‌రికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది. కొంద‌రు దోశ‌ల‌ను అమితంగా లాగించేస్తారు. ఇంకా కొంద‌రు పూరీలు అంటే ఇష్ట‌ప‌డ‌తారు.
అయితే వాస్త‌వానికి ఇవే కాకుండా కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన టేస్టీ టిఫిన్లు కూడా మ‌న‌కు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి ఉగ్గాని. దీన్నే బొరుగుల ఉప్మా లేదా మ‌ర‌మ‌రాల ఉప్మా అని కూడా పిలుస్తారు. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు హోట‌ల్ రుచితో దీన్ని మ‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
బొరుగులు లేదా మ‌ర‌మ‌రాలు – 8 క‌ప్పులు, ఉల్లిపాయ – 1 పెద్ద‌ది, బాగా త‌ర‌గాలి, ప‌చ్చి మిర్చి – 3, మ‌ధ్య‌లో స‌న్న‌గా చీరాలి, ట‌మాటా -1, ప‌సుపు – పావు టీస్పూన్‌, వేయించిన శ‌న‌గ‌లు (పుట్నాల ప‌ప్పు) – 3 టేబుల్ స్పూన్లు, తురిమిన కొబ్బ‌రి – 1 టేబుల్ స్పూన్‌, నిమ్మ ర‌సం – 1 టీస్పూన్‌, పొట్టు తీసి వేయించిన‌ ప‌ల్లీలు – గుప్పెడు, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కొత్తిమీర – కొద్దిగా (అలంక‌ర‌ణ కోసం), ఆవాలు – పావు టీస్పూన్‌, జీల‌క‌ర్ర – పావు టీస్పూన్‌, మిన‌ప ప‌ప్పు – ఒక‌టింపావు టీస్పూన్‌, క‌రివేపాకులు – 1 రెమ్మ‌.

ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా త‌యారీ విధానం..
ముందుగా బొరుగుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. అనంతరం నీటిని వంపేయాలి. ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులోనే ఆవాలు, మిన‌ప ప‌ప్పు, పుట్నాలు, ప‌ల్లీలు వేసి వేయించాలి. అవి గోధుమ రంగులోకి మారాక అందులో క‌రివేపాకులు, ప‌చ్చి మిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌లు, ప‌సుపు వేసి అవి పార‌ద‌ర్శ‌కంగా మారే వ‌ర‌కు వేయించాలి. అనంత‌రం త‌రిగిన ట‌మాటా, ఉప్పు వేసి అవి మెత్త‌గా ఉడికే వ‌ర‌కు వేయించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మ‌ర‌మ‌రాలు, వేయించిన పుట్నాల ప‌ప్పు పొడి, కొత్తిమీర ఆకులు, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. కొన్ని నిమిషాల పాటు వాటిని క‌లుపుతూ వేయించాలి. త‌రువాత కొత్తిమీర ఆకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే.. వేడి వేడి ఉగ్గాని రెడీ అవుతుంది. దీన్ని రాయ‌ల‌సీమ స్టైల్‌లో ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.

స్ల్పెండర్ బైక్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. RTO కీలక నిర్ణయం

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరోకు చెందిన స్ల్పెండర్ బైక్ లు విపరీతమైన ఆదరణ పొందాయి. నగరాలు, పల్లెటూర్లు అనే తేడాలేకుండా ఈ బైక్ లను వినియోగిస్తుంటారు. ధర తక్కువ ఉండడంతో ఈ బైక్ లను రైతులు, చిరుద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు స్ల్పెండర్ బైక్ ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో మిగతా బైకులకంటే ఈ బైక్ ల సేల్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికి దేశ వ్యాప్తంగా నిత్యం వందల బైక్ లు అమ్ముడవుతుంటాయి. సామాన్యుడి బైక్ గా పేరుగాంచిన ఈ స్ల్పెండర్ బైక్ మీ దగ్గర ఉందా? అయితే పాత స్ల్పెండర్ బైక్ లు కలిగి ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఆర్టీవో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాత స్ల్పెండర్ బైక్ లను కలిగిన వారికి ఆర్టీవో శుభవార్తను అందించింది. ఈ బైక్ లను ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఈవీగా మార్చుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. దీనికోసం గోగోఏ1 సంస్థ పూర్తి సపోర్ట్ చేస్తుంది. అధిక సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, కంట్రోలర్ యూనిట్ ఇతర అవసరమైన వైరింగ్ భాగాలను ఇది అందించనుంది.

కాగా పెట్రోల్ తో నడిచే స్ల్పెండర్ బైక్ లను ఈవీలుగా మార్చుకున్న తర్వాత రోడ్లపై తిరిగేందుకు ఆర్టీవో అనుమతిచ్చింది. దీంతో వాహనదారులకు చట్టపరంగా ఏవిధమైన ఇబ్బందులు తలెత్తవు. స్ల్పెండర్ ను ఈవీగా మార్చుకున్న తర్వాత సింగిల్ ఛార్జ్ తో 151 కి.మీల దూరం వరకు ప్రయాణించొచ్చు. అంటే దూర ప్రయాణాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పాత స్ల్పెండర్ ను ఈవీగా మార్చుకునేందుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలంటే స్ల్పెండర్ బైక్ ను ఈవీగా మార్చుకుంటే ఆర్థిక భారం తప్పుతుందంటున్నారు నిపుణులు.

కారులో కూతుర్ని వదిలేసి.. పెరేంట్స్ పెళ్లికి! 3 గంటల తర్వాత!

తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అలాగే తమ పనుల్లో నిమగ్నమై.. పిల్లల్ని పట్టించుకోరు. బయటకు వెళ్లినప్పుడు పిల్లల్ని వదిలేస్తుంటారు. ఆ సమయంలో ఆటల్లో మునిగిపోయిన చిన్నారులు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే జరిగింది. కారులో కూతుర్ని వదిలేసి పెళ్లి వేడుకలకు హాజరయ్యారు పేరెంట్స్. చివరకు ఆ కూతురు ఊపిరాడక చనిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ప్రదీప్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు. నలుగురు కలిసి కారులో వెళ్లాడు. ఫంక్షన్ వద్దకు రాగానే పెద్ద కూతుర్ని కారు నుండి దించారు. ఇద్దరు కుమార్తెలు కారు దిగిపోయి.. తల్లితో కలిసి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్‌ కారును ఒక చోట పార్క్‌ చేసి డోర్‌ లాక్‌ చేశాడు. అయితే అందులో చిన్న కూతురు గోర్విక ఉందన్న విషయాన్ని ఆయన గుర్తించలేదు. పెళ్లిలో వచ్చిన బంధువులు, చుట్టాలతో మాటలు కలిపారు. ముచ్చట్లలో మునిగి తేలారు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటారులే అనుకున్నారు కానీ.. చిన్న పాప లేదు అన్న సంగతి ఎవ్వరూ గ్రహించలేదు. అంతలో పెద్ద పాప చెల్లి ఏదీ నాన్న అనుకుంటూ వచ్చింది.

అమ్మ దగ్గర ఉందేమో అనుకున్నాడు. ఆమె దగ్గర కూడా లేకపోవడంతో ఇద్దరు కలిసి వెతకసాగారు. చిన్నారి గురించి మొత్తం వెతికారు. చివరకు కారులో ఉందేమోనన్న అనుమానం వచ్చింది. అప్పటికే మూడు గంటలు దాటింది. కారు వద్దకు వెళ్లి చూడగా.. గోర్విక అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు పేరెంట్స్‌ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పెద్ద చర్చ నడుస్తోంది. పిల్లలను వదిలేసి.. తమ ఆనందాలకు పరిమితమౌతున్నారని మండిపడుతున్నారు.

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అతి తక్కువకే అదిరిపోయే బెస్ట్ ప్లాన్‌!

ప్రముఖ టెలికాం రంగ సంస్థలో రిలయన్స్‌ జియో కూడా ఒకటి. ఇక మార్కెట్‌ లో జియో సంస్థ క్రియేట్‌ చేసిన సంచలనం గురించి అందరికి తెలిసిందే. ఎందుకంటే.. జియో సంస్థ మార్కెట్ లో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే.. కోట్లాడిది మంది కస్టమర్లను కూడగట్టుకుంది. అంతేకాకుండా.. తరుచు కస్టమర్లను ఆకర్షించేందుకు జియో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జియో తన కస్టమర్లను ఆకర్షించేందుకు మరో కొత్త బెస్ట్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

భారత టెలికాం రంగ సంస్థ రిలయన్స్‌ జియో కస్టమర్ల కోసం ఎప్పుడు రకరకాల ప్లాన్‌ లను ఆకర్షణీయమైన ప్లాన్‌ లను తీసుకువస్తునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జియో కంపెనీ తన 44 కోట్ల మంది వినియోగదారుల కోసం 365 రోజులకు సరిపడే బెస్ట్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా, దీనిలో మీరు అనేక ప్రయోజనాలతో కూడిన పూర్తి వినోద అవకాశాన్ని పొందుతారు. అంతేకాకుండా.. మీరు ఓటీటీ స్ట్రీమర్ అయితే, ఈ ప్లాన్ మీకు బెస్ట్‌ ఆప్షెన్‌ అని చెప్పవచ్చు. మరి ఆ ప్లాన్‌ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా జియో రూ. 3227 రీఛార్జ్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా, ఇందులో మీరు వినియోగదారులు చాలా ప్రయోజనం పొందుతారు. ఇక ఇందులదో మీకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇది కాకుండా.. ఏ నెట్‌వర్క్‌ లోనైనా ఉచిత కాలింగ్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ప్లాన్‌ లో సంవత్సరం మొత్తం రీఛార్జ్‌ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. జియో కంపెనీ 365 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందిస్తోంది. దీనితో పాటు మీకు రోజుకు 100 SMSల సౌకర్యం కూడా అందిస్తుంది. అంతేకాకుండా.. ఇందులో మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పదే పదే తీసుకోవడంలో విసిగిపోతే, ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఎందుకంటే ఈ వన్ ఇయర్ ప్లాన్‌లో మీ కస్టమర్‌లకు ప్రైమ్ వీడియోకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా.. మీరు ఇందులో జియో టీవీ, జియో , జియో క్లౌడ్‌కు ఉచిత సభ్యత్వాన్ని కూడా ఆనందించవచ్చు. ఈ ప్లాన్‌ తో పాటు జియో కొత్తగా రూ. 888, రూ. 999 ప్లాన్‌ను కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.

Laptop Tips: ల్యాప్‌టాప్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? పేలిపోతుంది.. జాగ్రత్త

మీరు ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తుంటే ఈ సమాచారం ప్రత్యేకంగా మీ కోసం. ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన కొన్ని సంకేతాలను ఇస్తుంది. మీరు ఈ సంకేతాలను విస్మరిస్తే మీ ల్యాప్‌టాప్ త్వరగా చెడిపోతుందని గుర్తించుకోండి. ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ల్యాప్‌టాప్‌లు చాలా వేడిగా అవుతాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే సిస్టమ్‌లు ఎందుకు వేడెక్కుతున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ల్యాప్‌టాప్ ఓవర్‌హీటింగ్ సమస్య: కొత్త ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే పాత సిస్టమ్‌లలో ఓవర్‌హీటింగ్ సమస్య సర్వసాధారణం, దాని వెనుక ఒకటి కాదు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు.. ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసిన కూలింగ్ ఫ్యాన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్య ఏర్పడుతుంది.

కూలింగ్ ఫ్యాన్ కాకుండా, వేడి బయటకు వచ్చే ప్రదేశంలో దుమ్ము పేరుకుపోవడం వల్ల ల్యాప్‌టాప్ వేడెక్కడం మరో కారణం. ల్యాప్‌టాప్‌లో పేరుకుపోయిన దుమ్మును ప్రతి రెండు, నాలుగు రోజులకొకసారి శుభ్రం చేస్తూ ఉండండి. ల్యాప్‌టాప్ నుండి వేడిని సరిగ్గా వెదజల్లకపోతే, ఓవర్ హీట్ సమస్య ఇంకా అలాగే ఉంటుంది. పొరపాటున కూడా దీన్ని విస్మరించవద్దు. మీరు దీన్ని విస్మరిస్తే మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ పేలి మంటలు రావచ్చు.

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అయిన తర్వాత మాత్రమే రన్ అవుతుంటే, బ్యాటరీని చెక్ చేసుకోండి. ల్యాప్‌టాప్ బ్యాటరీ డెడ్ అయిందని దుకాణదారు లేదా సర్వీస్ సెంటర్ మీకు చెబితే, డబ్బు ఆదా చేయడానికి బ్యాటరీని మార్చడాన్ని తప్పు చేయవద్దు. బ్యాటరీ ఉబ్బి ఉంటే, వెంటనే దాన్ని మార్చండి, లేకపోతే ల్యాప్‌టాప్‌ను నడుపుతున్నప్పుడు బ్యాటరీ పేలవచ్చు.

పలితాలు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే , ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

ఏపీ ఎన్నికల ఫలితాలపై (Election Results) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) తొలిసారి స్పందించారు.
‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్.. ఐప్యాక్ టీం (I-PAC Team) సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఐప్యాక్ టీమ్ ఈసారి కూడా వైసీపీకి (YSRCP) ఎన్నికల సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రశాంత్ కంటే రిషీ టీం చాలా వర్తీ…

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగం సురేష్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. ఐప్యాక్ టీంతో భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.

AP Government: ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్

ఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.

‘‘అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలి. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటాం. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలి. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి’’ అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ధృవీకరించింది. ఆ మేరకు మధ్యంతర నివేదికను సమర్పించింది. 10 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాల సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ నేడు సుప్రీం ముందు ఉంచారు. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్ర స్థాయికి పంపాలని గత వారం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా.. లేదా? అన్నది తనిఖీ చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని తమకు తెలుసని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నేడు సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు సమాచారం.

Chereddy Manjula : ‘పిన్నెల్లి’కి వీరనారిలా ఎదురు నిలిచి. నుదుటిపై తీవ్ర గాయమైనా బెదరకుండా బూత్‌లోనే విధులు

‘రిగ్గింగ్‌ను అడ్డుకోవాలనే ఏజెంట్‌గా కూర్చున్నా’

ప్రాణం పోయినా.. అరాచకాలను ఎదుర్కొవాలనుకున్నా..వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ చేరెడ్డి మంజుల

ఈనాడు, అమరావతి: ‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్‌ సర్వసాధారణంగా మారింది.

దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. గొడ్డలి వేటు పడి నుదుటిపై తీవ్ర గాయమైనా.. ఒకవైపు నెత్తురోడుతున్నా ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఏజెంట్‌గా కూర్చొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. మంజులను ‘ఈనాడు’ ప్రతినిధి మంగళవారం కలిసినప్పుడు పలు వివరాలు వెల్లడించారు.

‘పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో..ముఖ్యంగా మా రెంటాల గ్రామంలో ఎన్నికలు అంటే రాళ్లు, మారణాయుధాలతో దాడులు చేసుకోవటం, రిగ్గింగ్‌ ప్రతి ఎన్నికల్లో పరిపాటిగా మారింది. ఆ పరిస్థితి మారాలని, ప్రశాంతంగా ఎవరి ఓటు వారు వేసుకునే వాతావరణం కల్పించాలని ఏజెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ హోటల్‌ బిజినెస్‌ చేసున్నాను. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి గ్రామానికి చేరుకున్నా. ఆ విషయం ప్రత్యర్థులకు తెలిసింది. ఏజెంట్లుగా ఎవరూ కూర్చోనీయకుండా చేసేందుకు సుమారు 30 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డు మీదకు కత్తులు, గొడ్డళ్లతో చేరుకున్నారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. వైకాపా వర్గీయులు దాడి చేస్తారని, పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని కోరాం. అనంతరం సీఐ ఒకరు ఫోన్‌ చేసి మీకేం కాదు.. పోలింగ్‌ కేంద్రానికి బయలుదేరండి.. ఎస్సైని పంపుతానని చెప్పారు. అరగంట వేచి చూసినా పోలీసులు మాత్రం రాలేదు. మాక్‌ పోలింగ్‌ టైం అయిపోతుందని ఉదయం 6.30 గంటలకు నా మరిది చేరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తోటికోడలు చేరెడ్డి వీణ తదితరులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి బయలుదేరా. మేం రోడ్డెక్కగానే ప్రత్యర్థులు ఒక్కసారిగా మాపైకి కత్తులు, గొడ్డళ్లతో దూసుకొచ్చారు.

మీకు ఎంత ధైర్యం.. ఏజెంట్లుగా కూర్చొంటారా.. అంటూ ఆడ, మగ అనే తేడా లేకుండా దాడి చేశారు. తొలుత చేతులతో నా చెంపలపై కొట్టారు. తర్వాత గొడ్డలితో నుదుటిపై గాయం చేశారు. గాయమై నెత్తురోడుతుంటే మా అబ్బాయి వచ్చి కర్ఛీఫ్‌ ఇస్తుంటే అతనిపైనా దాడి చేశారు. బైకు ధ్వంసం చేశారు. ప్రాణం పోయినా పరవాలేదనుకొని, నెత్తురోడుతున్న గాయాలతోనే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే కాంక్షతో ఇలా చేశా. గాయమైందని ఇంటికో.. ఆసుపత్రికో వెళ్లిపోతే.. ఆ గాయాలు మేమే చేసుకున్నామని చెప్పి నెపం మోపుతారు. అందుకే బాధను భరిస్తూ పోలీసులు వచ్చే వరకు పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నా. పోలీసులు వచ్చాకే గురజాల ఆసుపత్రిలో చేర్పించి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ అరాచకాలకు స్వస్తి పలికేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. తమపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలి. వైకాపా వాళ్లు బలంగా ఉన్న ప్రాంతంలోనే పోలింగ్‌ కేంద్రాలు ఉండటం వల్లే దాడులు చేస్తున్నారు. ఊళ్లో పోలింగ్‌ కేంద్రాలను మార్చాలని ఏళ్లుగా మొత్తుకుంటున్నా మా మొర ఆలకించడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం వల్లే వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. తప్పు చేసే వారికి శిక్షలు పడినప్పుడే భయం ఉంటుంది’ అని మంజుల పేర్కొన్నారు.

 

MLA అరాచకాలపై ఎదురుతిరిగిన ఎమ్మెల్యే బంధువు మంజుల

రెచ్చిపోయి వేట కొడవళ్లతో దాడి చేసిన వైసీపీ మూకలు

నుదుటిపై తీవ్ర గాయమైనా బెదరకుండా బూత్‌లోనే విధులు

గుంటూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి అడ్డూ ఆపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నుదిటిపై పెద్ద గాయమై రక్తమోడుతున్నప్పటికీ ఆమె పోలింగ్‌ బూత్‌లోనే కూర్చున్నారు. ఆమె పేరు చేరెడ్డి మంజుల. ఎమ్మెల్యే పిన్నెల్లికి వరసకు మరదలు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల గ్రామ వాసి. మంజుల భర్త వెంకటేశ్వరరెడ్డి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. పిన్నెల్లి సోదరుల అకృత్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను చూస్తూ తట్టుకోలేక మార్చి 15న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపు కోసం పాటుపడుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించిన తరుణంలో రెంటాల పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో మంజుల ఏజెంట్‌గా వున్నారు. సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. మంజుల, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డిపై వేట కొడవళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని వెంటనే గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల నుదిటిపై తీవ్ర గాయమై రక్తం ధారగా కారుతున్నప్పటికీ ఆ గాయంతోనే బూత్‌లో ఏజెంట్‌గా కూర్చుని తన కర్తవ్యం నిర్వర్తించారు. చివరకు పార్టీ నేతలు సర్ది చెప్పి మంజులను బయటకు తీసుకొచ్చి వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల సాహసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

బంపరాఫర్ : రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు..10,ఐటీఐ పాసైతే చాలు.. మంచి జీతం

నిరుద్యోగులకు శుభవార్త. NHPC లిమిటెడ్ తనక్‌పూర్ పవర్ స్టేషన్ కోసం అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా నేటి నుంచి ప్రారంభమైంది. NHPC nhpcindia.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ జూన్ 10వ తేదీలోపు లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు

వెల్డర్- 03 పోస్టులు

స్టెనోగ్రాఫర్ మరియు సెక్రటేరియల్ అసిస్టెంట్ – 10 పోస్టులు

ప్లంబర్- 02 పోస్టులు

ఎలక్ట్రానిక్ మెకానిక్- 05 పోస్టులు

ఎలక్ట్రీషియన్ – 15 పోస్టులు

ఫిట్టర్ – 05 పోస్టులు

మెకానిక్ (MV) – 05 పోస్టులు

వైర్‌మ్యాన్- 02 పోస్టులు

టర్నర్- 02 పోస్టులు

మెషినిస్ట్- 03 పోస్టులు

మొత్తం-64 పోస్టులు

విద్యార్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులందరూ ITIలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమాన మార్కులు పొందినట్లయితే, ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు చేయడానికి లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?

ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటకు ముందే భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరిగితోతున్నారు. మధ్యాహ్నం అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు.ఇంట్లోనే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ముందు కూర్చుంటున్నారు. కొందరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే.. ఏసీల ధరలు పెరిగుతాయని నిపుణులు అంటున్నారు. అసలు ఎందుకు ఎసీల ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం..

