Smartphones Under 20K: తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు.. ఓ లుక్కేయండి..

స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు తగినట్టుగా వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎక్కువ సేపు పనిచేసేలా మంచి బ్యాక్టరీ బ్యాకప్, స్పష్టమైన డిస్ ప్లే, వేగవంతమైన ప్రాసెసర్లు, ఆకట్టుకునే డిజైన్, నాణ్యమైన కెమెరా, నీటి, దుమ్ము తదితర వాటి నుంచి రక్షణకు ప్రత్యేక వ్యవస్థ లతో తీర్చిదిద్దుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతుల వారికి అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. కేవలం రూ.20 వేల లోపు ధరలో మెరుగైన ఫీచర్లు కలిగిన ప్రముఖ బ్రాండ్ల ఫోన్ వివరాలు తెలుసుకుందాం.
వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ (OnePlus Nord CE lite).. ఈ ఫోన్ లో 6.72 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఆల్ట్రా వాల్యూమ్ మోడ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 పై పనిచేస్తుంది. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. 67 డబ్ల్యూ చార్జర్ తో ఫాస్ట్ చార్జింగ్ కు వీలుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తో కలిసి వస్తుంది. పాస్టెల్ లైమ్, క్రోమెటిక్ గ్రే కలర్లలో అందుబాటులో ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఐకూ జెడ్9 5జీ (iQOO z9 5G).. మీడియా టెక్ డైమన్సిటీ 7200 చిప్ సెట్ తో మెరుగున పనితీరు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో పాటు 1 టీబీ వరకూ మెక్రో ఎస్ డీ కార్డుతో పెంచుకునే వీలుంది. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటు సెల్పీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే కారణంగా చాలా స్పష్టత ఉంటుంది. అలాగే దుమ్ము, నీరు తదితర వాటి నుంచి రక్షణకు ఈ ఫోన్ లో ఏర్పాట్లు ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G).. రెడ్ మీ నోట్ 13 5జీ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమన్సిటీ 6080 చిప్ సెట్ తో సమర్థంగా పనిచేస్తుంది. స్పష్టమైన, అందమైన ఫోటోలు తీసుకునేందుకు వీలుగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటు సెల్పీలు, వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుగా 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాక్టరీ ఎక్కువ సేపు ఫోన్ పనిచేసేలా చూస్తుంది. 33 డబ్ల్యూ చార్జర్ తో చార్జింగ్ ను చాలా వేగంగా చేసుకునే వీలుంది.

Related News

టెక్నో పోవా 6 ప్రో 5జీ (Tecno pova pro 5G).. కాంతివంతమైన 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ, అమోలెడ్ డిస్ ప్లే కారణంగా విజువల్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ లో 108 ఎంపీ ట్రిపుల్ రీర్ కెమెరా సెటప్ ఉంది. డ్యుయల్ టోన్ లెడ్ ప్లాష్ తో కూడిన 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అందమైన సెల్పీలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో ముఖ్యమైన ప్రత్యేకత దీని బ్యాక్టరీ సామర్థం. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది.

రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 pro 5G).. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+అమోలెడ్ డిస్ ప్లే తో పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్, మాలి జీ68 ఎమ్ సీ4 జీపీయూతో పనితీరు చాలా బాగుంటుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో షూటర్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 14 పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో ఓఎస్ అప్ డేట్స్ కు రెండేళ్లు, సెక్యూరిటీ ప్యాచెస్ కు మూడేళ్ల వారంటీ ఉంది. 67 డబ్ల్యూ చార్జర్ తో ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *