వారంలో డీఎస్సీ – ఖాళీలు ఎన్నంటే..!!

????వారంలో డీఎస్సీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

♦️6వేలకు పైగా ఖాళీలతో ప్రకటన!!

❇అమరావతి

Related News

????️సార్వ త్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నాలుగు న్నరేళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది.

????️వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10 వేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయంగా తెలి సింది. డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు.

????️ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులు వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేకసార్లు రకరకాల లెక్కలు వేయగా, తాజా అంచనాలతో కనీసం 6వేల మందిని భర్తీ చేయొచ్చన్న అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
????️కొత్తగా ఏర్పాటుచేసిన ప్రీస్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మంది మాత్రమే అవసరమని పేర్కొంది. ఖాళీ ఉన్నప్పటికీ 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Related News