Neera : ఈ వేసవిలో దివ్య ఔషధం లాంటి డ్రింక్ ఒక గ్లాస్ తాగితే చాలు.. మీరు ఆశ్చర్యపోయే ప్రయోజనాలు..

Neera : చాలామంది మద్యం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అయితే మద్యం అధికంగా తాగితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ డ్రింక్ వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అదే కల్లు.. పచ్చటి పొలాల గట్లు దాటి ఊరు చివరన అడవిలో పుట్టి గౌడ్ అన్నలకు స్వయం సంపదగా మారి ప్రకృతి ఒడిలో దివ్య ఔషధ రూపంలో ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న నిరాకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈత చెట్టు నుంచి వచ్చే ఈ నీరా ఎటువంటి కల్తీ లేకుండా వాతావరణం అనుకూలంగా చెట్లనుంచి ఒక్కొక్క చుక్కగా వాస్తు కొన్ని గంటల వ్యవధిలో ఒక చెట్టుకి రెండు లీటర్ల మాత్రమే వస్తుంది. వచ్చేది రెండు లీటర్లైన దానిలో పోషక గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

పెద్దపల్లి జిల్లా అంతర్గాల మండలంలో నందయ్య అనే 75 ఏళ్ల వృద్ధుడు తన యుక్త వయసు నుండే గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నందయ్య ప్రతిరోజు తాటిచెట్టు ఈత చెట్టు ఎక్కి కళ్ళు గీసి గీసిన కల్లును అమ్ముకొని బ్రతుకుతున్నారు.. అయితే నందయ్య ఒక రోజు సోషల్ మీడియా వారితో మాట్లాడుతూ.. ఇప్పుడు రోజుల్లో ప్రకృతి ఇచ్చే పానీయాలు తాగి ఆ రోజులలో మనుషులు అన్ని రకాల విటమిన్లు పొంది ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం రోజులో యువకులు కలితీ మత్తుకు అలవాటు పడి అనారోగ్య బారిన పడుతున్నారని ఆయన తెలిపారు.. ఈ వేసవి కాలంలో ప్రకృతి ఒడిలో ఈత చెట్టు నుండి వచ్చే కల్లు మంచి రుచితో అంతకు మించిన పోషకాలతో నిండి ఉంటుంది. అని నందయ్య తెలిపాడు. సాయంత్రం కొత్త మట్టికుండను శుభ్రంగా కడిగి సాయంత్రం వేళ చెట్టుకు గీసి కుండను కడతారు. అది ఉదయం అయ్యే సరికి కల్లుతో నిండిపోతుంది.

Neera : ఈ వేసవిలో దివ్య ఔషధం లాంటి డ్రింక్ ఒక గ్లాస్ తాగితే చాలు.. మీరు ఆశ్చర్యపోయే ప్రయోజనాలు..

ఈ కల్లు నీ ప్రతిరోజు ఉదయం పరిగడుపున సూర్యోదయం కాకముందే తాగితే దానిలో ఉన్న పోషకాలు అన్నిట్లో ఇమిడి వేడి చేయకుండా మీ శరీరాన్ని రక్షిస్తుంది అని గౌడ్ అన్న తెలిపాడు..ప్రకృతి ప్రసాదించే కల్లులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే చెట్టు నుంచి తీయగానే వచ్చేదాన్ని నీరా అని అంటారు. ఇది రుచి తియ్యగా ఉండడమే కాకుండా దీనిలో మినరల్స్, ఫాస్ఫరస్, ఐరన్ లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇంకా ఈ నీరా త్రాగడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎలాంటి జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో నీర తాగడం వలన ఎండ వేడికి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అందుకే వేసవిలో నీరాకి మించిన మందు లేదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *