Gold Price: రూ.75 వేలకు చేరనున్న బంగారం ధర.. ఎప్పటిలోగా అంటే

రోజు రోజుకి ఎండలు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం ధర కూడా అదే స్థాయిలో పరుగులు తీస్తుంది. గతేడాది వరకు 50వేలు.. అంతకు దిగువన ఉన్న పసిడి ధర ఇప్పుడు మాత్రం ఆగకుండా పరుగులు తీస్తూ.. 65 వేల రూపాయల మార్క్‌ను దాటేసింది. పైగా ఇప్పుడు వివాహల సీజన్‌ కావడంతో పుత్తడి రేటు పెరుగుతుందే తప్ప దిగి రావడం లేదు. ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా పరుగులు తీస్తుంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం గోల్డ్‌ రేటు విపరీతంగా పెరుగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర రూ.68,730గా ఉంది. అలానే 22 క్యారెట్‌ పసిడి రేటు 63 వేల రూపాయలకు చేరింది. ఈక్రమంలో బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో పసిడి ధరకు బ్రేకులు పడే సూచనలు లేవని.. పైగా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర 75 వేల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు.

మార్కెట్‌ నిపుణులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర భారీగా పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. పది గ్రాములు పసిడి ధర 75 వేల రూపాయలను తాకవచ్చని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులు, అమెరిక ద్రవ్యోల్బణంలో తగ్గుదల, డాలర్‌ విలువలో మార్పుల కారణంగా పుత్తడి రేటు పెరుగుతుంది అంటున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్‌ రేటు ఏకంగా 11 వేల రూపాయలు పెరిగింది. రానున్న కాలంలో కూడా ఇదే తీరు కొనసాగి.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 75 వేల రూపాయలకు చేరుతుందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related News

వెండి కూడా ఇదే బాటలో పయనిస్తుంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. గ్లోబల్​ గ్రీన్​ ఇనీషియేటివ్స్​, 5జీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్​ సెగ్మెంట్స్​ కారణంగా.. వెండికి డిమాండ్​ పెరిగే అవకాశం ఉంది. బంగారం కన్నా సిల్వర్‌ రేటు బాగా పెరుగుతుందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 78,000-78,500 వద్ద ఉన్న కేజీ వెండి ధర రానున్న కాలంలో రూ. 88వేలు-95వేల వరకు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాక ఫిజికల్​ గోల్డ్​ కొని, దానినే ఇన్​వెస్ట్​మెంట్​ అనుకోవడం తప్పు అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఫిజికల్​ గోల్డ్​లో ఆ ఛార్జీలనీ, ఈ ఛార్జీలనీ.. చాలా కటింగ్స్​ ఉంటాయి. కనుక బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. అవి సావరిన్​ గోల్డ్​ బాండ్​, గోల్డ్​ ఈటీఎఫ్​, డిజిటల్​ గోల్డ్​. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే బెటర్‌ అంటున్నారు విశ్లేషకులు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *