Gold Rate Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన గోల్డ్.. ఇక సామాన్యుడు కొనటం కష్టమే..!!

Gold Price Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించే అవకాశాలు ఉన్నాయనే వార్త పసిడి ధరలకు ఆజ్యం పోసింది. దీంతో వరుసగా మూడు రోజుల నుంచి గోల్డ్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా 3 నెలల గరిష్ఠాలను దాటాయి.
భారతీయ కొనుగోలుదారులు దీంతో ఆందోళన చెందుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

నేడు 22 క్యారెట్ల గోల్డ్ 100 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.4,000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ తాజా విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,900, ముంబైలో రూ.60,100, దిల్లీలో రూ.60,250, కలకత్తాలో రూ.60,100, బెంగళూరులో రూ.60,100, కేరళలో రూ.60,100, వడోదరలో రూ.60,150, జైపూరులో రూ.60,250, లక్నోలో రూ.60,250, పూణేలో రూ.60,100, నాశిక్ లో రూ.60,130, అయోధ్యలో రూ.60,250, బళ్లారిలో రూ.60,100, గురుగ్రాములో రూ.60,250, నోయిడాలో రూ.60,250గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర ఏకంగా ఒక్కరోజులో రూ.4,300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ముఖ్యమైన నగరాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,440, ముంబైలో రూ.65,560, దిల్లీలో రూ.65,710, కలకత్తాలో రూ.65,560, బెంగళూరులో రూ.65,560, కేరళలో రూ.65,560, వడోదరలో రూ.60,150, జైపూరులో రూ.65,710, లక్నోలో రూ.65,710, పూణేలో రూ.65,560, నాశిక్ లో రూ.65,590, అయోధ్యలో రూ.65,710, బళ్లారిలో రూ.65,560, గురుగ్రాములో రూ.65,710, నోయిడాలో రూ.65,710 వద్ద విక్రయిస్తున్నాయి.

Related News

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, నెల్లూరు, కడప, కాకినాడ, విశాఖ, అనంతపురం, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,100గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.65,560గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.500 పెరిగిన తర్వాత ఏపీ, తెలంగాణలో రేటు రూ.78,500గా కొనసాగుతోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *