క్లాస్​రూమ్స్​ను స్విమ్మింగ్ పూల్స్​గా మార్చిన టీచర్స్ … ఎందుకంటే?

ఈ రోజుల్లో పిల్లలకు పాఠాలు నేర్పడం చాలా కష్టమవుతోంది. మొబైల్ ఫోన్ అడిక్షన్, టీవీ అడిక్షన్ ఎక్కువుతుండటంతో స్కూళ్లలో చాలా మంది విద్యార్థులు కుదురుగా కూర్చొని పాఠాలు వినడం లేదు. ముఖ్యంగా దిగువ తరగతి విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే కొన్ని స్కూళ్లలో పిల్లలకు చదువును సంప్రదాయ రీతిలో కాకుండా కాస్త వెరైటీగా బోధిస్తున్నారు. ఆటపాటల రూపంలో పాఠాలు చెబుతూ వాళ్లను క్లాస్​రూమ్​లో ఎంగేజ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు. దీని వల్ల అనేక చోట్ల సత్ఫలితాలు కూడా వచ్చాయి. అయితే పిల్లల్ని క్లాస్​రూమ్​కు మరింత అలవాటు చేసేందుకు ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటారనేది తెలిసిందే. సర్కారు బడుల్లో పిల్లల అటెండెన్స్ కూడా తక్కువే. దీన్ని నివారించేందు ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఉత్తర్ ప్రదేశ్​, కన్హౌజ్​లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ క్లాస్​రూమ్స్​ను ఏకంగా స్విమ్మింగ్ పూల్స్​గా మార్చేసింది. దీని వెనుక ఓ కారణం ఉంది. కన్హౌజ్​ స్కూల్​లో చదివే వారిలో ఎక్కువ మంది విద్యార్థుల పేరెంట్స్ శ్రామికులు, పేద రైతులు కావడం గమనార్హం. పంట కోతల వల్ల అన్నదాతల పిల్లలు స్కూళ్లకు డుమ్మా కొడుతున్నారు. అలాగే వడగాల్పుల వల్ల కూడా స్కూల్ అటెండెన్స్ అమాంతం పడిపోయింది.

పిల్లలు రాక స్కూలు బోసిపోయింది. దీంతో పాఠశాల యాజమాన్యం వినూత్న ప్రయోగానికి తెరలేపింది. క్లాస్​రూమ్స్​ను స్విమ్మింగ్ పూల్స్​గా మార్చేసింది. తరగతి గదుల నిండా నీళ్లు నింపేసింది. అందులో వాళ్లకు పాఠాలు చెబుతూనే మధ్యలో వాటర్ గేమ్స్, స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యార్థులు స్కూళ్లకు క్యూ కట్టారు. రోజు పాఠశాలకు వెళ్తూ చదువుకోవడమే గాక తోటి విద్యార్థులతో కలసి క్లాస్​రూమ్​లో ఆడుకుంటున్నారు. స్కూలు యాజమాన్యం ఆలోచనను చాలా మంది మెచ్చుకుంటున్నారు.
https://x.com/IndianTechGuide/status/1785533428412420162

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *