Saturday, November 16, 2024

Gold Price Today: బంగారం భగభగలు… ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ. 80 వేలకు చేరడం ఖాయమన్న వార్తలకు ప్రస్తుతం పెరుగుతోన్న బంగారం ధరలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర సుమారు రూ. 75వేలకు చేరువైంది. అయితే సోమవారం బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 74,760 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,390కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,610గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,490కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 74,720గా ఉంది.

* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

* విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

* విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపైస రూ. 100వరకు తగ్గింది. అయితే పెరిగిన ధరతో పోల్చితే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. కిలో వెండి ధర ఏకంగా రూ. లక్షకు చేరువకావడం సామాన్యులను భయపెడుతోంది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 92,900గా ఉండగా హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 96,400కి చేరుకుంది.

Andhra Pradesh: రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న ఎస్సైపై సస్పెండ్‌ వేటు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బంధువుల ద్వారా ఓ పార్టీకి చెందిన నేత నుంచి డబ్బు తీసుకుంటూ పట్టుబడటంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీంతో ఎన్నికల నిబంధనలను ఉల్లంగించినందుకుగానూ సదరు అధికారిని ఐజీ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకెళ్తే..

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబు సొంతూరు ప్రకాశం జిల్లా కురిచేడు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌లో విధుల నిర్వహణకు వచ్చారు. ఎస్సై ఖాజాబాబుకు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది. ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు పైకం పుచ్చుకొని, ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో పంపారు.

అయితే సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు. ఆయనను విచారించగా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు తెలిపాడు. వారిలో ఎస్సై ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు ఆయన చెప్పాడు. పోలీసులు వారిని విచారించగా నిజమేనని తేలింది. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. ఈ మేరకు ఎస్సై ఖాజాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Iran: హెలికాప్టర్‌ ప్రమాదం.. ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ గల్లంతు

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైంది. పొరుగుదేశం అజర్‌బైజాన్‌, ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ సరిహద్దుల్లో ఓ డ్యామ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ ఆమిర్‌ అబ్దులాహియన్‌, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా ఆయన చాపర్‌ వెంట ఉన్నాయి. మధ్యాహ్నానికి తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాలు, డిజ్మార్‌ అటవీ ప్రాంతాన్ని దాటే క్రమంలో.. జోల్ఫా గ్రామం సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో జోల్ఫాతోపాటు.. ఉజి, అర్దేషిరి, బారాజిన్‌ గ్రామాలతోపాటు.. డిజ్మార్‌ అటవీ ప్రాంతాల్లో భీకర వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, దట్టమైన పొగమంచుతో వాతావరణం ప్రతికూలంగా మారింది. మరో 2 హెలికాప్టర్లు గమ్యస్థానానికి చేరుకున్నా.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జాడ లేకపోవడంతో.. ఆదివారం సాయంత్రం నుంచి ఇరాన్‌ వ్యాప్తంగా టెన్షన్‌ నెలకొంది. కాసేపటికి తూర్పు అజర్‌బైజాన్‌ గవర్నర్‌ మాలిక్‌ రహ్మతి ‘‘అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది’’ అని ప్రకటించారు. అయితే.. ఇరాన్‌ అధికారిక మీడియా, అధికారులు మాత్రం.. ‘‘రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జోల్ఫా ప్రాంతంలో హార్డ్‌ ల్యాండింగ్‌ అయ్యింది’’ అని తెలిపారు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి, పైలట్‌, కోపైలట్‌, అధ్యక్షుడి భద్రతా బృందం అధిపతి, అంగరక్షకులు, అధికారులు ఉన్నట్లు వివరించారు.

ప్రతికూల వాతావరణంలో గాలింపు

హెలికాప్టర్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ సమాచారం అందగానే.. సైన్యం, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ), రెడ్‌ క్రెసెంట్‌తోపాటు.. మొత్తం 20 బృందాలు గాలింపు ప్రారంభించాయి. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా గాలింపులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొండ ప్రాంతాల్లో మట్టిరోడ్లు చిత్తడిగా మారిపోయి, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ‘‘సమాచారం అందిన వెంటనే హెలికాప్టర్ల ద్వారా గాలింపునకు ప్రయత్నించాం. అయితే.. దట్టమైన పొగమంచుతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పదాతి దళాలు అతికష్టమ్మీద ముందుకు సాగుతున్నాయి’’ అని ఇరాన్‌ ఎమర్జెన్సీ సేవల అధికార ప్రతినిధి బాబక్‌ యెక్తాపరస్ట్‌ మీడియాకు తెలిపారు. కడపటి వార్తలందేసరికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. రైసీ క్షేమంగా తిరిగి రావాలంటూ ఇరాన్‌ వ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలంటూ అధికారులు ప్రసార మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. ఇరాన్‌ మిత్ర దేశాలు కూడా రైసీ క్షేమ సమాచారం కోసం ప్రార్థనలు చేస్తున్నాయి. కాగా.. రైసీ హెలికాప్టర్‌ గల్లంతుపై అమెరికా అఽధ్యక్షుడు జో బైడెన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఎప్పటికప్పుడు బైడెన్‌ ఇరాన్‌ అధ్యక్షుడి సమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు వివరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. అటు ఇరాన్‌ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు– ఇస్లామిక్‌ జిహాద్‌ పొలిటికల్‌ బ్యూరో నేత అలీ అబూ షాహిన్‌, హమాస్‌ సీనియర్‌ సభ్యుడు ఇజ్జత్‌ అల్‌-రె్‌ష్కతోపాటు.. హిజ్బుల్లా, హౌతీ నేతలు కూడా రైసీ క్షేమ సమాచారం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

కాలం చెల్లిన హెలికాప్టరే కారణమా?

ఇరాన్‌ వద్ద హెలికాప్టర్లన్నీ కాలం చెల్లినవని తెలుస్తోంది. 1979 నాటి ఇస్లామిక్‌ రివల్యూషన్‌ సమయంలో ఉన్న హెలికాప్టర్లే ఇప్పటికీ సైన్యంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్‌ వాటి విడిభాగాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులున్నాయి. ఆదివారం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ కూడా కాలం చెల్లిందే కావడంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సుప్రీంలీడర్‌కు నమ్మిన బంటు!

హెలికాప్టర్‌ ప్రమాదంలో గల్లంతైన రైసీ వయస్సు 63 సంవత్సరాలు. ఆయన అధ్యక్ష పదవిని చేపట్టక ముందు న్యాయశాఖకు నేతృత్వం వహించారు. 1988లో ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధం సందర్భంగా చిక్కిన ఖైదీలకు సామూహికంగా మరణశిక్ష విధించి, అమలు చేశారు. వీరిలో మైనర్లు కూడా ఉండడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబడుతూ.. రైసీపై ఆంక్షలు విధించింది. 2015 నుంచి ఇరాన్‌లో అణ్వాయుధాలకు కావాల్సిన యురేనియం(వెపన్‌ గ్రేడ్‌) తయారీలో కీలక పాత్ర పోషించారు. 2017 ఎన్నికల్లో హసన్‌ రౌహానీకి వ్యతిరేకంగా బరిలో ఉన్నా.. ఓటమిపాలయ్యారు. 2021 ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించారు. అయితే.. 2021లో అత్యల్పంగా ఓటింగ్‌ జరిగి, 2.89 కోట్ల మంది పౌరులు మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ ఎన్నికలో రైసీ 62ు ఓట్లను సాధించి, అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. యురేనియం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. హమాస్‌, హౌతీ, హిజ్బుల్లా, ఇస్లామిక్‌ జిహాద్‌ ఉగ్రసంస్థలకు అండదండలను అందజేశారనే ఆరోపణలున్నాయి. హమా్‌సకు మద్దతుగా గత నెల ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడుల్లోనూ రైసీది కీలక పాత్ర అని స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై (Elections 2024 Result) రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ( Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు.
జగన్‌ (Jagan) ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో (YCP Activists) గుబులు రేపుతున్నాయి. తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) సీఎం కావడం ఖాయమని అన్నారు. జగన్ తనకు 151 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకోవడం భ్రమని.. తాను చెప్పింది కరెక్ట్ అయితే జగన్ మొహంపై పేడ పడుతుందని, ఆయన గెలవడం దుర్లభం అని పీకే స్పష్టం చేశారు.

కాగా 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అధికార పీఠాన్ని అదిష్టించారు. అయితే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్.. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో సైతం అగ్రస్థానంలో ఉండాల్సిన రాష్ట్రం.. అధోగతికి చేరింది. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు లేవు.. సరికదా ఉన్న పరిశ్రమలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి.

దీంతో ఉద్యోగం, ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు పయనమైంది. ఇక నవరత్నాలు పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం నగదు వేస్తుంది. అవి కూడా అడపాదడపా ఆగిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఖజానా పూర్తిగా నిండుకొంది. దీంతో అప్పుల కోసం ప్రతి నెల కేంద్రం ముందు జగన్ సర్కార్ చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. రాష్ట్రంలోని నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన వచ్చింది. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు.. తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు.

టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్యను సస్పెండ్ చేసిన ఏయూ రిజిస్ట్రార్!

ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు.

ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ లావణ్యకు రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించారని పేర్కొన్నారు. నోటీసులకు స్పందించిన లావణ్య… తాను శ్రీవాణి అనే మహిళను కలిశానని, ఎలాంటి ర్యాలీలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏయూ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. కాగా, గాజువాకలో కూటమి తరఫున పల్లా శ్రీనివాసరావు బరిలో దిగగా, వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారు.

Devara Fear Song: ‘దేవర’కు హారతి పట్టండమ్మా – అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది

Devara First Single fear song released on the occasion of Jr NTR birthday, Watch lyrical video: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే.

‘దేవర’ సినిమాలో ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ సాంగ్ వింటే ప్రతి అభిమానికి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!

అనిరుద్ అదరగొట్టాడుగా!
‘దేవర’ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, మాంచి సింగర్ కూడా! ‘ఫియర్ సాంగ్’ను కంపోజ్ చేయడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా పాడారు. ఆయన సంగీతంతో పాటు గాత్రం కూడా సూపర్ అని చెప్పాలి. ఈ పాటను కన్నడ, మలయాళ భాషల్లో సంతోష్ వెంకీ పాడారు.

‘దేవర’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటకు తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆల్ హెయిల్ టైగర్ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఆ పాట ఎలా ఉందో మీరూ వినండి.

SBI కస్టమర్లకు అలర్ట్‌.. రివార్డ్ పాయింట్స్‌ మెసేజ్‌ వచ్చిందా.. జాగ్రత్త

నేటి కాలంలో అన్ని ఆన్‌లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్‌ వరకు కూడా డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక చేతిలో డబ్బులు వాడటం తగ్గిపోయింది. కూరగాయల దగ్గర నుంచి బంగారం కొనుగోలు వరకు డిజిటల్‌ పేమెంట్సే చేస్తున్నాం. ఇది సైబర్‌ మోసగాళ్లకు మంచి అవకాశంగా మారింది. లాటరీ తగిలిందని.. గిఫ్ట్‌ కార్డ్‌ వచ్చిందని కాల్స్‌ చేసి.. ఏదో విధంగా జనాలను బురిడీ కొట్టించి.. అందిన కాడికి దోచేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసానికి తెర లేపారు సైబర్‌ కేటుగాళ్లు. ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్‌ చేసుకుని.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ పేరిట ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

తాజాగా సైబర్‌ నేరగాళ్లు.. ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్‌ చేసి.. మోసాలకు తెర తీశారు. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌ వాడితే.. రివార్డ్‌ పాయింట్స్‌ వస్తుంటాయి. వాటిని తర్వాత మూవీ టికెట్లు, ఇతర ఈకామర్స్‌ సైట్లలో చేసే షాపింగ్‌కు కూడా వాడుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ యాక్టివేట్‌ అయ్యాయంటూ.. లింక్‌లు పంపుతున్నారు. అది నిజమని నమ్మి.. ఆ లింకుల మీద క్లిక్‌ చేస్తే.. మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం.

ఇక తాజాగా ఓ వ్యక్తికి ఇలానే ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ 7,250 రూపాయలు యాక్టీవేట్‌ అయ్యింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మెసేజ్‌లు పంపించారు. ఆ మెస్సెజ్‌తో పాటు ఎస్‌బీఐ యోనో పేరుతో ఓ లింకును కూడా పంపుతున్నారు. ఇది నిజమని నమ్మి.. దాని మీద క్లిక్‌ చేయడంతో ఆ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా 50 వేలు మాయం అయ్యాయి.

ఈమధ్యకాలంలో ఇలాంటి మెసేజ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రమే కాక.. వారి స్నేహితులు, బందువులకు కూడా ఇలా రివార్డ్‌ మెసేజ్‌ లింకులను పంపుతున్నారు. అనుమానం వచ్చి కొందరు తిరిగి సదరు వ్యక్తులకు కాల్‌ చేయగా తాము పంపలేదని తెలిపారు. ఇక కొందరు తొందరపడి ఈ లింక్‌ను క్లిక్‌ చేయడంతో.. సుమారు 50 వేలే రూపాయల వరకు లాస్‌ అయ్యారు. ఈ విషయం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలియడంతో.. వారు ఈ ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ పేరిట వస్తున్న సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలానే బ్యాంకు కూడా ఈ తరహా మెసేజ్‌ల గురించి హెచ్చరిస్తోంది. ఇలాంటి లింకులతో మెస్సేజులు వస్తే.. అస్సలు తెరవకూడదని హెచ్చరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం

Rohit Sharma:ముంబై ఇండియన్స్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ శుక్రవారం నాడు ఆడింది. లక్నో సూపర్ జెయింట్‌తో తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఈ మ్యాచ్ ఆడింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. అయితే రోహిత శర్మ మ్యాచ్‌కు ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. కాగా దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కెమెరామెన్‌లు ప్రతిదాన్ని రికార్డ్ చేశారని రోహిత్ తన పోస్ట్‌లో ఫిర్యాదు చేశాడు. “క్రికెటర్ల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. మ్యాచ్ రోజున, శిక్షణ సమయంలో స్నేహితులు మరియు సహచరులతో గోప్యతతో మాట్లాడుతున్నప్పుడు కూడా కెమెరాలు ప్రతి కదలికను మరియు ప్రతి సంభాషణను రికార్డ్ చేస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ని రికార్డ్ చేయవద్దని చెప్పినప్పటికీ రికార్డ్ చేసిందని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది క్రికెటర్ల గోప్యతను ఉల్లంఘిస్తుంది మరియు క్రికెటర్లపై నమ్మకాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు రోహిత్.

లక్నోతో మ్యాచ్‌కు ముందు రోహిత్ తన ముంబై స్నేహితుడు ధవల్ కులకర్ణితో మాట్లాడుతున్నాడు. అప్పుడు కెమెరామెన్ తన సంభాషణను రికార్డ్ చేయడం చూశాడు. రోహిత్ వెంటనే కెమెరామెన్‌ని ఆపి బ్రదర్, ఆడియోను ఆపివేయండని వేడుకొన్నాడు. కాగా దీనికి సంబంధించి రోహిత్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.అంతకుముందు కోల్‌కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది, అందులో అతను ముంబై ఇండియన్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాది రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని కూడా భావిస్తున్నారు.

పొరపాటున కూడా ఈ 4 వస్తువులు ఎవరికీ ఇవ్వకండి.. ఇస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే !

ఇటీవల కాలంలో పుట్టిన రోజున, స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులకు, కావాల్సిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది అలవాటుగా మారిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎవరి మీదైనా సరే మనకున్న ప్రేమను వ్యక్త పరచడానికి గిఫ్ట్స్ ఇవ్వడం ఉత్తమ మార్గం. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గిఫ్ట్స్ తీసుకుంటే మీ జీవితానికి అశుభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వకూడదో, తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బహుమతిగా ఇవ్వకూడని 4 వస్తువులు ఇవే..

ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా..

ఉంగరాన్ని ఎవరికైనా సరే బహుమతిగా ఇవ్వకూడదు. ఎదుటి వారి నుంచి ఉంగరాన్ని అస్సలు తీసుకోకూడదు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉంగరాన్ని ఇచ్చే వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది కాకుండా, వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు, ఉంగరం తీసుకునే వ్యక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.

గడియారం బహుమతిగా ఇవ్వవచ్చా..

మీరు గడియారాన్ని ఏ వ్యక్తి నుంచి బహుమతిగా తీసుకోకండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీకు గడియారాన్ని బహుమతిగా ఇస్తే.. అది మీ జీవితం మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పెన్నును గిఫ్ట్‌గా తీసుకోవచ్చా..

ఎవరి దగ్గరి నుంచి అయినా సరే పెన్నును బహుమతిగా తీసుకోరాదు. పెన్ను కొనడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయని నమ్ముతారు. అంటే వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

బూట్లు, చెప్పులు బహుమతిగా తీసుకోవచ్చా..

ఎవరికైనా బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. వీటిని పేదరికానికి సంకేతాలుగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, షూ, చెప్పులు బహుమతిగా కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. దీంతో పాటుగా శని ప్రభావం కూడా మీ పై పడుతుంది.

Seeds For Iron : ఈ గింజలను రోజూ తింటే చాలు.. రక్తం పుష్కలంగా తయారవుతుంది..!

Seeds For Iron : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. వాటిల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అలాగే రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. అందువల్ల ఐరన్ ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరన్ వేటిలో ఉంటుంది ? అని మీరు సందేహ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయే పలు రకాల గింజలను రోజూ తింటే చాలు, దాంతో మీ శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఐరన్ అధికంగా ఉండే ఆ గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్ ఎక్కువగా ఉండే గింజల్లో గుమ్మడికాయ గింజలు కూడా ఒకటి. ఒక ఔన్సు గుమ్మడికాయ విత్తనాలను తింటే 2.5 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన ఐరన్‌లో ఇది 14 శాతంగా ఉంటుంది. అందువల్ల రోజూ ఈ గింజలను తినాలి. దీంతో మనకు మెగ్నిషియం, జింక్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుక రోజూ గుమ్మడి గింజలను తినాలి.

Seeds For Iron
నువ్వులను రోజూ తినడం వల్ల కూడా మనకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తిన్నా చాలు 1.3 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. అలాగే క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్ కూడా మనకు నువ్వుల ద్వారా లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో దోహదపడతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటి ద్వారా కూడా మనకు ఐరన్ లభిస్తుంది. 1 ఔన్సు పొద్దు తిరుగుడు గింజలను తింటే సుమారుగా 1.4 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. దీంతోపాటు విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఇవేకాకుండా అవిసె గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీంతో కూడా ఐరన్ లభిస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అన్నం వండే ముందు ఈ పని చేస్తే.. షుగర్, ఊబకాయంకి చెక్!

Should You Soak Rice Before Cooking: బియ్యం ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం చాలా తెలివైన పని. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దీంతో నిద్రకు ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం ద్వారా, దానిలోని పోషకాలు బాగా గ్రహించబడతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో GI కొలుస్తుంది.

బియ్యం నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఎంజైమాటిక్ విచ్ఛిన్నం అవుతుంది. ఇలా చేయడం వల్ల బియ్యం గింజల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నమై సాధారణ చక్కెరగా మారుతుంది. దీని వల్ల మన శరీరం ఈ పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఇది GIని కూడా తగ్గిస్తుంది,అది తక్కువగా ఉన్నప్పుడు, మీ రక్తంలో చక్కెర కూడా నియంత్రణలో ఉంటుంది.

అన్నం వండేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

బియ్యం నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు ఇది మంచి పద్ధతిగా పరిగణించబడుతుంది. అయితే, 3-4 గంటలు నీటిలో ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల విటమిన్లు, మినరల్స్ నీటిలో కరిగిపోతాయి. దీని వల్ల బియ్యంలోని పోషకాలు నశిస్తాయి. మీరు బియ్యాన్ని నానబెట్టకూడదనుకుంటే, మీరు దానిని నీటితో కడిగి ఉడికించాలి. ఇది బియ్యం ఆకృతిని సరిగ్గా ఉంచుతుంది.

Tea-Coffee: టీ-కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమా? ICMR ఏం చెబుతోంది?

Tea-Coffee: ఆహారం తిన్న తర్వాత, ముందు టీ-కాఫీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరానికి చాలా హానికరం చేస్తుందని ICMR నిపుణులు పెద్ద హెచ్చరిక చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భారతీయులకు టీ-కాఫీని పరిమితికి లోబడి తాగాలని సూచించింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని చెబుతున్నారు. తిన్న తరువాత టీ-కాఫీ తాగితే ఏమౌతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

భోజనం చేసినాక టీ-కాఫీ తాగితే:

‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఎన్ఐఎన్) భారతీయుల ఆహారం విషయంలో ప్రత్యేక సర్వే చేశారు. దాని మార్గదర్శకాలను చెప్పారు.
ఒక కప్పు కాఫీలో 80-120mg కెఫిన్, ఇన్‌స్టంట్ కాఫీలో 50-65mg కెఫిన్ ఉంటుంది. అయితే టీలో 30-65 mg కెఫిన్ ఉంటుంది. అందువల్ల టీ, కాఫీలు ఎక్కువగా తాగవద్దని శాస్త్రవేత్తలు సూచించారు.
ఒక వ్యక్తి శరీరంలో 300 mg కంటే ఎక్కువ కెఫిన్ లేదని జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఇది ఏ వ్యక్తికైనా అత్యంత ప్రమాదకరంగా చేస్తుంది.
ఆహారం తిన్న ఒక గంట ముందు, ఒక గంట తర్వాత టీ- కాఫీ తాగడం మానేయాలి. ఎందుకంటే ఈ రెండింటిలో టానిన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని కలిగిస్తుంది.
హిమోగ్లోబిన్ అనేది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేసే ప్రోటీన్. టానిన్ శరీరంలో ఐరన్ లోపాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది. అదనంగా ఇది జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. MannamWeb దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Virat Kohli: విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్‌గా ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు (14) సమమైనప్పటికీ చెన్నై (+0.392) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు (+0.459) నాకౌట్‌కు వెళ్లిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ (virat kohli) కొత్త రికార్డును సృష్టించాడు. సీఎస్కేపై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700+ స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్‌ గేల్ (Chris Gayle) మాత్రమే ఉన్నాడు. గేల్‌ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు.

మరికొన్ని ఘనతలు..
ఈ సీజన్‌లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు.
2016 ఎడిషన్‌లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 152. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2024 లీగ్‌ స్టేజ్‌ను విరాట్ 37 సిక్స్‌లతో ముగించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌ అతడే. ట్రావిస్ హెడ్ (36) రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్‌లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
గతంలోనూ మే 18 నాడు జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ రాణించిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56*, 27*, 113, 100 పరుగులు చేశాడు. ఈసారి కూడా 47 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 343 పరుగులు చేశాడు.
భారత్‌ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీనే. తాజాగా సీఎస్కేపై ఇన్నింగ్స్‌తో 9000+ స్కోరును నమోదు చేశాడు. అతడి తర్వాత రోహిత్ (8,008) ఉన్నాడు.

Raw Milk: వామ్మో.. పచ్చి పాలు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా ??

మనం సాధారణంగా ప్యాకెట్లలో చూసే పాలను ప్యాశ్చరైజ్డ్ మిల్క్ (Pasteurized Milk) అని అంటారు. అంటే..పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కొంతసేపు వేడి చేసి చల్లార్చాక ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. అయితే, ప్యాశ్చరైజ్డ్ పాలకంటే పచ్చి పాలు ఆరోగ్యానికి (Health) మేలు చేస్తాయని కొందరు నమ్ముతారు. పచ్చిపాలల్లో (Raw Milk) విటమిన్లు, ఇతర పోషకాలు అధికమోతాదుల్లో ఉంటాయని అంటారు. ఇది నిజమని రుజువు చేసే ఆధారాలు ఏవీ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చిపాలు తాగితే ఆరోగ్యానికి బదులు అపాయం ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు (Raw Milk unsafe to Drink).

పచ్చి పాలతో డేంజర్స్..

ప్యాశ్చరైజేషన్ చేయని పాలను పచ్చిపాలని అంటారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇందులో రకరకాల హానికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. అంతేకాకుండా, ప్యాశ్చరైజ్ చేయకపోవడంతో ఇవి త్వరగా పాడవుతాయి.

పచ్చిపాలతో ప్రధాన సమస్య బోవైన్ ట్యూబరికలోసిస్ అని వైద్యులు చెబుతున్నారు. 1900ల్లో పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టకమునుపు 25 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 65 వేల మంది బోవైన్ ట్యూబరికలోసిస్ బారినపడి కన్నుమూశారు. ఇది పచ్చిపాల ద్వారా సులువుగా మనుషులకు వ్యాపిస్తుంది.

ఇక ప్యాశ్చరైజ్డ్ పాలల్లో అంతా అనుకున్నట్టు పోషకాలు తక్కువగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మనుషుల ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.

పచ్చిపాలతో బోవైన్ ట్యూబరికలోసిస్ తో పాటు అనేక రకాల ఇతర హానికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ పాలల్లో ఉండే సాల్మొనెల్లా, ఎశ్చరీచియా, కాంపైలో బ్యాక్టర్, ఈ. కొలై, క్రిప్టోస్పరీడియమ్ వంటి బ్యాక్టీరియాలతో ఆర్థరైటిస్, గిలియన్ బార్ సిండ్రోమ్, హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తాయి. డయేరియా, డీహైడ్రేషన్, వాంతులు, జ్వరం వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది. అదే ప్యాశ్చరైజేషన్‌తో పాలల్లోని అధిక శాతం హానికారక బ్యాక్టీరియాలు నశిస్తాయి. కాబట్టి, పచ్చిపాల జోలికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad: నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు

కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్‌లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల్చి… మిగతావారిని మాయం చేశారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లల్ని చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిపోయారు. అదేంటీ.. దొంగలంటే డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీ చేస్తారు.. మనిషుల్ని ఎత్తుకుపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడ ఉంది అసలు మ్యాటర్. దొంగలు ఎత్తుకెళ్లింది భార్యాపిల్లల్నే..అయితే మనుషల్ని కాదండోయ్.. విగ్రహాలను. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. అందులోనూ.. ఆ విగ్రహాలు ఏదో ఫాపు నుంచో, ఇంటి నుంచో కాట్టేశారని అనుకోకండి.. రోడ్డు మీద GHMC ఏర్పాటు చేసిన విగ్రహాలను మాయం చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో GHMC .. 2021లో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఒక భర్త, ఓ భార్య.. వాళ్లకుఇద్దరు పిల్లలు ఉండగా.. వాళ్లు జాలీగా షాపింగ్ చేస్తున్నట్టుగా ఆ విగ్రహాలు ఏర్పాటు చేశారు. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే ఆ విగ్రహాలు అందర్నీ ఆకర్షించేవి. చాలామంది ఆ స్పాట్‌లో ఫోటోలు తీసుకునేవారు. ఆ చక్కటి కుటుంబంపై ఎవరి కన్ను పడిందో ఏమో…. భార్య ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. భర్త విగ్రహాన్ని మాత్రం అక్కడే వదిలేశారు.

కాగా.. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. అంత పెద్ద విగ్రహాలను తీసుకెళ్తుంటే ఎవరూ చడలేదా సీసీ కెమెరాలు ఏమయ్యాయి అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. భర్తను వదిలేసి.. భార్య, కూతురు, కొడుకు కలిసి షాపింగ్‌కి వెళ్లారేమో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. విగ్రహాలను కూడా వదలరా.. మీ మొహాలు మండ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Dinesh Karthik: ధోనీ సిక్స్ కొడితే ఆర్సీబీ గెలవటం ఏమిటి..? దినేష్ కార్తీక్ ఏం చెప్పాడంటే..!

Dinesh Karthik: IPL 2024లో శనివారం రాత్రి M చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో RCB అర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా..

RCB 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత MS ధోని గురించి RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) ఒక ప్రకటన ఇచ్చాడు.

RCB స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ మ్యాచ్ గెలిచిన తర్వాత MS ధోని గురించి మాట్లాడుతూ.. ఈ రోజు MS ధోని ఒక సిక్స్ కొట్టాడు. బంతి స్టేడియం నుండి బయటపడింది. ఇది మాకు చాలా లాభపడింది. ఎందుకంటే ఆ బంతి పోయాక కొత్త బంతి మా చేతుల్లోకి వచ్చింది. కొత్త బాల్‌తో మా బౌలర్ల బౌలింగ్ మెరుగైందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ప్రారంభంలో వర్షం కురిసిందని, ఆ కారణంగా మైదానంలో మంచు కురిసిందని, బౌలర్ల చేతుల్లోంచి బంతి జారిపోయిందని మనకు తెలిసిందే. కానీ ధోని స్టేడియం అవతలకి సిక్సర్ కొట్టాడు. దాని కారణంగా RCBకి కొత్త బంతి వచ్చింది.

ఐపీఎల్ 2024లో దినేష్ కార్తీక్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 39.38 సగటుతో 315 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. కార్తీక్‌ స్ట్రైక్-రేట్ 195.65. ఈ ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ స్కోరు 83 పరుగులు. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో కార్తీక్ అద్భుత ప్రదర్శన చేశాడు.

శనివారం రాత్రి బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ 47 పరుగులు, ఫాఫ్ డుప్లెసిస్ 54 పరుగులు చేశారు. దీనికి బదులుగా CSK తరపున రచిన్ రవీంద్ర 61 పరుగులు, రహానే 33 పరుగులు, రవీంద్ర జడేజా 42 అజేయంగా పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. క్వాలిఫై కావడానికి CSK 201 పరుగులు చేయాల్సి ఉండగా.. RCB వారిని 191 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

తెలంగాణ కేబినెట్ భేటీకి EC గ్రీన్ సిగ్నల్.. వాళ్లు పాల్గొనడానికి వీళ్లేదని షరతు

తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్‌లో చర్చించాలని కండిషన్ పెట్టింది.

ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేబినెట్‌ భేటీలో పాల్గొనకూడదు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. ఈసీ అనుమతి కోసం చివరి వరకు వెయిట్ చేసి.. వాయిదా వేశారు. దీంతో అనుమతి ఎప్పుడు లభిస్తే అప్పుడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. మరోవైపు సోమవారం వరకూ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తామని, అప్పటికీ రాకపోతే ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి రిక్వెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో సడన్‌గా ఈసీ పర్మిషన్ ఇవ్వడంతో కాస్త ఊరట లభించినట్లైంది.

మరోవైపు రైతు రుణమాఫీ, ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించేలా ఎజెండా సిద్ధమైంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసరమైన అంశాలపైనే చర్చ జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న ఉన్నందున వేడుకల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఫ్రీగా విమాన ప్రయాణం ..

ప్రతిఒక్క విద్యార్థి బంగారు భవష్యత్తుకు పునాది విద్య. మరి అటువంటి విద్యలో.. విద్యార్థులకు బంగారు భవితకు తొలిమెట్టు పదో తరగతి. ఇక ఈ పదో తరగతి ద్వారే విద్యార్థుల కెరీర్ దశ, దిశను నిర్ణయించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే.. విద్యార్థులు పదో తరగతిలో పదో తరగతి అనేది విద్యార్థుల బంగారు భవితకు తొలిమెట్టు. వారి కెరీర్ దశ, దిశను నిర్ణయించేది, నిర్దేశించేదీ పదో తరగతి. అందుకే పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వారిని ప్రోత్సహించేందుకు, మెరుగ్గా రాణించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కూడా కొంతమంది విద్యర్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు.. అలాగే పరీక్షల్లో వారు మెరుగ్గా రాణించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంటాడు. కానీ, అతను ఉపాధ్యాయుడు, స్కూల్‌ ఓనర్‌ అయితే మాత్రం కాదు. కేవలం మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు, పేద విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా.. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఇతడు పేద విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఓ బంపరాఫర్ ఇచ్చారు. ఇంతకి ఆయన ఎవరంటే.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మందనపాలెనికి చెందిన ఉమాపతి . ఈయన నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని గతంలో ప్రకటించారు.

అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో.. ఉమపతి పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను విమానంలో తిప్పారు. అయితే, పదో తరగతిలో ఐదువందల మార్కులకు పైగా సాధించిన నలుగురు గవర్నమెంట్ స్కూలు విద్యార్థులను తనతో పాటుగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. ఇక వారిలో పురుషోత్తం (552 మార్కులు) విష్ణు (515), మహా (509), తనూజ( 504) అనే నలుగురు విద్యార్థులతో పాటు స్కూల్ హెడ్మా్స్టర్‌ ని కూడా నిన్న అనగా.. 17వ తేదీ చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు ఉమాపతి. ఇక వీరంతా హైదరాబాద్‌లో రెండురోజుల పాటు ఉండనున్నారు. ఈ రెండు రోజులు సిటీ మొత్తం తిప్పి ఇక్కడున్న విశేషాలను వారికి చూపించనున్నారు.

ఇకపోతే ఈ టూర్‌ మొదలయిన నుంచి విద్యార్థులను తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే వరకూ మొత్తం ఖర్చును ఉమపతి భరించనున్నారు. ప్రస్తుతం ఉమపతి చేస్తున్న పని తెలిసి పలువురు అభినందిస్తున్నారు. ఇక పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆయన చేస్తున్న కృషిని స్థానికులు కొనియాడుతున్నారు.

వరుస ఓటముల నుంచి అనూహ్యంగా ప్లేఆఫ్స్​కు.. RCB సక్సెస్ వెనుక అదృశ్య శక్తి!

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయింది ఆర్సీబీ. ఆడిన మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఏడింట ఓడి దారుణమైన విమర్శల్ని మూటగట్టుకుంది. ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇక చేసేదేమీ లేదని, అంతా ముగిసిందనుకొని బ్యాగులు సర్దుకున్నాడట. కానీ ఇక్కడే అద్భుతం చోటుచేసుకుంది. ఒక దశలో పాయింట్స్ టేబుల్​లో చివర్లో ఉండకపోతే గొప్పని అనుకున్న ఆర్సీబీ.. పట్టుదలతో ఆడుతూ ఇప్పుడు ఏకంగా ప్లేఆఫ్స్​లోకి అడుగు పెట్టింది. సీఎస్​కే వంటి టాప్ టీమ్​ను నాకౌట్ పోరులో చిత్తు చేసి ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది డుప్లెసిస్ సేన. అయితే వరుస ఓటముల నుంచి అనూహ్యంగా క్వాలిఫై అవడం వరకు బెంగళూరు సక్సెస్ వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేసింది.

ఈ సీజన్ ఫస్టాఫ్​లో ఎంత బాగా ఆడినా ఆర్సీబీ ఓడిపోతుండటంతో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ కూడా డల్ అయ్యాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతున్న దినేష్ కార్తీక్ కూడా తమ జట్టు రాత ఇంతే అని నిరాశలో కూరుకుపోయాడు. ఈ టీమ్​ ఫేట్ మార్చడం తన వల్ల కాదని కెప్టెన్ డుప్లెసిస్ కుంగిపోయాడు. ఈ టైమ్​లో ఓ అదృశ్య శక్తి ఎంట్రీ ఇచ్చింది. ఆ సీక్రెట్ పవరే బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. మీ వల్ల అవుతుంది అంటూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడు ఆండీ. 1 శాతం అవకాశాన్ని కూడా 100 శాతం వరకు తీసుకెళ్లొచ్చంటూ వాళ్లలో మనోధైర్యం నింపాడు. మీరు ప్రపంచాన్నే జయించగలరు.. ఇదో లెక్కా అంటూ వాళ్లలోని పౌరుషాన్ని బయటకు తీశాడు. అంతే ఆర్సీబీ ప్లేయర్లు చెలరేగిపోయారు.

కోచ్ ఆండీ ఫ్లవర్ చెప్పినట్లు ప్రతి మ్యాచ్​ను డూ ఆర్ డైగా తీసుకున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. దూకుడే మంత్రంగా చెలరేగిపోయారు. ఎదురొచ్చిన ప్రతి జట్టును తొక్కిపడేస్తూ ముందుకెళ్లారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఏదైనా సరే, అటాకింగ్ మోడ్​లోనే ఆడుతూ అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టడం స్టార్ట్ చేశారు. నిన్న సీఎస్​కేను కూడా ఇలాగే ఆడి వణికించారు. ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకుంటూ అద్భుతాలు సృష్టించడం ఎలాగో బాగా తెలిసిన కోచ్ ఆండీ.. జట్టు కూర్పును బాగా సెట్ చేశాడు. సరిగ్గా పెర్ఫార్మ్ చేయని మ్యాక్స్​వెల్, సిరాజ్​ లాంటి వారికి రెస్ట్ ఇచ్చి స్వప్నిల్, కర్ణ్​ శర్మ, విల్ జాక్స్​ను టీమ్​లోకి దించాడు. వాళ్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు.

కొంత గ్యాప్ తర్వాత సిరాజ్​ను జట్టులోకి తీసుకుంటే అతడూ అదరగొట్టాడు. నిన్నటి మ్యాచ్​లో మ్యాక్స్​వెల్ బ్యాట్​తో, బంతితో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఎవర్ని ఎప్పుడు ఆడించాలి, వాళ్లలోని బెస్ట్​ పెర్ఫార్మెన్స్​ను ఎలా బయటకు తీయాలో తెలిసిన ఆండీ ఫ్లవర్ టీమ్ అవసరాలకు తగ్గట్లు అందర్నీ వాడుకున్నాడు. ఐపీఎల్​లో ఆర్సీబీకే కాదు.. పీఎస్​ఎల్, సీపీఎల్, హండ్రెడ్ లీగ్, ఐఎల్​టీ20 లీగ్స్​లో ఇతర జట్లకూ కోచింగ్ ఇస్తూ ఎంతో అనుభవం గడించాడాయన. దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ బెంగళూరు సక్సెస్​కు కారణం అవుతున్నాడు.

OTTలో.. సీట్ ఎడ్జ్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్! క్లైమాక్స్‌ అయితే మైండ్ బ్లాంకే.. డోంట్‌మిస్‌

క‌న్న‌డ‌లో మార్చి 8న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన బ్లింక్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. మొద‌ట‌ త‌క్కువ స్క్రీన్ల‌లోనే విడుద‌లైన ఈ సినిమా ఆ త‌ర్వాత‌ మౌత్‌టాక్‌తో అంత‌కంత‌కు స్క్రీన్ల సంఖ్య‌ను పెంచుకుంటూ పోయారు. ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ బ్లింక్ (Blink) సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్ష‌కులను కూడా బాగా థ్రిల్ చేస్తోంది. మ‌న‌వాళ్లు కూడా ఇలాంటి సినిమా తీశారా అనిపించేలా చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం యాక్ష‌న్‌,సెంటిమెంట్, ల‌వ్, రివేంజ్‌, ఫిక్ష‌న్, టైమ్ లూప్‌ అంటూ ఇలా దాదాపు 10, 15 ర‌కాల జాన‌ర్ల‌లో సినిమాలు చూసి ఉంటాం. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే సినిమా అలాంటి ఓ జానర్‌కు చెందిందే కానీ ఇంత గ్రిప్పింగ్‌గా, ఆస‌క్తిక‌రంగా తీస్తారా అనేది ఈ సినిమా చూసేదాక తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు. ఆ సినిమా పేరు బ్లింక్ (Blink). క‌న్న‌డ‌లో మార్చి 8న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. మొద‌ట‌ త‌క్కువ స్క్రీన్ల‌లోనే విడుద‌లైన ఈ సినిమా ఆ త‌ర్వాత‌ మౌత్‌టాక్‌తో అంత‌కంత‌కు స్క్రీన్ల సంఖ్య‌ను పెంచుకుంటూ పోయారు. ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ బ్లింక్ (Blink) సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్ష‌కులను కూడా బాగా థ్రిల్ చేస్తోంది. మ‌న‌వాళ్లు కూడా ఇలాంటి సినిమా తీశారా అనిపించేలా చేసింది.

తెలుగులో నాని క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన ద‌స‌రా సినిమాలో రెండో హీరోగా చేసిన క‌న్న‌డ న‌టుడు దీక్షిత్ షెట్టి (Dheekshith Shetty) హీరోగా మ్యూజిక‌ల్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ బ్లింక్ (Blink) చిత్రం తెర‌కెక్కింది. చైత్ర ఆచార్ (Chaithra J. Achar), మందార బత్తలహళ్లి (Mandara Battalahalli), గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే (Gopalkrishna Deshpande) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు పైగా ఇండియాలోనే ఈ జాన‌ర్‌లో రూపొందిన మొట్ట‌మొద‌టి సినిమా ఇదే అవ‌డం విశేషం. శ్రీనిధి బెంగ‌ళూరు (Srinidhi Bengaluru) ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయ‌డ‌మే కాక క‌థ, స్క్రీన్‌ప్లే అందించ‌డం గ‌మ‌నార్హం. మ‌నంద‌రికీ తెలిసిన టైం ట్రావెలింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే..

అపూర్వ (దీక్షిత్ షెట్టి ) సిటీలో పీజీ (MA) చ‌దువుతూ ఉంటాడు. త‌ను అందులో ఫెయిల్ అయిన విష‌యం త‌ల్లి ద‌గ్గ‌ర‌ దాచి ఇంటి అర్థిక అవ‌స‌రాల కోసం పార్ట్ టైం జాబ్‌ల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఈక్ర‌మంలో త‌న గ‌ర్ల్‌ప్రెండ్ స్వ‌ప్న సాయం తీసుకుంటాడు. అంతేగాక ఓ డ్రామా కంపెనీలో మెంబ‌ర్స్ అవ‌డంతో త‌రుచూ ఇద్ద‌రు అక్క‌డ రిహార్స‌ల్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈక్ర‌మంలో ఉన్న‌ట్టుండి ఓ మ‌ధ్య వ‌య‌స్కుడు, అచ్చం త‌న‌లాగే ఉండే మ‌రో మ‌నిషి అపూర్వ‌కు మాత్ర‌మే రెండు మూడు సార్లు క‌నిపించి మాయ‌మైపోతారు. దీంతో త‌న‌కు ఏదో అవుతుంద‌నే డిఫ్రెష‌న్‌లోకి వెళ‌తాడు.

త‌ర్వాత కొద్ది రోజుల‌కు త‌న‌కు ఓ జాబ్ ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డికి వెళ్లగా త‌న‌కు అంత‌కుముందు క‌నిపించి మాయ‌మైన‌ మ‌ధ్య వ‌య‌స్కుడు క‌నిపిస్తాడు. నేనే నిన్ను ఇక్క‌డ‌కు ర‌ప్పించాన‌ని నీ తండ్రి గురించి తెలుసా.. అత‌ను ఎలా మ‌ర‌ణించాడో తెలుసుకోవాలంటే నేను చెప్పిన ప‌ని చేయాల‌ని డ‌బ్బులు ఇస్తాన‌ని చెబుతాడు. మొద‌ట అంగీక‌రించ‌ని అపూర్వ త‌ర్వాత ఒకే చెప్ప‌డంతో అ మ‌ధ్య వ‌య‌స్కుడు ఓ ఐ డ్రాప్స్ , ఓ వాచ్ ఇచ్చి వీటితో నువ్వు టైం ట్రావెల్ చేయాల‌ని చెబుతాడు. డ్రాప్స్ వేసుకున్నాక కండ్లు బ్లింక్ చేయ‌కుండా ఎంత‌సేపు ఉండ‌గ‌ల‌వో అంత సేపు అక్క‌డ ఉండొచ్చ‌ని బ్లింక్ చేస్తే తిరిగి ప్ర‌జెంట్ డేకు వ‌స్తావ‌ని చెబుతాడు.

దీంతో అపూర్వ టైం ట్రావెల్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు.. ఇక ఆ త‌ర్వాత ఎలాంటి విష‌యాలు తెలిశాయి, ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నేదే అస‌లు క‌థ‌. అపూర్వ టైం ట్రావెల్ చేసి వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదో కొత్త విష‌యం బ‌య‌ట ప‌డి ప్రేక్ష‌కుల‌ను షాక్ గురి చేస్తుంటాయి. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌నిపించిన త‌న‌లాగే ఉన్న‌ యువ‌కుడెవ‌రు, ఆ మ‌ధ్య వ‌య‌స్కుడు ఎవ‌రు, అపూర్వ‌కు వారితో ఉన్న‌ సంబంధమేంటి, తండ్రిని ర‌క్షించుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్ట‌డం ఖాయం. ముఖ్యంగా చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. చివ‌ర‌కు హీరో చేసిన ప‌ని కూడా అలోచింప‌చేస్తుంది. సంగీతం ఈ చిత్రానికి చాలా ఫ్ల‌స్ కాగా బ్లింక్ (Blink) సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే.. మొద‌టి ఫ్రేం నుంచి ఎక్క‌డా మిస్ చేయ‌కుండా చూస్తేనే ఈ సినిమాను అర్ధ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. లేకుంటే చాలామంది క‌న్ప్యూజ్ అవ‌డం మాత్రం గ్యారెంటీ. ఈ బ్లింక్ (Blink) సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా కేవ‌లం క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. తెలుగు వారికి కాస్త ఇబ్బందైనా ఇంగ్లీష్ స‌బ్‌టైటిల్స్ ఉండ‌డంతో సినిమా చూస్తున్నంత సేపు లాంగ్వేజ్ ఇష్యూ అనిపించ‌దు. మంచి థ్రిల్ల‌ర్‌, సైన్స్ ఫిక్ష‌న్ చూడాల‌నుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయ‌కండి.

AB Venkateswara Rao: ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు

అమరావతి: గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. #JusticeForABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణకు ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో చక్కటి స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఎంతో మంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

‘‘1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గత అయిదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. ఆయన పదవీ విరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖకు సేవలందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్‌ అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆన్‌లైన్‌లో ఉద్యమం కొనసాగుతోంది.

పోస్టింగ్‌ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే… గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం లేదా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. కానీ కొంతమంది టిఫిన్ చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంటారు.

మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీసుకు త్వరగా వెళ్లాలని ఆరాటం, ఆఫీసు వర్క్ బిజీ వీటన్నింటి వలన చాలా మంది టిఫిన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ ఇది వారి ప్రాణానికే ప్రమాదం అని గుర్తించడంలో విఫలం అవుతున్నారు.

తాజాగా చేసిన న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేయకపోతే హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి అంటున్నారు ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు. ఉదయం ఎనిమిది గంటలకే తినే వారికంటే ,9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఆరు శాతం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా తొమ్మిదిగంటలకు తినడం వలన మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతోందని వారు గుర్తించారు. అందువలన తప్పనిసరిగా ఫుడ్ తీసుకోవడంలో నెగ్లెట్ చేయకూడు అంటున్నారు నిపుణులు.

హైదరాబాద్ చివరన కొత్త సిటీ.. ఇక్కడ స్థలం కొంటే మీ లైఫ్ సెటిల్!

కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలి అనుకునేవారికి ఎక్కడైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఒక వ్యాపారమే. ఎక్కడుంటే ఏంటి స్థలం లాభాలు తీసుకురావాలి.

అయితే లాభాల శాతం అనేది పెట్టుబడి పెట్టే ప్రాంతం మీద, ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని తక్కువ లాభాలు పొందే కంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని ఎక్కువ లాభాలను పొందడం మేలు. లొకేషన్ తో పని లేకుండా సిటీకి దగ్గర ఏరియాలో తక్కువ ధరకు ప్లాట్కొనుక్కుని ఫ్యూచర్ లో ఎక్కువ లాభాలకు అమ్ముకోవడం బెటర్. అలాంటి ఏరియా గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ ఏరియాలో చాలా తక్కువ ధరకే ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఊహించని లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు.

ఆ ఏరియా పేరు కొంగరకలాన్. ఇప్పుడు ఈ ఏరియాలో స్థలాల మీద పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలను పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కి 28 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఉంది. ఇక్కడ ఫాక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. 4,550 కోట్ల పెట్టుబడితో ఈ టెక్ దిగ్గజం కొంగరకలాన్ లో అడుగుపెట్టింది.