భారతదేశంలో హీట్‌వేవ్స్ ఎయిర్ కండీషనర్ డిమాండ్‌ను పెంచుతున్నాయి వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి తయారీదారులు ఉత్పత్తి కొర తను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో హీట్‌వేవ్‌లు సాధారణంగా ఎయిర్ కండీషనర్‌ల డిమాండ్‌తో పాటు దాని ధరలను పెంచుతాయి.

భారతదేశం అంతటా హీట్‌వేవ్‌ల కారణంగా ఎయిర్ కండిషనర్‌ల డిమాండ్‌ క్రమక్రమంగా పెరిగిపోతున్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా కంపెనీలు ఏసీల రేట్లను పెంచే అవకాశం ఉంది.

వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి ప్రధాన AC తయారీదారులు పరిశ్రమ.. గత ఆరు వారాలుగా కాలిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అపూర్వమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉత్పత్తులు,మోడళ్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

mParivahan App | ఈ యాప్స్ ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ వెంట లేకున్నా నో ప్రాబ్లం

MParivahan App | ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్.. కారు నడుపుతున్నారు. అయితే, వాహనాల యజమానులు రోడ్లపైకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయినా, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ వంటి పత్రాలు లేకున్నా వాహనాల యజమానులు ఇబ్బందుల్లో పడ్డట్లే.

మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారో సుమారు రూ.5000 వరకూ ఫైన్ పే చేయాల్సిందే.

అయితే, అంతా డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో ఆందోళన చెందనక్కర్లేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, తదితర పత్రాలు వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఒకే చోట ఉండేలా యాప్స్ రూపొందించిందీ కేంద్ర ప్రభుత్వం. డిజిలాకర్, ఎం-పరివాహన్ వంటి మొబైల్ యాప్ ల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సీ), పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేసుకోవచ్చు. 2018 నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్స్‌లో అప్ లోడ్ పత్రాలను నిజమైన డాక్యుమెంట్స్ గా పరిగణించాలని తెలిపింది.

అలర్ట్​: బ్రేక్​ఫాస్ట్​గా అన్నం తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

Health Benefits of Eating Rice in Breakfast: సాధారణంగానే చాలా మంది ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేస్తుంటారు. ఇక అల్పాహారం అంటే ఇడ్లీ, దోశ, వడ, పూరీ వంటివి గుర్తొస్తాయి. అయితే చాలా మంది ఉదయం పూట టిఫెన్స్​కు బదులుగా అన్నం తింటుంటారు. ఇలా తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఉదయాన్నే అన్నం తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ, అంతకు మించి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

శక్తిని అందిస్తుంది: అన్నం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి సహాయపడతాయి. అలాగే రోజంతా యాక్టివ్​గా ఉంచుతుంది. ఉదయం పూట అన్నం తినడం వల్ల మీకు రోజంతా పనిచేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా: అన్నంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల DNA ను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: మెదడుకు శక్తిని అందించే గ్లూకోజ్​కు అన్నం బెస్ట్​ ఆప్షన్​. బ్రేక్​ఫాస్ట్​లో అన్నం తినడం వల్ల మీరు మరింత ఏకాగ్రతతో, స్పష్టంగా ఆలోచించగలరని నిపుణులు అంటున్నారు.

గుండె ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట అన్నం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అన్నంలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

2002లో The New England Journal of Medicineలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అన్నం ఎక్కువగా తినే వ్యక్తులు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 17% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోషణ విభాగంలో ప్రొఫెసర్ డా.డేవిడ్ జె. లీ, MD, PhD పాల్గొన్నారు. అన్నం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 5% తగ్గుతాయని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 4% పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్​రైస్​ ఎక్కువ మేలు చేస్తుందని చెబుతున్నారు.

జీర్ణక్రియకు మంచిది: అన్నం జీర్ణం చేయడానికి సులభమైన ఆహారం అని.. ఇది జీర్ణ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది: అన్నం తినడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: బియ్యంలో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

Mangoes Test: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఇలా గుర్తించండి

Mangoes Test: మామిడిని పండ్ల జాతికే రారాజుగా పిలుస్తారు. ఎంతోమంది ఈ మామిడి పండ్ల కోసమే వేసవి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మామిడి పండ్లు సహజసిద్ధంగా పండినవి తింటేనే ఆరోగ్యం. కృత్రిమంగా పండించినవి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా రసాయనాలు వేసి పండించిన మామిడి పండ్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి శరీరానికి కీడు చేస్తాయి. అలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

ఈ రసాయనాలతో..
మామిడి పండ్లను కృత్రిమంగా పండించడం కోసం క్యాల్షియం కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను వినియోగిస్తారు. ఈ రసాయనాలను చల్లడం వల్ల మామిడి పండ్లు త్వరగా పసుపు రంగులోకి మారుతాయి. కేవలం క్యాల్షియం కార్బైడ్ మాత్రమే కాదు మరిన్ని రసాయనాలను కూడా వినియోగిస్తూ ఉంటారు. అలాంటి పండ్లను తినకూడదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి వినియోగించే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం క్యాన్సర్ కారక లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని వెల్డింగ్ పనిలో అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇది చాలా చౌకగా మార్కెట్లో లభిస్తుంది. కాబట్టే వ్యాపారులు ఈ రసాయనాన్ని కొని మామిడి పండ్లను పండించడానికి వినియోగిస్తూ ఉంటారు.

ఈ కాల్షియం కార్బైడ్ లో ఫాస్పరస్ హైడ్రాయిడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలు కూడా కలుస్తాయి. ఈ రసాయనాలు పొరపాటున శరీరంలో చేరితే వాంతులు, విరేచనాలు, చర్మంపై పుండ్లు పడడం, కంటి చూపు దెబ్బ తినడం, శ్వాస ఆడక పోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలా గుర్తించండి
కృత్రిమంగా పండిన మామిడి పండ్లను గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. సహజంగా పండిన మామిడితో పోలిస్తే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు అధికంగా పసుపు రంగును, నారింజరంగును కలిసి ఉంటాయి. కాస్త మెరుస్తూ కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు తీపి, వాసన వస్తూ ఉంటాయి. అదే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు తీపి వాసన వేయవు. భిన్నమైన వాసనను కలిగి ఉంటాయి. కృత్రిమంగా పండిన మామిడి పండ్లు… సహజ మామిడి పండు కన్నా మెత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ రసాయనాలు పండులోని గోడలను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే అవి మెత్తగా అవుతాయి. కాబట్టి మెత్తగా ఉన్న మామిడి పండ్లను కొనకూడదు. మామిడిపండ్లపై చిన్న చిన్న గాయాలు, మచ్చలు వంటివి కనిపిస్తే కొనకపోవడమే మంచిది. కొన్ని రకాల రసాయనాలను ఇంజక్షన్ల రూపంలో మామిడిపండు లోపలికి పంపిస్తారు. వీటి వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి.

బకెట్ టెస్ట్
కృత్రిమంగా పండిన మామిడి పండ్లు చప్పగా ఉండడం లేదా కాస్త భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. అలా ఉంటే అవి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు అని అర్థం. ఒక బకెట్లో నీటిని వేసి మామిడికాయలను ఆ నీటిలో ఉంచండి. ఆ మామిడికాయలు మునిగిపోతే అవి సహజంగా పండినవి అని అర్థం. అవి మునగకుండా తేలిపోతున్నట్లయితే అవి కృత్రిమంగా పండించినవి అని అర్థం చేసుకోవాలి.

బేకింగ్ సోడా టెస్ట్
నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసి మామిడికాయలను ఆ మిశ్రమంలో పావుగంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మామిడికాయలను శుభ్రంగా కడిగి బయటకు తీయండి. మామిడి పండ్ల రంగు మారితే అవి రసాయనికంగా పండినవి అని అర్థం చేసుకోవాలి.

ప్రాణాంతకంగా మారుతున్న లివర్ సిర్రోసిస్.. ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలి?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేయాలి. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. దీని పనితీరు ఏమాత్రం మందగించినా వివిధ అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఇటీవల ‘లివర్ సిర్రోసిస్’ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఆరోగ్య నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 7 లక్షల 70 వేల మందికి పైగా లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారు. శరీరంలో ప్రోటీన్ లెవల్స్ తీవ్రస్థాయిలో పడిపోయి, కాలేయ కణాలు దెబ్బతినడాన్నే లివర్ సిర్రోసిస్ అంటారు.

అసలు కారణం ఇదే

కాలేయ కణాలు దెబ్బతినడంవల్ల లివర్ సిర్రోసిస్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇది రావడానికి ప్రధాన కారణం మద్యపానం సేవించడమే. ఆల్కహాల్‌కు అడిక్ట్ అయిన వారిలోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నట్లు నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. దీంతోపాటు హెపటైటిస్ బి, సి, వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలం కొనసాగినా లివర్ సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. కానీ దాదాపు 30 శాతం వరకు సమస్యలకు ప్రధాన కారణం మాత్రం ఆల్కహాల్ సేవించడమే. అయితే ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, కాలుష్యాలవల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇండ్యూస్డ్ సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఇటీవల పెరుగుతున్నాయి.

వ్యాధి లక్షణాలు

లివర్ సిర్రోసిస్ బాధితుల్లో కనిపించే అత్యంత ప్రాథమిక లక్షణం తీవ్రమైన అలసట. బాడీలో ప్రోటీన్ లెవెల్స్ పడిపోవడంవల్ల ఇలా జరుగుతుంది. దీంతోపాటు కాళ్లల్లో వాపు, పొత్తికడుపులో లిక్విడ్స్ పేరుకుపోయిన అనుభూతి, రక్తపు వాంతులు, కళ్లు ఎల్లో కలర్‌లోకి మారడం వంటివి లివర్ సిర్రోసిస్ లక్షణాలు.

నిర్ధారణ – చికిత్స

లివర్ సిర్రోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. వ్యాధి నిర్ధారణ తర్వాత వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. హెపటైటిస్ బి, సి లను నియంత్రించగలిగే మందులనే లివర్ సిర్రోసిస్‌ చికిత్సలోనూ ఉపయోగిస్తారు. అయితే లివర్ డ్యామేజ్ కానంత వరకే ఇవి పనిచేస్తాయి. డ్యామేజ్ అయితే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది సమస్య తీవ్రం అయ్యాక వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దాదాపు 80 శాతం వరకు మెడిసిన్ ద్వారా తగ్గే చాన్సెస్ ఉంటాయి.

Virat Kohli: ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2024 సీజన్‌లో టాప్‌ స్కోరర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli). ఆరెంజ్‌ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో తన ఆర్సీబీ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లేందుకు పట్టుదలగా ఉన్నాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లోనూ కోహ్లీ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్‌నెస్‌ ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవరికీ లేదు. కనీసం నాలుగైదేళ్లు ఆడగలిగే సత్తా అతడి సొంతం. అయితే, ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మరెవరికీ కనిపించనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఎప్పుడైనా సరే మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఎందుకు అలా ఆడానా? అని పశ్చాత్తాపపడకూడదని తెలిపాడు.

‘‘స్పోర్ట్స్‌ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్‌ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలి. అందుకే, నేనెప్పుడూ ‘ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది’ అనుకుంటూ నా కెరీర్‌ను ముగించదల్చుకోలేదు. అసలు అలాంటి విషయాలను పట్టించుకోను. నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను. అక్కడితో వదిలేసి తదుపరి మనం చేయగలిగే తర్వాత వాటిపైనే ఆలోచిస్తా. క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘమైన విరామం తీసుకుంటా. ఆ తర్వాతే ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటా. మీకు కూడా కనిపించను (నవ్వుతూ). కాబట్టే నేను ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడతా. ఆ స్ఫూర్తే నన్ను నడిపించేది’’ అని కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. టీ20 ప్రపంచ కప్‌ కూడా ప్రారంభం కానుంది. అందులోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు 13 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, సీఎస్కేతో పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని సమాచారం. ఈ మ్యాచ్‌ రద్దైతే ఆర్సీబీ ఇంటిముఖం పట్టినట్లే.

AP Election 2024: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి పార్టీలు కూడా దీమా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తున్నాడని సమాచారం ఉందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఏపీ ఎన్నికలపై మీడియా ప్రతినిధులు స్పందించగా ఈ విధంగా స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటే: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులతో తాను మాట్లాడానని, ఎలక్షన్ చక్కగా జరిగిందని అన్నారు. తాను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించానని, ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్‌కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెబుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కరెక్ట్‌గా లేరని అన్నారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నామని దీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందని అన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్‌ను చూసి కాంగ్రెస్ , బీజేపీ భయపడ్డాయని కేటీఆర్ అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని అన్నారు.

సిరిసిల్లలో నేను ఒక్క రూపాయి పంచలేదు: కేటీఆర్

పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదని అన్నారు. ”కావాలంటే మీరు వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగండి. సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్‌గిరికి ఏమన్నా సంబంధం ఉందాఝ? ఆమె అక్కడ కాంగ్రెస్ కాండేట్ ఏంది?. బండి సంజయ్‌ని గెలిపించాలని అడ్రస్ లేనివారికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ… వెలిచాల రాజేశ్వరరావు ఎవరు?. నాగర్ కర్నూల్‌లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి. ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావుని కమ్మ సామాజికవర్గం గెలిపించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చూపిస్తోందని అనుకోవడం లేదు. జూన్ 4న తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరే చూడండి” అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

రోజూ సోడా తాగుతున్నారా? ఎంత అపాయమో తెలుసా?

సాధారణం ఆహారపు అలావాట్లు, శీతల పానియాల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. అయితే వేసవి కాలంలో ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది కూల్ డ్రింక్స్, సోడాలు ఇతర శీతల పానియాలు తాగుతుంటారు.

కొన్ని పానియాలు ఆరోగ్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అనర్థాలకు దారి తీస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో సోడా ఒకటి. చాలా మంది ఆహారం జీర్ణం కాక సోడా తాగుతుంటారు. సోడా తాగాకా బ్రేవ్ మంటూ త్రేన్పు రాగానే ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతుంటారు.. ఆహారం జీర్ణమైందని భావిస్తుంటారు. అయితే సోడా తాగడం ఒక అలవాటుగా మారితే మాత్రం డేంజర్లో పడ్డటే అంటున్నారు నిపుణులు.

