Devotional అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా?

అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను (శేష వస్త్రం) వేలం వేయడం లేదా ధర కట్టి అమ్మడం షరా మామూలే! కానీ కొందరు భక్తులకు అమ్మవారికి కట్టిన చీరలు ధరించవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంటుంది.
అమ్మవారికి కట్టిన చీరలు సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాంటి చీరలను శుక్రవారం నాడు మాత్రమే ధరించాలి. వాటిని ధరించినప్పుడు కోపాలూ అసహనాలూ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భగవన్నామ స్మరణ చేయడం మంచిది. రాత్రి సమయాల్లో ధరించకూడదు. ఈ చీరను ఉతికినప్పుడు ఆ నీళ్లను ఎక్కడపడితే అక్కడ పోసి తొక్కకుండా, మొక్కల్లో మాత్రమే పోయాలి. అన్నిటి కంటే ముఖ్యమైన సూత్రం నెలసరి సమయంలో ఆ వస్త్రాల జోలికి వెళ్లకూడదు. ఈ నియమాలు పాటించినప్పుడే అమ్మవారి అనుగ్రహం ధరించినవారి మీద ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

– ఈవని వెంకట గౌరీ నాగ దీప్తి