ఘోరం.. కొడుకును కాలేజీలో చేర్పించేందుకు వెళ్లిన టీచర్ తిరిగి వస్తుండగా..

ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఊహించలేము. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. అప్పటి వరకు తమతో ఉన్న వాళ్లు ఇక లేరని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టలేక పోతున్నారు. మరోవైపు అధిక స్పీడు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్ తన కొడుకును కాలేజీలో చేర్పించేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆంధ్రప్రదేశ్ లోని కదిరి మండలం గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి (45) దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ టీచర్ ఉమామహేశ్వరి, దివాకర్‌ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కొడుకు జయదీప్‌ను శుక్రవారం ఉదయం తిరుపతి జూనియర్‌ కళాశాలలో చేర్పించేందుకు బయలుదేరారు. కుమారుడిని కాలేజీల వదిలిన అనంతరం వారు కారులో తిరుగుపయనమయ్యారు.

ఇలా వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి కదిరి మండలం మొటుకుపల్లి సమీపంలోకి రాగానే కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త దివాకర్‌యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వారిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొడుకును కాలేజీలో చేర్పించేందుకు వెళ్లి తిరిగి వస్తూ టీచర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి ఉపాధ్యాయులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *