Single Premium: ఒకేసారి ప్రీమియం చెల్లించండి.. జీవితాంతం పెన్షన్ పొందండి!

మీరు ప్రైవేట్ ఉద్యోగాల్లో పింఛను అందడం లేదని వర్రీ అవుతున్నారా. అయినా కూడా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఉద్యోగిగా కొనసాగుతూనే ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం పింఛన్ పొందే అవకాశం ఉంది.
అయితే అది ఎలా పొందవచ్చు. ఆ విశేషాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఎల్‌ఐసీ(LIC) సరళా పింఛను పథకంలో మీరు ఒకసారి డబ్బును డిపాజిట్ చేయండి. 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏటా మీకు రూ.12000 పింఛను లభిస్తుంది. మీరు జీవితాంతం ఈ పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఇందులో 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఏటా రూ.58,950 వస్తుంది. ఈ పథకంలో పొందే పెన్షన్ మీ పెట్టుబడి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకునే సౌకర్యం ఉంది. మీ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

ఈ పెన్షన్ పథకాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో తీసుకోవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం 12000 రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ పథకం 40 నుంచి 80 ఏళ్ల మధ్య వారికి వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో పాలసీదారు పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి 6 నెలల తర్వాత ఎప్పుడైనా లోన్ కూడా పొందవచ్చు.

Related News

ఈ పాలసీ ఒక వ్యక్తికి సంబంధించినది. పెట్టుబడిదారుడు అంటే పెన్షనర్ జీవించి ఉన్నంత వరకు, అతను పెన్షన్ పొందుతూనే ఉంటాడు. పెట్టుబడిదారుడు మరణించిన తర్వాత, నామినీ మూల ప్రీమియం అందుకుంటారు.

Related News