Saturday, November 16, 2024

PF Withdraw: కేవలం రెండు నిమిషాల్లోనే పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. ఎలాగో తెలుసుకోండి!

ప్రతి ఒక్క ఉద్యోగికి పీఎఫ్‌ అకౌంట్‌ చాలా ముఖ్యం. కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్‌ అకౌంట్‌లో విరాళలు జమ చేస్తుంటుంది. అయితే పీఎఫ్‌ అకౌంట్‌ వారి వేతనం నుంచి కొత్త మొత్తాన్ని జమ చేస్తుంటాయి. అయితే పీఎఫ్‌ అకౌంట్లో జమ అయిన డబ్బును ఉద్యోగులు అప్పుడప్పుడు విత్‌డ్రా చేస్తుంటారు. అయితే విత్‌డ్రా చేయాలంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి విత్‌డ్రా ప్రాసెస్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విత్‌డ్రా చేయాలంటే కొంత ప్రాసెస్‌ ఉంటుంది. అందుకు సమయం కూడా పడుతుంది. వెబ్‌సైట్‌లో కాకుండా మొబైల్‌లో కూడా ఈ పని చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓలో ఖాతాదారుల సౌకర్యార్ధం చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ యాప్ ఉమంగ్ అందుబాటులో ఉంది. ఈ ఉమంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎఫ్‌ సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతాలో డబ్బు ఎంత ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతే కాదండోయ్‌.. దీని నుంచి కూడా మీ పీఎప్ ఖాతాలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. దీనిని మీ మొబైల్ నుంచే డైరెక్ట్ గా అప్లై చేసుకునే వీలుంటుంది.

ఉమంగ్ యాప్‌లోఈపీఎఫ్‌ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. ముందుగా మీ మొబైల్‌లో ఉమాంగ్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్ సైట్లోకి వెళ్లండి. అక్కడ ‘Employee Centric’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘Raise Claim’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

ఈపీఎఫ్‌ పాన్‌ నంబర్‌ను నమోదు చేయండి. రిజిస్టర్డ్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి. ఆ తర్వాత విత్ డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత Submit పై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ విత్‌డ్రా ప్రాసెస్‌ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్‌లో భాగంగా క్లెయిమ్‌కు సంబంధించి రెఫరెన్స్‌ నంబర్‌ కూడా వస్తుంది. ఈ నంబర్‌ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

Digilocker: డిజీ లాకర్‌ను ఎలా వినియోగించాలి.. సర్టిఫికెట్స్‌ను ఎలా భద్రపరచాలి..!

Digilocker: డిజీ లాకర్‌ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌. దీనిని సులువు గా యాక్సెస్‌ చేయవచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
విలువైన పత్రలను ఇందులో సేవ్‌ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ సాయంతో అవసరమైనప్పుడు ఎక్కడైనా వాడుకోవచ్చు. మీకు సంబంధించిన సమాచారం మొత్తం డిజిటల్‌గా సేవ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని అవసరం ఏ విధంగా ఏర్పడుతోంది.. దీని ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

డిజీలాకర్‌ యాప్‌లో మీ సర్టిఫికెట్లు, పత్రాలు సురక్షితంగా దాచుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్‌ నుంచి ఆధార్‌, పాన్‌, రేషన్‌.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్‌ వంటి బాండ్‌ లను కూడా ఇందులో దాచుకోవచ్చు. మీరు రోడ్డుపై బైక్‌పై వెళ్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు ఆపి లైసెన్స్‌ అడిగారు. అప్పుడు మీ దగ్గర లైసెన్స్‌ లేకున్నా డిజిలాకర్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న డిజిటల్ కాపీని చూపించవచ్చు. ఇలా అవసరమైన దగ్గరల్లా అవసరమైన పత్రాలను మీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.
ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..

ముందుగా మీ ఫోన్‌లో డిజీలాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగా వచ్చే ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ ఆధార్‌కార్డ్‌ లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ పై క్లిక్‌ చేసి అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి.తర్వాత ఆధార్‌ నంబర్‌ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్‌- ఇన్‌ అవగానే మీ ఆధార్‌ కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి.

పైన కుడివైపున మీ ఫొటో కనిపిస్తుంది. యాప్‌లో కింద ఉన్న సెర్చ్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్‌ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్‌ నంబర్‌, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్‌ చేసి డాక్యుమెం ట్లు పొందొచ్చు. వీటితో పాటు పాన్‌, రేషన్‌.. లాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలు కింద ఉన్న ఇష్యూడ్‌లో దర్శనమిస్తాయి. మాన్యువల్‌గా కూడా అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Cheque Bounce Rules: చెక్ బౌన్స్‌ కావడానికి కారణాలు ఏమిటి? మీపై బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది!

యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తర్వాత చెక్కు వినియోగం పరిమితం అయిపోయింది. కానీ దాని ఉపయోగం ఇప్పటికీ ముగియలేదు. నేటికీ చాలా మంది చెక్కుల ద్వారానే పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు.

ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు వచ్చినా చెక్‌లను ఉపయోగించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అదే సమయంలో చాలా మంది చెక్‌లు రద్దు అవుతుంటాయి. చెక్‌ లేకుంటే కొందరికి పనులు జరగవు. అయితే, చెక్కు ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు మీ చిన్న పొరపాటు చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉన్నందున దానిని చాలా జాగ్రత్తగా నింపాల్సిన అవసరం ఉంది. బౌన్స్‌ అయిన చెక్కు అంటే ఆ చెక్కు నుండి డబ్బు రావాల్సిన వ్యక్తి దానిని పొందలేకపోతాడు.

బ్యాంకింగ్ భాషలో చెక్ బౌన్స్‌ని డిషనోర్డ్ చెక్ అంటారు. చెక్ బౌన్స్ మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 ప్రకారం.. చెక్ బౌన్స్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే నిబంధన ఉంది. అయితే చెక్‌ బౌన్స్‌ అయితే బ్యాంకులు మొదట ఈ తప్పును సరిదిద్దడానికి మీకు అవకాశం ఇస్తాయి. చెక్కు బౌన్స్ అవడానికి గల కారణాలు, అటువంటి సందర్భంలో ఎంత జరిమానా విధించబడుతుందో, కేసు తలెత్తినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

చెక్ బౌన్స్‌కు ఇవే కారణాలు:

ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు
సంతకం సరిగ్గా లేకపోవడం
స్పెల్లింగ్‌లో తప్పు
ఖాతా నంబర్‌లో పొరపాటు
చెక్‌ రైటింగ్‌లో తప్పుగా ఉండటం
చెక్ జారీచేసేవారి ఖాతాను మూసివేయడం
నకిలీ చెక్కు అందించడం
చెక్కు మొదలైన వాటిపై కంపెనీ స్టాంపు లేకపోవడం
చెక్ బౌన్స్ తప్పును సరిదిద్దడానికి అవకాశం

మీ చెక్కు బౌన్స్ అయి మీపై కేసు పెట్టడం జరగదు. మీ చెక్కు బౌన్స్ అయినట్లయితే బ్యాంకు ముందుగా దాని గురించి మీకు తెలియజేస్తుంది. దీని తర్వాత మీకు 3 నెలల సమయం ఉంటుంది. దీనిలో మీరు రెండవ చెక్కును రుణదాతకు ఇవ్వవచ్చు. మీ రెండవ చెక్ కూడా బౌన్స్ అయితే, రుణదాత మీపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

చెక్ బౌన్స్‌పై బ్యాంకులు ఎంత జరిమానా వసూలు చేస్తాయి?

చెక్ బౌన్స్ అయితే బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తాయి. చెక్కు జారీ చేసిన వ్యక్తి జరిమానా చెల్లించాలి. కారణాలను బట్టి ఈ జరిమానా మారవచ్చు. ఇందుకోసం ఒక్కో బ్యాంకు ఒక్కో మొత్తాన్ని ఫిక్స్ చేస్తుంది. సాధారణంగా జరిమానా రూ.150 నుండి రూ.750 లేదా 800 వరకు ఉంటుంది.

కేసు ఎప్పుడు వస్తుంది?

మీరు ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాకపోయినా కేసు నమోదు చేయవచ్చు. చెక్ బౌన్స్ అయినప్పుడు బ్యాంకు మొదట రుణదాతకు రసీదుని ఇస్తుంది. అందులో చెక్ బౌన్స్‌కు కారణం వివరిస్తుంది. దీని తర్వాత రుణదాత 30 రోజులలోపు రుణగ్రహీతకు నోటీసు పంపవచ్చు. నోటీసు ఇచ్చిన 15 రోజులలోపు రుణగ్రహీత నుండి స్పందన రాకపోతే రుణదాత కోర్టుకు వెళ్లవచ్చు. రుణదాత ఒక నెలలోపు మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. దీని తరువాత కూడా అతను రుణగ్రహీత నుండి మొత్తం పొందకపోతే అతను అతనిపై కేసు పెట్టవచ్చు. నేరం రుజువైతే, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

Xavier: సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడే ఈ మీమ్ స్టార్ ఎవరో తెలుసా?

జేవియర్.. జేవియర్ అంకుల్ పేరుతో ఎక్కువగా అనేక ఫన్నీ మీమ్స్ వస్తుంటాయి. ఆ మీమ్స్ లో ఈ వ్యక్తి నవ్వుతూ, కొంచెం సీరియస్ ముఖంతో కనిపిస్తాడు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడే వారికి ఇతని మీమ్స్ గురించి బాగా తెలుస్తుంది.

జేవియర్ అనే పేరుతో మీమ్స్ బాగా వైరల్ అవుతుంటాయి. అచ్చం భారతీయుడిలా మీసాలున్న ఈ వ్యక్తి ఫేస్ బుక్, ట్విట్టర్, రెడ్డిట్ వంటి మాధ్యమాల్లో దర్శనమిస్తాడు. మీమ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 9గ్యాగ్ అనే మీమ్స్ వెబ్ సైట్ లో కూడా ఈయన కనబడతాడు. ఇతని ఫోటో మీద అనేక మీమ్స్ వచ్చాయి. వస్తున్నాయి. ఇప్పటికీ అవి వైరల్ అవుతున్నాయి. ఇతను ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే ఈ మీమ్ స్టార్ గురించి చాలా మందికి తెలియదు. అతని అసలు పేరు ఏంటో? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో అనేది తెలియదు.

నిజానికి అతని పేరు జేవియర్ కాదు. అతని అసలు పేరు ఓం ప్రకాష్ అట. ఈయన 1968లో అక్టోబర్ 22న జన్మించాడని తెలుస్తోంది. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. ఐఐటీ కాన్పూర్ లో స్టాఫ్ మెంబర్ అని సమాచారం. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జేవియర్ మీమ్స్ ఇంతలా పాపులర్ అవ్వడం వెనుక ఉన్నది పకాలు పపీటో అనే పేరు. పకాలు పపీటో పేరుతో ఫిక్షనల్ క్లర్క్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది ఈ ఓం ప్రకాష్ నే. ఆయన క్రియేట్ చేసిన కామిక్ మీమ్స్ తో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోవర్స్, ట్విట్టర్ లో 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. పపీటో అమెరికాలో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్టు పెట్టాడు. కానీ నిజానికి అతనొక భారతీయ వ్యక్తి. నో యువర్ మీమ్స్ అనే వెబ్ సైట్ ప్రకారం.. పకాలు పపీటో 2013లో జూలై 12న ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఆ సమయంలో అతను ‘హలో ట్విట్టర్ ఐ యామ్ సింగిల్’ అని తొలి ట్వీట్ చేశాడు.

రెండేళ్లలో ఈ ట్వీట్ ని 17 వేల మంది రీట్వీట్ చేశారు. 6 వేల మంది లైక్ చేశారు. 7,39,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఈయన చేసే ట్వీట్స్.. ట్విట్టర్ రూల్స్ కి విరుద్ధంగా ఉందన్న కారణంతో 2018లో ఇతని ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. 2013 సెప్టెంబర్ 2న ఫేస్ బుక్ పేజ్ ఒకటి తెరిచాడు. అయితే ఈ పేజ్ కూడా డిలీట్ అయిపోయింది. దీని తర్వాత @pakalupapitow పేరుతో ఒక కాపీ క్యాట్ అకౌంట్ ఒకటి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ అకౌంట్ ద్వారా అచ్చం పకాలు పపీటో స్ట్రాటజీని అనుసరించి ఫన్నీ మీమ్స్ పోస్ట్ అయ్యేవి. అయితే ఇది పకాలు పపీటో ఖాతానా? కాదా? అనేది ఇప్పటికీ అనుమానమే. ఆ తర్వాత ఈ పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత జేవియర్, జేవియర్ అంకుల్ ఇలా కొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి.

పపీటో స్ట్రాటజీని అనుసరించి జేవియర్ మీమ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా ఈ జేవియర్ పేరుతో మీమ్స్ కనిపిస్తాయి. అవి చదివితే చాలా నవ్వు తెప్పిస్తాయి. జేవియర్ మీమ్స్ లో ఒక జోక్ గురించి మాట్లాడుకోవాలి. 80 శాతం అబ్బాయిలు సిగరెట్ తాగే అమ్మాయిలని ఇష్టపడతారట. దానికి జేవియర్ ఇచ్చిన సమాధానం వింటే ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో అర్థమవుతుంది. ‘సిగరెట్ తాగే అమ్మాయిలు త్వరగా చనిపోతారు. ఆమె చనిపోయాక వేరే అమ్మాయిని చూసుకోవచ్చు. అందుకే అబ్బాయిలు సిగరెట్ తాగే అమ్మాయిలని లవ్ చేస్తారు’ అని సమాధానం ఉంటుంది. ఇలా ఉంటాయి జేవియర్ జోక్స్. ఇదీ జేవియర్ మీమ్స్, జోక్స్ వెనుక ఉన్న కథ.

Car Cleaning Cloth:ఈ క్లాత్ ఉంటే చాలు.. కారు ఎప్పుడు కొత్త కారులా ఉంటుంది

Car Cleaning Cloth:ఈ క్లాత్ ఉంటే చాలు.. కారు ఎప్పుడు కొత్త కారులా ఉంటుంది .. కారు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

ఇప్పుడు చెప్పే cloth ఉంటే car శుభ్రం చేయటం చాలా సులువు. చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

ఈ మైక్రోఫైబర్ క్లాత్ ని చాలా సార్లు వాడుకోవచ్చు. చాలా మన్నిక కలది. ఈ క్లాత్ 70% పాలిస్టర్ మరియు 30% పాలిమైడ్ తో తయారు చేయబడింది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.

Car Cleaning Cloth

https://amzn.to/3JX2oEj

ఓటేయడం కోసం దంపతులు సాహసం.. హైదరాబాద్‌ నుంచి 500 కిమీ స్కూటీపై వెళ్లి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్‌ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఓటింగ్‌ జరుగుతుంది. ఓటేసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక ప్రతి ఒక్కరు ఓటు వేయాలని.. కచ్చితంగా తమ హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పదే, పదే చెబుతుంది. ఓటు హక్కు వినియోగం గురించి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తుంటారు. ఇక నేడు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ హైదారబాద్‌లో సెటిలైన ఏపీ ఓటర్లు సొంత ఊర్లకు క్యూ కట్టారు.. మూడు రోజులు ముందుగానే సొంత గ్రామాలకు చేరుకున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలన్నీ ఫుల్లు రద్దీగా మారాయి.. ఈ క్రమంలో ఓ భార్యాభర్తలు ఓటు వేయడం కోసం హైదారాబాద్ నుంచి దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించి సొంత ఊరికి వెళ్లారు. వారి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇంతకు ఎవరా జంట అంటే..

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన లక్ష్మణరావు.. హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో.. ఓటు వేయడానికి లక్ష్మణ రావు.. తన భార్య కనకలక్ష్మితో కలిసి సొంత ఊరుకి వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి శనివారం ఉదయం 5 గంటలకే బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బస్సులు ఫుల్లు రద్దీగా ఉన్నాయి.. బస్సు కోసం ఉదయం 10 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. కానీ ఒక్క బస్సులో కూడా సీటు దొరకలేదు. అయినా సరే ఆ దంపతులు ఓటు వేయడానికి సొంత ఊరు వెళ్లాల్సిందేనని ఫిక్స్ అయ్యారు.

బస్సులు, రైళ్లు రద్దీగా ఉన్నాయి.. మరి ఏం చేయాలి.. ఊరికి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుండగా వారికి కనిపించిన పరిష్కారం.. స్కూటీ. ఈ ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే భార్యాభర్తలు తమ దగ్గర ఉన్న కైనటిక్‌ హోండాపై సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రయాణం ప్రారంభించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి ఆగి విశ్రాంతి తీసుకుంటూ తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా మెల్లిగా రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు.

అక్కడ రెండు గంటల పాటూ నిద్రపోయారు.. మళ్లీ ప్రయాణం ప్రారంభించి ఆదివారం ఉదయం 6 గంటలకు రామచంద్రాపురం చేరుకున్నారు. అక్కడ బంధువుల ఇంట్లో టిఫిన్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ బయల్దేరి ఉదయం 9 గంటలకు సొంత ఊరు కొంకుదురు చేసుకున్నారు. పక్కనే పోలింగ్‌ కేంద్రం ఉన్నా సరే.. ఓటు వేయకుండా బద్దకించే వాళ్లకు ఈ దంపతులు ఆదర్శం అని చెప్పాలి. ఏకంగా 500 కిలోమీటర్లు.. అది కూడా బైక్‌ మీద ప్రయాణించి సొంత ఊరికి వెళ్లి ఓటేస్తున్నారంటే.. రాష్ట్రం పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది అంటున్నారు.

మ్యాథమెటిక్స్‌లో మ్యాజిక్‌ నంబర్‌ ఏదో తెలుసా..? మన భారతీయుడే కనిపెట్టాడు!

ఇప్పటి వరకు ప్రపంచంలో గణితశాస్త్రానికి సంబంధించి చాలా అరుదైన ఆవిష్కరణలు జరిగాయి. ప్రఖ్యాత మ్యాథమెటీషియన్లు కొన్ని సంఖ్యల ప్రత్యేకతను వివరించారు.

వీటికి ఆ గణిత శాస్త్రవేత్తల పేర్లే పెట్టారు. ఉదాహరణకు 1729ని ప్రఖ్యాత భారత గణిత శాస్త్రవేత్త రామానుజన్‌ మ్యాజిక్‌ నంబర్‌గా పేర్కొంటారు. రెండు విభిన్న సంఖ్యల ఘనాల మొత్తం (1729 = 10^3 + 9^3 = 1000 + 729, 1729 = 12^3 + 1^3 = 1728 + 1) 1729 అవుతుంది. ఈ లక్షణం మరే సంఖ్యకూ లేదు. అలానే 1949లో చెన్నైలో జరిగిన గణిత సదస్సులో, గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఆర్ కప్రేకర్.. ‘కప్రేకర్ స్థిరాంకం'(Kaprekar Constant)గా పేర్కొనే ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన మ్యాజిక్‌ నంబర్‌ 6174.

ఈ నంబర్‌, నాలుగు అంకెల సంఖ్య ఆరోహణ, అవరోహణ క్రమాన్ని తీసివేసిన తర్వాత మళ్లీ రిపీట్‌ అవుతుంది. ఇటీవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారం క్వోరా(Quora)లో 6174ను మ్యాజిక్‌ నంబర్‌గా ఎందుకు పరిగణిస్తారు? అని ఓ యూజర్‌ క్వశ్చన్‌ పోస్ట్‌ చేశారు. చాలా మంది యూజర్లు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కప్రేకర్ స్థిరాంకంతో దాని అనుబంధం కారణంగా మ్యాజికల్ నంబర్‌ అయిందని పేర్కొన్నారు.

ప్రాథమిక నియమాలు

6174 మ్యాజిక్‌ను మ్యాథమెటికల్‌ ఈక్వేషన్‌, కప్రేకర్ రొటీన్ అని పిలిచే ప్రక్రియ ద్వారా అర్థం చేసుకోవచ్చు. 6174కి మ్యాజికల్‌ స్టేటస్‌ అందించే ప్రాథమిక నియమాలు కొన్ని ఉన్నాయి.

ముందు నాలుగు అంకెల సంఖ్యను తీసుకోండి. అందులో కనీసం రెండు విభిన్న అంకెలు ఉండాలి. అవసరమైతే సున్నాలను జోడించండి. ఈ అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చండి. తర్వాత పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేయండి. పొందిన ఫలితంతో ఈ విధానాన్ని రిపీట్‌ చేయండి. కప్రేకర్ రొటీన్‌ స్థిరంగా గరిష్టంగా ఏడుసార్లు రిపీట్‌ అయిన తర్వాత దాని స్థిరమైన పాయింట్ 6174కి చేరుకుంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణతో ఈ మ్యాజిక్‌ని పరిశీలిద్దాం

ఉదాహరణకు మీకు నాలుగు అంకెల సంఖ్య 1234ని తీసుకోండి. దీన్ని అవరోహణ క్రమంలో అమరిస్తే 4321 అవుతుంది. ఆరోహణ క్రమంలో 1234 వస్తుంది. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేస్తే (4321-1234) 3087 వస్తుంది. ఇదే ప్రాసెస్‌ను రిజల్ట్‌ 3087తో రిపీట్‌ చేస్తే 8352 (8730-378) వస్తుంది. ఈ ప్రాసెస్‌ రిపీట్‌ చేస్తూ ఉంటే చివరకు 6174 వస్తుంది. 6174తో ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరికి ఫలితం అదే నంబర్‌ వస్తుంది. కప్రేకర్ రొటీన్‌ ఎల్లప్పుడూ గరిష్టంగా ఏడు రిపిటీషన్లలో స్థిరమైన పాయింట్ 6174కి చేరుకుంటుంది.

ఆ సంఖ్యలకు వర్తించదు

6174 ప్రత్యేకత ఏమిటంటే, ఈ పద్ధతిని ఎన్నిసార్లు రిపీట్‌ చేసినా ఫలితం అదే నంబర్‌ వస్తుంది. ఉదాహరణకు 8532- 2358= 6174కి సమానం, 6174తో అదే విధానాన్ని అప్లై చేస్తే 6174 వస్తుంది. ఈ ప్యాటర్న్‌ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే 6174 మ్యాజిక్‌ నంబర్‌ అయింది. 1111 లేదా 4444 వంటి రెప్డిజిట్‌లను ఉపయోగిస్తే, కప్రేకర్ రొటీన్‌ 6174 ఫలితాన్ని చేరుకోలేదని గమనించాలి. ఈ నిర్దిష్ట కేసులు కప్రేకర్ స్థిరాంకానికి మినహాయింపులు.

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) లండన్ పర్యటనపై (London Tour) నేడు సీబీఐ కోర్టులో (CBI Court) తీర్పు వెలువడనుంది.
యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ (CM Jagan) విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని.. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నట్లు జగన్ చెప్పారు.

అయితే జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ (CBI) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వద్దని సీబీఐ వాదించింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇరువురి వాదనలు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో జగన్ లండన్ పర్యటనపై తీర్పు వెలువడనుంది. జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా?.. ఇవ్వదా? అనే ఉత్కంఠ నెలకొంది.

Pavitra Jayaram: పవిత్రా జయరామ్ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదట.. పూసగుచ్చినట్లు చెప్పిన భర్త!

త్రినయని సీరియల్ లో తిలోత్తమగా కనిపించి అందరనీ మెస్మరైజ్ చేసిన నటి పవిత్రా జయరామ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె తాజాగా ప్రాణాలు కోల్పోయింది. అయితో ఈమె రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయిందనేదని అందరికీ తెలిసిందే. కానీ ఆమె మృతికి యాక్సిడెంట్ కారణం కాదట. ఆమె చనిపోవడానికి అసలైన కారణం వేరే ఉందట. అయితే ఆ విషయాన్ని నేరుగా ఆమె భర్త చల్లా చంద్రకాంత్ యే రివీల్ చేశారు. ఆమె ఎలా, ఎందుకు చనిపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం రోజు అంటే మే 12వ తేదీ రోజు.. పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే హైదరాబాద్ లోనే ఉంటూ సీరియల్స్ చూసుకునే ఈమె.. తన సొంతూరు కర్ణాటకకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతల్లి డివైడర్ ను ఢీకొట్టింది. ఇది జరుగుతుండగానే.. కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అలా రోడ్డు ప్రమాదానికి గురైన ఈమె ప్రాణాలు కోల్పోయిందని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా ఆమె భర్త చల్లా చంద్రకాంత్ స్పందించారు. తన భార్య మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని చెప్పుకొచ్చారు. అయితే రోడ్డు ప్రమాదం జరుగుతున్న సమయంలో తనతో పాటు తన భార్య పవిత్రా జయరామ్, వాళ్ల అక్కకూతురు మరో అమ్మాయి కూడా కారులో ఉన్నట్లు చెప్పారు. డ్రైవర్ ఉండడంతో తాను పడుకున్నాని.. అయితే అర్థరాత్రి 12.30 నిమిషిలాకు ఓ ఆర్టీసీ బస్సు ఎడమై వైపు నుంచి ఓవర్ టేక్ చేసిందని చల్లా చంద్రకాంత్ వెల్లడించారు.

దీంతో డ్రైవర్ కారును కుడికి తిప్పాడని.. అలా ఓ డివైడర్ ను ఢీకొట్టినట్లు వివరించారు. అలా కారు ముందుభాగంలోనే విండ్ షీల్డ్ ముక్కలు అయిపోయిందని చంద్రకాంత్ వివరించారు. అయితే ఈ ప్రమాదంలో తనకు మాత్రమే ఎక్కువ గాయాలు అయ్యాయని.. పడిపోయినట్లు చెప్పారు. అయితే మిగతా వారికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని.. ముఖ్యంగా తన భార్య పవిత్రా జయరామ్ కు ఏమీ కాలేదని చెప్పుకొచ్చాడు.

కానీ ప్రమాదం జరిగిన తీరు చూసి.. ముఖ్యంగా తనకు గాయాలు కావడం చూసి తాను షాక్ అయిందని.. ఆ షాక్ వల్లే తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని… అలా చనిపోయిందని తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో ఏమాత్రం గాయాలు కాకుండా బయట పడ్డ గుండెపోటు వల్ల మరణించడం నిజంగా బాధాకరం అని.. భార్య మృతిని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.

Success story: ఒకప్పుడు ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్..నేడు కోట్ల రూపాయల కంపెనీలకు ఓనర్.. ఇది

చిన్న ఉద్యోగి స్థాయి నుంచి కంపెనీలను ఏర్పాటు చేసేంత ఎదగటం అంటే అంత సులువు కాదు. ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, దృఢ సంకల్పంతో అంకితభవంతో పనిచేస్తే గమ్యాన్ని చేరుకోకుండా వారిని ఎవరూ ఆపలేరు.

ఈ విషయాన్ని మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాసి దాదాసాహెబ్ భగత్ నిరూపించారు. భగత్ ఒకప్పుడు ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో ప్యూన్‌గా పనిచేసేవాడు. అతిథులకు టీ, నీళ్లు అందించేవాడు. పూణెలో ఐటీఐ కోర్సు చేసిన తర్వాత నెలకు రూ.9వేలకు ఈ ఉద్యోగం చేశాడు భగత్. కానీ, పెద్దగా ఏదైనా చేయాలనే తన కలను నెరవేర్చుకోవాలనే ఆలోచనను మాత్రం వదులుకోలేదు. పగలు ప్యూన్‌గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు సెంటర్‌కి వెళ్లేవాడు. నేడు దాదాసాహెబ్ భగత్ నిన్త్‌మోషన్(Ninthmotion),డూగ్రాఫిక్స్( DooGraphics) అనే రెండు కంపెనీలకు యజమాని అయ్యాడు.

దాదాసాహెబ్ భగత్ 1994లో మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించారు. అతని కుటుంబం చెరుకు తోటల్లో కూలీ పనులు చేసేది. చిన్నతనంలో భగత్ కూడా పొలాల్లో కూడా పని చేయాల్సి వచ్చేది. స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివిన భగత్.. ఆ తర్వాత ఐటీఐ చదువు పూర్తి చేసేందుకు పూణే వెళ్లాడు. ఐటీఐ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు.

ఎదగాలనే కోరిక

దాదాసాహెబ్ భగత్ ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్‌గా ప్రతినెలా రూ.9,000 సంపాదించేవారు. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. తాను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పగలు పని చేస్తూ, రాత్రిపూట ఒక సెంటర్‌లో గ్రాఫిక్స్ డిజైనింగ్,యానిమేషన్ కోర్సు చేశాడు. కోర్సు పూర్తయ్యాక ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు సి++, పైథాన్‌లో కోర్సు చేశారు.

ప్రమాదం జరిగినా

అనేక విజువల్ ఎఫెక్ట్‌లను రూపొందించడానికి చాలా సమయం పడుతుందని, పునర్వినియోగ టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం అద్భుతంగా ఉంటుందని గ్రహించాడు. అలా డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత అతను ప్రమాదానికి గురయ్యాడు. దీంతో చాలా నెలలు మంచం మీద ఉండవలసి వచ్చింది. కానీ, భగత్ ధైర్యం కోల్పోలేదు. మంచం మీద కూర్చొని డిజైన్‌లు,టెంప్లేట్లు తయారు చేయడం కొనసాగించాడు. వీటిని అమ్మి ఉద్యోగంలో సంపాదించినదాని కంటే ఎక్కువ సంపాదించాడు. 2015లో నింత్‌మోషన్ అనే స్టార్టప్‌ని ప్రారంభించాడు. కొద్దికాలానికే, 6,000 మంది కస్టమర్‌లు అతనితో చేరారు.

లాక్‌డౌన్ సమయంలో

దాదాసాహెబ్ ఆన్‌లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో పని చేస్తూనే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. గ్రామంలోని గోశాలలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2020 సంవత్సరంలో, అతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు.

దీనితో పాటు, అతను తన రెండవ కంపెనీ DooGraphics Pvt. లిమిటెడ్ ప్రారంభించారు. ఒకప్పుడు రూ.9వేలకు పనిచేసిన దాదాసాహెబ్ నేడు లక్షలు సంపాదిస్తున్నాడు. 26 సెప్టెంబర్ 2020న ప్రధాని మోదీ కూడా దాదాసాహెబ్ యొక్క పనిని,అంకితభావాన్ని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు.

Viral video: ఇదేం పాడు పని! ప్రజారవాణా బస్సులో రెచ్చిపోయిన ప్రేమికులు.. వీడియో ఇదిగో!

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణా బస్సులోని జంట అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఓ ప్రేమ జంట బస్సు వెనుక సీట్లో దగ్గరగా కూర్చోని రొమాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. పక్కనే ఉన్న వేరొక మహిళ వారిని చూసి కొంత ఇబ్బందికి లోనవుతుంది. అయిన కూడా బస్సులో పబ్లిక్ ముందు ఇద్దరు రెచ్చిపోతూ ప్రవర్తించారు.

ఇది గమనించిన తోటి ప్రయణికుడు వారిని వీడియో తీశాడు. ఇది ఢిల్లీలో జరిగిన ఘటనగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పబ్లిక్ బస్సులో అలా చేయడంపై ఫైర్ అయ్యారు. ఫ్రీడం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

ఏపీలో పోల్ పర్సంటేజ్.. కుస్తీలు పడుతున్న విశ్లేషకులు

ఏపీలో గెలుపెవరిదైనా మెజార్టీ స్వల్పంగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే ఆ మెజార్టీ ఎవరికి వస్తుందనే విషయంలో మీడియా ఛానెళ్లు, విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలిస్తున్నారు.

మొత్తంగా అందరూ ఒక అంచనా దగ్గర మాత్రం ఆగిపోయారు. పోల్ పర్సంటేజ్ పెరిగితే ప్రతిపక్షానికి లాభం, గతంలో లాగే పోల్ పర్సంటేజ్ ఉన్నా, అంతకంటే తక్కువ ఉన్నా కూడా అది అధికార పార్టీకే లాభం అంటున్నారు.

ఏపీలో పోల్ పర్సంటేజ్ ఎంత..?

2014లో ఏపీలో పోలింగ్ శాతం 77.96

2019 ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ 79.64

ఈసారి పోలింగ్ శాతం అంతకంటే తక్కువ అని తేలిపోయింది. సోమవారం అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో 76.5 శాతం పోలింగ్ నమోదైంది. మహా అయితే మరో రెండు శాతం పెరగొచ్చని అంచనా. ఈ దశలో ప్రభుత్వంపై నెగెటివ్ ఓటింగ్ ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు విశ్లేషకులు.

ఆ లెక్కలు వేరే ఉన్నాయా..?

ఈ ఏడాది ఓటరు జాబితాలో చాలా సవరణలు జరిగాయని, మరణాలు, డూప్లికేట్ లిస్ట్ పూర్తిగా తొలగించారని, అందుకే పోల్ పర్సంటేజ్ అనుకున్నదానికంటే కాస్త పెరిగినట్టు ఉందని మరో విశ్లేషణ వినపడుతోంది. అది కూడా నిజమైతే.. చివరి లెక్కలను మరింతగా సవరించాల్సి ఉంటుంది. అంటే పోల్ పర్సంటేజ్ పెరగడం కేవలం ఊహాజనితమే. ఓటరు పోటెత్తాడు, దండెత్తాడు అనే డైలాగులన్నీ అవాస్తవం. పోలింగ్ కి రిజల్ట్ కి ఈసారి ఎక్కువ గ్యాప్ ఉండటంతో టీవీల్లో కనపడే విశ్లేషకులను మరో 20రోజుల పాటు ప్రేక్షకులు భరించక తప్పదు.

YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!

Cross Voting: కడపలో సంచలనం నమోదు కానుందా.. జగన్ ఆశలు సగమే నెరవేరనున్నాయా.. వైఎస్సార్ రక్తం పంచుకుని బిడ్డలకు ఓటర్లు తమ ఓటును కూడా పంచుతున్నారా..

ఔననే అంటున్నారు పరిశీలకులు. కడప జిల్లా ఓటర్లు వైఎస్సాఆర్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఓటును వైసీపీకి.. కడప లోక్ సభ ఓటును వైఎస్ షర్మిలకు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

వైఎస్సార్‌ కూతురుగా, జగన్ చెల్లెలుగా షర్మిల సరికొత్త వ్యూహంతో రాజకీయం చేస్తున్నారని.. వ్యవహారాలను చక్కగా.. తెలివిగా నడిపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లి వైఎస్‌ విజయమ్మ పిలుపు కూడా షర్మిలకు మద్దతు తెలపడం కలిసి వస్తోందంటున్నారు. ఎవరు ఓడినా కూడా వేరే సందేశం వెళ్తుందనే భావనతో కడప ఓటర్లు వైఎస్ వారసులకు చెరిసగం ఓట్లు ఇచ్చారని చర్చ జరుగుతోంది. కడప లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న షర్మిలకు వైఎస్సార్‌ ఓటర్ల మద్దతు పెరిగినట్టు సమాచారం.

దీనికితోడు రాహుల్ గాంధీ ప్రచారం, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఎన్నికల ప్రచారం కూడా షర్మిలకు తోడయిందని భావిస్తున్నారు. అనిల్‌ కారణంగా క్రైస్తవ వర్గమంతా షర్మిల వెంట నడుస్తోంది. క్రైస్తవ వర్గమంతా ఓట్లన్నీ షర్మిలకు పడుతున్నాయని పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి అభిమానులు, వారసులు కూడా షర్మిలకు అండగా నిలుస్తున్నారు. కాగా ఇవన్నీ వైఎస్సార్‌సీపీకి చేటు చేసే అవకాశం ఉంది. జగన్‌పై అభిమానంతోపాటు సంక్షేమ పథకాలు కడప ఓటర్లు అసెంబ్లీకి పడగా.. లోక్‌సభ విషయానికి వస్తే మాత్రం ఓటర్లు, వైఎస్ కుటుంబ అభిమానులు మాత్రం షర్మిలకు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.

Vastu Tips for Plants: ఇంటి బయట మామిడి చెట్టు నాటడం శుభమా? అశుభమా?

Vastu Tips for Plants: ప్రతి ఒక్కరూ ఇంటి బయట చెట్లు, మొక్కలు నాటేందుకు ఇష్టపడతారు. కానీ ప్రతి మొక్క యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. ఒక చెట్టును నాటడం ద్వారా కొన్ని కుటుంబాలు సుభిక్షంగా మారితే మరికొన్ని పేదరికంలో మునిగిపోతాయి. మామిడితో సహా అటువంటి 6 మొక్కల గురించి వాటి శుభ, అశుభ ప్రభావాల గురించి తెలుసుకుందాం.

1. ఉసిరి మొక్క

మత పండితుల ప్రకారం, ఉసిరి చెట్టు విష్ణువుకు చాలా ప్రియమైనది. ఇక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. ఈ చెట్టు అన్ని కోరికలను నెరవేరుస్తుందని భావిస్తారు. ఈ చెట్టు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటినప్పుడే మంచి లాభాలను ఇస్తుంది.

2. అశోక చెట్టు

అశోక చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఇంటికి కాపలాగా పనిచేస్తుంది. ఈ చెట్టును నాటిన ఇంట్లో పరస్పర సామరస్యం, సంతోషం, శాంతి నెలకొంటాయని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంటి బయట అశోక వృక్షాన్ని నాటడం వల్ల ఇతర అశుభ వృక్షాల దుష్ఫలితాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

3. శమీ మొక్క

వాస్తు శాస్త్రంలో, శమీని శుభ ప్రభావాలను ఇచ్చే మొక్కగా పరిగణిస్తారు. శమీ మొక్కను పూజించడం ద్వారా శని దేవుడి అనుగ్రహం కుటుంబంపై ఉంటుందని నమ్ముతారు. అయితే ఇంటి మెయిన్ గేటుకు ఎడమవైపున కొంచెం దూరంలో దాని నీడ ఇంటిపై పడకుండా అమర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాత్రమే ఇది ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

4. మామిడి చెట్టు

మామిడి చెట్టును పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. ఇది పిల్లలకు హానికరంగా పరిగణించబడుతుంది. దీనికి కారణం మామిడికాయలు కోయాలనే అత్యాశతో పిల్లలు చెట్టు ఎక్కి గాయపడవచ్చు లేదా దారిన వెళ్లేవారు మామిడి కాయలు కోయడానికి రాళ్లు విసరడం వల్ల ఎవరైనా గాయపడవచ్చు.

5. అరటి చెట్టు

వాస్తు శాస్త్రంలో, ఇంటి లోపల లేదా వెలుపల అరటి చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో విష్ణువు ఉంటాడని చెబుతారు. ప్రతి గురువారం పూజ చేస్తారు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తి అరటిచెట్టు కింద కూర్చుని చదువుకుంటే మేధావి అవుతాడని నమ్మకం.

6. అశ్వగంధ మొక్క

అశ్వగంధ ఒక ఆయుర్వేద మొక్క. ఇది వాస్తు శాస్త్రంలో కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో కలహాలు ఏర్పడితే కేతువును శాంతింపజేయడానికి అశ్వగంధ మూలాన్ని తన ఇంటి గుడిలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి.

మెగా ఫ్యామిలీ రచ్చ.. బన్నీపై నాగబాబు ఘాటు ట్వీట్

ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చుపెట్టాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నా ఈసారి అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయి. అల్లు వారి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయి. తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా అసలు విషయం చెప్పారు నాగబాబు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది. రావడమే కాదు, తన స్నేహితుడ్ని గెలిపించాలని కూడా బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. జనసైనికులకు కోపం వచ్చింది.

అంతా అయిపోయాక.. అప్పటికప్పుడు అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారు. ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాకిచ్చే ప్రమాదం ఉంది. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారు నాగబాబు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మొదలైంది. మెగా ఇమేజ్ నుంచి మెల్ల మెల్లగా పక్కకు వచ్చి తనకంటూ ఓ సొంత ఇమేజ్ సృష్టించుకుని ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. అందుకే ఆయన ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపెడతారా..? వేచి చూడాలి.

Roja: YSRCP వాళ్లే TDPకి ఓటెయ్యమంటున్నారు

Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి రోజా షాకింగ్ కామెంట్స్ చేసారు. తనకు నగిరిలో తెలుగు దేశం పార్టీ వాళ్లతో ఎలాంటి సమస్యలు లేవని..
కానీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్ట్‌లు తీసుకున్నవాళ్లు నగిరిలోని అన్ని బూత్‌లు తిరిగి మరీ తెలుగు దేశం పార్టీ వారికి ఓటెయ్యాలని చెప్తున్నారని అన్నారు. కేజే కుమార్ వంటి వాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో జగన్ మోహన్ రెడ్డిని పలకరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్నారని.. మరోపక్క తెలుగు దేశం పార్టీ వాళ్లకు ఓటెయ్యాలంటూ సైకిల్ ఎక్కి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసారు.

AP Assembly Polls: ఓ వైపు భర్త మృతి.. బాధలోనూ ఓటు మరువని భార్య

కొంతమంది ఓటుని చాలా పవిత్రమైన హక్కుగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరతారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు.

బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన గర్నెపూడి చిట్టెమ్మ కూడా ఆ కోవకు చెందుతారు. చిట్టెమ్మ భర్త సింగయ్య(62) పోలింగ్ రోజైన సోమవారం చనిపోయారు. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో చిట్టెమ్మ దుఃఖంలో మునిగిపోయారు. అయినప్పటికీ బాధను దిగమింగుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆమె ఓటు వేశారు. 178వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ఆమె చాటి చెప్పారు.

కాగా గ్రామంలో చిట్టెమ్మ వీవోఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె దుఃఖంలోనూ వెళ్లి ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయమంటూ అభినందనలు వెల్లువెత్తున్నాయి.

AP Assembly Polls: ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా జాబితా ఇదే

చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్‌లో ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసింది.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
అల్లూరి సీతారామరాజు – 63.19 శాతం
అనకాపల్లి – 81.63 శాతం
అనంతపురం – 79.25 శాతం
అన్నమయ్య – 76.12 శాతం
బాపట్ల – 82.33 శాతం
చిత్తూరు – 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ – 83.19 శాతం
తూర్పు గోదావరి – 79.31 శాతం
ఏలూరు – 83.04 శాతం
గుంటూరు – 75.74 శాతం
కాకినాడ – 76.37 శాతం
కృష్ణా – 82.20 శాతం
కర్నూలు – 75.83 శాతం
నంద్యాల – 80.92 శాతం
ఎన్టీఆర్ – 78.76 శాతం
పల్నాడు -78.70 శాతం
పార్వతీపురం మన్యం – 75.24 శాతం
ప్రకాశం – 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు – 78.10 శాతం
శ్రీ సత్యసాయి – 82.77 శాతం
శ్రీకాకుళం – 75.41 శాతం
తిరుపతి – 76.83 శాతం
విశాఖపట్నం – 65.50 శాతం
పశ్చిమ గోదావరి -81.12 శాతం
వైఎస్సార్ – 78.12 శాతం

ఫేక్ సర్టిఫికెట్‌తో MBBS చేసిన పేద విద్యార్థి.. హైకోర్టు సంచలన తీర్పు

చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు, జాబ్ కోసం అప్లై చేసేవాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకుంటారు. అయితే ఓ యువకుడు ఎంబీబీఎస్ అవ్వాలన్న కలను నిజం చేసుకోవడం కోసం ఫేక్ సర్టిఫికెట్ ని సృష్టించుకున్నాడు. అయితే ఆ యువకుడు తప్పు చేసినప్పటికీ అతను చేసిన ఎంబీబీఎస్ విద్య ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫేక్ సర్టిఫికెట్ తో ఎంబీబీఎస్ చేసి ఉండవచ్చు. అయితే అది నేరం కాదని కోర్టు నిర్ణయాత్మక తీర్పు వెల్లడించింది. సాధారణంగా సినిమాల్లో మాత్రమే న్యాయమూర్తులు మనసుతో ఆలోచించే సన్నివేశాలు ఉంటాయి. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి తీర్పులు ఉంటాయని ముంబై హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో రుజువైంది. సాధారణంగా ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ కి అప్లై చేస్తుంటారు కొంతమంది. నకిలీ పత్రాలతో ఎలాగోలా జాబ్ తెచ్చుకుని కష్టాల ఊబి నుంచి బయటపడితే చాలనుకుంటారు.

దాదాపు చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టే వాళ్లలో మధ్యతరగతి ప్రజలే ఉంటారు. అయితే ఓ యువకుడు ఫేక్ సరిటిఫ్కెట్ పెట్టి ఎంబీబీఎస్ చేశాడు. ఈ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భారతదేశంలో జనాభాకు సరిపడా డాక్టర్లు లేరని.. ఆ కుర్రాడు తప్పు చేసిన అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలోని లోకమాన్య తిలక్ మెడికల్ కళాశాలలో లుబ్నా ముజావర్ అనే స్టూడెంట్.. నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ చూపించి ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నాడు. ముజావర్ తండ్రి తన తల్లికి తలాక్ చెప్పడంతో.. ఆర్థికంగా తల్లికి భారం కాకూడదని ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి క్రియేట్ చేయించాడు. ఆదాయపు ధ్రువీకరణ పత్రంలో రూ. 4.5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉన్నట్లు చూపించాడు. నిజానికి ముజావర్ తల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తుంది. ఆ విషయాన్ని దాచి పెట్టి ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు.

2012లో అడ్మిషన్ రాగా.. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అయితే ఫేక్ సర్టిఫికెట్ తో అడ్మిషన్ తీసుకున్నందుకు.. అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ని క్యాన్సిల్ చేయమని న్యాయవాదులు కోరారు. 2012లో నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ ఆధారంగా ఓబీసీలకు వచ్చిన ఎంబీబీఎస్ అడ్మిషన్స్ పై ముంబై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో.. మూడు నెలల్లో ఎంబీబీఎస్ కోర్సు కోసం చెల్లించాల్సిన ఫీజుతో పాటు 50 వేల రూపాయలు చెల్లించాలని ముజావర్ ని కోర్టు ఆదేశించింది. అయితే ఫేక్ సర్టిఫికెట్ తో ఎంబీబీఎస్ పూర్తి చేసినంత మాత్రాన అతని సర్టిఫికెట్ రద్దు చేయలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే దేశంలో వైద్యుల కొరత ఉందని.. అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ రద్దు చేస్తే అది జాతికే నష్టం అని కోర్టు వెల్లడించింది.

మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ – ఆ జట్లలో దేని అవకాశాలు ఎలా ఉన్నాయి?

ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ కథ కూడా ముగిసింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. మరి ఆ జట్లలో దేని అవకాశాలు ఎలా ఉన్నాయి?

రాజస్థాన్‌ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్‌, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్‌ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది.

రాజస్థాన్‌ తర్వాత మెరుగైన అవకాశాలున్నది హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌, పంజాబ్‌) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. నెట్‌రన్‌రేట్‌ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం కావచ్చు.
లఖ్‌నవూ, దిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. ఆ రెండు జట్లూ నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డాయి. లఖ్‌నవూ.. దిల్లీ, ముంబయిలతో తలపడాల్సి ఉంది. లఖ్‌నవూ చేతిలో దిల్లీ ఓడితే ఆ జట్టు కథ ముగుస్తుంది. ఎందుకంటే అదే ఆ జట్టుకు చివరి మ్యాచ్‌. దిల్లీ చేతిలో లఖ్‌నవూ ఓడితే ఆ జట్టు కథ కూడా దాదాపు ముగిసినట్లే. ఎందుకంటే ఎల్‌ఎస్‌జీ నెట్‌రన్‌రేట్‌ (-0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.
తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓడి ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనట్లు కనిపించిన బెంగళూరు.. అనూహ్యంగా తర్వాతి 5 మ్యాచ్‌ల్లోనూ నెగ్గి రేసులోకి వచ్చింది. ఆ జట్టుకు సమీకరణాలు కలిసి వస్తే ముందంజ వేయొచ్చు. నెట్‌రన్‌రేట్‌ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌, దిల్లీ, లఖ్‌నవూ జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నై-బెంగళూరు మ్యాచ్‌ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరుతుంది.

చల్లని వార్త.. అనుకున్న దాని కంటే ముందే వస్తున్న రుతుపవనాలు!

ప్రస్తుతం భానుడు భగ భగలకు బ్రేక్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మే 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. అదేంటంటే.. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే రాబోతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రానికి చోరుకోబోతున్నాయి అంటూ ప్రకటించారు. నిజానికి ఈ రుతుపవనాలు రావాల్సిన దానికంటే ముందుగానే వస్తున్నట్లు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు మే 19కి దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. నిజానికి ఈ నైరుతి రుతుపవనాలు మే 22కి అండమాన్ సముద్రానికి చేరుకుంటాని చెప్పారు. కానీ, ఇప్పుడు రెండ్రోజుల ముందే రానున్నాయి. అలాగే కేరళకు రుతుపవనాలు వస్తుండటంపై కూడా అధదికారిక ప్రకటన చేశారు. కేరళకు జూన్ 1న రుతుపవనాలు రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కేరళ నుంచి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు కాస్త సమయం పడుతుంది.

కేరళ నుంచి రుతుపవనాలు కదిలి జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపారు. అలాగే ఈ ఏడాది వర్షాల విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలోనే ప్రకటించారు. ఎందుకంటే ఈ ఏడాది రుతువపనాల వల్ల అధికంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది రుతుపవనాల వల్ల జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణం, ఈ ఏడాది వర్షానికి సంబంధించి మే నెల చివర్లో భారత వాతావరణ శాఖ మరో అధికారిక ప్రకటన చేయనుంది. వాతావరణ శాఖ చేసిన ఈ ప్రకటనతో రైతులు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి తరుణంలో అధికారులు చల్లని కబురు అందించారు.

Vastu Shastra: ఇంట్లో చేసే ఈ చిన్న వాస్తు పొరపాట్లు పెద్ద సమస్యలకు దారి తీస్తాయి..

Vastu Shastra:జీవితంలో మనం చాలా చిన్న విషయాలను మరచిపోతుంటాం. అయితే ఇలా చేసే విషయాలు ఎటువంటి మార్పును కలిగించవని నమ్ముతాము. చాలా సార్లు ఈ చిన్న విషయాలు పెద్దవిగా మారి జీవితంలో అడ్డంకులు సృష్టించడం ప్రారంభిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు. జ్యోతిష్యం లేదా వాస్తు కావచ్చు, అవన్నీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మనం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినట్లయితే, మొదట జాతకాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. విషయం కుటుంబం లేదా ఇంటికి సంబంధించినది అయితే వాస్తు శాస్త్రాన్ని విస్మరించలేం. కొన్ని చాలా సులభమైన పరిష్కారాలు సూచిస్తే మరికొన్ని ఇంటి నుండి ఆనందాన్ని దూరం చేస్తాయి. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన వాస్తు నియమాలు

– తరచుగా బెడ్‌రూమ్‌లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దాని తలుపు మూసివేయడం మర్చిపోతారు. బెడ్‌రూమ్‌లోని అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ డోర్‌ను ఎప్పుడూ మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.

– పాత్రలను అలంకరించి షోకేస్‌లో ఉంచకూడదు, అలా చేయడం సరికాదు.

– వంటగది మెయిన్ డోర్ నుండి కనిపిస్తే, వంటగదిలో ఖచ్చితంగా కర్టెన్ ఉపయోగించండి. ఓపెన్ కిచెన్ బయటి నుండి కనిపిస్తే, ఇంటి రహస్యాలు బయటి వ్యక్తులకు తెలియడం ప్రారంభిస్తాయి.

– కీని ఎప్పుడూ అల్మారాలో వేలాడదీయకూడదు. లేకుంటే డబ్బు నష్టం జరుగుతుంది.

– పాలు మరిగి చిమ్మితే ధన నష్టమే కాకుండా ఇంటి ఐశ్వర్యం పోతుంది.

– మంచం కింద పెట్టెలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచవద్దు. అది వైవాహిక జీవితంలో ఆనందాన్ని, శాంతిని పాడు చేస్తుంది.

– ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా, ఒక్కటి గుర్తుంచుకోండి, బెడ్‌రూమ్‌లో పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అది ప్రత్యేక స్థలంలో ఉండాలి.

– పడకగదిలో అక్వేరియం పెట్టకూడదు. ఇంటి అలంకరణ కోసం ఇలా చేసే వారి వైవాహిక జీవితం గంభీరంగా ఉంటుంది.

– ఫ్రిజ్ దక్షిణాభిముఖంగా ఉంటే అందులో ఉంచిన ఆహారం విషపూరితంగా మారి రోగాలకు దారి తీస్తుంది. ఉత్తరం లేదా తూర్పు వైపు చేయండి.

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన..

సాధారణంగా బతికున్న వారికే పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ఈ ఊరిలో మాత్రం చనిపోయిన వారికి పెళ్లిళ్లు చేస్తారు. ఏంటి షాకయ్యారా? మరే ఇదే నిజం. అక్కడ ఇదే కల్చర్ అంట. ఎప్పుడో చనిపోయిన కూతుర్లకు పెళ్లి చేస్తారు. దానికోసం వరుడు కావాలని ప్రకటన ఇస్తారు. తాజాగా ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురికి వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. కర్ణాటకలోని తుళునాడులో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చనిపోయిన తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తుళు మాసం వచ్చిందంటే ప్రత్యేకించి మరీ ఈ వివాహాలు జరిపిస్తారు. తుళు మాసంలో పెళ్లిళ్లు తప్ప మరే ఇతర శుభకార్యాలను నిర్వహించరు.

ఈ క్రమంలో ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురు పెళ్లి కోసం ఒక ప్రకటన ఇచ్చింది. ‘బంగేరా గోత్రం, కులూల్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి వరుడు కావాలి. అమ్మాయి 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. అయితే అబ్బాయి 30 ఏళ్ల కిందట చనిపోయి ఉండాలి. మా కులానికి చెందిన వాడు, వేరే గోత్రం వాడు అయి ఉండాలి. 30 ఏళ్ల క్రితం చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ప్రేతాత్మ పెళ్లి చేయడానికి ఇష్టమైతే సంప్రదించండి’ అంటూ ఫోన్ నంబర్ తో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో 50 మంది స్పందించారని ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ఈ ప్రేతాత్మ వివాహా తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు.

ఈ వివాహం చేయడానికి ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. సరైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ పెళ్లిని బతికున్న వారికి ఎలా చేస్తారో అలానే చేస్తారు. వధువు, వరుడి బొమ్మలను పీటల మీద కూర్చోబెట్టి.. వాటికి పెళ్లి బట్టలు ధరిస్తారు. గ్రాండ్ గా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ఇలా చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చనిపోయిన బాధలోంచి బయటకు వచ్చి సంతోషంగా గడపడం కోసం ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. తుళులో ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది.

బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్‌ చేసి వివరించారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ నెల 28న ఈ వివాహం జరిగింది. దక్షిణ కన్నడ సంప్రదాయం ప్రకారం చిన్నప్పుడే చనిపోయిన పిల్లలకు వారి తల్లిదండ్రులు 30 ఏళ్ల తర్వాత ఈ పెళ్లి తంతు నిర్వహిస్తారు. దీని కోసం ఈడు, జోడు కూడా చూసుకుంటారు. చిన్నప్పుడే మరణించిన మగ పిల్లాడికి సరైన ఈడు, జోడున్న చిన్నప్పుడే చనిపోయిన ఆడ పిల్ల కుటుంబాన్ని ఎంచుకుంటారు. ఇరు కుటుంబాలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుని సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. పెళ్లి ముహుర్తాలు నిర్ణయిస్తారు.