ఫాక్స్ కాన్ అనేది అంతర్జాతీయ కంపెనీ. యాపిల్ యాక్ససరీస్ కి సంబంధించిన కంపెనీ. బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ. పలు యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. కంపెనీ పూర్తయితే కనుక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ పూర్తి స్థాయిలో పూర్తవ్వడానికి మూడు, నాలుగేళ్లు అయినా పడుతుందని అంటున్నారు. ఏడాదిలోగా కనీసం 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుందని అంటున్నారు. అందుకోసం తొలుత ఒక యూనిట్ ని ఫినిష్ చేసి స్టార్ట్ చేయనున్నారు. ఈ కంపెనీ ఎప్పుడైతే ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టిందో అప్పుడే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగిపోయాయి.

గజం 7 వేల నుంచి 25 వేలకు పెరిగింది:

2014లో గజం 7 వేలు ఉండేది. ఎప్పుడైతే ఫాక్స్ కాన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందో అప్పుడే భారీగా పెరిగిపోయారు. ఇప్పుడు త్రిబుల్ అయ్యింది అక్కడ స్థలం రేటు. చదరపు అడుగు స్థలం రూ. 2800గా ఉంది. అంటే గజం స్థలం రూ. 25 వేలు ఉంది.

ఈ కారణాల వల్లే భారీ లాభాలు:

కొంగరకలాన్ అవుటర్ రింగ్ రోడ్ కి 1 కి.మీ., శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 8 కి.మీ. దూరంలో ఉంది. మంగళపల్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు 3 కి.మీ. దూరంలో ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కి హాఫ్ కి.మీ. దూరంలో ఉంది. ఈ కొంగరకలాన్ శ్రీశైలం హైవే, సాగర్ హైవేల మధ్యలో ఉంది. ఆదిభట్ల టీసీఎస్ కంపెనీకి 3 కి.మీ. దూరంలో ఉంది. ఏరో స్పేస్ సెజ్ కి దగ్గరలో ఉంది. రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఈ ప్రాంతం గ్రోత్ జోన్ గా ఉంది. హెచ్ఎండీఏ జెన్యూన్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ 200 ఫీట్ రోడ్లే వస్తున్నాయి. ఫాక్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టాక ఇక్కడ డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ ఆల్రెడీ పలు డెవలపర్స్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాలు డెవలప్ చేసేశారు. కోటిన్నర నుంచి 4 కోట్లకు విల్లాలు అమ్ముతున్నారు. ఫ్లాట్ లు కూడా భారీ ధరకే అమ్ముతున్నారు.

ఆ ఫాక్స్ కాన్ కంపెనీ పూర్తయ్యేలోపు ఇంకా వేరే ఇండస్ట్రీలు రావచ్చు. అలానే ఫాక్స్ కాన్ పూర్తయితే లక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో డిమాండ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు స్థలాలు కొని ఉంచుకుంటే రాబోయే రోజుల్లో భారీ లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు 25 వేలు ఉన్న గజం రేటు రాబోయే రోజుల్లో 70 వేల నుంచి లక్ష రూపాయలు అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 25 లక్షలు పెట్టి 100 గజాలు కొన్నవారికి.. 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వస్తాయని అంటున్నారు. అంటే 25 లక్షల పెట్టుబడికి 45 లక్షల నుంచి 75 లక్షల లాభం ఉంటుందని చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా

ఆలస్యంగా బడికొచ్చినా సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారుఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌

పాఠ్యపుస్తకాలను పరిశీలించి సూచనలిస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

తణుకు, న్యూస్‌టుడే: లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు… ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి… ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ప్రశ్నించారు. శనివారం రాత్రి తణుకు ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా నూరుశాతం సాధించకపోవడానికి నిర్లక్ష్యమే కారణం. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారు’ అని అన్నారు.

ఒక్కొక్కరు 50 మందిని చూడలేరా? ‘ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీరు 50 ఇళ్లను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా. ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతీ యూనిట్‌లో 70శాతం మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు… ప్రజలందరిదని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ని కలువగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనియత విద్య బోధకులు, సూపర్‌వైజర్లు రాష్ట్ర సమగ్రశిక్షా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, సంచుల నాణ్యతను పరిశీలించి, నూతన పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటోంది.

టీవీ చూస్తూ ఫుడ్ తింటే ఏమవుతుందంటే?
టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండినా అలాగే తింటూనే ఉంటారని చెప్తున్నారు. మోతాదుకు మించి భోజనం తీసుకుంటారట. అలా చేయడం ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

735 మంది విద్యార్థులపై అధ్యయనం
పోర్చుగల్‌లోని మిన్హో యూనివర్శిటీ 735 మంది యువ విద్యార్థులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది. టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేసిన విద్యార్థులలో ఊబకాయం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. యుకె లెక్కల ప్రకారం 11 సంవత్సరాల వయసున్న పిల్లలో 91 శాతం మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నట్లు తేలింది. అంతేకాదు, రోజుకు కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఆన్ లైన్ లో గడుపుతున్నారట. 16 ఏండ్ల లోపు వారు వారానికి కనీసం 5 గంటల పాటు టీవీ చూస్తున్నట్లు ఆఫ్కామ్ వెల్లడించింది.

ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మందికి ఊబకాయం
దాదాపు 40 శాతం మంది పిల్లలు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే సమయానికే అధిక బరువు లేదంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.“పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్‌ చూస్తూ ఫుడ్ తిన్నప్పుడు వాళ్లు ఎంత తింటున్నారో అర్థం కాదు. టీవీ, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా మోతాదుకు మించి భోజనం చేస్తారు. పరధ్యానంలో పడి ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఇలా చేయడం పిల్లలకు ఎంతో ప్రమాదకరం. వాళ్లు ఈజీగా బరువు పెరుగుతారు. మరికొంత మందిలో ఊబకాయం సమస్య తలెత్తుతుంది” అని పోర్చుగల్‌లోని మిన్హో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధలు చయిత్రి డాక్టర్ అనా డ్వార్టే వెల్లడించారు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల మాదిరిగా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదని చైల్డ్ గ్రోత్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ ఫ్రై వెల్లడించారు. “ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి, తల్లిదండ్రులు మరోసారి భోజనం చేస్తున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలకు బాగా అలవాటుపడిపోయారు. వారి ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది” అని వెల్లడిచారు.

సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే.. అందుకే అక్కడి నీళ్లు వేడిగా ఉంటాయి..

రామాయణ కావ్యం అంటే తెలియని వారు ఎవరుంటారు. మన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి సీతా కుండ్. సీత మాత ఇక్కడే అగ్నిపరీక్షకు నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి ఎక్కడ అగ్నిప్రవేశం చేసిందో అక్కడ వేడి నీటి చెరువు ఏర్పడిందని, ఈ నీళ్లు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి కారణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

సీతా కుండ్ నీళ్లు..

ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు చెరువులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది.

శాస్త్రవేత్త పరిశోధన..

సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు, వెడల్పు 20 అడుగులు కాగా, చెరువు 12 అడుగుల లోతు ఉందని చెప్పారు. అలాగే పరీక్ష నిర్వహించి ఎనిమిది నెలల పాటు ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆయన చెప్పారు.

మాఘమాసంలో ప్రత్యేక జాతర..

ప్రజలు ఏడాది పొడవునా సీతా కుండ్‌ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. కానీ మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతా కుండ్‌లోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.

Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది

ఉప్మా కేవలం అల్పాహారం మాత్రమే కాదు. దాని చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. మరెన్నో ఆర్థిక కోణాలూ ఉన్నాయి. చెప్పాలంటే అందులో మన బానిసత్వం కనిపిస్తుంది. కాస్తంత అతిశయోక్తి అనిపించినా అసలు కథ తెలిస్తే అదంతా నిజమే అని అర్థమవుతుంది.

ఉప్మా కథ ఇది..

Upma అనే పేరు uppu mavu అనే తమిళ పదాల నుంచి పుట్టింది. అంటే ఉప్పగా ఉండే పిండి అని అర్థం. పిండిలో నీళ్లు పోసి కాస్తంత ఉప్పు వేసుకుని వండుకునే వాళ్లు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కర్ణాటకలో ఉప్పిట్టు అని, ఆంధ్రప్రదేశ్లో ఉప్పుడు పిండి అని కూడా పిలుస్తారు. 18వ శతాబ్దంలోనే మనకి ఈ వంటకం (Rava Upma) పరిచయం అయింది. ఈ ఉప్మా పుట్టుక వెనక పెద్ద చరిత్రే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని బియ్యం నిల్వలన్నింటినీ బ్రిటీష్ వాళ్లు తమ సైనికుల కోసం ఎగుమతి చేసుకున్నారు. ఫలితంగా సౌత్లో బియ్యం దొరక్కుండా పోయింది. ఈ సమస్యని తీర్చేందుకు అప్పటికప్పుడు బర్మా నుంచి దిగుమతి చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బర్మాపై జపాన్ దాడి చేసింది. ఫలితంగా రైస్ ఇంపోర్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. అప్పుడే బ్రిటీష్ పాలకులు చాలా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. సౌత్ ఇండియన్స్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని పంజాబ్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాలని చూసింది. కానీ ఇక్కడ ఓ సమస్య వచ్చి పడింది. గోధుమలను తీసుకొచ్చినా వాటిని పిండి పట్టించి చపాతీలు చేసుకునేందుకు స్థోమత అప్పట్లో దక్షిణాది ప్రజలకు లేకుండా పోయింది.

చెత్త నుంచి పుట్టిన టిఫిన్..

సింపుల్గా వండుకునేలా ఏముంటుందని ఆలోచిస్తే ఫ్లోర్ మిల్లుల్లో (How Upma is Invented) పిండి పట్టగా మిగిలిపోయిన రవ్వపై వాళ్ల దృష్టి పడింది. ఓ రకంగా అది చెత్త లాంటిదే. కాకపోతే వండుకోడానికి సులువుగా ఉంటుందని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రచారం చేశారు. ఆకలి నుంచి బయటపడాలంటే ఇదే మంచిదంటూ ఊదరగొట్టారు. అంతే కాదు. ఈ రవ్వని ఎలా వండుకోవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రెస్టారెంట్లకూ సప్లై చేశారు. అలా క్రమంగా అందరికీ ఈ ఉప్మాని అలవాటు చేశారు. అప్పటికి అందరికీ అదే పంచభక్ష్య పరమాన్నమైపోయింది. అప్పట్లో MTR (Mavalli Tiffin Room) అధినేత యజ్ఞనారాయణ మయ్యా రవ్వ ఇడ్లీని పరిచయం చేశారు. మద్రాస్ రెసిడెన్సీలో రెస్టారెంట్లలో పొంగల్కి బదులుగా అప్పటి నుంచి రవ్వ ఇడ్లీ సర్వ్ చేయడం మొదలు పెట్టారు. అది కాస్తా ఫేమస్ అయిపోయింది. అలా మొదలైన ఈ ఉప్మా ప్రస్థానం ఇక్కడి వరకూ వచ్చింది. రకరకాల ఉప్మాల రెసెపీలు ఇప్పుడు వచ్చేసినా ఎక్కడో మనలో తెలియకుండానే దానిపై విరక్తి వచ్చేసింది. ఎంత స్పైసీగా చేసుకున్నా మసాలా తగలదు కాబట్టి చప్పటి తిండిగానే మిగిలిపోయింది. నచ్చినా నచ్చకపోయినా తిన్నా తినకపోయినా ఇప్పటికీ కిచెన్ని రూల్ చేసేస్తోంది ఉప్మా.

ఎన్నికల ఫలితాల ముందే ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఉత్కంఠ సాగుతుంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండో ఐకానిక్ తీగల వంతెనకు ప్రతిపాదన సిద్ధమైంది. రాష్ట్రంలో రెండో తీగల వంతెన నిర్మాణానికి కసరట్టు జరుగుతుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ – కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

మరో వంతెన కోసం

ఇదే తరహాలో మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది. ఆ నిర్మాణం సైతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది పైన నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన డి పి ఆర్ సిద్ధమవుతోంది. గుంటూరు-కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట, దోమల పెంట మీదుగా హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిని విస్తరిస్తుంది.

విస్తరణ పనులు
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేకచోట్ల 5.5 మీటర్ల నుంచి ఏడు మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతుంది. ఇప్పటికే కుంట- దోర్నాల మధ్య 24.2 కిలోమీటర్ల మేర 20045 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. దోర్నాల నుండి శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట మీదుగా కృష్ణా నదిపై వంతెన దాటే వరకు 53.5 కిలోమీటర్ల మేర విస్తరించేలా డిపిఆర్ ను కేంద్రం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కృష్ణానది పై ఉన్న వంతెన 1972లో నిర్మాణం చేసుకుంది. దీనికి సమీపంలోనే ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది.

మారనున్న రూపు రేఖలు

ఇందుకోసం దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది టీపీఎఫ్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీ కి సంబంధించిన డిపిఆర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోగా పనులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐకానిక్ వంతెన కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూప రేఖలు రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జిలు నిజంగానే ఐకానిక్ వంతెనలుగ నిలిచిపోనున్నాయి.

కల్కీ 2898 AD.. బుజ్జిని రివీల్ చేసిన మేకర్స్.. ఎన్నో స్పెషాలిటీలు కూడా!

డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా బజ్ ఉంది. ఆ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీ అయితే జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతకన్నా ముందే అసలు కల్కీ అంటే ఏంటి? ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పేందుకు స్క్రాచ్ పేరిట మూవీ టీమ్ కొన్ని ఎపిసోడ్స్ ని విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మే 18న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చలు స్టార్ట్ అయిపోయాయి.

నిన్నటి నుంచి కల్కీ 2898 ఏడీ సినిమా గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేస్తాను అని చెప్పాడు. ఆ బుజ్జి ఎవరో తెలుసుకోవాలి అని అంతా తెగ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కల్కీ మూవీ టీమ్ చెపిన్న టైమ్ కి అప్ డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అంతా 5 దాటి చాలాసేపు అయ్యింది అంటూ చాలానే ట్వీట్లు వేస్తున్నారు. ఎట్టకేలకు ఆ స్క్రాచ్ ఎపిసోడ్ రానే వచ్చింది. కల్కీ 2898 ఏడీ మూవీ హీరో భైరవ తన బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

మొదట అంతా అమ్మాయి అని.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. చివరకు బుజ్జి అంటే ఒక కారు అనే విషయాన్ని తాజాగా ఈ ఎపిసోడ్ ద్వారా వెల్లడించారు. కల్కీ మూవీలో ప్రభాస్ వాడేది నిజంగానే సూపర్ ఫ్యూచరిస్టిక్ కారు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ మొత్తం కల్కి సినిమాపైనే అంచనాలను భారీగా పెంచేసింది. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది.

ఈ బుజ్జికి సంబంధించి.. అది ఒక రోబో. కానీ, దాని బాడీని కోల్పోతుంది. అందుకే దానిని ఒక సూపర్ కారుకు అటాచ్ చేస్తారు. అంటే ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో బుజ్జి ఒక పెద్ద రోబోలాగా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోబో హెడ్ ని తీసుకెళ్లి కారుకు తగిలిస్తున్నారు. పైగా తన బాడీని ఈ హెడ్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తే.. హాలీవుడ్ ట్రాన్సాఫ్మర్స్ లో తరహాలో ఒక సీక్వెన్స్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే బుజ్జిని పూర్తిగా చూపించలేదు. మే 22న ఒక ఈవెంట్ పెట్టి రివీల్ చేస్తారని చెప్తున్నారు.

 

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ప్రస్తుతానికి ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్త ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇప్పటికే గత వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని తెలిపింది. ఆదివారంలోకి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి.

రుతుపవనాలు మే 31 కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కేరళ అంతా వ్యాపించనున్నాయి. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు సకాలంలో పడితే పంటలు సాగు మొదలు పెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిస్తే రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Health

సినిమా