దేశంలో చాలా మందికి సోడా తాగే అలవాటు ఉంది. సుష్టిగా భోజనం చేసిన తర్వాత కడుపులో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే ఒక సోడా తాగాలనిపిస్తుంది. సోడా అందుబాటులో లేకుంటే కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రతిరోజూ సోడా తాగడం అలవాటుగా చేసుకుంటారు.. రాత్రి వరకు కడుపులో సోడా పడకుంటే ఎదో వెలితిగా బాధపడుతుంటారు. మరి అంతగా ఇష్టపడి తాగే సోడా ఆరోగ్యానికి మంచిదా? అంటే అస్సలు కాదని అంటున్నారు వైద్య నిపుణులు. సోడా తాగడం వల్ల అప్పటి వరకు ఉపశమనం కలిగినా.. దాని వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజూ సోడా తాగడం వల్ల ప్రధానంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగే వ్యక్తులు.. వాటిని కంటిన్యూగా తాగేవారు మూత్రపిండ వ్యాధి భారిన పడే ఛాన్స్ 20 శాతం ఉందని పరిశోదనలో తెలిందని అంటున్నారు. సోడాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెజోయిట్ అనేది ఉపిరితిత్తులను దెబ్బతీస్తుందని అంటున్నారు.

ఆస్తమా ఉన్నవారు అస్సలు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. సోడా తాగడం వల్ల ఆస్తమా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ అనేది శరీరం నుంచి కాల్షియంను బయటకు పంపిస్తుంది. దాని వల్ల ఎముకల్లో బలం తగ్గి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొవాల్సి వస్తుంది. సోడా గ్యాస్ లో ఉండే ఆర్టిఫిషియల్ స్విట్నర్ వల్ల బరువు పెరిగే ఛాన్సు ఉంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల భారిన పడవొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావొచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాదు సోడాతో ఉబకాయం, టైప్ 2 మధుమేహం, ఫ్యాటీ లివర్ మూత్ర పిండ వ్యాధి, కాలేయ వ్యాధి, పంటి నొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ప్రతిరోజూ సాడా తాగితే కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలు కూడా దెబ్బతీస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు.. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురతలు, పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నరాల బలహీనత వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతిరోజూ సోడా తాగడం ప్రాణాలకు హానికరం.. ఆ అలవాటు తగ్గించుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Gallbladder | గాల్‌బ్లాడర్‌లో అసలు రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Gallbladder | గాల్‌బ్లాడర్.. అదే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.

గాల్‌బ్లాడర్‌లో రాళ్లను ముందుగానే గుర్తిస్తే మందులు వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు ఆపరేషన్‌ కూడా అవసరమవుతుంది. అదే పిత్తాశయంలో రాళ్లను గుర్తించకపోతే మాత్రం అది తీవ్ర సమస్యగా.. ఒక్కోసారి క్యాన్సర్‌గా కూడా ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అసలు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? రాళ్లు రావద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు పిత్తాశయం ఏ పనిచేస్తుంది?

కాలేయం కింది భాగంలో పిత్తాశయం (గాల్‌బ్లాడర్‌ ) అతుక్కుని ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటే.. వాటిని జీర్ణం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు పిత్తాశయంలోకి వెళ్తాయి. ఇందులో విడుదలైన పైత్యరసం.. కొవ్వును చిన్ని చిన్న భాగాలుగా విడగొడుతుంది. అయితే గాల్‌బ్లాడర్‌లో కొవ్వు అధికంగా పేరుకుపోతే అది గట్టిపడి రాళ్లలా మారే ప్రమాదం ఉంది. ఇవి ఇసుక రేణువు అంత సైజులో మొదలయ్యి.. గోల్ఫ్‌ బాల్‌ అంత సైజు వరకూ పెరుగుతుంది. గాల్‌బ్లాడర్‌లో నుంచి రాళ్లు పిత్త వాహికలోకి ప్రవేశిస్తే అది కామెర్లు, ప్యాంక్రియాస్‌ వాపు సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను ఎక్కువ కాలం గుర్తించపోతే కేన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.

రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

ఈ బిజీ లైఫ్‌లో మారిన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం కామన్‌ అయిపోయింది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధ పడేవాళ్లలో గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్‌ కూడా పిత్తాశయంలో రాళ్లకు కారణం అయ్యే అవకాశం ఉంది. బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా కొంతమంది సరిగ్గా భోజనం చేయరు. ఖాళీ కడుపుతోనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఇంటి పనులు చేస్తూ, పిల్లలను చూసుకోవడం కారణంగా సరిగ్గా భోజనం చేయరు. ఇలా చేయడం వల్ల పిత్తాశయంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది పిత్తాశయంలో కొవ్వు స్థాయులను పెంచుతుంది. ఇదే దీర్ఘకాలం ఉండటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఆహారంలో నూనె, మసాలాలను తక్కువగా తీసుకోవాలి.

లక్షణాలు ఏంటి?

సాధారణంగా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్న 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎప్పుడైతే గాల్‌బ్లాడర్‌ విడుదల చేసే పైత్యరసానికి ఈ రాళ్లు పడతాయో అప్పుడు నొప్పి మొదలవుతుంది. ఇలా రాళ్లు అడ్డుపడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

– కుడి వైపు పొత్తి కడుపులో నొప్పి
– కుడి భుజం నొప్పి
– వాంతులు, వికారం
– జీర్ణ సంబంధ సమస్యలు, కడుపు ఉబ్బరంగా ఉండటం

పై లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా అల్ట్రా సౌండ్‌ చేయించుకోవాలి. రాళ్లు అధికంగా ఉన్నట్లయితే సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగిస్తారు. సర్జరీ తర్వాత రోగి కేవలం ఒక్క రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. అనంతరం వారం రోజుల్లో రోగి కోలుకుంటారు. అయితే, గాల్‌బ్లాడర్‌ సర్జరీ తర్వాత రోగులు తమ ఆహారం, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

Mahindra XUV 3XO: మహీంద్రా మాస్ – గంటలో 50 వేల బుకింగ్స్ కొట్టిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో!

Mahindra XUV 3XO Record Bookings: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో బుకింగ్స్ నేడు (బుధవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. మొదలైన మొదటి 60 నిమిషాల్లోనే ఏకంగా 50,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్లను మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో పొందడం విశేషం.

మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో దేశవ్యాప్తంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. మొదటి 10 నిమిషాల్లోనే ఏకంగా 27 వేల బుకింగ్లను నమోదు చేసింది. ఇది మహీంద్రా కొత్త ఎస్యూవీపై కస్టమర్ల అద్భుతమైన ఉత్సాహాన్ని చూపుతుంది. ఈ విజయం ఎక్స్యూవీ 3ఎక్స్వో అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన రైడ్, అధునాతన సాంకేతికత, థ్రిల్లింగ్ పనితీరు, సాటిలేని భద్రతను ప్రతిబింబిస్తుంది.

కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఎస్యూవీ గెలాక్సీ గ్రే, రెడ్, డూన్ బీజ్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ ప్లస్ గాల్వనో గ్రే, ఎవరెస్ట్ వైట్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే ప్లస్ స్టెల్త్ బ్లాక్, స్టెల్త్ బ్లాక్ ప్లస్ గాల్వనో గ్రే, టాంగో రెడ్ ప్లస్ వంటి 16 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, నెబ్యులా బ్లూ, డీప్ ఫారెస్ట్ ప్లస్ గాల్వనో గ్రే, డూన్ బీజ్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, సిట్రిన్ ఎల్లో, సిట్రిన్ ఎల్లో ప్లస్ స్టెల్త్ బ్లాక్ రంగుల్లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇంజిన్, మైలేజీ ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో ఇప్పటికే ఉన్న పెట్రోల్ ఇంజన్ (130 పీఎస్/230 ఎన్ఎం) లాగా అదే పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను పొందుతుంది. అన్ని ఇంజన్లు ప్రామాణికంగా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మార్కెట్లోకి రానున్నాయి. రెండు పెట్రోల్ ఇంజన్లు ఆప్షనల్గా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని పొందుతాయి. అయితే డీజిల్ యూనిట్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లీటరుకు 17.96 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.1 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్-8 పెట్రోల్, 1.2 లీటర్ టీజీ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు 20.6 కిలోమీటర్ల మైలేజీని, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 21.2 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వోలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్, మరొకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం), క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి కొన్ని అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి.

క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు.

దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన కౌంటింగ్ ప్రక్రియపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ అయినా సక్రమంగా జరుగుతుందా.. అని ఆయన దీర్ఘాలు పోతూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకునేందుకు సజ్జల ప్రయత్నాలు చేశారు. ఈసీ ఆదేశాలు అమలు కాకుండా చేయడంలో ఆయన గుప్పిట్లో ఉన్న అధికారులే కీలకం. గెలిచే అవకాశమే ఉంటే.. ఇలా దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉన్నప్పుడే కసి.. కక్ష తీర్చుకోవాలని డిసైడయ్యారు. ఆ పని చేశారు. పోలీసులు తర్వతా కఠిన చర్యలు తీసుకుంటారని.. ఇంకా ఈసీ చేతుల్లోనే పాలన ఉందని సజ్జలకు తెలియకుండా ఎలా ఉంటుంది ?. అందుకే ఈసీ టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలు పాటించిందని సజ్జల అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమ పరిపాలన సంక్షేమ, అభివృద్ధి సమతూకంగా నడిచిందని ప్రజల మీద అసలు భారం వేయకుండా పాలన చేశామని అనుకున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి అది నమ్మకంతో సొంత పార్టీ క్యాడర్ బెట్టింగులు గట్టిగా పెట్టుకోవడానికి కారణం అయింది. అలా కూడా పార్టీ క్యాడర్ నష్టపోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి వైసీపీ క్యాడర్ కు రాకుండా ఉండేందుకు సజ్జల ముందస్తుగా హింట్స్ ఇస్తున్నారని.. ఓటమికి కారణాలు చెబుతున్నారని అంటున్నారు.

Business Idea: ఈ మిషన్‌ ఉంటే చాలు.. రెండు గంటలు పనిచేస్తే నెలకు రూ. 30 వేలు పక్కా ఆదాయం

ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్క ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అందుకే చాలా మంది సైడ్‌ ఇన్‌కమ్‌ వచ్చేలా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తూనే వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే వ్యాపారంగా అనగానే గంటల తరబడి టైమ్‌ స్పెండ్‌ చెయ్యాలి. లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు చాలా మంది. కానీ తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్‌ లేకుండా కూడా వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా.? ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి.

అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో ఉదయం లేవగానే చాలా మంది చేసే పని పాత్రలను శుభ్రం చేయడం ఇందుకోసం కచ్చితంగా స్క్రబర్‌ను ఉపయోగిస్తుంటాం. మరి ఈ స్క్రబర్‌ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భలే లాభాలు ఉంటాయి కదూ! అయితే మీరు స్బ్రబర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం స్బ్రబర్స్‌ను ప్యాక్‌ చేసి వాటిని విక్రయించడమే మీ పని. మార్కెట్‌లో స్క్రబర్‌ ప్యాకింగ్ మిషన్స్‌ను పలు సంస్థలు అందిస్తున్నాయి. అంతేకాకుండా వాటికి అవసరమయ్యే ముడి సరుకును కూడా వారే అందిస్తుంటారు.

స్బ్రబర్‌ ప్యాకింగ్ కోసం ఒక మిషన్‌ అవసరపడుతుంది. అలాగే స్క్రబర్‌ ముడి సరుకు, ప్యాకింగ్ చేయడానికి ఒక షీట్‌ కావాల్సి ఉంటుంది. ముందుగా మిషన్‌లో ఉండే హోల్స్‌లో ముందుగా కప్పులను పెట్టి అనంతరం వాటిలో స్క్రబర్‌ను పెట్టాలి. అనంతరం పైనుంచి షీట్‌ను పెట్టి, మిషన్‌పై నుంచి నొక్కాలి. అంతే ఆటోమెటిక్‌గా సెట్‌ చేసిన టెంపరేచర్‌తో స్క్రబర్స్‌ ప్యాక్‌ అవుతాయి. ఈ షీట్‌ను మీ సొంతం బ్రాండింగ్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. తయారీ అనంతరం మీకు సమీపంలో ఉన్న దుకాణాల్లో హోల్‌సేల్‌ ధరకు విక్రయించుకోవచ్చు.

ఇక పెట్టుబడి విషయానికొస్తే స్క్రబర్‌ ప్యాకింగ్‌కు అవసరపడే షీటు ధర రూ. 7.80 గా ఉంటుంది. అలాగే ఒక కప్పు 55 పైసలు ఉంటుంది. ఇక ఒక కిలో స్క్రబ్‌ ధర రూ. 230గా ఉంటుంది. ఒక కిలో ముడి సరుకుతో 125 స్బ్రబర్‌లను తయారు చేసుకోవచ్చు. ఇక మిషన్‌ విషయానికొస్తే రూ. 30 వేలుగా ఉంటుంది. ఒక స్బ్రబర్‌ షీట్‌ను తయారు చేయడానికి రూ. 42 అవుతుంది. అంటే 12 స్క్రబర్‌ల తయారీకి అయ్యేది కేవలం రూ. 42 మాత్రమే. మార్కెట్లో ఒక్కో స్బ్రబర్‌ను రూ. 10 విక్రయిస్తారు. మనం హోల్‌సేల్‌లో ఒక షీట్‌ను రూ. 10 లాభానికి విక్రయించినా.. రోజుకు 100 షీట్స్‌ తయారు చేస్తే రూ. 1000 పొందొచ్చు.ఇలా నెలకు రూ. 30 వేలు ఆర్జించవచ్చు.

Pakistan: ‘భారత్‌ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర చర్చ!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్‌ ముస్తఫా కమల్‌.. భారత్‌ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్‌ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్‌ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పార్లమెంటు సాక్షిగా వారి దయనీయ స్థితిపై వాపోయారు. ఆయన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘‘టీవీలో చంద్రుడిపై భారత్‌ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్థాన్‌కు (Pakistan) కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారంలాంటిది. కానీ, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు’’ అంటూ పాక్‌ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్‌ ముస్తఫా వివరించారు.