అనంతరం వేడుకగా పెళ్లి తంతు నిర్వహిస్తారు. పెళ్లి వేదికపై రెండు ఖాళీ కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వధువు కుటుంబం పట్టుచీర, వరుడి కుటుంబం ధోవతిని అందులో ఉంచుతారు. ఆ దుస్తులు ధరించేందుకు వధువరులకు కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత చీర కొంగును, పంచెకు ముడి వేస్తారు. ఏడు అడుగుల బంధానికి శ్రీకారంగా ఆ దుస్తులను కుర్చీల చుట్టూ ఏడుసార్లు తిప్పుతారు.

ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరుగుతుంది. దీని తర్వాత వధువరుల స్థానాలను మార్చుతారు. ఈ పెళ్లి తంతులో ఇరు కుటుంబాల వారు, బంధువులు జంటను ఆట పట్టిస్తారు. వారిపై జోకులు కూడా వేసుకుంటారు. అందరి ఆశీర్వాదం కోసం వధువరులను బయటకు తీసుకువస్తారు. చివరకు వధువును వరుడి కుటుంబానికి అప్పగించే అప్పగింతల కార్యక్రమంతో ఈ వింత పెళ్లి ముగుస్తుంది. అనంతరం మాంసాహారంతో విందు భోజనం పెడతారు. అయితే ఈ పెళ్లికి పిల్లలు, పెళ్లి కాని వారిని అనుమతించారు. 30 ఏళ్ల కిందట చిన్నప్పుడే చనిపోయిన చందప్ప, శోభల పెళ్లిని ఈ నెల 28న ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ఈ పెళ్లి తంతు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 

 

 

 

 

 

 

AP Election Polling 2024: సీఎం జగన్, మంత్రి విడుదల రజనీ‌పై కేసు నమోదు.. కారణమిదే..?

ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్ , మంత్రి విడుదల రజనీ (Vidadala Rajini) పేరుతో ఐవీఆర్‌ఎ‌స్ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు కూడా ఫిర్యాదు చేశారు.

జగన్, విడుదల రజనీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వైసీపీకు ఓటు వేయాలని వస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్లపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వీరిద్దరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఐవీఆర్‌ఎ‌స్ వాయిస్ ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు అందజేశారు. ఈసీ ఫిర్యాదుపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 249/24 కింద కేసు నమోదు చేశారు.

ఐపీసీలోని 188, 171f, 171h, ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 123, 126, 130 సెక్షన్ల కింద మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఐవీఆర్‌ఎ‌స్ కాల్స్ రావడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నది. ఈసీ ఆదేశాల మేరకు జగన్‌, విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైటెక్ సిటీ దగ్గరలో 15 లక్షలకే 100 గజాల స్థలం.. సామాన్యులకిదే మంచి ఛాన్స్!

హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఒకప్పుడు ఇవన్నీ సాధారణ ప్రాంతాలే. కానీ ఇప్పుడు అవి అసాధారణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏరియా కూడా ఈ ఏరియాల్లానే ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ లో కింగ్ గా మారనుంది.

ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక.. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయలేకపోయామే అన్న బాధ ఉండదు. అంతలా ఈ ప్రాంతం లాభాలు తెచ్చిపెడుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్:

ఆ ఏరియా మహేశ్వరం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ పార్క్, దగ్గర్లో హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇక్కడ ఆశాజనకంగా ఉంది. టీసీఎస్, హెచ్సీఎల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, విప్రో సెజ్ వంటి ప్రధాన ఎంప్లాయిమెంట్ హబ్స్ మహేశ్వరం ఏరియాకి దగ్గరగా ఉండడం మరో అడ్వాంటేజ్. ఈ ఇండస్ట్రియల్ ఏరియాల వల్ల మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ అనేది బలోపేతమవుతుంది. హెచ్ఎఫ్సీఎల్ ప్రపోజ్ చేసిన ఫైబర్ ప్రాజెక్ట్, కన్స్యూమర్ కేర్ సెక్టార్ లో విప్రో పెట్టుబడులు వంటివి మహేశ్వరంలో అదనంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కారణమవ్వనున్నాయి. అలానే ఇక్కడ ప్రముఖ విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సంస్థలు కూడా ఉన్నాయి.

కనెక్టివిటీ:

ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఈ ఏరియా అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఇది నగరంలోని ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా శ్రీశైలం హైవేని కలుపుతుంది. మహేశ్వరంలో రీజనల్ రింగ్ రోడ్ సహా పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేయనుంది. హైవేలకు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి, ప్రధానమైన ల్యాండ్ మార్క్స్ కి దగ్గరలో ఉన్న కారణంగా మహేశ్వరం ఏరియా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తున్నారు ఇన్వెస్టర్స్. ఉపాధి అవకాశాలు పెరగడం, కనెక్టివిటీ, సరసమైన ధరలకే ఇక్కడ స్థలాలు దొరుకుతున్న కారణంగా చాలా మంది ఇక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహేశ్వరంలో ఇండ్ల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ వస్తుందని అంటున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ విల్లాలు, అపార్టుమెంట్ల కంటే స్థలాలు మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. పైగా ప్రాపర్టీ ట్యాక్సులు, మెయింటెనెన్స్ కాస్ట్ వంటివి తక్కువ.

ధరలు ఎలా ఉన్నాయంటే?:

ప్రస్తుతం మహేశ్వరంలో చదరపు అడుగు స్థలం 1650 రూపాయలుగా ఉంది. గజం 14,850 రూపాయలుగా ఉంది. ఒక వంద గజాల స్థలం కొనాలంటే రూ. 14,85,000 అవుతుంది. 15 లక్షలతో 100 గజాల స్థలం సొంతం చేసుకోవచ్చు. 22 లక్షలు పెట్టుకుంటే 150 గజాల స్థలం పొందవచ్చు. హైదరాబాద్ కి 50 కి.మీ. దూరంలో ఉంది. 50 నిమిషాల్లో సిటీకి చేరుకోవచ్చు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు 50 నిమిషాల్లోపే చేరుకోవచ్చు.

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

Business Idea: మనీ ట్రీ అంటే ఏంటో తెలుసా? వీటిని సాగు చేస్తే లక్షల్లో లాభం.. అదిరిపోయే బిజినెస్‌ ఐడియా!

సాధారణంగా మీరు రోడ్డు పక్కన ఎత్తైన పచ్చని చెట్లను చూసి ఉంటారు. ఎక్కువగా ఈ చెట్లు సఫేదాకు చెందినవి. ప్రజలు ఈ చెట్లను పనికిరానిదిగా భావిస్తారు.

కానీ ఈ చెట్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి సాగుతో లక్షల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్కలను పెంచడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా దీని సాగుకు అయ్యే ఖర్చు కూడా నామమాత్రమే. దీని కోసం ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. వీటిని ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ చెట్లు నేరుగా పైకి పెరుగుతాయి. వీటిని పెంచేందుకు పెద్దగా స్థలం ఉండాల్సిన అవసరమూ లేదు.

చెట్లు, మొక్కలు, వ్యవసాయానికి సంబంధించిన పనిలో అతిపెద్ద సవాలు ఎరువులు, నీరు, పంటల సంరక్షణ. కానీ, సఫేడా చెట్టు విషయంలో ఇది అలా కాదు. ఎందుకంటే దాని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దాని మొక్కను పెంచడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ చెట్టును ఏ వాతావరణంలోనైనా ఎక్కడైనా పెంచుకోవచ్చు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో సఫేదా సాగు

ఇది ఆస్ట్రేలియన్ మూలానికి చెందిన చెట్టు. అయితే దీనిని భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తారు. దీనిని గమ్, సఫేదా, మొదలైన వాటితో పిలుస్తుంటారు. ఈ చెట్ల కలపను గట్టి బోర్డులు, గుజ్జు, ఫర్నిచర్, పెట్టెలు మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాల్లో సాగు చేస్తారు. సాధారణంగా చెట్టు ఎత్తు 40 నుండి 80 మీటర్ల వరకు ఉంటుంది. మీరు ఈ చెట్లను నాటినప్పుడల్లా, ఒకదానికొకటి ఒకటిన్నర మీటర్ల దూరం ఉంచి నాటాలి. ఒక హెక్టారులో 3000 సఫేడా మొక్కలు నాటవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వారికి 7-8 రూపాయలకు సులభంగా లభిస్తుంది.

సేఫ్డా నుండి సంపాదన

సఫేదా కలపను పెట్టెలు, ఇంధనం, హార్డ్ బోర్డ్, ఫర్నిచర్, పార్టికల్ బోర్డ్ తయారీకి ఉపయోగిస్తారు. సఫేడా మొక్కలు కేవలం 5 సంవత్సరాలలో మంచి వృద్ధిని సాధిస్తాయి. దీని తరువాత వాటిని కట్ చేయవచ్చు. ఒక చెట్టు నుండి దాదాపు 400 కిలోల కలప లభిస్తుంది. యూకలిప్టస్ కలపను కిలో రూ.6-7 చొప్పున మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హెక్టారులో 3000 చెట్లను నాటితే 72 లక్షల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు.

