Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిందని ఆందోళన వద్దు, పెంచుకోవడం చాలా ఈజీ

Credit Score: బ్యాంకులు సహా ఏ ఫైనాన్స్ కంపెనీ నుంచి మనం లోన్ తీసుకోవాలన్నా, అవి మొట్టమొదట చూసేది మీ క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ బాగుందని సంతృప్తి చెందితేనే ఆయా సంస్థలు లోన్లు ఇస్తాయి.
క్రెడిట్ స్కోర్ బాగుంటే (Good Credit Score) మీకు కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. బ్యాంక్ నుంచి ఎక్కువ రుణం అడగొచ్చు, తక్కువ వడ్డీ కోసం బేరం చేయవచ్చు. మంచి స్కోర్ ఉన్న వాళ్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా వదిలి పెట్టవు. స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం లోన్ ఇవ్వలేమని నిర్మొహమాటంగా చెబుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

పర్సనల్ లోన్, హౌస్ లోన్, వెహికల్ లోన్.. ఇలాంటి ఏ విధమైన అప్పును మీరు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ 700 దాటి ఉండాలి. 700 కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు మీ అప్లికేషన్ను పక్కన పెట్టేస్తాయి.

తక్కువగా ఉన్న క్రెడిట్ స్కోరును పెంచుకునే పద్ధతులు:
1. మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయండి. క్రెడిట్ కార్డు బిల్లును గానీ, లోన్ EMIను గానీ లాస్ట్ డేట్ రాకముందే చెల్లించండి. ఏ కారణం వల్ల గడువు దాటినా, ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది.

Related News

2. ఎక్కువ లోన్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్లు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి తారుమారై, డబ్బు కట్టకపోతే క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, అనవసర ప్రయాస వద్దు.

3. సురక్షిత (సెక్యూర్డ్), అసురక్షిత (అన్ సెక్యూర్డ్) రుణాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుంటాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్ను సెక్యూర్డ్ లోన్స్ అని… తనఖా ఏమీ ఉండదు కాబట్టి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ను అన్ సెక్యూర్డ్ లోన్స్గా బ్యాంకులు పరిగణిస్తాయి.
4. మీ క్రెడిట్ కార్డ్లోని లిమిట్ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. తరచుగా క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి.

5. నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం జీతం లేదా ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి. క్రెడిట్ స్కోర్ సాఫీగా పెరుగుతుంది.

6. బ్యాంక్ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే… మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని బ్యాంకులు అనుమానిస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్లోనూ ఈ విషయం నమోదవుతుంది.
7. రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్లు దాదాపు కరెక్ట్గానే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్ట్ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్ కేర్కు కాల్ చేసి సాధ్యమైనంత త్వరగా సరిచేయించుకోండి.

Related News