గత ఏడాది భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్‌ (Pakistan) మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.

ICMR: నాన్‌స్టిక్ పాత్రలు వాడారో ఇక అంతే సంగతులు..!!

నాన్‌స్టిక్‌ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎమ్మార్‌) హెచ్చరించింది. నాన్‌స్టిక్‌ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్‌ పైపూత (కోటింగ్‌)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది.

గీత పడితే అంతే సంగతులు..?

ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్‌ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్‌ వంటపాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్‌ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలయ్యే ప్రమాదం ఉంది.

ఏం జరుగుతుందంటే..?

వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్‌, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎమ్మార్‌ పేర్కొంది. నాన్‌ స్టిక్‌ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్‌ పాత్రలను కూడా సూచించింది. అయితే, వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్‌లె్‌స స్టీల్‌ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ‘భారతీయులకు ఆహార మార్గదర్శకాలు’ పేరుతో ఐసీఎమ్మార్‌ ఈ సూచనలను ఇటీవల విడుదల చేసింది.

వీటిని మామిడిపండ్లతో కలిపి తిన్నారంటే.. విషంతో సమానమే.! తస్మాత్ జాగ్రత్త.. అవేంటంటే.?

పండ్లకు రారాజు మామిడి. వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ కూడా నోరూరించే మామిడిపండ్లను తెగ లాగించేస్తుంటారు. మామిడిలో విటమిన్ ఎ, సితో పాటు ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. అయితే మామిడితో పాటు కొన్ని ఆహార పదార్ధాలను తింటే.. కచ్చితంగా లేనిపోని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. మరి అవేంటంటే.?

మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ తయారయ్యి.. శరీరానికి చాలా సమస్యలు తెచ్చిపెడుతుందట. అలాగే మామిడితో పాటు మిరపకాయలు తిన్నా.. కడుపు, చర్మ వ్యాధులకు దారి తీస్తుందని వైద్యుల సూచన. మామిడి, కాకరకాయ కలిపి తినడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.

ఇక మామిడి తిన్న వెంటనే శీతల పానీయాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిక్ రోగులకు ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు. అటు మామిడి తిన్న తర్వాత నీరు తాగితే కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ ఏర్పడతాయట.అందుకే మామిడి తిన్న అరగంటకు నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.. పై వార్త కేవలం పలు అధ్యయనాలు ఆధారంగా ప్రచురితం చేసింది మాత్రమే.

Devara: పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. రెడీ అవ్వండ్రా అబ్బాయిలు

Devara: దేవర.. వచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేటి నుంచే పండగ మొదలుపెట్టేస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం అక్టోబర్ లో దసరా కానుకగా రానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ బర్త్ డే అయిన మే 20 న దేవర నుంచి అప్డేట్ వస్తుంది అని టాక్ నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే అది టీజర్ నా.. ? సాంగ్ నా.. ? అనేది క్లారిటీ లేదు.

ఇక తాజాగా ఆ క్లారిటీని మేకర్స్ అందించారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మొదటి సింగిల్ మే 19 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్ లో ఎన్టీఆర్ చెయ్యిని మాత్రమే చూపించారు. అది కూడా చేతిలో గొడ్డలి.. రక్తంతో తడిచి కనిపిస్తుంది. చూడడానికే చాలా వైలెంట్ గా కనిపిస్తుంది. ఇక ఫియర్ సాంగ్ అంటూ మేకర్స్ చెప్పగానే ఇక ఫ్యాన్స్ ట్రెండ్ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించడంతో మ్యూజిక్ పై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

AP: పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

Delhi: నేడు ఏపీ సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
కాగా.. 13 తేదీన జరిగిన ఎన్నికల రోజు.. ఆ తర్వాత రోజు.. మాచర్ల,తాడిపత్రి, చంద్రగిరి, నరసారావుపేటలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో పోలింగ్ తీరుపై పూర్తి నివేదికతో ఢిల్లీకి రావాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్‌లతో సీఎస్ అత్యవసర భేటీ అయ్యారు. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలం అయ్యారని.. రాజకీయ నాయకులు పార్టీలు ఆరోపించడంతో.. ఈసీ స్పందించింది. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌ను ప్రశ్నించింది.

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన శతాధిక వృద్ధుడు.. 102 ఏళ్ల వయసులోను తగ్గని హుషారు!

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన శతాధిక వృద్ధుడు.. 102 ఏళ్ల వయసులోను తగ్గని హుషారు!
క్రికెట్ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులోను హుషారుగా కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసి.. యువకులకు ప్రేరణగా నిలిచారు.

క్రికెట్ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులోను హుషారుగా కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసి.. యువకులకు ప్రేరణగా నిలిచారు. వందేళ్లు పైబడిన వయసులోనూ మైదానంలో తర్వాతి తరానికి మెళకువలు చెబుతూ వారికి మార్గదర్శిగా మారిన ‘కరమ్ దిన్’ గురించి తెలుసుకుందాం.

పసిడి ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వరుసగా తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం..

పసిడి ప్రియులకు మరోసారి బిగ్‌ అలర్ట్‌. ఎందుకంటే.. మూడు రోజుల పాటు దిగివచ్చిన బంగారం ధర నేడు ఒక్కసారిగా షాకిచ్చింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రివర్స్ గేర్ వేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కాగా, గత మంగళవారం రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో బంగారం ధరలు ఎగబాకాయి. ఇక మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో గోల్డ్ ఫూచర్స్ జూన్ 2024 కాంట్రాక్ట్ ఎక్స్ పైరీ రేటు పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇకపోతే అది దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా.. దేశీయంగానూ తులం ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా రూ.430 మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకురూ. 2,395 స్థాయికి చేరుకుంది. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి మారకం విలువ ఈరోజు కాస్త పుంజుకుంది. ఇక డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ. 83.415 వద్ద అమ్ముడవుతోంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లలో నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు దాదాపు రూ. 900 మేర దిగివచ్చిన తులం బంగారం రేటు ఇవాళ మళ్లీ రూ. 430 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 73 వేల 250 స్థాయికి ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ రూ.400 మేర పెరిగి రూ. 67 వేల 150 వద్దకు పెరిగింది. అలాగే బంగారంతో పాటు వెండి సైతం పోటీ పడుతూ వరుసగా రెండో రోజుల నుంచి పెరిగుతుంది. ఇక నేడు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 400 మేర పెరిగి రూ. 87 వేల 600 స్థాయికి చేరింది. రెండు రోజుల్లో రూ.1100 మేర పెరగింది.

227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ షోకాజ్‌ నోటీసులు

నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ రాష్ట్ర పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన విభాగం కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల పురోగతి శాతం తక్కువగా ఉన్న 227 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న మరుగుదొడ్లు, వంట గదులు, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, తరగతి గదులు, విద్యుత్తు పనుల ప్రగతిలో వీరు వెనకబడిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో ఇందుకు తగిన వివరణను అందజేయాలని ఆమె ఉత్తర్వుల్లో కోరారు. ఈ వివరణలను కమిషనర్‌కు పంపిస్తామని, వివరణ ఇవ్వని ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Health

సినిమా