ఇన్వర్టర్ ను వినియోగిస్తున్నారా.. ఈ విషయాలను మర్చిపోయారో అంతే సంగతి..

ఒకప్పుడు పెద్ద హాస్పిటల్ లో, షాపింగ్ మాల్స్ లో, థియేటర్లలో పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ను వినియోగించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇండ్లల్లో పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్లను వినియోగిస్తున్నారు.

దీని ద్వారా పవర్ కట్ సమయంలో ఇంటికి అవసరమైన విద్యుత్తును సరఫరా అవుతుంది. ఇన్వర్టర్ కనెక్షన్ తో ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, LED బల్బ్, టీవీ, ఫ్రిజ్ వంటి అవసరమైన విద్యుత్ ఉపకరణాలను వినియోగించవచ్చు.

మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్ ఉంటే దాని ఉపయోగం కోసం కొన్ని చిట్కాలను మీరు తప్పక పాటించాలి. ఎందుకంటే మీకు ఇన్వర్టర్ యూసింగ్ తెలియకుండా దాన్ని ఉపయోగిస్తే దాని జీవితకాలం తగ్గిపోతుంది. అంతేకాదు ఇన్వర్టర్ ఉపయోగిస్తున్న విద్యుత్ ఉపకరణాలు కూడా పాడైపోయే అవకాశం ఉంది. మరి ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వర్టర్ లోడ్ పై శ్రద్ధ..

ఇంట్లో ఇన్వర్టర్‌ని ఉపయోగించే ముందు మీ ఇన్వర్టర్ ఎన్ని వాట్స్‌లో ఉందో మీరు తెలుసుకోవాలి. మీ ఇన్వర్టర్ 1 కిలోవాట్ (అంటే 1000 వాట్స్) ఉన్నట్లయితే, మీరు పవర్ కట్ సమయంలో ఇన్వర్టర్ – పవర్డ్ ఎక్విప్‌మెంట్ లోడ్ 1000 వాట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇన్వర్టర్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.

ఇన్వర్టర్ పవర్ సరఫరా చేయడానికి MCB..

చాలా ఇళ్లలో ఇన్వర్టర్‌ను సరఫరా చేసే మెయిన్ వైర్‌ పై MCB ఉపయోగించరు. దీంతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే పవర్‌ ఆఫ్‌ కాకపోవడంతో ఇన్‌వర్టర్‌ పాడయ్యే అవకాశం ఉంది. మీరు ఇన్వర్టర్ పవర్ సరఫరా చేసే ప్రధాన వైర్‌ పై MCB ని ఇన్‌స్టాల్ చేస్తే, షార్ట్ సర్క్యూట్ ఉంటే వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.

ఇన్వర్టర్ బ్యాటరీ నిర్వహణ..

ఇన్వర్టర్ బ్యాటరీలో ఎప్పటికప్పుడు డిస్టిల్ వాటర్ నింపుతూ ఉండాలి. వేసవి కాలంలో ఇన్వర్టర్ బ్యాటరీలో ఉండే నీరు త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇన్వర్టర్ బ్యాటరీలో తక్కువ నీటి స్థాయికి సంబంధించిన సంకేతం పై శ్రద్ద వహించాలి. గుర్తు తగ్గినట్లయితే బ్యాటరీలో డిస్టిల్ వాటర్ పోసేందుకు వెంటనే ఇన్వర్టర్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.

అంబాసిడర్ 2.0. త్వరలో మార్కెట్లోకి.. లుక్ చూస్తే దిమ్మదిరిగిపోద్దీ!

1980 కాలంలో భారత కార్ల మార్కెట్ దిగ్గజం అంబాసిడర్. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ కారు అప్పట్లో కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇళ్లల్లో మాత్రమే ఉండేది.

ఆటోమోబైల్ మార్కెట్ ను దాదాపు 70 శాతం ఆక్రమించిన ఈ మోడల్ విక్రయాలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో 2014లో దీని ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో అంబాసిడర్ హక్కులను ఫ్యూజో అనే కంపెనీ రూ.80 కోట్లకు దక్కించుకుంది. ఆ తరువాత ఈ కారు మళ్లీ మార్కెట్లోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అంబాసిడర్ కొత్త అవతారంలో వస్తుంది. ఇది ఎలా ఉండనుందంటే?

కొత్త అంబాసిడర్ 2.0 కారును హిందూస్తాన్ చెన్నై ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త అంబాసిడర్ ను ఆవిష్కరించే క్రమంలో హిందూస్థాన్ మోటార్స్ డైరెక్టర్ మీడియాకు పలు విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బటయపడ్డామని, యూరోపియన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.ఇందులో భాగంగా రూ.600 కోట్ల పెట్టుబడితో అంబాసిడర్ 2.0 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆటోమోబైల్ రంగంలో చక్రం తిప్పిన అంబాసిడర్ ప్రేమికులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో మళ్లీ రోడ్లపైకి రానుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు గురించిపూర్త వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఫీచర్స్, ధర త్వరలో ప్రకటిస్తామని కంపెనీ డైరెక్టర్ తెలిపారు. 70వ దశకంలో ఒక ఎంతో ఆదరణ పొందిన అంబాసిడర్ మళ్లీ రాబోతుందంటే కారు ప్రియులకు పండుగే.

Health: ఇలా చేస్తే.. పాడైపోయిన లివర్ ఒక్క దెబ్బతో శుభ్రం అవుతుంది..

మన శరీరంలో అన్నింటికంటే ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించే అవయవం లివర్. మనం తినే ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ దోషాలు, మనం మింగిన మందుల్లో ఉండే కెమికల్ దోషాల్ని క్లీన్ చేసేది లివర్.

అలానే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్‌ని క్లియర్ చేసేది లివర్. అలాగే మన శరీరంలోని వివిధ రకాల టక్సిన్లను బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపేది లివర్. ఇంకా ఎన్నో పనులు చేసే లివర్‌ను ఈ మధ్య ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఫ్యాటీ లివర్. అలానే లివర్ సాగిపోవడం, గట్టిపడిపోవడం వంటి కేసులు కూడా చూస్తున్నాం. అలానే లివర్ సిర్రోసిస్ సమస్యలు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అవసరానికి మించి నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని.. ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. లివర్‌ను రక్షించిండానికి మెడిసిన్స్ కూడా పెద్దగా ఉపయోగపడవని ఆయన చెప్పారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడమే లివర్‌కు మెడిసిన్ అని చెప్పారు.

లివర్‌కు సూక్ష్మ పోషకాలు కావాలని.. అవి వండిన ఆహారాల్లో ఉండవని మంతెన చెబుతున్నారు. రోజులో 60 శాతం అయినా ఉడకని ఆహారం తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల విటమిన్స్, మినరల్స్ అందుతాయంటున్నారు. మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారం తీసుకుని.. మార్నింగ్, ఈవెనింగ్.. జ్యూసులు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి మీ లివర్‌ను తిరిగి హెల్దీ చేయడంలో సాయపడతాయంటున్నారు. అలానే సాయత్రం 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల లివర్ తనను తాను రికవర్ చేసుకుంటుందని మంతెన చెబుతున్నారు.

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

Health: అదీ లెక్క.. ఇది తింటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె జబ్బులు పరార్

ఈ మధ్య చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయ్.. తక్కువ ఏజ్‌లోనే బీపీ సమస్యలు వెంటాడుతున్నాయ్. ఈ కారణాలతో రక్తం చిక్కబడుతోంది. ఆ రక్తాన్ని గుండె సరిగ్గా పంప్ చేయలేకపోతుంది.

దీంతో రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తం పలుచగా ఉంటేనే.. గుండె పంప్ చేసేందుకు ఈజీ అవుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో కొంతమంది సమస్యలు ఉన్నా, లేకపోయినా రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్ వాడుతున్నారు. గుండె సమస్యలు, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు.. ఇవి ఒకసారి మొదలెడితే లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే.. జీవితం కాలం ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ప్రధానంగా తక్కువ నీరు తాగడం, ఎక్కువ ఉప్పు వినియోగం.. నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం చిక్కగా అవుతుంది.

ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా.. రా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పలుచగా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్, ఈవెనింగ్ ఎక్కువ ఉడకని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ.. మధ్యాహ్నం ఉడికిన ఫుడ్ తిన్నా అందులో ఉప్పు లేకుండా చూసుకుంటే రక్తం చిక్కబడటం ఆగుతుందని చెబుతున్నారు. ఇలా ఫాలో అయితే నెలా, రెండు నెలల తర్వాత మెడిసిన్ మానిసేనా ఇబ్బంది ఉండదని ప్రకృతి వైద్యులు మంతెన చెబుతున్నారు. ఎప్పుడైనా పండక్కి, పబ్బానికి ఉప్పు ఉన్న ఆహారం తింటే పర్లేదు కానీ.. రోజూ ఉప్పు తగినంత వేసిన ఆహారం తింటే తిప్పలు తప్పవంటున్నారు. మనిషి ఆరోగ్య వ్యవస్థను పాడు చేయడానికి ఉప్పే ప్రధాన కారణమని ఆయన అంటున్నారు. మనం తినే ఆహారమే మన హెల్ద్‌ను డిపెండ్ చేస్తుందని చెబుతున్నారు.

Health

సినిమా